డచ్ ఫేవరేట్ బ్రాండ్ ను ఇండియా బాట పట్టించిన నయానిక

డచ్ ఫేవరేట్ బ్రాండ్ ను ఇండియా బాట పట్టించిన నయానిక

Sunday March 06, 2016,

4 min Read


ఈ స్టోరీ మూలాలు హార్లీమ్‌లో ఉన్నాయి. న్యూయార్క్‌లో ఉన్న హ్లార్లీమ్ గురించి కాదు మేం మాట్లాడేది.. ఒరిజినల్ హార్లీమ్, హాలండ్ కేపిటల్ అమెస్టర్‌డ్యామ్ నుంచి 15 నిమిషాలు ప్రయాణిస్తే వచ్చే హార్లీమ్ గురించి. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఆనతికాలంలోనే యూరప్, అమెరికాలలో అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిన డచ్ ఫేవరెట్ రీటైల్ బ్రాండ్ క్లెసెన్స్ సొంత నగరం గురించి.

image


నెధర్లాండ్స్‌లోని టీఐఏఎస్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన నయానికా పవార్, అనుకోకుండా క్లెసెన్స్‌ వ్యవస్థాపకులు గెరార్డ్ డెన్ బోయర్‌తో సమావేశమయ్యారు. కాఫీ తాగుతూ పదిహేను నిమిషాలు జరిగిన ఆ సమయంలోనే ఆయన మాటలు విని ఆమె ఎంతో స్ఫూర్తి పొందారు. దీంతో క్లెసెన్స్‌బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకున్నారు.

మరోవైపు నయానికాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించిన గెరార్డ్ తన సంస్థలో ఆమెకు ఇంటర్న్‌షిప్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అలా క్లెసెన్స్‌ కేంద్ర కార్యాలయంలో ఇంటర్న్ పూర్తి చేసుకున్న నయానికా చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చారు. భారత్‌లో రీటైల్ మార్కట్ స్థితిగతులపై స్టడీ చేసి, వచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకున్నారు.

‘‘వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లోకి గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకురావాలన్నది నా ఆశయం. అలా క్లెసెన్స్‌ బ్రాండ్‌ను తీసుకొచ్చాను’’ అని నయానికా వివరించారు.

ది బిగినింగ్..

గ్లోబల్ బ్రాండ్ ఆశయంతో ఎంబీఏ పూర్తి చేసిన నయానికాకు గెరార్డ్ వెన్నుదన్నుగా నిలిచారు. మార్కెట్ స్ట్రేటజీలకు తగ్గట్టుగా ప్రాడక్ట్ లైన్, ప్రాడక్ట్ మిక్స్, బ్రాండ్ స్ట్రేటజీని రూపొందించే స్వేచ్ఛనిచ్చారు. ఏప్రిల్ 2013లో ఇండియాలో సంస్థను ప్రారంభించారామె. మనసు, ఆత్మ రెండింటినీ సంస్థపైనే కేంద్రీకరించారు. బడ్జెట్ తక్కువ మొత్తంలోనే ఉన్నప్పటికీ ఇండియాలో క్లెసెన్స్‌ బిజినెస్ మంచి అభివృద్ధి సాధించింది. ప్రారంభించిన ఐదు నెలల్లోనే మార్కెట్లో పేరు సంపాదించింది. అప్పటి నుంచి ప్రతి యేటా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ దేశంలోని ప్రతి ప్రధాన పట్టణంలో లభిస్తున్నది.

మార్కెట్ సైజ్..

‘‘కిడ్స్ ఇన్నర్‌వేర్ కేటగిరిలో మేమే తొలి ఇంటర్నేషనల్ బ్రాండ్‌ను తీసుకొచ్చాం. కిడ్స్ కేటగిరీని పూర్తిగా మార్చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చాం. ఇన్నర్‌వేర్ మార్కెట్ రూ.500 కోట్లకు పైమాటే. వచ్చే రెండేళ్లలో పది పర్సెంట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాం. అవకాశాలు అపారం. భారత్‌లో 300 మిలియన్లకు పైగా చిన్నపిల్లలున్నారు. జనాభాలో 60% 35 ఏళ్లలోపువారే. అందువల్ల భారత్‌లో వ్యాపారానికి ఆకాశమే హద్దు’’ అని నయానికా వివరించారు. ప్రస్తుతానికైతే మార్కెట్ సైజ్ ఉత్సాహభరితంగా ఉందని, ఆన్‌లైన్ సేల్స్ బూమ్ నడుస్తుండటంతో అంచనాలకందని విధంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

