ఫోన్ బిల్లుల గుట్టువిప్పి చెప్పే 'మబుల్'

ఫోన్ బిల్లుల గుట్టువిప్పి చెప్పే 'మబుల్'

Sunday August 30, 2015,

5 min Read

కాల్ ఛార్జీ, డేటా ప్యాక్, ఆఫర్లు అర్థం కావు. 

టెలికాం కంపెనీల మతలబలు మనకు తెలియదు.

డేటా, ఛార్జీలు సహా అన్నీ చెప్పేసే మబుల్. 3 లక్షల మంది కస్టమర్లు.


దాదాపు 95 శాతం మంది భారతీయ మొబైల్ వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్లోనే ఉంటున్నారు. మెజార్టీ వినియోగదారులకు అసలు వాయిస్ , డేటా ప్లాన్ల గురించి , వాటి గడువు గురించి అర్థమే కాదు. చాలా సందర్భాల్లో టెలీకాం ఆపరేటర్లు కూడా సంబంధం లేని విషయాలు చెబుతుంటారు. పూర్తి సమాచారం కూడా ఇవ్వరు. అవి వినియోగదారుల్ని మరింత గందరగోళంలో పడేస్తాయి.

ఒక వేళ కస్టమర్ ప్రస్తుతం వినియోగిస్తున్న దానికన్నా బెటర్ ప్లాన్ కు వెళ్లాలంటే ఆపరేటర్‌తో మాట్లాడేందుకు సెల్ఫ్ సర్వీస్ మెనూతో కూడిన IVRSను ఆశ్రయించాల్సిందే. ఇక ప్రీపెయిడ్ వినియోగదారులు కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్స్‌తో మాట్లాడాలంటే కచ్చితంగా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లున్నా అవి ఎందుకూ పనికిరావు.

మబుల్ యాప్ స్క్రీన్ షాట్

మబుల్ యాప్ స్క్రీన్ షాట్


ఈ బాధలు లేకుండా చేసేందుకు అశ్విన్ రామస్వామి, ప్రణవ్ ఝా, రాఘవేంద్ర వర్మ అనే ముగ్గురు మిత్రులు నడుంబిగించారు. ఎలాంటి సమస్యలూ లేకుండా పారదర్శకంగా మొబైల్ ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించారు.

అలా మొదలయ్యింది

వాళ్లు ముగ్గురు సుదీర్ఘ కాలం టెలీకాం రంగంలోనే పని చెయ్యడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. వీలైనంత ఎక్కువమందికి ఉపయోగపడేలా ఓ మొబైల్ అప్లికేషన్ను తయారు చేశారు. 'బ్యాలెన్స్ ఇన్ బ్యాక్' పేరుతో దాని బీటా వెర్షన్ ను 2014 అక్టోబర్ లో విడుదల చేశారు. వినియోగదారుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు మరింత అప్ గ్రేడ్ చేసి 2015 మార్చిలో మబుల్ పేరుతో అప్లికేషన్‌ను మళ్లీ లాంచ్ చేశారు.

కుడి నుంచి ఎడమకు... అశ్విన్, ప్రణవ్, రాఘవేంద్ర

కుడి నుంచి ఎడమకు... అశ్విన్, ప్రణవ్, రాఘవేంద్ర


మబుల్ సీఈఓ అశ్విన్. మద్రాస్ ఐఐటీలో ఇంజనీరింగ్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. మార్కెటింగ్, ఆపరేషన్స్ స్ట్రాటజీ విభాగాల్లో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఎయిర్ టెల్, జూబిలెంట్ రిటైల్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేశారు. తన స్నేహితులతో కలిసి మబుల్ నెట్ వర్క్స్ ప్రారంభించే ముందు కొద్ది కాలం పాటు ఎంటీఎస్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో కూడా పని చేశారు.

ప్రణవ్ మబుల్ నెట్ వర్క్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. బొంబే ఐఐటీలో ఇంజనీరింగ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, వ్యవహారాలు, విశ్లేషణలు, మొబైలిటీ రంగాల్లో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. అప్నోమిక్, వాయు, ఆన్ మొబైల్, మరింబ సంస్థలతో పాటు ఇన్ఫోసిస్, బీఎంసీ సాఫ్ట్ వేర్ లాంటి సంస్థల్లో కూడా పని చేశారు. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐటీ ఇండస్ట్రీలో 23 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. ఆన్ మొబైల్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇన్ఫోసిస్‌లో ప్రొడక్ట్ ప్లాట్ ఫామ్స్, స్టార్టప్ అప్లికేషన్స్, మిడిల్ వేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఆన్ మొబైల్. ఈ ముగ్గురుతో పాటు మరో 8 మంది ప్రోగ్రామర్లు కూడా వాళ్ల టీంలో ఉన్నారు.

