గుజరాత్ బిస్కెట్ రుచిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న బేక్‌వెల్

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తున్న మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ మోడర్న్ బిజ్ ప్రోడక్ట్స్ సౌజన్యంతో ఎదిగిన బేక్‌వెల్ బేకరీ పరిశ్రమలో 37శాతం, విలువలో 75శాతం వాటా బిస్కెట్లదేబిస్కెట్ తయారీలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో భారత్

0

This article is a part of a 4-part series sponsored by MS Modern Biz Products. Know more about how Microsoft is helping the SMEs.

దేశీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్ విలువ రూ. 47,800 కోట్లు. ఇందులో 7శాతం మార్కెట్ బిస్కెట్లదే. ఈ రంగంలోని ప్రధన కంపెనీల్లో బేక్‌వెల్ బిస్కెట్స్ ఒకటి. పదేళ్ల క్రితం ఈ సంస్థను బిస్కెట్ తయారీ, ఎగుమతిదారులు మహమ్మద్ రాయిష్ సుతార్ ప్రారంభించారు. గుజరాత్‌లో వీరికో తయారీ యూనిట్ ఉంది. అఫ్రికా, గల్ఫ్ దేశాలకు బిస్కట్స్, కుకీస్‌ను ఎగుమతి చేస్తుంది బేక్‌వెల్. అంతర్జాతీయ తయారీ ప్రమాణాలకు అనుగుణంగా వీరు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. FY13లో ఈ సంస్థ వార్షికాదాయం 8,18,000 అమెరికా డాలర్లు.

అమెరికా, యూరోపియన్ మార్కెట్లలోకి కూడా విస్తరించాలని భావించినా... సమాచార లోపం, ఉద్యోగ నిర్వహణలో ఎదురైన ఇబ్బందుల కారణంగా.. ఆ ప్రతిపాదన పక్కన పెట్టాల్సి వచ్చింది. మన దేశానికి, అక్కడి మార్కెట్లకు 10-12 గంటల తేడా ఉంటుంది. కాలంలో ఇంతటి వైరుధ్యమున్న ప్రాంతాలకు సరఫరా, అమ్మకాలు చేయాలంటే... సరైన స్థాయి సమాచార వ్యవస్థ ఉండాలంటారు సుతార్. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు తగిన వ్యవస్థ తమకు లేదని చెబ్తారు.

నిజాయితీగా..

“మాకున్న వనరులు చాలా తక్కువ. మా పెట్టుబడులన్నీ తయారీరంగంపైనే కేంద్రీకరించాం. గ్లోబల్‌గా సమాచార వ్యవస్థవో గత పదేళ్లలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంది. మేం ఈ విషయంలో వెనుకబడ్డాం” అంటారు బేక్‌వెల్ బిస్కట్స్ ఐటీ&ప్రొడక్షన్ హెడ్ జావేద్ సుతార్.

స్థానికంగా ఓ సర్వీస్ ప్రొవైడర్ అందించే ఉచిత ఈమెయిల్ సహాయంతో బేక్‌వెల్ మొదలైంది. ఎక్స్‌టర్నల్ మెయిల్ సర్వర్ కారణంగా దీనితో తరచుగా ఇబ్బందులు ఎదురయ్యేవి. దురదృష్టవశాత్తూ ఇలాంటి నమ్మదగని మెయిల్ ఆపరేటర్లపై చాలాసార్లు సొమ్ములు వెచ్చించారు వీరు. ఈమెయిల్స్, వెబ్‌సైట్ హోస్టింగ్‌ల కోసం పెద్దమొత్తాన్నే వెచ్చించారు. అదే సమయంలో చాలా సమయం కూడా వృథా అయిందని చెబ్తారు. ఒక సమగ్రమైన ప్లాట్‌ఫాం లేకపోవడంతో అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.

వెబ్‌సైట్ డౌన్ అయినప్పుడల్లా సమస్యలు పెరిగిపోయేవి. “దీని మూలంగా అనేక విషయాలు ఆలస్యమయిపోతాయి. కొటేషన్స్ ఇవ్వడం, ఇన్‌వాయిస్‌లు అందించడం, అమ్మకాలు, పర్చేజ్ ఆర్డర్స్, అప్రూవల్స్... ఇలా అన్నిటికీ లేట్ అయ్యేది. ఇది వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది” అంటారు ఎక్స్‌పోర్ట్స్ హెడ్ రఫీక్ ఏ జథేరా.

