ఇంటర్నెట్ బానిసల కోసం బెంగళూరులో ఓ క్లినిక్

ఇంటర్నెట్‌కు బానిసవుతున్న జనంఆందోళన కలిగిస్తోన్న గణాంకాలుఇంటర్నెట్ వ్యసనాన్ని దూరం చేసే షట్ క్లినిక్

0

ఈ రోజుల్లో ఇంట్లో కరెంట్ ఎంత అవసరమో.. ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. భారత్‌లాంటి దేశాల్లో సగటు ఇంటర్నెట్ వినియోగం దాదాపు 25 శాతమే. కానీ బెంగుళూరులాంటి మెట్రో నగరాల్లో పరిస్థితి వేరు. గడిచిన పదేళ్లలో బెంగుళూరుపై ఐటి ఎంతో ప్రభావాన్ని చూపింది. సామాజిక మార్పులు చోటుచేసుకున్నాయి. లక్షల్లో ఉద్యోగులు ఐటి కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఎంతో మంది ఆంట్రప్రెన్యూర్స్ చాలా మందిని ఆన్ లైన్లోకి లాగుతున్నారు. అయిదే ఇది ఎక్కడికి పోతోంది ? సాధారణంగా దేనికైనా మంచీ, చెడులు రెండూ ఉంటాయి. ఇంటర్నెట్ వినియోగానికీ రెండు పాశ్వాలు ఉన్నాయి.

ఇంటర్నెట్ వ్యసనం (ఎడిక్షన్):

బెంగుళూరు నగర నడిబొడ్డున వెలిసింది షట్ క్లినిక్(SHUT Clinic). షట్ అంటే షార్ట్ పర్ సర్వీస్ ఫర్ హెల్దీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇంటర్నెట్‌కు బానిసలవుతున్న వారి వ్యసనాన్ని దూరం చేయడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (జాతీయ మానసిక ఆరోగ్యకేంద్రం), న్యూరోసైన్స్‌ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

“ఇంటర్నెట్ నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఇక్కడ ప్రత్యేక పద్ధతిలో కౌన్సిలింగ్ ఇస్తారు. ఆరోగ్యకరమైన కార్యాచరణతో ఇది సాగుతుంది” అని మనోజ్ శర్మ తెలిపారు. శర్మ నిమ్‌హాన్స్(NIMHANS)లో క్లినికల్ సైకాలజిస్ట్. దీనిగురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన యువర్ స్టోరీతో చెప్పారు.


నిమ్హాన్స్ చేసిన సర్వే లెక్కలిలా ఉన్నాయి.

18-25 ఏళ్ల మధ్య ఉన్న అబ్బాయిల్లో 5% మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు బానిసలవుతున్నారు. దాదాపు 24% మంది అమ్మాయిల ఇంటర్నెట్ ఉపయోగం పరిమితికి మించిపోతోందట. మీనన్, శర్మ 2013లో , భరత్కార్, శర్మ 2011లో చేసిన రెండు సర్వేల ఆధారంగా పై లెక్కలను తేల్చారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వర్క్ తరుపున 2013లో ఓ సర్వేనిర్వహించారు. ఇందులో 18నుంచి65 ఏళ్ల మధ్య ఉన్న 2755 సబ్జక్టులపై ప్రశ్నించారు. బెంగళూరు లోని స్థానికులను డోర్ టు డోర్ వెళ్లి సర్వే చేపట్టారు.

ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

 • 2% అబ్బాయిలు, 0.6% అమ్మాయిలు ఇంటర్నెట్ కు బానిసయ్యారు.
 • 5% అబ్బాయిలు,3.1% అమ్మయిలు మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యారు.
 • 3.5శాతం జనాభా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు, నాలుగుశాతం జనానికి షాపింగ్ వ్యసనంగా మారిపోవడాన్ని మనం ఇక్కడ గమనించాలి.
 • 0.2శాతం ఇంటర్నెట్ లో సెక్స్ విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 
 • 1.2శాతం మంది ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్లో గేమ్స్ ఆడకపోతే రోజు గడవదంటే నమ్ముతారా ?

కుటుంబ సభ్యుల ఫేస్ బుక్ వాడకంలో సంఖ్యాపరంగా తేడాలున్నాయి. ఒంటరిగా ఉన్న వారు ఎక్కువగా ఫేస్ బుక్‌కి బానిసవుతున్నారు. పెళ్లికాని వారేం తక్కువ తినకపోయినా.. ఉమ్మడి కుటుంబంలో ఫేస్ బుక్ వ్యసనం కావడంలేదనే విషయాన్ని మనం గుర్తించాలి.

