చిన్న నగరాల్లో బడ్జెట్ హోటల్స్‌కు కేరాఫ్‌గా 'విస్టా రూమ్స్'

చిన్న నగరాల్లో బడ్జెట్ హోటల్స్‌కు కేరాఫ్‌గా 'విస్టా రూమ్స్'

Sunday October 18, 2015,

3 min Read

దేశ‌వ్యాప్తంగా హ‌స్పిటాలిటీ రంగం జోరుమీదుంది. అయితే పెద్ద‌ న‌గ‌రాల్లో ఉన్న‌టువంటి సౌక‌ర్యాలు చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేవు. చిన్న‌పాటి హోట‌ల్స్ ఉన్నా, వాటిలో సౌక‌ర్యాలు అంతంత‌మాత్ర‌మే. అయితే త‌న ప్ర‌యాణ కాలంలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల నుంచి క‌స్ట‌మ‌ర్ల‌ను ర‌క్షించేందుకు విస్టారూమ్స్‌ను ఏర్పాటు చేశారు అంకితా సేత్‌. ద్వితీయ, తృతీయ శ్రేణిగా చెప్పుకునే చిన్న న‌గ‌రాల్లోనూ చ‌క్క‌టి, ప‌ర్యాట‌క అనుభూతుల‌ను సంద‌ర్శ‌కుల‌కు మిగులుస్తున్నారు.

అంకిత త‌న కెరీర్‌ను 2006లో ప్ర‌ఖ్యాత సెర్చ్ ఫ‌ర్మ్ స్టాంట‌న్ చేస్‌లో ప్రారంభించారు. ఈ సంస్థ‌లో సీనియ‌ర్ రీసెర్చ‌ర్‌గా ఆమె ప‌నిచేశారు. ఏడాదిన్న‌ర ఆ సంస్థ‌లో ప‌నిచేసిన త‌ర్వాత బిజినెస్ రీసెర్చ్ అండ్ ఫైనాన్షియ‌ల్ అన‌లిటిక్స్ కేపీఓలో చేరారు. ఈ సంస్థ‌లో ఆమె బాధ్య‌త‌లు మ‌రింత పెరిగాయి. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌, హైరింగ్ వ్య‌వ‌హారాల‌ను చూసుకోవాల్సి వ‌చ్చింది.

అంకిత ప‌నిచేస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ సెర్చ్‌, హెచ్ఆర్ ఔట్‌సోర్సింగ్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేది. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, క‌న్స్యూమ‌ర్ గూడ్స్ రంగాలు ఈ సంస్థ క్ల‌యింట్స్‌. సెర్చ్ అసైన్‌మెంట్స్‌తోపాటు హెచ్ఆర్ ఫంక్ష‌న్స్‌ ఔట్‌సోర్సింగ్ వ్య‌వ‌హారాల‌ను కూడా చూసేది.

అంకిత సేత్‌

అంకిత సేత్‌


పెద్ద సంస్థల్లో.. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ.. ఆమె మ‌న‌సు మాత్రం వ్య‌వ‌స్థాప‌క రంగం వైపే మొగ్గుచూపేది. అదే స‌మ‌యంలో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌కు, క‌స్ట‌మ‌ర్లు కోరుకునేదానికి చాలా తేడాలున్నాయ‌ని ఆమె గ్ర‌హించారు. ఆ ఖాళీని తాను పూరించగలననే భావ‌న ఆమె మ‌దిలో మెదిలేంది. అలా అప్పటి ఆలోచనలకు రూపమే 'విస్టా రూమ్స్‌'. ఈ ఏడాది ఏప్రిల్‌లో అంకిత కో-ఫౌండ‌ర్‌గా, పార్ట్‌న‌ర్‌షిప్ హెడ్‌గా విస్టా రూమ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. చిన్న న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌త క‌లిగిన అవ‌కాశాల‌ను ప్ర‌జ‌ల‌కు సూచించడమే ఈ సంస్థ ఉద్దేశం.

