అవయవ దానం అద్భుత దానం అంటున్న సెలబ్రిటీలు

0

హైదరాబాద్ మాదాపూర్‌కి చెందిన మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ నుంచి 200లకు పైగా డాక్టర్లు, 2వేల మంది ఉద్యోగులు ఒకే వేదికపై అవయవ దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంత ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గతంలో ఎన్నడూ లేదు. దీనికి ప్రత్యూష సపోర్ట్, జీవన్ దాన్ సంస్థలు మద్దతిచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత గొప్ప కార్యక్రమం తాము నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు మ్యాక్స్ క్యూర్ ఎండి అనీల్ క్రిష్ణ.

“ఇలాంటి ప్రొగ్రాం కి భారీ స్పందన రవడం, అంతా స్వచ్ఛందంగా ముందుకు రావడం మాకు ప్రొత్సాహాన్నిచ్చింది.” డా.అనిల్

డాక్టర్ల స్వచ్ఛంద నిర్ణయం

మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ డాక్టర్లు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని తనకు చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యం, మరింత ఆనందానికి లోనయ్యానని అనిల్ అన్నారు. తమ డాక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుచెప్పకుండా ఓ వేదికని ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు.ఈ రెండు స్వచ్ఛంద సంస్థల మద్దతుతో అవయవ దానం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. భవిష్యత్ లో మరింత మంది అవయవదానం చేసేలా ప్రొత్సహిస్తాం, వారిలో స్పూర్తి నింపుతామన్నారాయన.

సెలబ్రిటీలూ స్వచ్ఛందంగానే...

ప్రత్యూష సపోర్ట్ ఫౌండర్ సమంతకు ఈ విషయం చెప్పగానే వెంటనే ఓకే చెప్పారు. పుల్లెల గోపీ చంద్ ఇచ్చిన మద్దతు మర్చిపోలేనిది. మేం పిలవగానే మాతో పనిచేయడానికి ముందుకొచ్చిన అనురాగ్ శర్మ సాయం వెలకట్టలేనిదని అనిల్ అన్నారు.

“తిరిగి ఇవ్వడం అనేది అన్నింటి కంటే గొప్ప విషయం. ఈ వేదికపై అంతా అవయవాలు దానం చేస్తున్నట్టు ప్రతిక్ష చేసిన మీరంత చాలా గొప్పవారు.” సమంత.

అవయవదానం అన్ని దానాల్లోకి గొప్పది. దీనికి ఇంత గొప్ప వేదికను ఏర్పాటు చేసిన మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి కంగ్రాట్స్ చెప్పిన పుల్లెల గోపీ చంద్ తానూ అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

అవయవ మార్పిడికి అవసరం అయిన ఎలాంటిసాయం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు అనురాగ్ శర్మ ప్రకటించారు. దీనిపై ఇంకా జనంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముందుండి నడిపిన మంజులా అనగాని

పద్మశ్రీ డాక్టర్ ముంజులా అనగాని ఈ మొత్తం కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నడిపించారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకు రావడమే కాదు, మొత్తం కార్యక్రమం విజయవంతం కావడానికి కూడా కారణం ఆమెనే.

“ప్రపంచ వ్యాప్తంగా అవయవాల దానం కోసం ఏటా 5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు.” మంజులా అనగాని

భవిష్యత్ ప్రణాళికలు

అవయవ దానంపై అవగాహన పెంచేందుకు మరిన్ని ఈవెంట్లు చేపడతామని అనిల్ ప్రకటించారు. అవయవాలను సేకరించడం ద్వారా శస్త్రచికిత్స, ట్రీట్మెంట్లను తక్కువ ధరలకే చేపడతామని అన్నారాయన.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Stories by ashok patnaik