“పెళ్లిళ్లు పెటాకులు కావడానికి షాపింగ్, సెక్స్, మొబైల్, ఇంటర్నెట్ ఫేస్‌ బుక్‌కి బానిస కాడం వల్లనే అనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది.”

భౌతికంగా కనపడేది(eye strain)/ మానసిక ఆందోళన( నిద్రలేమి,ఇరిటేషన్):

 • 6.8శాతం మంది మొబైల్ ఫోన్ కు బానిసవుతున్నారు. 
 • 4.2 శాతం ఇంటర్నెట్ వాడకానికి 
 • 3 శాతం మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో సతమతమవుతున్నారు. 
 • ఇందులో3.3 శాతం మంది ఇంటర్నెట్ కార్యాచరణని మార్చుకోవలని చూస్తోంటే, 
 • 4.2శాతం మంది మొబైల్ ఖర్చును ఎలాగైనా తగ్గించాలని తాపత్రయపడుతున్నారు.

వ్యసనాన్ని ఎలా అంచనా వేస్తారు?

పైన చెప్పబడిన ఫలితాలు ఏదో అల్లాటప్పాగా చెప్పిన వైతే కాదు. దీనికోసం ఓ ప్రామాణిక సాధనాలున్నాయి.

 • టెక్నాలజీ ఎడిక్షన్( ఇంటర్నెట్ ఎడిక్షన్ టెస్ట్ యంగ్ 1999)
 • ఫేస్ బుక్ ఇంటెన్సిటీ స్కేల్ (ఎల్లిసన్ ఈటి ఎఎల్2007)
 • లై బెట్ గేమింగ్ స్కేల్ ( జాన్సన్ ఈటి ఎఎల్ 1988)

ఇక మిగిలన వ్యసనాలైన మొబైల్, పోర్నోగ్రఫి, విడియోగేమ్, షాపింగ్‌లకు నాలుగు Cలతో కొన్ని ప్రశ్నలను సంధించి తెలుసుకున్నారు.

a) క్రావింగ్(Craving) – ఈ ప్రవర్తనలో మార్పును బట్టి

b) కంట్రోల్(Control) – ప్రవర్తనలో అసమర్థ అనుభవాని బట్టి

c)కంపల్సన్(Compulsion)- నిమగ్నమైనప్పటికీ అసవరంలేనట్లు ఉండటం

d)కాన్సిక్వెన్స్ (Consequences) – అనుభవాల ప్రభావంతో బాటు ప్రవర్తనల మార్పుతో

పైన చెప్పిన వాటిలో ఎవరైన వ్యక్తి మూడు, అంతకంటే ఎక్కువ వాటిళ్లలో అవును అని చెబితే సదరు వ్యక్తి టెక్నాలజీ డివైజ్ పాట్రన్‌లో ఎలాంటి మార్పు తీసుకోనవసరం లేదు.

ఈ ఫలితాల ఆధారంగా.. ఇంటర్నెట్ కి బానిసవుతున్న జనానికి సాయం చేయాలనే ఉద్దేశంతో షట్ క్లీనిక్ ప్రారంభమైంది. 14 ఏప్రిల్, 2014లో షట్ అనేది .. జనంలో ఇంటర్నెట్ ఎడిక్షన్‌పై అవగాహన కలిగించాలని వర్క్ షాప్‌లను నిర్వహించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత షట్‌కు పెద్ద సంఖ్యలో ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్‌ రావడం మొదలయ్యాయి. ఇందులో ఎక్కువ మంది 14 నుంచి 19 ఏళ్ల మధ్య వారు కాగా.. వీరంతా ఉన్నత సామాజిక ఆర్థిక కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

“ఈ సెషన్స్ తోపాటు మేం టెక్నాలజీని ఆరోగ్యవంతా ఉపయోగించేలా పోస్టర్లను అంటించి ప్రచారం చేస్తున్నాం. తల్లిదండ్రులు, కౌన్సిలర్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కు వర్క్ షాపులు నిర్వహిస్తున్నాం.(ఇంటర్నెట్ వ్యసనానికి గురైన వారిలో మార్పుతీసుకొచ్చి.. వారిప్రవర్తన పూర్తిగా మామూలుగా మారేవరకూ బాధ్యత తీసుకొనే కార్యక్రమం) బైయోసైకోసోషియల్ బేసిస్ ఆఫ్ ఇంటర్నెట్ ఎడిక్షన్ , కనిటివ్ రిట్రెయినింగ్ అండ్ బ్రీఫ్ బిహేవిరల్ ఇంటర్వెర్షనల్ ప్రోగ్రాంపై పెట్టుబడులు వచ్చేలా ఉన్నాయి,” అని మనోజ్ శర్మ అన్నారు.

More information and contact details can be found here.


ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik