ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పింకీ రెడ్డి

0


హైదరాబాద్ లో విమెన్ ఆంట్రప్రెన్యూర్ పింకీరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఎఫ్ఎల్ఓ వైస్ ప్రెసిడెంటుగా మొదటిసారి ఆమె ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఎఫ్ఎల్ఓలో ఐదు వందల మందికి పైగా సభ్యులున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి హోదా ఎవరికీ దక్కలేదు. ఇంతమంది సభ్యులున్న హైదరాబాద్ ఎఫ్ఎల్ఓ దేశంలో అన్నింటి కంటే పెద్ద చాప్టర్.

“హైదరాబాద్ సభ్యురాలు జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ కావడం మాకు గర్వకారణం”-  రేఖ లాహోటి

పింకీరెడ్డి జాతీయ వైస్ ప్రెసిడెంట్ కావడం పట్ల హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రేఖ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి గతంలో కూడా చాలా మంది జాతీయ బోర్డు మెంబర్లుగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు.

2018-19 ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ ప్రెసిడెంట్‌

ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన పింకీ రెడ్డి- 2018 నుంచి ఏడాది పాటు జాతీయ ప్రెసిడెంట్ గా సేవలందిస్తారని రేఖ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ చాప్టర్ జాతీయ సంస్థలో క్రియాశీలంగా పనిచేస్తోంది. పింకీరెడ్డి ప్రెసిడెంట్ అయితే మన ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అన్నారు. పింకీరెడ్డి భర్త జీవీ సంజయ్ రెడ్డి, జీవికే గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బెంగళూరు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుబ్బిరామిరెడ్డి పింకీరెడ్డి తండ్రి.

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్

ఫిక్కీ లోని మహిళా పారిశ్రామిక వేత్తలు కలసి ఏర్పాటు చేసి సంస్థ ఇది. విమన్ ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడం కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. దేశంలో ప్రధాన నగరాల్లో ఫిక్కీ ఎఫ్ఎల్ఓకు చాప్టర్లున్నాయి. 500 లకు పైగా సభ్యులతో ఉన్న మన హైదరాబాద్ చాప్టర్ అన్నింటి కంటే పెద్దది. ఢిల్లీ చాప్టర్ కూడా హైదరాబాద్ లాగానే ఫిక్కీఎఫ్ఎల్ ఓ లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గతేడాది సాయం పేరుతో మహిళల స్టార్టప్ లకోసం మెంటారింగ్, ఇతర పాలసీని  ప్రకటించింది.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik