బనీహాల్ సంబంధం చూస్తే.. పెళ్లిభాజా మోగాల్సిందే!!

 -పెళ్లిళ్ల పేరయ్యగా పేరుగాంచిన బనీహాల్-అటెంప్ట్ చేస్తే చాలు..పక్కా మ్యాచ్ సెటిల్-చూపులే కాదు అభిరుచుల్నీ కలిపి ఇస్తుంది

బనీహాల్ సంబంధం చూస్తే.. పెళ్లిభాజా మోగాల్సిందే!!

Tuesday July 14, 2015,

3 min Read

అంత అర్రిబుర్రిగా తేలే యవ్వారం కాదు 

పెళ్లంటే అటు ఏడు తరాలు-ఇటు ఏడు తరాలు చూడాలంటారు! ఒక వివాహం కోసం వేయి అబద్దాలు అడినా తప్పు లేదంటారు! వాస్తవానికి, పెద్దలు చెప్పిన పై రెండు మాటల్లో ఒకదానికొకటి పొంతనే లేదు! ప్రతీదీ ఆరా తీసి పెళ్లి చేయాలనేదీ వాళ్లే. అవసరమైతే అబద్దాలు ఆడినా తప్పులేదనేదీ వాళ్లే! సరే, ఈ కన్‌ప్యూజన్ కాసేపు పక్కన పెడితే- ఇవాళ్రేపు పెళ్లి చేయడం కంటే- మ్యాచ్ సెట్ చేయడమే కష్టమైన టాస్క్‌. ఈడూ జోడూ కుదరాలి! మనసూ మనసూ కలవాలి! అభిప్రాయాలూ ఆలోచనలూ ఒకలాగే ఉండాలి! లక్షాతొంభై ఆబ్లిగేషన్స్! అంతేకదా మరి. రిలేషన్ అంటేనే ఆబ్లిగేషన్‌. పెళ్లి విషయంలో అందరినీ మెప్పించాలంటే అంత అర్రిబుర్రిగా తేలే యవ్వారం కాదు.

ఏంటి స్పెషాలిటీ..?

మనకు ఏదైనా పక్కా ఇన్ఫర్మేమేషన్ కావాలంటే గూగుల్‌లో వెతుకుతాం. మరి జీవిత భాగస్వామి కావాలంటే ఎక్కడ వెతకాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మ్యాచ్ మేకింగ్ స్టార్టప్‌! అటెంప్ట్ చేస్తే చాలు-పక్కా! మ్యాచ్ సెటిలవుతుంది! ఈడూజోడు సరిగ్గా కుదురుతుంది! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటుందా జంట! ఆ మాత్రం పని చేయడానికి మ్యారేజీ బ్యూరోలు లేవా? దీని గొప్పతనమేంటనేగా మీ డవుట్! ఆ స్పెషాలిటీ ఏంటో మీరే చదివి తెలుసుకోండి!!

స్టార్టప్ పేరు వెనుక..

జమ్మూ, శ్రీనగర్‌ మధ్య ఓ చిన్న టౌన్. దాని పేరు బనీహాల్. ఇష్‌దీప్ మొదలుపెట్టిన స్టార్టప్ పేరు కూడా అదే. ఆ సైట్‌కో ప్రత్యేక టెక్నాలజీ ఉంది. స్పెషల్ సాఫ్ట్‌ వేర్ ఉంది. అసలు దాని రూటే సెపరేటు. అన్నట్టు స్టార్టప్ పేరుకి కూడా ప్రత్యేకత ఉందండోయ్‌! బనీహాల్ అనేది ప్రాంతంపేరు. అది జమ్మూ-కాశ్మీర్‌ మధ్యలో బోర్డర్‌ మీద ఉంటుంది. ఒకవైపు జమ్ము మైదానాలు, మరోవైపు కాశ్మీర్ లోయలు. ఇదీ బనీహాల్ పట్టణ భౌగోళిక దృశ్యం. పెళ్లి కూడా మైదానం- లోయ లాంటిదే అంటారు బనీహాల్ నిర్వాహకులు.

ఇష్‌దీప్, ఉపేందర్. కంప్యూటర్ ఇంజినీరింగ్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్‌ లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఇష్‌దీప్ ఆలోచనలన్నీ బిజినెస్ మీదనే ఉన్నాయి. ఆ ఉత్సాహంతోనే కొన్ని చోట్ల ఇన్వెస్ట్‌ మెంట్ కూడా చేశారు. ఓసారి వారెన్ బఫెట్ స్పీచ్ విన్నాక- ఇష్‌ దీప్ మైండ్ సెట్టే మారిపోయింది.

"ఎవరైనా జీవితంలో తీసుకున్న ముఖ్యమైన, అతి పెద్దదైన నిర్ణయం జీవిత భాగస్వామిని ఎంచుకోవడమే"- వారెన్ బఫెట్


డేవిడ్ చెరిటన్‌తో ఇష్‌దీప్‌

డేవిడ్ చెరిటన్‌తో ఇష్‌దీప్‌


“కస్టమర్లు ఏం కోరుకుంటారో- వాటికి తోడుగా, మా అల్గారిథం సూచించిన వాటితో కలిపి పెళ్లికి ఐదు రికమెండేషన్స్ ఇస్తాం. అప్పుడా జంట ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు- ఇంతమంచి వ్యక్తిని గతంలో ఎన్నడూ కలవలేదే అని ఇద్దరూ అనుకుంటారు. అలా ఉంటాయి మా సూచనలు” అంటారు ఇష్‌దీప్.

