పెద్దనగరాల్లో ఈవెంట్ల వివరాలందించే లిటిల్ బ్లాక్ బుక్!

పెద్దనగరాల్లో ఈవెంట్ల వివరాలందించే లిటిల్ బ్లాక్ బుక్!

Thursday January 28, 2016,

3 min Read

పెద్ద నగరాల్లో రోజూ వందల సంఖ్యలో ఈవెంట్లు జరుగుతుంటాయి. ఓ చోట ఎగ్జిబిషన్, మరోచోట మ్యూజిక్ కన్సర్ట్.. ఇంకో చోట కవి సమ్మేళనం. ఇక హోటల్స్‌లోనైతే ఫుడ్ ఫెస్టివల్స్ సంగతి చెప్పనక్కర్లేదు. వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఈ మొత్తం సమాచారాన్ని ఫింగర్‌టిప్స్‌పై అందిస్తున్నది లిటిల్ బ్లాక్ బుక్.

లిటిల్ బ్లాక్ బుక్. పెద్ద నగరాల్లో జరుగుతున్న ఈవెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న సంస్థ. ట్రావెల్ నుంచి ఫుడ్ వరకు, షాపింగ్ నుంచి ఈవెంట్స్ వరకు ఢిల్లీ, ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాల్లో జరుగుతున్న ఈవెంట్ల సమాచారాన్ని అందిస్తున్నది.

సుచిత

సుచిత


లిటిల్ బ్లాక్ బుక్ సుచిత సాల్వన్ మానస పుత్రిక. 2012లో ప్రారంభించారు. ఢిల్లీలో వీకెండ్స్‌లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె ఎంతో ప్రయత్నించారు. అయితే కోరుకున్న సమాచారం దొరక్కపోవడంతో అలాంటి వెబ్‌సైట్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన ఆమెకు వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన 25 ఏళ్ల సుచిత కెరీర్ తొలినాళ్లలో విజ్‌క్రాఫ్ట్‌లో పనిచేశారు. ఆ తర్వాత బీబీసీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియాలో మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు.

‘‘వాల్యూ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏంటో అప్పుడే పూర్తిగా అర్థమయింది. మంచి ప్రొగ్రామింగ్/కంటెంట్ సుదీర్ఘ కాలం గుర్తుండిపోతాయి. ఎల్‌బీబీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు 2012లో బీబీసీ నుంచి బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఎల్‌బీబీలోనే పనిచేస్తున్నాను’’ -సుచిత.

విశాల దృక్పథం..

నగరంలో జరుగుతున్న ఈవెంట్ల గురించి అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ స్టార్టప్స్ ఒకటి రెండు రంగాలకు మాత్రమే పరిమితమవుతుండగా, ఈ లిటిల్ బ్లాక్ బుక్ మాత్రం ఫుడ్, ఈవెంట్స్, ట్రావెల్, అడ్వెంచర్, లైఫ్ స్టయిల్, షాపింగ్ వంటి రంగాలను కవర్ చేస్తూ వివరాలను అందిస్తున్నది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల యువకులు తమకు ఆసక్తి ఉన్న రంగం గురించి తెలుసుకునేందుకు ఈ స్టార్టప్‌ను అప్రోచ్ అవుతున్నారు.

సొంత మూలధనం నుంచి ఫండింగ్ వరకు..

మరో ముగ్గురు కోలిగ్స్, కొందరు ఇంటర్న్స్‌తో కలిసి సుచిత ఎల్‌బీబీని ప్రారంభించారు. ఆరంభంలో ఓ చిన్న భవనంలో స్టార్టయింది. నెమ్మదిగా సంస్థ వృద్ధి చెందుతున్నది. 2014 డిసెంబర్ నెలలో 80 వేల మందికిపైగా ఎల్‌బీబీ వెబ్‌సైట్‌ను సందర్శించారని సుచిత చెప్తున్నారు. 2015లో ఎల్‌బీబీ ఈవెంట్లకు, పార్ట్‌నర్ ఈవెంట్లకు రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు.

పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా ముందుకొస్తున్నారు. 2015 ఏప్రిల్‌లో రాజన్ ఆనందన్, సచిన్ భాటియా, సింగపూర్ ఏంజెల్ నెట్‌వర్క్ కంపెనీలు ఎల్‌బీబీలో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఉద్యోగులను పెంచడంతోపాటు బెంగళూరులో కూడా కార్యకలాపాలను ఆరంభించారు సుచిత. అలాగే గత ఏడాది నవంబర్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్ల కోసం యాప్‌ను కూడా ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ప్రతి నెలా 60 వేలకు పైగా యూజర్లు ఎల్‌బీబీని సందర్శిస్తున్నారని సుచిత చెప్పారు.

ధ్రువ్, కో ఫౌండర్

ధ్రువ్, కో ఫౌండర్


టెక్ కో-ఫౌండర్ కోసం అన్వేషణ..