వ్యాపారస్తుల కుటుంబం

చిన్న‌ప్ప‌టి నుంచి అంకిత‌కు ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే అమిత ఆస‌క్తి. తండ్రి, సోద‌రులు ఆఫ్రికాలో చాలా ఏళ్లుగా వ్యాపారం చేస్తుండ‌టంతో అంకిత‌కు కూడా అదే రంగంపై మ‌న‌సుపుట్టింది.

విస్టా రూమ్స్ ప్రారంభించ‌క ముందు ముంబైలో ఓయో రూమ్స్‌లో అక్విజిష‌న్స్ హెడ్‌గా అంకిత ప‌నిచేశారు. ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌క‌, కీల‌క ఉద్యోగుల్లో అంకిత కూడా ఒక‌రు. ఆ త‌ర్వాత చిన్న న‌గ‌రాల్లో సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌మైన రూమ్స్‌ను త‌క్కువ అద్దెకే క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు విస్టా రూమ్స్‌కు శ్రీకారం చుట్టారామె. అంకిత కృషితో అన‌తికాలంలోనే విస్టా రూమ్స్ 60 న‌గ‌రాల్లో 500 హోట‌ల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. చాలామంది క‌స్ట‌మ‌ర్లు విస్టారూమ్స్‌ను త‌మ న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామిగా భావిస్తున్నారు. భార‌త్‌ను సంద‌ర్శించేందుకు వ‌చ్చే విదేశీయులు, ప‌లు న‌గ‌రాల్లో ఆఫీస్ ప‌నుల‌పై తిరిగే కార్పొరేట్ వ‌ర్గాలు, యాత్రికులు, ప‌ర్యాట‌కులు విస్టారూమ్స్ రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్లుగా మారారు.

విస్టారూమ్స్ ఏర్పాటు వెనుక క‌థ‌..

ప‌ర్య‌ట‌న‌లంటే ఇష్ట‌ప‌డే అంకిత‌, ప్ర‌యాణ స‌మ‌యంలో ఎన్నో చేదు అనుభ‌వాల‌ను ఎదుర్కొన్నారు. తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను ఎవ‌రూ ఎదుర్కోకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఆమె విస్టారూమ్స్‌కు శ్రీకారం చుట్టారు.

అంకిత సేత్‌, విస్టారూమ్స్ కో ఫౌండ‌ర్‌

అంకిత సేత్‌, విస్టారూమ్స్ కో ఫౌండ‌ర్‌


'' నాకు ప్ర‌యాణాలంటే పిచ్చి. ముందుగానే ప్లాన్ చేసుకుంటే ప్ర‌యాణ అనుభ‌వం ఎంతో బాగుంటుంది '' అని అంకిత వివ‌రించారు. ప్ర‌తి హాలీడేకు ముందు అంకిత ప‌ని అదే. గంట‌ల త‌ర‌బ‌డి సంద‌ర్శ‌క ప్ర‌దేశాలు, ఆ ప్రాంతాల్లో అకామిడేష‌న్స్ కోసం ఇంట‌ర్నెట్‌లో వెతికేవారు. ఆమె స్నేహితుల్లో చాలామంది అంత సుల‌భంగా కాంప్ర‌మైజ్ అయ్యేవారు కాదు. దీంతో ఆమె కూడా సుర‌క్షిత ప్ర‌దేశాలు, బ్రాండ్ నేమ్స్‌కే ప్రాధాన్య‌త ఇచ్చారు.

తాము చేస్తున్న ఉద్యోగాల్లో మొనాట‌నీ కార‌ణంగా సెల‌వు రోజుల్లో అంకితా, ఆమె స్నేహితులు కాస్త విశ్రాంతి కోరుకునేవారు. అందుకోసం ప‌ర్య‌ట‌క ప్ర‌దేశాల‌కు వెళ్లేవారు. ''భార‌త్‌లోని చిన్న ప్రాంతాల్లో ప్ర‌యాణాల కోసం ఎంతో రీసెర్చ్ చేసేవారం. అయితే ద్వితీయ‌, తృతీయ‌శ్రేణి న‌గ‌రాల్లో సేవ‌లు అంత బాగుండేవి కావు. వాటిని మార్చాల‌ని మేం నిర్ణ‌యించాం'' అని అంకిత పేర్కొన్నారు. అంకిత కొన్నిసార్లు ఏక‌ధాటిగా నెల‌న్న‌ర‌కుపైగా ప్ర‌యాణాల‌తోనే గ‌డ‌పాల్సి వ‌చ్చేది. దీంతో బ‌డ్జెట్ హోట‌ల్స్‌లోనే ఆమె బ‌స‌చేసేవారు. ఆ హోట‌ల్స్ అంత శుభ్రంగా ఉండేవి కావు. '' మురికితోకూడిన సింకులు, టాయిలెట్లలో అప‌రిశుభ్ర‌త నుంచి శుభ్ర‌త‌ క‌లిగిన గ‌దులు, బాత్‌రూమ్స్‌ల స్థాయికి చిన్న న‌గ‌రాల్లో హోట‌ల్స్‌ను మార్చాల‌ని నిర్ణ‌యించాం. టైర్‌2,3 న‌గ‌రాల్లో ఎన్నో అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ, స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించేవారే క‌రువ‌య్యారు'' అని అంకిత న‌ర‌క‌ప్రాయ‌మైన త‌న ప్ర‌యాణ‌ అనుభ‌వాల‌ను గుర్తుచేసుకున్నారు.

విస్టా రూమ్స్ ఏర్పాటైన త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల‌కు ఎంతో సౌల‌భ్యంగా ఉంది. శుభ్ర‌త క‌లిగిన గ‌దుల‌ను ఇప్పించ‌డ‌మే కాదు, ఆన్‌లైన్ సేల్స్‌, మార్కెటింగ్ రంగాల్లో క‌స్ట‌మ‌ర్ల‌కు స‌హ‌కారం అందించేవారు. ఈ కార‌ణంగా క‌స్ట‌మ‌ర్ల‌కు స‌మ‌యంతోపాటు డ‌బ్బు కూడా భారీగా ఆదా అయ్యేది. ఈ సేవ‌ల‌తో క‌స్ట‌మ‌ర్లు ఎంతో సంతృప్తి చెందేవారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభ‌మైన విస్టారూమ్స్ దేశ‌వ్యాప్తంగా ప్రామాణిక‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన వ‌స‌తుల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్న‌ది. అంకిత‌తోపాటు అమిత్ ద‌మాని, ప్ర‌ణ‌వ్ మ‌హేశ్వ‌రీ ఈ హాస్పిటాలిటీ స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్ట‌ప్ కంపెనీల్లో విస్టారూమ్స్ కూడా ఒక‌టి.

సామాజిక కార్య‌కర్త‌గా కూడా..

అంకిత స్టార్ట‌ప్ కో ఫౌండ‌రే కాదు.. ఆమె ఉద్య‌మ‌కారిణి. అవినీతిపై స‌మ‌ర శంఖం పూరించిన అన్నా హ‌జారే టీమ్‌తో క‌లిసి ఆమెపోరాడారు. '' రాలేగావ్‌లో ఓ రోజు అన్నా హ‌జారేను స్వ‌యంగా క‌లిశాను. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ, అన్నా టీమ్ స‌భ్యుల‌తో క‌లిసి ముంబై విల్లేపార్ల‌ేలో ప‌నిచేశాను. అన్నా ఆలోచ‌న‌లు ఎంతో స్ఫూర్తినిచ్చాయి'' అని అంకిత వివ‌రించారు. అంతేకాదు యంగ్‌ వాలంటీర్స్ అనే ఎన్జీవోలోనూ అంకిత క్రియాశీల‌క స‌భ్యురాలు.

website