ఖరీదైన వైద్యాన్ని గ్రామస్తుల కోసం నేలకు దించిన ఐక్యూర్

సాఫ్ట్‌వేర్ సహాయంతో గ్రామాల్లో వైద్య సేవలుపశ్చిమ బెంగాల్‌లో స్టార్టప్ కంపెనీ అద్భుతంమారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక చౌక వైద్యం

ఖరీదైన వైద్యాన్ని గ్రామస్తుల కోసం నేలకు దించిన ఐక్యూర్

Wednesday May 13, 2015,

2 min Read

వైద్యోనారాయణో హరి అంటారు..కాని మనదేశంలో ఆ దేవుడు పేదోడి ఇంటి గుమ్మం తొక్కడం లేదు. KPMG 2013 రిపోర్ట్ ప్రకారం 84 కోట్ల గ్రామీణ ప్రజలు సరైన వైద్య సదుపాయానికి నోచుకోవడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు సుజయ్ సంత్ర. అందుకే ‘ఐ క్యూర్’ సంస్థను ఏర్పాటుచేసి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని చౌకగా అందిస్తున్నారు. సుజయ్ సంత్ర ఐక్యూర్ ఆలోచనకు ఖరగ్‌పూర్‌లో జరిగిన ఓ సంఘటనే ప్రేరణ.

గ్రామీణులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు

గ్రామీణులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు


పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్‌లో ఓ వ్యక్తి గుండె సంబంధింత వ్యాధి చికిత్సకు తీసుకున్నాడు. అక్కడి డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ప్రముఖ కార్డియాలజీ హాస్పిటల్‌లో చూపించుకున్నాడు. అప్పుడే ఆయనకో విషయం తెలిసింది. ఆయన వెసుకుంటున్న మందులు గుండె జబ్బుకు సంబంధించనవే కాదని ! ఖరగ్‌పూర్ డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఆ పరిస్థితి తలెత్తింది. ఈ విషయం తెలుసుకున్న సుజయ్ సంత్ర...నాణ్యమైన వైద్యం పొందడం ప్రతీ ఒక్కరి హక్కుగా ఉండాలని ఐ- క్యూర్‌ను స్థాపించారు. ఇదో స్టార్టప్ కంపెనీ. అయితే సేవాభావంతోనే తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంది. అందుకే చౌకగా ఆరోగ్య సేవలందించడంపై దృష్టి పెట్టిందీ సంస్థ.

సుజయ్ సంత్ర, ఐ క్యూర్ సంస్థ వ్యవస్థాపకులు

సుజయ్ సంత్ర, ఐ క్యూర్ సంస్థ వ్యవస్థాపకులు


WHO 2012 రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 43.5% గ్రామాల్లో మాత్రమే డాక్టర్లు ఉన్నారు.. వీళ్లలోనూ చాలామంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఇంతేకాదు ఆయా గ్రామాల్లోని ఆసుపత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. మొత్తంగా అక్కడి ఆరోగ్య సేవల విధానంలోనే లోపం ఉంది. “మేం ఈ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాం. గ్రామాల్లోనీ ప్రతీ ఒక్కరికి వైద్య సేవలను అందించాలనుకుంటున్నాం. ఇందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. WHIMS. (Wireless Health Incident Monitoring System)సాఫ్ట్‌వేర్ సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము. WHIMS అనేది క్లౌడ్ బేస్డ్ వెబ్ ఆప్లికేషన్ కావడంతో తక్కువ బ్యాండ్ విడ్త్‌లోనూ అద్భుతంగా పనిచేస్తుంది” అని అంటున్నారు సుజయ్ సంత్ర

ఐక్యూర్ సంస్థ తయారుచేసిన మానిటరింగ్ డివైస్‌లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉంది. దీంతో పేషంట్ మెడికల్ హిస్టరీ రికార్డ్ అవుతుంది.ఇంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, అందుకు దారి తీస్తున్న పరిస్థితుల ఏంటన్న విషయాలపై డాక్టర్లకు స్పష్టత వస్తుంది.

image


గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఐ క్యూర్ డాక్టర్ కన్సల్టేషన్‌తో పాటు డయాగ్నోస్టిక్ సేవలకు గాను తక్కువ ఫీజు వసూలు చేస్తుంది. గడిచిన ఐదేళ్లలో యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.ఇందులో డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

image


ఐ క్యూర్ సేవలను టెలిమెడిసిన్ తో పోల్చలేమంటున్నారు ఐ క్యూర్ సీఈఓ సుజయ్.. “RHC’s అంటే RURAL HEALTH CENTERS ఉన్న ఏకైక సంస్థ ఐ క్యూర్...RHC’s తో తమ సిబ్బంది గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు..ఇలాంటి సర్వీస్ అందిస్తున్న సంస్థ దేశంలో ఐ క్యూర్ ఒక్కటే..టెలిమెడిసిన్ సేవలు విస్తృతంగా లభిస్తున్నా కూడా వాటిని ఐ క్యూర్ సేవలతో పోల్చలేము..ఎందుకంటే మేం రోగులను ప్రత్యక్షంగా కలుస్తాం..వాళ్ల వ్యాధి వివరాలు తెలుసుకుని చికిత్స అందిస్తాము. ” అని అన్నారు సుజయ్

image


పశ్చిమ బెంగాల్ బీర్భమ్,మిడ్నాపూర్ జిల్లాల్లో ఐ క్యూర్ కు 28 RHC’s ఉన్నాయి.. అందులో నిష్ణాతులైన డాక్టర్లు,డయాగ్నోస్టిక్, మందులతో పాటు సర్జరీ కి సంబంధించిన సేవలందించే సదుపాయలున్నాయి..ఒడిషా,బీహార్,అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఐ క్యూర్ ను విస్తరించి మరో 100 RHC’s స్థాపించే లక్ష్యంతో సుజయ్ పనిచేస్తున్నారు...

image


“నా ఈ గమ్యంలో గెలపోటములు రెండూ ఉన్నాయి..గెలవాలన్న కసి ఓడిపోతేనే వస్తుంది..కష్టసమయాల్లో ధృడంగా ఉండే ఆత్మస్థైర్యం ఐ క్యూర్ ప్రస్థానంతో పాటు నాలోనూ పెరిగింది” అన్నారు సంజయ్ సంత్ర...