ఎలా చేస్తే బావుంటుంది?

బనీహాల్ స్టార్టప్ ఆలోచన బుర్రలో తొలుస్తోంది! ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? రొటీన్ కాకుండా సమ్‌ థింగ్ డిఫరెంట్‌గా ఉండాలంటే ఎలాంటి రిస్క్‌ తీసుకోవాలి? ఇలాంటి మేథోమథనంలో ఉపేందర్ తోడయ్యాడు. అసలు ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి? ఈ అంశమే వాళ్ల మొదటి టాపిక్. జనరల్‌గా వధువునో, వరుడినో వెతికేటప్పుడు చాలా ఆప్షన్స్ ఎదురుగా ఉంటాయి. స్నేహితులు, చుట్టాలు, తెలిసినవాళ్లు, యాడ్స్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఇలా అనేక రకాలుగా అబ్బాయిల్నీ అమ్మాయిల్నీ వెతుకుతుంటారు. మంచీచెడూ ఆరా తీస్తుంటారు.

“కస్టమర్లు ఏం కోరుకుంటారో- వాటికి తోడుగా, మా అల్గారిథం సూచించిన వాటితో కలిపి పెళ్లికి ఐదు రికమెండేషన్స్ ఇస్తాం. అప్పుడా జంట ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు- ఇంతమంచి వ్యక్తిని గతంలో ఎన్నడూ కలవలేదే అని ఇద్దరూ అనుకుంటారు. అలా ఉంటాయి మా సూచనలు” అంటారు ఇష్‌దీప్.

అల్గారిథం పాత్రే కీలకం

మ్యాచ్ సెట్ చేయడంలో అల్గారిథం పాత్రే కీలకం. ప్రతీ అబ్బాయికీ అమ్మాయికీ తగిన పార్ట్‌ నర్‌ గా అనిపించే 20 ప్రొఫైల్స్ ఎంపిక చేస్తారు. వాటి ఆధారంగా అతడు/ఆమె తగిన జోడిని ఎంచుకోవచ్చు. ఒకరకంగా ఇది గూగుల్ సెర్చ్ లాంటిది. పెళ్లికి జంటను వెతకడంలో అల్గారిథం గూగుల్‌కు ఏమాత్రం తీసిపోదు. మానవ మేథస్సు వర్సెస్ సైంటిఫిక్ అల్గారిథం. వెరసి ద బెస్ట్‌ మ్యాచ్ మేకర్‌. ఏదిమంచో -ఏది చెడో, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో- మనిషి మేథస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. చిన్న విషయం పట్లనే ఇంత విచక్షణతో ఉంటే- జీవిత భాగస్వామి విషయంలో ఇంకెంత ఆలోచించాలి! ఆ పని బనీహాల్ చేసిపెడుతుంది. అంటే ఒక వ్యక్తికి జీవితాంతం తోడుగా నీడగా ఉండాల్సిన మనిషిని వెతికిపెడుతుంది. అంటే అచ్చం సదరు వ్యక్తిలాగే ఆలోచించాలి. అతని/ఆమె అభిరుచిల్ని ఆకళింపు చేసుకోవాలి! ఎదుటివారిలో ఆ టేస్ట్ ఉందో లేదో వెతికిపట్టాలి. ఇవన్నీ జరగాలంటే నాడీశాస్త్రం దగ్గర్నుంచి మాడ్రన్ టెక్నాలజీ వరకు అన్నిరకాలుగా పరిశోధన చేయాలి. అంత రిస్క్, కమిట్మెంట్ ఉంటుంది కాబట్టే బనీహాల్‌కి మాంచి పెళ్లిళ్ల పేరయ్యగా పేరొచ్చింది.

వేలకొద్దీ యూజర్లు

ప్రస్తుతం ఢిల్లీతోపాటు, రెడ్‌ వుడ్ సిటీగా పేరుగాంచిన కాలిఫోర్నియాలోనూ సర్వీసులు అందిస్తోంది బనీహాల్. దీనికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిట్ చెరిటన్ సీడ్ ఫండింగ్ చేశారు. ఆయనతోపాటు పలువులు ఏంజిల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టారు. బీటా వెర్షన్‌లోనే వేలకొద్దీ యూజర్లు బనీహాల్‌ కు రిజిస్టర్ అయ్యారు.

ఆన్‌లైన్‌ ద్వారా జంటలను వెతికే వ్యాపారం ఇప్పుడు ఏటా 30శాతం డెవలప్ అవుతోంది. మనదేశంలో టాప్ 3 మ్యాచ్ మేకింగ్ సైట్స్ - షాదీ, జీవన్ సాథీ, భారత్ మ్యాట్రిమోనీ సైట్లు గత పదేళ్ల కాలంలో 50 లక్షలకు పైగా పెళ్లిళ్లను కుదిర్చాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ సామర్ధ్యం 10 కోట్ల డాలర్లకు పైనే. ఇందులో 8 ప్రధాన నగరాల వాటా 50 శాతంపైనే ఉంది.

Website