మీరు ఇల్లు మారాలా? అయితే వీళ్లకు చెప్పండి.. చాలా సింపుల్!!

0

అద్దె ఇల్లు మారాలంటే ఎంత ఇబ్బందో సగటు నగర జీవికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుకున్న ఏరియాలో అనుకున్న బడ్జెట్లో ఇల్లు దొరకబుచ్చుకోవడం అంటే అంత అర్రిబుర్రిగా తేలే యవ్వారం కాదు. ఆఫీసుకి సెలవు పెట్టి వెతకాలి. అదొక్కటేనా? ఇంటికి దగ్గర్లోనే స్కూల్ ఉండాలి. హాస్పిటల్ చుట్టుపక్కలే ఉండాలి. బ్యాంకు కూడా కావాలి. ఏటీఎం ఫెసిలిటీ ఉండాలి. ప్రొవిజన్ స్టోర్ కంపల్సరీ. హోటల్ కూడా అవసరమే. వీటితో పాటు కేబుల్ కనెక్షన్ కావాలి. గ్యాస్ మైగ్రేషన్ కూడా. టెలిఫోన్, ఇంటర్నెట్, వాటర్.. ఇలా ఒకటేమిటి.. ఇల్లు మారుతున్నామంటే వీటన్నిటినీ సమకూర్చుకోవాలి.

అది జరగాలంటే ఒక్కరోజులో జరిగేది కాదు. మినిమం పదిహేను రోజులు. మాగ్జిమం నెల పడుతుంది. ఎంత టైం వేస్ట్. సిటీలో ఉండేవాళ్లకే ఇంత ప్రయాస ఉంటే.. అదే వేరే స్టేట్ నుంచి వచ్చేవాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఏ ఏరియాలో ఏముంటుందో పెద్దగా అవగాహన ఉండదు. మరి వాళ్లకు సమచారం తెలిసేదెలా?

ఇలాంటి సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ చెప్తోంది గో ఫ్లైట్టా అనే స్టార్టప్. అనుకున్న బడ్జెట్లో అనుకున్న ఏరియాలో ఇల్లు మాట్లాడటమే కాదు.. సామాను ప్యాక్ చేసే దగ్గర్నుంచి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చేంత వరకు అన్నీ దగ్గరుండి చక్కబెడతారు.

2015లో చెన్నయ్ లో భయంకరమైన వరదలు వచ్చిన సమయం అది. రాహుల్ ఆ టైంలో అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. చాలామంది ఇల్లు, వాకిలి సర్వం కోల్పోయారు. సిట్యువేషన్ చాలా హారిబుల్ గా ఉంది. ఇల్లు మారుదామని అనుకున్నాడు. కానీ ఎక్కడికి షిఫ్ట్ అవుదామన్నా ఇబ్బందే. దగ్గర్లో హాస్పిటల్ ఉందో లేదో తెలియదు. హోటల్ సమాచారం లేదు. బ్యాంక్ వివరాలు తెలియవు. పోనీ ఇవన్నీ చూపించే పోర్టల్ ఏదైనా ఉందా అని వెతికితే ఇంటర్నెట్ లో అలాంటి వెబ్ సైటే కనిపించలేదు. అసలు ఒక ఏరియాలో ఏమేం ఉంటాయో మినిమం సమాచారం కూడా దొరకలేదు. అప్పుడే పుట్టింది గో ఫ్లైట్టా ఆలోచన.

2016 జనవరిలో రాహుల్, గోకుల్ కలిసి గో ఫ్లైట్టా స్టార్ట్ చేశారు. ఒకే పోర్టల్ లో సమస్త సమాచారం దొరికేలా దాన్ని డిజైన్ చేశారు. రోజులు గడుస్తున్నా కొద్దీ రియాలిటీలో బిజినెస్ లో స్పేస్ కనిపించింది. దాంతో ఈ స్టార్టప్ ని ఒక్క సమాచారం ఇవ్వడంతోనే సరిపెట్టకూడదని డిసైడ్ అయ్యారు. సర్వీస్ కూడా ఇవ్వాలనుకున్నారు. స్టార్టప్ ఐడియా బాగుండటంతో మార్చిలో నాస్కామ్ 10000కి అప్లయ్ చేశారు. లక్కీగా సెలెక్ట్ అయ్యారు. టీ హబ్ లో నాస్కామ్ వేర్ హౌజ్ లో వీరి స్టార్టప్ ఇంక్యుబేట్ అయింది. ఆరు నెలల తర్వాత మెంటార్స్ చాలామంది వచ్చారు.

ఇప్పుడు రోజుకి ఎంత లేదన్నా నెలకు 300 రిక్వెస్టులు వస్తున్నాయంటున్నాడు ఫ్లైట్టా సీఈవో రాహుల్. వాటిలో 50- 100 వరకు రిలోకేట్ సర్వీస్ అందిస్తామంటున్నారు. ఇల్లు మాట్లాడటం దగ్గర్నుంచి సామాను ప్యాక్ చేసి జాగ్రత్తగా వాటిని సర్ది, కేబుల్ కనెన్షన్ పెట్టించి, గ్యాస్ ట్రాన్స్ ఫర్ చేసి, సకల సౌకర్యాలు సమకూర్చి ఇంటిని తీర్చిదిద్దుతారు.

ప్రస్తుతానికి గో ఫ్లైట్టా కంపెనీ 10 కార్పొరేట్స్ సంస్థలతో టై అప్ అయింది. హైదరాబాదే కాకుండా ఇతర నగరాలకు కూడా బిజినెస్ ఎక్స్ పాన్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నామని ఆపరేషన్స్ మేనేజర్ నరేష్ అంటున్నారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories