ఇద్దరమ్మాయిలతో.. ఒక స్టార్టప్ కన్సల్టెన్సీ..!

ఇద్దరమ్మాయిలతో.. ఒక స్టార్టప్ కన్సల్టెన్సీ..!

Friday March 25, 2016,

4 min Read


నేటి తరం యువత ఉద్యోగం చేయడం కంటే సొంతంగా స్టార్టప్ ప్రారంభించడానికే మొగ్గు చూపుతోంది. ఇండియాలో ఇది ఒక ట్రెండ్ లా మారింది. ఐడియాని పూర్తిస్థాయి స్టార్టప్ గా మార్చే క్రమంలో ఎన్నో ప్రయోగాలు, మరెన్నో అనుభవాలు. ఇదిలా ఉంటే దీనిపై పనిచేసే ఫౌండర్లు చాలా ఒత్తిళ్లకు లోనుకావడం తెలిసిందే. స్టార్టప్ కోర్ వేల్యూపై పనిచేయడంతో పాటు, దాన్ని ఫండ్ రెయిజింగ్ కి తీసుకెళ్లడం లాంటివి ప్రధాన సమస్యలుగా చెప్పుకొవాలి. స్టార్టప్ రంగంలో ఇలాంటి ప్రాబ్లం ప్రతి స్టార్టప్ ఫేస్ చేయాల్సిందే. దానికి పరిష్కార మార్గం చూపిస్తామంటోంది అండ్ కన్సల్టింగ్. ఫండ్ రెయిజింగ్ తో పాటు టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, లీగల్ అండ్ అకౌంటింగ్ సర్వీసులు లాంటి పనులన్నీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంది హైదరాబాదీ కన్సల్టింగ్ స్టార్టప్. 

సాంప్రదాయ వ్యాపారం చేసే చాలామంది స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. అయితే దేంట్లో పెట్టుబడి పెట్టాలనే దానిపై వారికి అవగాహన ఉండం లేదు. అలాంటి వారికి స్టార్టప్ లను వెతికి పెట్టే బాధ్యతను కూడా అండ్ కన్సెల్టింగ్ చేపట్టింది. చాలా స్టార్టప్ లకు ఫండింగ్ వచ్చినప్పటికీ, వ్యాపారం చేయలేక మూతపడటానికి ప్రధాన కారణం- ఆ సంస్థలకు సరైన వ్యూహం లేకపోవడమే. సీడ్ దశ నుంచి సిరీస్ ఏ,బీలకు చేరిన స్టార్టప్ లకు.. కన్సల్టింగ్ చేయడానికి చాలా కంపెనీలు, అడ్వయిజరీ ఫర్మ్ లు లభిస్తాయి. కానీ సీడ్ నుంచి సిరీస్ ఏ మధ్యలో స్టార్టప్ ను నడపడం కత్తిమీద సాములాంటిది. ఈ దశలో తమని సంప్రదిస్తే సరైన ప్లాన్ ఇస్తామంటున్నారు ఈ ఇద్దరమ్మాయిలు. 

image


అండ్ కన్సల్టింగ్ పనితీరు

ఎన్నో రకాల వ్యాపారాల్లో లాభాలు సాధించిన ఎంతోమంది సరికొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఇటీవల స్టార్టప్ కల్చర్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఏ స్టార్టప్ లో పెట్టుబడులు పెట్టాలనేదానిపై క్లారిటీ ఉండటం లేదు.

పెట్టుబడులతో సిద్ధంగా ఉన్న వారికి సరైన స్టార్టప్ ను వెతికి పెట్టే బాధ్యత మాది అంటున్నారు కో ఫౌండర్ సౌజన్య. ఈ ప్రాసెస్ లోనే స్టార్టప్ కు ఫండింగ్ అందించే ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారామె. తాము అందించే బిజినెస్ సొల్యూషన్ ఉభయతారకమైనదని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు స్టార్టప్ సస్టెయినబుల్ మోడల్ లోకి రావడానికి ఈ సంస్థ పరిష్కారం చూపుతోంది.