నయానిక పవార్

నయానిక పవార్


క్లెసెన్స్‌ ప్రాడక్ట్ లైన్ ఎక్కువగా కిడ్స్‌కు సంబంధించినవే. కిడ్స్ ఇన్నర్‌వేర్, లాంజ్‌వేర్, స్లీపర్‌వేర్‌లపైనే దృష్టి సారించింది. ఇటీవలే మెన్స్ ఇన్నర్‌వేర్‌ను కూడా లాంచ్ చేసింది.

‘భారతీయ ధరకే డచ్ క్వాలిటీ నైపుణ్యం’ అన్న నినాదంతో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నదీ సంస్థ. అంతర్జాతీయ సంస్థలో ఉన్న మరిన్ని ఉత్పత్తులను కూడా భారత్‌కు తీసుకురావాలని నయానిక భావిస్తున్నారు. ప్రతి సీజన్ కు ఓ కొత్త ప్రాడక్ట్ ను చేర్చాలన్నదే ఆమె ఆశయం.

కంపెనీ మోడల్...

బ్రాండ్ డచ్‌కు చెందినదే అయినా.. కంపెనీ మాత్రం దేనికదే. క్లెసెన్స్‌ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను భారత్‌లోనే ఏర్పాటు చేశారు. గెరార్డ్, నయానిక ఈ సంస్థ డైరెక్టర్లు. తిరుపూర్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అంతర్జాతీయంగా సప్లయ్‌ చేసే బ్రాండ్స్‌ను కూడా ఈ సంస్థలో రూపొందిస్తారు. యూరొపియన్ స్టయిల్‌లో భారతీయ మార్కెట్‌కు నప్పే విధంగా కలర్స్, ధరను ఎంపిక చేస్తారు.

మార్కెటింగ్ స్ట్రేటజీ, సేల్స్..

క్లెసెన్స్‌కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంతర్జాతీయ నాణ్యత, అంతర్జాతీయ బ్రాండ్‌నేమ్ కలిగి ఉండటం. కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేటప్పుడు వ్యూహాలు సరిగ్గా ఉండకపోతే, బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు టైమ్ కూడా చాలా తీసుకుంటుంది. అయితే నయానిక మాత్రం ధర నిర్ణయించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండియా మార్కెట్‌కు అనుకూలంగా బ్రాండ్ ధరను నిర్ణయించారు. అలాగే పంపిణీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లను ఎంపిక చేసిన తర్వాత, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ఇన్‌స్టోర్ ప్రమోటర్లను నియమించారు. ఇలా చేయడంతో క్వార్టర్ క్వార్టర్ కు విక్రయాల్లో భారీగా అభివృద్ధి కనిపించింది. క్లెసెన్స్‌భారత్‌లో ఇప్పటికే 250 పాయింట్స్ ఆఫ్ సేల్‌ను సాధించింది.

అన్ని రీటైల్ షోరూమ్స్‌లో..

ల్యాండ్ మార్క్, లైఫ్ స్టయిల్, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హైపర్ సిటీ, లాలూ మాల్, పార్థాస్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి అన్ని పెద్ద పెద్ద రీటైలర్స్‌లలో క్లెసెన్స్‌అందుబాటులో ఉన్నాయి. అలాగే అమెజాన్, మైయాంత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లో కూడా ఈ సంస్థ బ్రాండ్స్ లభిస్తున్నాయి.

లిమిటెడ్ కాంపిటీషన్..

ఒకరకంగా చెప్పాలంటే కిడ్స్ ఇన్నర్‌వేర్ క్యాటగిరీలో కాంపిటీషన్ అంతంతమాత్రమే. భారత్‌లో ప్రధానంగా జాకీ మాత్రమే ఈ రంగంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే పెటిట్ బటీయూ, కెల్విన్ క్లెయిన్, హ్యాన్రో వంటి బ్రాండ్లతో క్లెసెన్స్‌ పోటీపడుతోంది.

అమ్మే రోల్ మోడల్..