పాఠాలు

మొదట్లో సున్నా నుంచి మొదలైన మబుల్ యాప్ ప్రయాణం ఇవాళ మూడు లక్షల మంది వినియోగాదారులు ఉపయోగించే స్థాయికి చేరింది. టెలికాం ఆపరేటర్ల వచ్చిన రెండు కోట్ల పైబడి మెసేజ్‌లు స్కాన్ చేశారు. ఆ క్రమంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు.

అసంపూర్ణమైన డేటా

ప్యాకేజీల ముగిసిపోయే సమయం లాంటి కనీస సమాచారం కూడా లేని మేసెజ్ లు 37 శాతం ఉన్నట్లు గుర్తించారు. చాలా మంది ప్రీపేయిడ్ వినియోగదారులు రేట్ కటర్ ప్లాన్లు, ఎస్ఎంఎస్ ప్లాన్లు , డేటా ప్లాన్లు వినియోగించుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకు వాటికి గురించి పూర్తి వివరాలు తెలియవు. అందువల్ల చాలా మంది దేనికి ఎంత ఖర్చువుతున్నదన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు. వాటిని గుర్తుంచుకునేందుకు గడువు ముగిసిపోయే తేదీలను గుర్తుంచుకోవాల్సి వస్తోంది. అంటారు అశ్విన్

"ప్రస్తుతం ప్రతి కాల్ పూర్తయిన తరువాత ఆపరేటర్లు మిగిలిన బ్యాలెన్స్ వివరాలు పంపుతారు. కానీ ఆ పంపిన మెసేజ్ ను దాచుకునే సదుపాయం ఉండదు ఒక్కోసారి అర్థం కాదు కూడా. రేట్ కట్టర్లకు ముగింపు తేదీ కూడా ఉండదు. ప్రతిసారి మనమే ఒకదానికొకటి సరిపోల్చుకుంటూ ఉండాలి. "
ఏ యాప్ ఎంత డేటా వాడిందో చూపిస్తున్న యాప్

ఏ యాప్ ఎంత డేటా వాడిందో చూపిస్తున్న యాప్


అపార్థాలు

కేవలం అల్పాదాయ వర్గాలే ప్రీపెయిడ్ వాడతారన్న ఒక అపోహ జనాల్లో బాగా ఉండిపోయింది. అందులో ఎంత మాత్రం నిజం లేదంటారు అశ్విన్. " దేశంలో సుమారు 95 శాతం మంది ప్రీపెయిడ్ వినియోగదారులే, అందులో అన్ని వర్గాల వారు ఉన్నారు. ప్రీపెయిడ్ అనేది ఖర్చును నియంత్రించడమే. అలా ఆలోచించే ప్రజలంతా ప్రిపెయిడ్ వినియోగదారులే."

మాతృభాషలో లేకపోవడం 

మబుల్ గుర్తించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది టెలికాం ఆపరేటర్లు పంపించే మేసెజ్‌‌లన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటోంది.

సదుపాయాలు

వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారతీయుల అవసరాలకు అనుగుణంగా ముగ్గురు మిత్రుల బృందం మబుల్‌ను తయారు చేసింది.

అన్ని విధాల సహకారం: ఈ అప్లికేషన్ రెండు సిమ్ కార్డులున్న ఫోన్లలో పని చేస్తుంది. ఏ ప్యాకేజీలోనైనా మొబైల్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెబుతుంది. కాల్ రేట్ల కత్తిరింపుల పూర్తి రికార్డు ఉంటుంది. మొబైల్ డేటాను అప్లికేషన్లు ఎంత ఉపయోగించుకుంటున్నాయి. అసలు ఏ ఏ అప్లికేషన్లు నడుస్తున్నాయి..? ఈ వివరాలన్నింటినీ ముబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

మాతృభాషలోనే సమాచారం

ఈ అప్లికేషన్ ఉపయోగించడానికి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేదు. మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్ బట్టి ఇంగ్లిష్ తో పాటు హింది, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు వంటి ప్రముఖ భారతీయ భాషలన్నింటిలోనూ సమాచారం తెలుసుకోవచ్చు. జీఎస్ఎం ఆపరేటర్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దాదాపు 45 శాతం మంది ప్రజలు హింది అప్లికేషన్నే ఉపయోగిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 30 శాతం మంది వారి వారి ప్రాంతీయ భాషా అప్లికేషన్ ను వినియోగిస్తున్నారు.

