తన బాధను మరిచి జనాలను నవ్విస్తున్న కనీజ్ సుర్కా

ఇంప్రువైజేషన్ ప్రక్రియతో దేశంలో ఎన్నో ప్రదర్శనలుమొదటి కామెడీ ఇంప్రువైజర్‌గా గుర్తింపుహాస్య ప్రక్రియల్లో ఎన్నో ప్రయోగాలు, మరెన్నో మెళకువలుభర్తతో విడాకులు తీసుకున్నాక జీవితంలో మలుపు

తన బాధను మరిచి జనాలను నవ్విస్తున్న కనీజ్ సుర్కా

Sunday May 03, 2015,

4 min Read

నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల. మన కల్చర్‌లో హాస్యం మిళితమై ఉంది. స్టేజీపై హాస్యాన్ని పండించే ప్రక్రియను ఇంగ్లీష్ లో ఇంప్రువైజేషన్ అంటారు. మెట్రో నగరాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ కళ ఇప్పుడిప్పుడే దేశం మొత్తం వ్యాపిస్తోంది. అందులో అందె వేసిన చేయి కనీజ్ సుర్కాది. ఆమెకు జీవితం నేర్పిన పాఠం.. నవ్వుతూ నవ్విస్తూ ఉండమని. దేశంలో మొదటి మహిళా ఇంప్రువైజేషన్ ఆర్టిస్ట్ గా పేరొందిన కనీజ్ కథే ఇది.ఒక మహిళగా తాను ఇతర కమేడియన్స్ నుంచి ఎలాంటి వ్యత్యాసాన్ని ఇప్పటి వరకూ చూడనేలేదట.

“ నేను అమ్మాయిననే భావం కూడా ఎప్పుడూ కలగలేదు. కమేడియన్ కమ్యూనిటీ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. అందరి మనస్థత్వం ఒకేలా ఉండటం విశేషం”- కనీజ్ సుర్కా

“ నేను అమ్మాయిననే భావం కూడా ఎప్పుడూ కలగలేదు. కమేడియన్ కమ్యూనిటీ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. అందరి మనస్థత్వం ఒకేలా ఉండటం విశేషం”- కనీజ్ సుర్కా


కనీజ్ సుర్కా...భారతీయ కామెడీ తెరపై ఈ పేరు చాలా ఫేమస్. ప్రస్తుతం కనీజ్ ‘ది ఇంప్రువైజర్స్’ గ్రూప్‌లో మెంబర్. అభిష్ మాథ్యూ, కనన్ గిల్, కెన్నెత్ సెబాస్టియన్‌లు ఈ గ్రూప్ లో ఉన్న ఇతర మెంబర్లు. ఇంప్రూవ్ వర్క్ షాప్స్ నిర్వహించడం, స్కెచ్‌లు వేయడం లాంటివి కూడా ఆమె చేస్తుంటారు. కిందటి ఏడాది నుంచి స్టాండప్ షో( నిల్చొని చేసే ప్రక్రియ) లను చేస్తున్నారు. ‘ది వీక్ దట్ వాజంట్’ (సిఎన్ఎన్-ఐబిఎన్) షో తో కనీజ్ చాలా పాపులర్ అయ్యారు. ఇందులో సైరస్ బ్రోచా, కునాల్ విజయ్‌కర్ తో ఆమె కలసి పనిచేస్తున్నారు.

ఐబిఎన్ షోలో భాగంగా కనీజ్

ఐబిఎన్ షోలో భాగంగా కనీజ్


బ్యాక్‌గ్రౌండ్ అండ్ జర్నీ

కనీజ్ సౌతాఫ్రికాలో జన్మించారు. అక్కడే పాఠశాల విద్యతో పాటు కాలేజీ చదువును పూర్తి చేశారు. “నాకు నాటకాలంటే మక్కువ, అందుకే చదువుకునే రోజుల్లో డ్రామా కోర్స్ పూర్తి చేశాను. స్కూల్లో ఉన్నప్పుడే నాటకాల్లో వేషాలు వేసే దాన్ని,” అని చిరునవ్వులు చిందించారు కనీజ్. యూనివర్సిటీ చదువు ముగిసిన తర్వాత 2005లో ఆమె ముంబై వచ్చేశారు. ఒక ఏడాది కాలంగడిపిన తర్వాత తిరిగి వెళ్లి న్యాయశాస్త్రంలో పీజీ పూర్తిచేద్దామని అనుకున్నారట. కానీ ముంబైపై మమకారం పెంచుకున్నారామె. దీంతో ఇక్కడే స్థిరపడిపోయారు. గతంలో ఒకసారి కుటుంబంతో కలసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడొచ్చినప్పుడు బాగా తెలిసిన ప్రాంతంగా అనిపించిందట. ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. నాటకాల్లో వేషాలకోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. తర్వాత దివ్య పలాట్ ట్రూప్ “ఇంప్స్” లో జాయిన్ అయ్యారు. ఇక్కడ చేసే పని ఎంతగానో నచ్చింది. మరో ఏడాది దీన్నే ఎందుకు కొనసాగించ కూడదని అనుకున్నారు. దీంతో ఇంప్రువైజేషన్ కళను మరింత చక్కగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అటు తర్వాత మాగ్నెట్ థియేటర్ లో ఇంప్రవైజేషన్ నేర్చుకోడానికి న్యూయార్క్ వెళ్లారు. ఇంప్రూవ్ కామెడీని కెరియర్‌గా మార్చుకొని గ్రూప్‌లో పనిచేయడం ప్రారంభించారు.

image


“ న్యూయర్క్, ముంబై రెండూ వలసలు వచ్చిన వారితో ఉండే నగరాలే. దీంతో ఎవరూ స్థానికులు కారు. అలాగే అందరూ స్థానికులే. దీంతో అక్కడ కొత్త ప్రాంతమనే అభిప్రాయం రాదు. న్యూయార్క్ లో రెండు నెలలున్నాను. రెండు వారాలకే న్యూయార్క్ ని నా సొంతూరులాగా ఫీలయ్యా. ముంబైలో కూడా ఇదే రకమైన ఫీలింగ్.” అన్నారు కనీజ్.

సైరస్ బ్రోచ, కునాల్ విజయ్‌కర్‌లతో కలసి చేస్తున్న కొన్ని నెలల్లోనే CNN-IBN షో ‘ది వీక్ దట్ వాజంట్’ లో అవకాశం వచ్చింది. కామెడీని కెరియర్ గా మార్చుకో లేననే అభిప్రాయపడ్డారామె. దీంతో నాటకాలను కూడా వేస్తూ షోలు చేశారు. 2007లో కనీజ్ కు పెళ్లైంది. కామెడీలో సీరియస్ కెరియర్ కనిపించలేదు. దీంతో మరింత డిఫరెంట్ థింగ్స్ చేయాలనుకున్నారు. ఒక్క కామెడీనే కాకుండా అన్ని రంగాల్లో ప్రావీణ్యం పెంచుకోవాలని కనీజ్ నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

“ఇదే ప్రయాణం సాగుతుండగానే 2011లో భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. జీవితంలో ఏదో కోల్పోయానే బాధపడ్డాను.” కనీజ్

జీవితం ఎవరికోసం ఆగిపోదు కదా. తన స్నేహితుల నుంచి వచ్చిన పిలుపుతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందనే చెప్పాలి. ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ ముంబైని విడిచి ఎక్కడికీ వెళ్లాలనిపించలేదు. కామెడీ షో చేయడానికి మరోసారి నిర్ణయించుకున్నారు. ఇంప్రూవ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారామె. సమిష్టిగా పనిచేయడాన్ని ఇష్టపడతారామె. చాలా రకాల గ్రూపులతో కలసి పనిచేయడం మొదలు పెట్టారు. ఆల్ ఇండియా బాక్చోద్(A.I.B) కోసం థియేటర్ చేశారు. తర్వాత ఇంప్రూవర్స్‌లో భాగమయ్యాను. దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన వర్క్ షాపుల్లో పాల్గొన్నా. కెన్నెత్ , సందీప్ తనని ఇంప్రువైజేషన్ క్లాసులుచెప్పాలని అడిగినప్పుడు.. ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెపేశారు. ఇంప్రూవ్ తోపాటు వివిధ రకాలైన కామెడీలను ప్రయత్రించారు. స్టాండప్ లో దాదాపు 20నిముషాల నిడివి ఉన్న ఓ ప్రక్రియకు ప్రాణం పోశారు కనీజ్. భారత్‌లో ఇంప్రూవ్ సీన్ స్థాయిని పెంచాలనేది ఆమె ఉద్దేశం. దీనికోసం వర్క్ షాపులు నిర్వహించడం ప్రధానమైనది.

“ఇంప్రూవ్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ఎంత ఆనందంగా ఉంటాడో.. దాన్ని చూసే ఆడియన్స్ కూడా అంతే సంతోషంగా ఉంటారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి.” కనీజ్ . తొందరలోనే న్యూయార్క్ వెళ్లి ఇంప్రూవ్ రైటింగ్‌తోపాటు స్కెచ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారట. భారత్‌లో కామెడీ కమ్యూనిటీ అనేది చాలా గొప్పదని నమ్మేవారిలో కనీజ్ ముందుంటారు. నా సహ కళాకారులుతో నాకు ఆరోగ్యకరమైన పోటీ ఉంది. వాళ్లంతా నిజంగానే గొప్పవ్యక్తులని అభిప్రాయపడ్డారామె. దేశంలో మార్కెట్ భారీగా పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేరు వేరు రకాలైన స్టైల్స్ ఉన్నాయి. ముంబైలో బాలీవుడ్, పాలిటిక్స్ పై ప్రధానంగా ఆధారపడి కామెడీ నడుస్తుంది. బెంగుళూరు దీనికి భిన్నమనే చెప్పాలి. బెంగళూరులో చురుకుదనాన్ని మనం చూడొచ్చు. కథను చెబుతూ కామెడీచేయాలిక్కడ. దీన్ని ఆమె ఎంతగానో ఇష్టపడతారట. బెంగుళూరులో వారంలో ఐదుసార్లు షో ఉండటానికి అవకాశం ఉంటే.. ముంబైలో మాత్రం నెలలో నాలుగుసార్లు ఆ అవకాశం వస్తుంది. నేను చాలా ఇష్టపడతా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా కళని ప్రదర్శించవచ్చు. ఎక్కువ సార్లు షోలు చేయడం వల్ల బెంగళూరులో కళాకారులకు కళాప్రదర్శనకు అద్భుతమైన అవకాశాలున్నాయి. ఒక కళాకారిణిగా తాను దీన్ని ఇష్టపడతారని అంటారామె.

హాస్యం అనేది నీలోనే ఉంది. దాన్ని బయలకు తీయడానికి ప్రయత్నిస్తే అద్భుతాలు చేయొచ్చు.నీలోని ఉన్న శక్తిని గుర్తించి బయటకు రా.- కనీజ్

హాస్యం అనేది నీలోనే ఉంది. దాన్ని బయలకు తీయడానికి ప్రయత్నిస్తే అద్భుతాలు చేయొచ్చు.నీలోని ఉన్న శక్తిని గుర్తించి బయటకు రా.- కనీజ్