ఇబ్బందులు పెరిగిపోవడంతో బేక్‌వెల్ సంస్థ ఉన్నత సిబ్బంది ఓ పరిష్కారం కోసం ఆలోచించారు. పెరిగిపోతున్న ఖర్చులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. “మా సమస్యకు ఓ ప్రపంచ స్థాయి పరిష్కారం కావాలనుకున్నాం. నగరాలు, పట్టణాలే కాదు... కుగ్రామాల్లో అయినా ఒకే తరహా సేవలందించేలా ఓ సాంకేతిక భాగస్వామిని అన్వేషించాం. మా కంపెనీ అభివృద్ధి కోసం టెక్నాలజీపై పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని భావంచా”మంటారు రాయిష్.

క్లౌడ్ ఆఫీస్

స్థానిక ఐటీ సేవలపై సంతృప్తి చెందని బేక్‌‍వెల్ టీం... క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫాం తమకు తగిన పరిష్కారమని భావించింది. ఇది పెరిగిపోతున్న తమ ఖర్చులను అందుబాటులో పెట్టే సాధనమవుతుంది భావించారు వారు. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ అందించే క్లౌడ్ బేస్డ్ ఆఫీస్ 365 ఎంటర్‌ప్రైజ్ క్లాస్‌ను భాగస్వామిగా తీసుకున్నారు. వీరు తమ సహకారం ఇవ్వడమే కాకుండా నమ్మదగిన ఈమెయిల్ సిస్టంను కూడా అందిస్తారు.

“ప్రపంచ వ్యాప్తంగా మా ఐటీ అవసరాలన్నిటికీ ఒకే అంతర్జాతీయ పార్ట్‌నర్ అనే ఆలోచన నాకు నచ్చింది. ఈమెయిల్స్, వెబ్‌సైట్స్, వెబ్ కాన్ఫరెన్సులు... ఇలా అన్ని సేవలకు ఒకే సంస్థతో జత కట్టడం నయంగా భావించాం. ఆఫీస్ 365కు మారడానికి మరో కారణం అతి తక్కువ ఖర్చుకే స్థానికంగా మద్దతు లభించడం” అంటారు రాయిష్. కొత్త విధానం ఆఫీస్ 365కి మారాక... బేక్‌వెల్ టర్నోవర్ 35శాతం పెరిగింది. ఆటోమేటిక్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో కంపెనీ సమచారానికి భద్రత కూడా ఇస్తుంది క్లౌడ్ ఆధారిత ఆఫీస్ 365.

షేర్ పాయింట్ ఆన్‌లైన్‌తో కూడా జత కట్టింది బేక్‌వెల్. లింక్ ఆన్ లైన్ కారణంగా... ఎస్‌టీడీ, ఐఎస్‌డీ బిల్లులు, అంతర్జాతీయ ప్రయాణాల ఖర్చులు గణనీయంగా తగ్గాయి. మరోవైపు స్టేటస్, యూజర్స్ లభ్యత వంటి వివరాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆన్‌లైన్ ఛాటింగ్, ప్రయాణాల్లో మీటింగ్‌లకు అవకాశం ఏర్పడింది.

ఆన్‌లైన్‌లో కాన్ఫరెన్సులు, జర్నీల్లో మీటింగులు

“ఆన్‌లైన్ మీటింగులు, కాన్ఫరెన్సుల కారణంగా మా ప్రయాణ, టెలిఫోన్, షిప్పింగ్ ఛార్జీలు గణనీయంగా దిగొచ్చాయి. మా అంచనాల ప్రకారం భాగస్వామ్య, సమచారంపై వెచ్చించే మొత్తం ఏడాదిలో 35శాతంపైగా తగ్గుతుంది” అంటున్నారు బేక్‌వెల్ వ్యవస్థాపకులు.

“మన దేశంలో ఫోన్ చేసి కస్టమర్‌తో మాట్లాడ్డం చాలా సహజం. అదే యూరోప్ మార్కెట్లలో దీన్ని వ్యక్తిగత చొరబాటుగా పరిగణిస్తారు. దీంతో నేనిప్పుడు కస్టమర్‌ లభ్యతను, వారికి తగిన సమయాన్ని, సౌకర్యాన్ని ఐఎం ద్వారా చెక్ చేసుకుని కాల్ చేస్తాను. ఇది కస్టమర్‌తో మా అనుబంధాన్ని మరింతాగ పెంచుతుంది" అంటారు రాయిష్.

మార్కెట్ స్థాయి ఇది

బేకరీ పరిశ్రమలో 30-50శాతం లాభదాయకత ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & సైన్స్ అంచనాల ప్రకారం దేశంలో బేకరీ పరిశ్రమకు రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని అందించే స్థాయి ఉంది. అయితే ఈ రంగంలో చాలా వరకూ అసంఘటిత రంగంలో ఉండండతో... సంస్థాగత వ్యపారాలకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD