ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను ఎంగేజ్ చేసే ‘స్మార్ట్ లాయల్టీ’

ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను ఎంగేజ్ చేసే ‘స్మార్ట్ లాయల్టీ’

Tuesday November 24, 2015,

2 min Read

పెద్ద పెద్ద స్టోర్లకు కస్టమర్లకు ఎంగేజ్ చేసి పెట్టుకోడానికి వారి దగ్గర ప్రత్యేక ఆఫర్లతో పాటు, లాయల్టీ కార్డులు, పాయింట్స్ లాంటివి మనకు తెలిసిన విషయమే. మన ఫోన్ నంబర్ రిజిస్ట్రర్ చేస్తే చాలు స్టోర్ లోని ప్రతి డీల్ అప్ డేట్స్ పంపిస్తారు. కానీ చిన్న తరహా షాపులకు ఇలాంటి అవకాశం ఉండే పరిస్థితి లేదు. లాయల్టీ మెయింటెన్ చేయడానికి ఆ స్టోర్లకు అంతబడ్జెట్ ఉండదు. వాటికి కూడా లాయల్టీ కస్టమర్లను వెతికిపెట్టే పని తాము చేస్తామంటోంది స్మార్ట్ లాయల్టీ.


image


యూకే నుంచి ఇండియాకు

వాస్తవానికి స్మార్ట్ లాయల్ యూకే కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్. అయితే ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్స్ మొదలు పెట్టింది. భారత్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా వస్తుండటంతో ఇక్కడకు మారింది. గతంతో పోలిస్తే ఇక్కడ వ్యాపారావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు ఫౌండర్‌ దీప్‌ దోరడ్ల. యాప్ ఆధారంగా నడిచే స్టార్టప్ ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం కలసొచ్చే విషయం. ప్రారంభించిన రోజు నుంచే యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరిగింది. భవిష్యత్ లోనూ ఆ నెంబర్‌ మరింత పెరిగే అవకాశముంది. భారత్ లో ఆపరేషన్స్ ను స్వయంగా చూసుకోవడమే కాదు.. స్థానికంగా కలసి వచ్చే సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది కంపెనీ.

స్మార్ట్ లాయల్ టీం

స్మార్ట్ లాయల్ కి దీప్ దొరడ్ల కోఫౌండర్. యూకేలోనే ఎంబియే పూర్తి చేశారు. కాలేజీ రోజుల నుంచే స్టార్టప్ లతో పనిచేసిన అనుభవం ఉంది. స్మార్ట్ లాయల్ లో టెక్నాలజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దీప్‌ ప్రస్తుతం భారత్ లో ఆపరేషన్స్ , సేల్స్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక్కడ స్టార్టప్ ఆపరేషన్స్ ప్రారంభించి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య ఆశించిన దానికంటే ఎక్కువగానే ఉంది. ప్రతి రోజూ 5 నుంచి10మంది యాక్టివ్ యూజర్లుంటున్నారు. వీరితో పాటు యూకేలో మరో ఐదుగురు కో ఫౌండర్లున్నారు. భారత్ లో మరో ఉద్యోగి దీప్ టీంలో ఉన్నారు. టీం ఎక్స్ ప్యాన్షన్ ఆలోచనలో ఉన్నారు.

image


సవాళ్లు, పోటీ దారులు

స్మార్ట్ లాయల్ తరహా వ్యాపారంలో రాణించడం అంటే అంత సులువేం కాదు. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయ వ్యాపారం చేసే కిరణా షాప్స్ లాంటివి ఇప్పటికే తమ లాయల్ కస్టమర్లను కలిగి ఉన్నాయి. కొత్తగా వాటికి లాయల్టి ఇస్తామంటే ముందుకు కొస్తాయాలేదా అనేది ఆలోచించాలి. అయితే కొత్తగా ఆఫ్ లైన్ స్టోర్లు పెట్టే వారికి ఇది బ్రహ్మాండమైన ఆలోచనగా స్మార్ట్ లాయల్ చెప్పుకొస్తోంది. లాయల్టీ కాకపోయినా ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను ఎంగేజ్ చేసే సంస్థలు భారత్ లో చాలానే ఉన్నాయి. వీటినుంచి ప్రధానంగా పోటీ ఉంటోంది.

“మా టార్గెట్ ఆఫ్ లైన్ స్టోర్లే. ఆఫ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గే అవకాశం లేదు.” కో ఫౌండర్ దీప్ దొరడ్ల. ఇప్పుడిప్పుడే భారత్ లాంటి దేశాల్లో చిన్న స్టోర్ల కోసం సరికొత్త స్ట్రాటజీ తో స్టార్టప్ లు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ తరహా వ్యాపారంలో మేం ముందుండటం విశేషం అంటారాయన .

image


భవిష్యత్ ప్రణాళికలు

మార్కెటింగ్ టీం ను పెంచడం ద్వారా మరిన్ని స్టోర్లను కనెక్ట్ చేయాలని చూస్తున్నారు. స్టోర్లకు ఎంగేజ్ చేయడానికి ప్రమోషన్స్ ప్రారంభించాలని . వచ్చే ఏడాది చివరికల్లా కనీసం మిలియన్ యూరోల వ్యాపారం భారత్ లో చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

“ఆఫ్ లైన్ స్టోర్ కు లాయల్ కస్టమర్లు ఉండటం వల్లనే ఆఫ్ లైన్ వ్యాపారం ఎంత విస్తరించినా, ఆఫ్ లైన్ వ్యాపారం నంబర్ల విషయంలో మార్పు రావడం లేదు. భవిష్యత్ లో ఇది కొనసాగాలంటే లాయల్టీ కార్డులు చాలా అవసరం. దీనికి మా లాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉందని ముంగించారు దీప్”