సంస్థలో టెక్ కో ఫౌండర్ కోసం సుచిత ఎంతో అన్వేషించారు. అయితే ధ్రువ్ మాథుర్ గత ఏడాది ఆరంభంలో కో ఫౌండర్, సీటీవోగా చేరడంతో ఆమె సమస్య తీరింది. కార్నెగ్గి మెలన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చసిన 28 ఏళ్ల ధ్రువ్, సొంత సంస్థ getFb Pay.inను ప్రారంభించాలన్న యోచనతో ఇండియా వచ్చారు. అంతకు ముందు డిలైట్‌లో పనిచేశారు. ఇప్పుడు సుచితతో చేతులు కలిపారు.

500% డెవలప్ మెంట్

యాడ్స్ రూపంలోనే ఎల్‌బీబీకి ప్రధానంగా ఆదాయం వస్తుంది. పెద్ద బ్రాండ్లతోపాటు స్థానిక ఫుడ్ కేఫ్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఎల్‌బీబీలో ప్రకటనలు ఇస్తాయి. స్థానిక వినియోగదారులకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రకటనలిస్తాయి. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు ఎల్‌బీబీ ఆదాయంలో 500% వృద్ధి ఉందని సుచిత తెలిపారు. మరింత సీడ్ ఫండింగ్‌ల కోసం ఎల్‌బీబీ చూస్తున్నది.

విస్తరణ..

బెంగళూరులో కూడా ఎల్‌బీబీకి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ స్పందనతో ఎల్‌బీబీ టీమ్ ఎంతో సంతోషంగా ఉంది. యూజర్లకు దగ్గరయ్యేందుకు మరిన్ని ఫీచర్స్‌ను కూడా యాప్‌లో చేర్చాలని భావిస్తున్నది.

‘‘మా యూజర్లకు మరిన్ని సేవలు అందించాలన్నదే మా లక్ష్యం. యూజర్ల అవసరాలను మేం తీరుస్తాం. మా యాప్‌లో త్వరలోనే ఎన్నో మార్పులను చూస్తారు. ఎంతో ఆసక్తి రేకెత్తించే ‘మేక్ ప్లాన్’ ఫీచర్‌ను జోడించబోతున్నాం’’- సుచిత.

విజయం వైపు పయనం..

కొద్ది కాలంలోనే సంస్థ విజయపథాన నడవడానికి కారణం.. సంస్థ ఉద్యోగులే. ఫౌండర్లు సుచిత, ధ్రువ్‌తోపాటు ఉద్యోగుల దృక్పథం కూడా ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ప్రతి అంశాన్ని వారు చాలా ముఖ్యమైనదిగానే పరిగణిస్తారు. ‘ఒక్క ఎక్సెల్ షీటే కాదు, నంబర్లే కాదు, అంచనాలను పెంపొందించుకోవడం, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం ఇలా అన్నింటిని అందరూ వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల వర్క్ స్మార్ట్‌గా జరుగుతుంది. అంతేకాదు ఫాస్ట్‌ ఆలోచించేందుకు ఉపయోగపడుతుంది’’ అని సుచిత చెప్పారు.

‘‘వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలానికి ప్లాన్ చేసుకోవాలి. అయితే అది కూడా రేపటి షెడ్యూల్‌లా పనిచేయాలని ప్లాన్ చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’’- ధ్రువ్
ఎల్‌బీబీ ఉద్యోగులతో ఫౌండర్లు సుచిత, ధ్రువ్..

ఎల్‌బీబీ ఉద్యోగులతో ఫౌండర్లు సుచిత, ధ్రువ్..


‘‘మనం ఎంతో ఒత్తిడిలో పనిచేస్తుంటాం. వేగంగా పనిచేసేందుకు ప్రెజర్‌కు లోనవుతుంటాం. సమయం దగ్గరపడుతున్నకొద్దీ పొరపాట్లు జరుగుతుంటాయి. ఎందుకంటే రెండోసారి ఆలోచించే సమయం ఉండదు’’ -సుచిత

సవాళ్లు సహజమే..

సంస్థ అభివృద్ధిపై ఫౌండర్లు ఎంతో హ్యాపీగా ఉన్నారు. తరుచుగా వెబ్‌సైట్‌ను సందర్శించేన యూజర్లు, ఉద్యోగులే తమను మోటివేట్ చేస్తున్నాయని వారంటున్నారు.

యువర్‌ స్టోరీ టేక్..

పెద్ద నగరంలో జరిగే అన్ని ఈవెంట్లకు లిటిల్ బ్లాక్ బుక్ వన్ స్టాప్ షాప్. కానీ యూజర్లు ఏదైనా ప్రత్యేకమైన రంగం, ఫుడ్ గురించి కానీ, ట్రావెల్ గురించి కానీ తెలుసుకోవాలంటే జొమాటో లేదా హాలిడిఫైనే ఆధారపడుతున్నారు.

వెబ్‌సైట్: https://lbb.in/delhi/