మాంసాహార ప్రియులకు శుభవార్త చెప్తున్న ఫ్రెష్ చాప్స్

మాంసాహార ప్రియులకు శుభవార్త చెప్తున్న ఫ్రెష్ చాప్స్

Wednesday February 24, 2016,

3 min Read

అప్పుడప్పుడు ఇంటి దగ్గర వంట చేస్తుంటారా? మంచిదే.. వంట చేయడం ద్వారా మానసిక ఆందోళ దూరమవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. ఆడుతు పాడుతూ వంట చేస్తే ఆ కిక్కే వేరు. ఉరుకల పరుగుల కార్పొరేట్ జీవితాల్లో స్టార్టప్ లు రావడంతో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయాలనుకునే వారికోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ కోరుకునే జనం కోసమే ఓ స్టార్టప్ మొదలైంది. ప్రత్యేకంగా మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం లేదరంటున్నారు ఈ స్టార్టప్ ఫౌండర్లు.  

తాజా మాంసాహారం

తాజా చికెన్ దొరకొచ్చేమో కానీ తాజా చేపలు ఎలా తీసుకు రావాలి. వాటిని ఎలా కట్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు వేయడం మానేయొచ్చని ఫ్రెష్ చాప్స్ అంటోంది.

“ఆర్డర్ ఇచ్చిన గంటలో మీ ఇంటికి ఫ్రెష్ చికెన్ తీసుకొస్తాం,” రఘుబాబు

ప్రిపేర్ చేయాలనుకున్న సమయం చెబితే , ఆ సమయానికే రెడీ చేసి తీసుకొస్తామని అంటున్నారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరీ తెస్తారు. మనకు కావల్సిన మసాలా కలుపుకొని కర్రీ ప్రిపేర్ చేయడమే ఆలస్యం . ప్రస్తుతానికి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని మరో కో ఫౌండర్ మధు అంటున్నారు.

ఈ సెక్టార్ లో మార్కెట్ ఒక్క భాగ్యనగరంలోనే 3 వేల కోట్లు ఉన్నట్లు రఘు బాబు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ ఏడాది లెక్కల ప్రకారం 6 మెట్రో నగరాల్లో కలిపి 20 వేల కోట్లు ఉంది. ఆ ప్రకారం ఆయన విశ్లేషించారు. భారీగా అవకాశాలున్న ఫ్రెష్ నాన్ వెజ్ మార్కెట్ లో అడుగు పెట్టింది ఫ్రెష్ చాప్స్.


బిజినెస్ మొడల్

స్థానిక వ్యాపారులతో ఫ్రెష్ చాప్స్ టైఅప్ పెట్టుకుంది. వెబ్ సైట్, యాప్, లేదా మొబైల్ కాల్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటారు. కస్టమర్లు చెప్పిన సమయానికి వాటిని అందిస్తారు. కాల్ సెంటర్లలో ఎగ్జిక్యూటివ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

“మా స్టార్టప్ ద్వారా ఆఫ్ లైన్ వెండార్టకు బిజినెస్ అందిస్తాం,” మధు

దీంతో పాటు కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇంటి దగ్గరకే ప్యాకేజీ లను అందిస్తామంటున్నారామె. ఫుడ్ మార్కెట్ అంతా అన్ ఆర్గనైజ్డ్ సెక్టారు. దీన్ని వ్యవస్థీకరించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు మధు. వెండర్లకు కస్టమర్లను ఎంగేజ్ చేయడంతో పాటు, ఇటు కస్టమర్లకు హెసెల్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఈరెండు సమస్యలను ఒకే సమయంలో పరిష్కరిస్తోందీ హైదరాబాదీ స్టార్టప్. గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభమైన ఫ్రెష్ చాప్స్ నెలలో 1000కి పైగా ఆర్డర్లను తీసుకుంటోంది. ఆదివారాలు 100 ఆర్డర్లు క్రాస్ అవుతాయట. నలభై శాతం మంది రిపీటెడ్ కస్టమర్లు రావడం చూస్తే తమ సర్వీసును జనం ఆదరిస్తున్నారని సంతోషంగా చెప్తున్నారు మధు.  

ఫ్రెష్ చాప్స్ టీం

91 స్ప్రింగ్ బోర్డ్ ఇంక్యబేషన్ సెంటర్ నుంచి ఆపరేషన్స్ చూస్తోన్న ఈ స్టార్టప్ కు ముగ్గురు కో ఫౌండర్లు.శేఖర్ చేబోలు, ఫ్రెష్ చాప్స్ కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్న ఈయనకు టెక్ ఫీల్డ్ లో 20 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. ఐఎస్బీ పూర్వ విద్యార్థి అయిన శేఖర్ ప్రాడక్ట్ డెవలప్ మెంట్ వ్యవహారాలు చూస్తున్నారు. మధు చేబోలు మరో కో ఫౌండర్. దాదాపు పదేళ్ల పాటు ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేసిన మధు ఫ్రెష్ చాప్స్ లో ఆపరేషన్స్ చూస్తున్నారు. రఘు బాబు మరో కో ఫౌండర్. ఈయనకు లీగల్ ఇన్వెస్ట్ మెంట్ రంగంలో 20ఏళ్ల అనుభవం ఉంది. ఈయన కూడా ఐఎస్బీ పూర్వ విద్యర్థి కావడం విశేషం. ముగ్గు కో ఫౌండర్లకు కలపి దాదాపు 50ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం ఉంది. వీరితో పాటు మరో 8 మంది ఉద్యోగులు ఈ స్టార్టప్ లో పనిచేస్తున్నారు.

undefined

undefined


సవాళ్లు, పోటీ దారులు

వెండర్లను గుర్తించడమే ప్రధాన సవాల్ అని రఘు బాబు అంటున్నారు. సరైన వెండర్ ని గుర్తించడంపైనే మా గ్రోత్ ఉంటుందని, ఆ విషయంలో తామే స్వయంగా వెరిఫై చేసి దీన్ని అధిగమిస్తున్నామంటున్నారాయ.

“పూర్తి అస్తవ్యవస్థంగా ఉన్న మార్కెట్ ని వ్యవస్థీకరించడం మా ముందున్న సవాలు,” రఘుబాబు

ప్రస్తుతం బిటుసి నుంచి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. దీన్ని బిటుబి కి కూడా విస్తరించాలనుకుంటున్నాం. ఇదొక చాలెంజ్ అంటున్నారు. ప్రస్తుతం మన హైదరాబాద్ లో అయితే పోటీదారులు లేరు. బెంగళూరులో లిషినియస్ అనే ఓ స్టార్టప్ ఉంది. గుర్గావ్ లో జబ్ ఫ్రెష్ ఉంది. అయితే తమ మోడల్ ని పోలిన స్టార్టప్ లేకపోవడం వ్యాపారిని తిరుగు లేదని రఘుబాబు అంటున్నారు.

ఫ్యూచర్ ప్లాన్స్

మరో మూడు నెలల్లో హైదరాబాద్ నగరమంతా సేవలను విస్తరిస్తామని అంటున్నారు. ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ లో సేవలను విస్తరిస్తామంటున్నారు. విస్తరణ కు ఫండింగ్ వస్తే ఆహ్వానిస్తామని రఘు బాబు అంటున్నారు. పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన ఫ్రెష్ చాప్స్ సస్టేనబుల్ రెవెన్యూ మొడల్ లో ఉంది. ఫండింగ్ కు సిద్ధంగా ఉన్నామని ముగించారు రఘుబాబు.

image


undefined

undefined