కీర్తి అనే అమ్మాయి ఈ సంస్థకు మరో కో ఫౌండర్. బిజినెస్ ప్లాన్ తో పాటు ప్రాడక్ట్ డిజైన్ లాంటి ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తెచ్చామని కీర్తి అంటున్నారు. ఒక ఐడియాను స్టార్టప్ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్లాలనే దానిపై కొందరికి పూర్తిగా అవగాహన ఉండదు. సీడ్ ఫండింగ్ వస్తే ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలియకపోవచ్చు. అలాంటి వారికి సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని కీర్తి చెప్తున్నారు. స్టార్టప్ మార్కెట్ వ్యాల్యూమ్ గుర్తించి అడుగులేస్తే.. ఆ తర్వాత తిరిగి చూడక్కర్లేదంటారామె.

image


స్టార్టప్ లో ప్రధానాంశాలు

1. ఫండ్ రెయిజింగ్

ఇప్పుడున్న రోజుల్లో ఫండ్ రెయిజింగ్ ప్రధాన సవాలు. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో స్టార్టప్ మార్కెట్ పొటెన్షియల్ తో పాటు తర్వాత రిటర్న్స్ ఎలా చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వాలి. ఇలా పది రకాలుగా స్టార్టప్ సొల్యూషన్ ని చూపించడంతో దీన్ని అధిగమించే మార్గాన్ని అండ్ కన్సల్టింగ్ చూపిస్తుంది.

2. రెప్యుటేషన్

ఒకే సొల్యూషన్ చూపించే రెండు స్టార్టప్ లు ఉన్నప్పుడు వాటి స్ట్రాటజీ బట్టి రెప్యుటేషన్ ఆధారపడి ఉంటుంది. ఎప్పటి కప్పుడు వ్యూహం మార్చి రెప్యుటేషన్ పెంచడంలో అండ్ కన్సల్టింగ్ సాయం చేస్తుంది.

3. కోర్ వ్యాల్యూ ఎడిషన్

ప్రతి స్టార్టప్ కు కొంత వ్యాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఆ సంస్థ ప్రారంభం నుంచి దాన్ని కాపాడుకోవడంపైనే ఆ స్టార్టప్ గ్రోథ్ ఆధారపడి ఉంటుంది. దీన్ని పెంచుకుంటూ పోతే వండర్స్ క్రియేట్ చేయొచ్చని అండ్ కన్సల్టెన్సీ అంటోంది. ఆ బాధ్యత తమపై విడిచిపెట్టి ఇతర విషయాలను చూసుకోండని భరోసా ఇస్తోంది.

4. సొల్యూషన్, నెట్ వర్కింగ్.

సాధారణంగా స్టార్టప్స్ ఫెయిల్ అయ్యేది సొల్యూషన్, నెట్ వర్కింగ్ సరిగా లేకనే. వాటిని ఎంత చక్కగా ప్రజెంట్ చేసుకుంటే అంత గొప్ప ఫలితాలు పొందొచ్చని అండ్ కన్సల్టింగ్ అంటోంది. స్టార్టప్ సొల్యూషన్ తో అంతా సాధ్యమని అంటున్నారు సౌజన్య. నెట్ వర్కింగ్ పెంచుకోవడంపైనే స్టార్టప్ వృద్ధి ఆధారపడి ఉందని కీర్తి చెప్పుకొచ్చారు.

అండ్ కన్సల్టింగ్ టీం

టీం విషయానికొస్తే ప్రధానంగా ఇద్దరు కో ఫౌండర్ల గురించి చెప్పాలి. బెంగళూరు ఏలియన్స్ బిజినెస్ అకాడమీ నుంచి ఎంబీయే పూర్తి చేసిన కీర్తి.. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థలో ఐదేళ్లు బిజినెస్ అనలిస్ట్ గా పనిచేశారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వేల్యూయేషన్, ఫినాన్సియల్ మోడలింగ్ లాంటివి కీర్తి ప్లస్ పాయింట్స్. మేనేజ్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ దాకా అన్ని ఆపరేషన్స్ ఆమెకు కొట్టిన పిండి. సింగపూర్, మలేషియా, గయానా, ఘనా లాంటి ఆన్ సైట్ ప్రాజెక్టులను కూడా డీల్ చేసిన అనుభవం ఆమెకు ఉంది. 