2015-16 ఆర్థిక సంవత్సరం కల్లా క్లెసెన్స్‌రూ.10 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 110 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఐదేళ్లలో వంద కోట్ల రూపాయలను వారికి టార్గెట్‌గా నిర్దేశించారు. లీ/రాంగ్లర్, ఆరో, ఎనామోర్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో సేల్స్ హెడ్‌గా పనిచేసిన తన తల్లి అనిత నుంచి వ్యూహాలను తెలుసుకుంటూ తమ సంస్థలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు నయానిక.

తల్లిదండ్రులే స్ఫూర్తి..

తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని నయానిక చెప్తారు. వారిద్దరికి ఎంతో మనోధైర్యముందని, కష్టపడి పనిచేస్తారని అంటారు. ఆమె తండ్రి షహాజి పవార్ ఇండియన్ నేవీలో సబ్ మరైనర్‌గా 20 ఏళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత టీసీఎస్, ఐసీఐసీఐ వంటి సంస్థలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హెడ్‌గా కూడా వ్యవహరించారు.

రీటైల్ బిజినెస్ టిప్స్ మాత్రం తల్లి అనిత నుంచి చిన్నప్పటి నుంచే నయానిక నేర్చుకున్నారు. ‘‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి రిస్క్ తీసుకోవడంపై జాగ్రత్తలు చెప్పారు. పెద్ద పెద్ద ఆశయాలు ఏర్పర్చుకోవాలని సూచించారు. చిన్నప్పుడు మా అమ్మ, ఇప్పుడు గెరార్డ్ నా గురువులు. ఇద్దరికీ వ్యవస్థక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో వారి పర్యవేక్షణలో నేను కూడా ప్రయోగాలు చేస్తూ విజయవంతంగా ఫలితాలు సాధిస్తున్నాను’’ అని నయానిక వివరించారు.

ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై అభిప్రాయం..

‘‘నేను ఎంచుకున్న మార్గంలో బాధా ఉంది, సంతోషమూ ఉంది. బాధ్యతలు నాపైనే ఉండటం కారణంగా పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తాను. అలాగే భారం కూడా నాపైనే ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరితనం అనిపిస్తుంది. క్లయింట్లు, వెండర్లు, ఇన్వెస్టర్లు నన్నే వేలెత్తి చూపుతుంటారు. అదికూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన స్టయిల్, వాల్యూకు తగ్గట్టుగా అభివృద్ధి చెందొచ్చు. ఎలాంటి ఫార్ములాలు ఉండవు. సంస్థకు ఏదీ సరైనదో మనకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి’’ అని నయానిక వివరించారు.

image


లక్ష్యం..

క్లెసెన్స్‌ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే నయానిక ప్రస్తత లక్ష్యం. అందుకోసం ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీలైనంత తొందరలో మార్కెట్ ను క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ తొందరలో కంపెనీ పేరు, అర్థం మారిపోకుండా చూడాలనుకుంటున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే ఉన్న రెండు సంప్రదాయ వాదాలను తిప్పికొట్టాలనుకుంటున్నారు. అందులో మొదటిది.. ఇండియాలాంటి పెద్ద మార్కెట్ లోకి ప్రవేశించాలంటే మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం భారీగా ఖర్చుపెట్టాల్సి ఉంటుందన్న అపవాదును తొలగించాలనుకుంటున్నది. రెండోది మహిళలు కూడా హౌజరీ బిజినెస్ ను విజయవంతంగా రన్ చేయగలరని నిరూపించడం. ఇప్పటికైతే ఈ రెండు లక్ష్యాలను నయానిక అధిగమించారు. ఆమెకు మరికొన్ని ఆశయాలు కూడా ఉన్నాయి. యోగాలో మరింత రాణించాలన్నది ఆమె కోరిక. అలాగే 40 ఏళ్లకే రిటైర్ అయి క్యాంప్‌లకు వెళ్లాలనుకుంటున్నారామె. ఈ రెండు కూడా నయానికకు కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడే ప్రారంభిస్తే, ఏ స్వప్నం కూడా పెద్దది కాదు. ఈ విషయాన్ని నయానిక ఇప్పటికే నిరూపించింది.

చిన్న వయసులోనే అన్ని ఆశయాలను నెరవేర్చిన నయానిక మరిన్ని విజయాలను సాధించాలని యువర్‌స్టోరీ కోరుకుంటున్నది.

వెబ్ సైట్ 1 

వెబ్ సైట్ 2