వాడిన ఖరీదైన దుస్తులను అమ్మిపెట్టే 'ఇటాషీ'

వాడిన ఖరీదైన దుస్తులను అమ్మిపెట్టే 'ఇటాషీ'

Tuesday April 21, 2015,

3 min Read

''ఎప్పటికప్పుడు సైజుల్లో మార్పులు రావడంతో.. కొత్త జతలు కొనడం ఆనవాయితీ అయిపోయింది ఈ రోజుల్లో. దీంతో ఎంతో డబ్బు పెట్టి కొన్న బట్టలను ఏం చేయాలో తెలియని స్థితి చాలా మంది జనాలకు. తన లానే ఎంతో మంది మగువలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికోసం OLXలా ఓ వెబ్ సైట్ పెట్టి సేల్ చేస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఇటాషీని మొదలు పెట్టాను అంటున్నారు''- సిఈఓ అమ్న అబ్బాసి.

image


సాధారణంగా మగువలంతా తమ దగ్గరున్న బట్టల్లో సగానికి సగం బీరువాలో లేదా కప్ బోర్డులో దాచి పెడుతుంటారు. ఎప్పటికప్పుడు కొత్తవాటిని కొంటూ ఉంటారు. కొన్ని సార్లు వాటిని ఒక్కసారి కూడా వాడకపోవచ్చు. ఇలా ఎన్నో బట్టలు అలానే మూలుగుతున్న విషయం మనం ఇక్కడ గమనించాలని ఆమె చెబుతారు.

shutterstock image

shutterstock image


మరికొంత మందితో తన అభిప్రాయాన్ని వివరించిన అమ్నా.. వారితో కలసి ఇటాషీ డాట్ కామ్(Etashee.com) ప్రారంభించారు. ఇప్పుడు ఇటాషీ అంటే ఓ లగ్జరీ బ్రాండ్. ఇటాషీ అంటే సరికొత్త ఆన్ లైన్ షాపీ.

“నా బట్టల అల్మారాలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైన అకేషన్స్ కోసం తీసుకున్నవే. కానీ వాటిని ఆ తర్వాత ఎప్పుడూ వాడలేదు. వాడే అవసరం కూడా లేదు. ఎందుకంటే అందులో చాలా ఐటమ్స్ మంచి కండిషన్‌లో లేవు. వాటిని దానం చేయడానికి సైతం మనసు రావడం లేదు” అని అంటారు అపూర్వ. 

అపూర్వ ఫ్యాషన్‌ని అప్‌టుడేట్ ఫాలో అవుతారు. ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా ఉండటానికి ఇష్టపడే మహిళల్లో అపూర్వ కూడా ఒకరు. అపూర్వకు షాపింగ్ చేయడం కంటే ఇష్టమైన పని మరొకటి ఉండదంటే నమ్ముతారా ? ఇలాంటి వారికి ఇటాషీ ఎంతగానో ఉపయోగపడుతోంది.

డిజైనర్ పీస్‌లను ఇష్టపడి.. వాటిని కొనే స్థోమత లేని వారికి సైతం ఈ ప్లాట్‌ఫాంతో ప్రయోజనం చేకూరుతోంది. అటు అమ్మేవారితో పాటు కొనే వారికి ఇటాషీ మంచి లాభదాయకంగా మారుతోంది.

ఓఎల్‌ఎక్స్, ఈబే ఉన్నాయిగా ?

ఓఎల్ఎక్స్, ఈబేలా కాకుండా.. ఇటాషీ ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ పై ఫోకస్ చేస్తోంది. చాలా వరకూ లగ్జరీ శ్రేణే లక్ష్యంగా వీళ్ల వ్యాపారం సాగుతోంది. ఆసక్తి ఉన్న అమ్మకందార్లు తమ సైట్‌లో నేరుగా వ్యాపారం చేసుకోవచ్చు. ఫోటో అప్‌లోడ్ చేసి.. కింద డిటైల్స్ అందిస్తారు. వస్తువులు సేల్ అయిన తర్వాత 15 శాతం కమీషన్ తీసుకుంటామని అమ్న వివరించారు.

ఇటాషీలో ఉండే కొన్ని ప్రత్యేకతలే అమ్నా మనసుకు ఇటాషీని మరింత దగ్గర చేస్తున్నాయి. సైట్‌లో అమ్మకానికి పెట్టిన వస్తువుల తయారీ తమ చేతిలో లేదు. బ్రాండెడ్ వస్తువులు మాత్రమే లభిస్తాయి. అంతకంటే పెద్దగా పనేమి ఉండదు. మరిన్ని ప్రీ ఓన్డ్ వస్తువులను మార్కెట్ లోకి తీసుకురావాలనేదే మా లక్ష్యం అంటారు ఆమె.

గతేడాది నవంబర్‌లో ప్రారంభమైన ఇటాషి ప్రస్తుతానికి 18మంది టీంతో నడుస్తోంది. నోయిడా, ఢిల్లీలో మంచి ప్రాచుర్యం సంపాదించుకుంది. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ గ్రూపు ఇందులో రూ. 5 కోట్లు పెట్టుబడులు పెట్టింది.

ప్రీ ఓన్డ్ ప్రాడక్ట్‌లంటే మన దేశంలో ఇప్పటి వరకూ కొద్దిగా వెనక్కితగ్గుతారు. అయితే సామాజిక పరిస్థితులు తెచ్చిన మార్పుతో.. జనం ఆలోచనా సరళి మారుతోంది. ఇక్కడ ఫ్యాషన్‌ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఫ్యాషన్ అనేది లేకపోతే.. ఈ విషయంలో మార్పు వస్తుందని చెప్పలేం. తమ అమ్మ, అమ్మమ్మల ప్రైస్ లెస్ పీసులు సూట్ కేసుల్లో దశాబ్దాలుగా మూలగడం ఇష్టం లేకపోవడంతో.. వాటిని ఇటాషీలో అమ్మకానికి పెడుతున్నారు ఈ తరం అమ్మాయిలు.

image


అంత ఈజీ కాదేమో !

ఆన్ లైన్లో రెంటల్ స్పేస్ గురించి మనకు గడిచిన నాలుగేళ్లుగా తెలుసు. సీక్రెట్ వాడ్రోబ్ అనేది ఆన్ లైన్లో బట్టలను, వస్తువులను రెంట్ కు ఇచ్చే మొదటి సైట్ అని చెప్పడానికి సంతోషంగా ఉంది. వాటి అసలు ధరకంటే అద్దెకు ఇచ్చే ధర మధ్య సారూప్యం చాలా ఎక్కువ ఉండటాన్ని మనం గమనించవచ్చు.

సీక్రెట్ వాడ్రోబ్, తోపాటు ర్యాప్ అనేది మరో స్టార్టప్. ఇదికూడా బట్టలను రెంట్‌కు ఇచ్చే దే. మగువలతో పాటు మగాళ్లకు కూడా పార్టీవేర్, వెడ్డింగ్ వేర్‌లను అద్దెకిస్తుంది. దేశంలో యువత పార్టీ, ప్రత్యేక మైన అకేషన్ కోసం బట్టలను అద్దెకు తీసుకోవడంపై ఆసక్తి చూపుతోంది. ఇదిలా ఉంటే ఇక్కడ స్థాయికి సంబంధించిన సమస్య రావడంతో భవిష్యత్తులో ఈ స్టార్టప్స్ గ్రోత్ కొద్దిగా కష్టంతో కూడుకున్న పనిగానే అనిపిస్తోంది.


website