సౌజన్య ఈ సంస్థలో మరో కో ఫౌండర్. ఓయూ నుంచి బీఈ చదివారు. ఐఐఎం అహమ్మదాబాద్ నుంచి పీజీ పూర్తి చేశారు. ఫినాన్స్, కమర్షియల్, స్ట్రాటజీ కన్సల్టింగ్ లలో దాదాపు తొమ్మిదేళ్ల అనుభవం గడించారు. తర్వాత లైఫ్ స్టైల్ ఈ-కామర్స్ స్టార్టప్ కు పనిచేశారు. ఐటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినాన్స్ మోడలింగ్ రంగాల్లో ఆమెకు మంచి అవగాహన ఉంది. ఈ ఇద్దరితోపాటు అడ్వయిజరీ బోర్డ్ లో మరికొందరు అనుభవజ్ఞులున్నారు.

ప్రధాన సవాళ్లు

సరైన స్టార్టప్ ని గుర్తించడమే అండ్ కన్సల్టింగ్ కు ప్రధాన సవాల్ అని కీర్తి అంటున్నారు. అంతా ఒకే రకమైన సొల్యూషన్ చూపిస్తారు. అందుకే ఫండర్స్ కు కావల్సిన రిక్వైర్మెంట్ వెతకడం రిస్కే అంటారామె. అందుకే తామే స్టార్టప్ స్ట్రాటజీని సరికొత్తగా తయారుచేసి ప్రొజెక్ట్ చేస్తామంటున్నారు. 

ఇక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్న సవాల్- దీనికి పూర్తిగా భిన్నమంటారు సౌజన్య. ఎండ్ ఆఫ్ ద డేకి వారు పెట్టిన పెట్టుబడికి రిటర్న్ చూపించగలగాలి. దానికి వ్యూహం తయారుచేయడం ద్వారా సమస్య అధిగమించగలమంటున్నారు. అయితే ఈ క్రమంలో అందరు ఇన్వెస్టర్లు ఒకేలా ఉండరని.. దీనికోసం స్టార్టప్ తరుపునుంచి ఒప్పించాల్సి వస్తుందని అంటారామె.

image


పోటీదారులు.. ఫ్యూచర్ ప్లాన్స్

ఈ సెగ్మెంట్లో పోటీ లేకపోయినప్పటికీ సిరీస్ ఏ తర్వాత మెకన్సీ లాంటి బిజినెస్ స్ట్రాటజీ కన్సెల్టింగ్ కంపెనీలు ఉన్నాయంటున్నారు సౌజన్య. అయితే తాము సీడ్ రౌండ్ స్టార్టప్ లను టార్గెట్ గా పెట్టుకోవడం వల్ల ప్రస్తుతానికి పోటీదాలులేరనే చెప్పాలంటున్నారామె

స్టార్టప్ టీంలో గ్యాప్స్ ఫిల్ చేయడం తో పాటు డిజిటల్ మార్కెటింగ్ లాంటి లక్ష్యాలను పెట్టుకున్నామన్నారు. స్టార్టప్ వ్యాపార లావాదేవీలపై తమ కంపెనీని బ్రాండ్ నేమ్ గా మార్చడమే అంతిమ లక్ష్యం అంటున్నారు.

ఏడాది చివరికల్లా కనీసం10 స్ట్రార్టప్ లకు స్ట్రాటజీ తో పాటు 10 మంది ఇన్వెస్టర్లకు స్టార్టప్ లను వెతికే పనిని లక్ష్యంగా పెట్టుకున్నామని కీర్తి ముగించారు.