యువర్ స్టోరీ తీర్పు:

ఈ కథనం రాసిన నేను కూడా ఈ అప్లికేషన్ ను నా డ్యూయల్ సిమ్ కార్ట్ స్మార్ట్ ఫోన్ లో లాంచ్ చేసుకున్నాను. అప్లికేషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. రెండు సిమ్ కార్డులను అవి ఉపయోగించుకుంటున్న డేటా వివరాల్ని ఒకదాని నుంచి మరో దానికి చాలా త్వరగా మార్చుకోగల్గాను. ఎక్కువ ప్రీపెయిడ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన అప్లికేషన్ అయినా నా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ 3జీ డేటా వినియోగ వివరాలను కూడా తెలుసుకోగలిగాను. వినియోగించుకున్న డేటా వివరాల్ని మెగా బైట్స్‌లో చూపిస్తోంది. అలాగే ప్రతి అప్లికేషన్ ఎంతెంత డేటా వినియోగించుకుంటుందో వేర్వేరుగా చూపిస్తోంది. ప్రస్తుతం ఫోన్లో నడుస్తున్న అప్లికేషన్లు ఎంత డేటాను వినియోగించుకుంటున్నాయో కూడా చూపిస్తోంది..

నా ప్రిపెయిడ్ సిమ్‌కు సంబంధించిన కాల్ లాగ్స్ డేటాను అలాగే పాప్ అప్ మెసేజ్‌ను భవిష్యత్ అవసరాల కోసం స్టోర్ చేసుకోగల్గాను. నేను సబ్ స్క్రైబ్ చేసుకున్న ప్యాక్ వివరాలు కూడా యాప్ లో చూపిస్తోంది. అదే సమాచారాన్ని తెలుగులో కూడా చూసుకున్నాను. కానీ పాప్ అప్ మెసేజ్‌లు మాత్రం ఇంగ్లీష్ లోనే కనిపిస్తున్నాయి.

మార్కెట్ సైజ్..రెవెన్యూ మోడల్

ఇండియాలో దాదాపు పది కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్నారు. రోజు రోజుకి వారి సంఖ్య రెట్టింపవుతోంది. కనుక మబుల్ వ్యాపారం ఏ ఏటికాయేడు రెట్టింపవుతుందే తప్ప వచ్చిన ఇబ్బందేం లేదు. వచ్చే రెండేళ్లలో పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వినియోగదారులకు మబుల్ ఉపయోగం అంతా ఇంతా కాదు. అంటారు అశ్విన్

ఖర్చు విషయంలో భారతీయులు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బులు విలువ తెలుసుకోవాలనుకుంటారు. పారదర్శకతను కోరుకుంటారు.

మబుల్ తన పని తీరును మరింత మెరుగుపరచుకోవాలనుకుంటోంది. భవిష్యత్ లో ప్యాకేజీల వివరాలు, రీచార్జ్ చేసుకోవడం వంటి రుసుము ఆధారిత సేవలను కూడా అందించాలనుకుంటోంది . ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ఛానెళ్ల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైబడి వినియోగదారులున్నారు. కొద్ది నెలలుగా అసలు రెండు సిమ్ కార్డులున్న ఫోన్లే జనాలు ఎందుకు వాడాలనుకుంటున్నారు వంటి సమాచారాన్ని కూడా సేకరించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా కంటెంట్‌తో మార్కెటింగ్ ను పెంచాలనుకుంటున్నారు.

కాల్ లాగ్, ఎస్ఎంఎస్ ఛార్జీల వివరాలు

కాల్ లాగ్, ఎస్ఎంఎస్ ఛార్జీల వివరాలు


మొదట్లో కొద్ది నెలల పాటు నిధుల కోసం ఇబ్బంది పడ్డా ఆ తరువాత స్నేహితుల నుంచి, కుటుంబసభ్యుల సాయంతో మొత్తంగా రెండు కోట్ల 40 లక్షలు పోగు చేసి ప్రారంభించారు. ప్రస్తుతం వాళ్ల సీరిస్ ఫండింగ్ గురించి దానికి అవసరమైన నిధుల కోసం VCలతో చర్చలు జరుగుతున్నాయి. ఆ నిధులు వస్తే ప్రొడక్ట్ మార్కెటింగ్, టెక్నికల్ టీం బలపర్చడానికి ఉపయోగించాలని అనుకుంటున్నారు.

మున్ముందు మరిన్ని భాషల్లో అప్లికేషన్‌ను అందుబాటులో తీసుకొచ్చి వీలైనంత మందికి ఉపయోగపడేలా చెయ్యాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతీయ మార్కెట్ పై దృష్టి పెట్టినా భవిష్యత్తులో మనలాగే ప్రిపెయిడ్ వినియోగం ఉన్న అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు మబుల్ సేవలను విస్తరించాలనుకుంటున్నారు.