మీ ఇమేజ్‌ని పెంచే బాధ్యత ఈమెది !

0

“మీ ఇమేజ్, మీ అత్యుత్తమ విజిటింగ్ కార్డు అవుతుంది”, అంటారు మోనికా గార్గ్. ఈమె ఇంటర్నేషనల్ లగ్జరీ అకాడమీకి డైరక్టర్. లగ్జరీ ఇమేజ్ కనసల్టెన్సీని నడుపుతున్న ఈ అకాడమీ న్యూడిల్లీలో ఉంది.

ఇమేజ్, స్టైల్, వస్త్రాలంకరణ, కలర్, మర్యాదగా వ్యవహరించడం వంటి అంశాల్లో, ప్రప్రంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సర్టిఫైడ్ ఇమేజ్ మాస్టర్స్ వద్ద శిక్షణ పొందారు మోనికా. న్యూయార్క్ లోని మన్‌హాటన్‌లో ఎటికెట్ స్కూల్ నుంచి ట్రైనర్ గా సర్టిఫికెట్ కూడా అందుకున్నారు. అదనంగా, స్విట్జర్‌లాండ్‌లోని విల్లా పియరెఫ్యూ సంస్థ నుంచి కూడా ఎన్నో సర్టిఫికెట్స్ అందుకున్నారు. తద్వారా, మహిళల ఇమేజ్ పెంచడంలో ఆమె నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు.

“నా వద్దకు వచ్చేవారు విభిన్న ఆలోచనలతో వస్తారు. కొంతమంది తమ పెళ్లిరోజున చాలా బాగా కనిపించాలని కోరుకుంటారు. మరికొంతమంది తమ కెరీర్ అత్యుత్తమంగా మలచుకోవడానికి ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తారు. అదే విధంగా విదేశాల్లో సమ్మర్ ఇంటర్న్ షిప్ కోసం వెళ్లే పిల్లలు, అక్కడికి వెళ్లకముందే తమ ఇమేజ్ ని పెంచుకోవాలని చూస్తారు. వారి వారి సమస్యలు విభిన్నంగా ఉంటాయి, అదే విధంగా పరిష్కారాలు కూడా. కాకపోతే అంతిమంగా వాళ్ల ఆత్మవిశ్వాస పాళ్లు పెంచడమే ఇందులో ఉండే కీలక అంశం”, అంటారు మోనికా.

కొంతమందికి మెరుగైన శరీర భాషని అందించి తోడ్పడ్డాను, ఇంకొంతమందికి ఫ్యాషన్ మరియు స్టైల్ పట్ల అవగాహన కల్పించాను. సాధారణంగా, ఒక వ్యక్తిని తీర్చిదిద్దేందుకు ఎనిమిది నుంచి పది సెషన్లు సరిపోతాయి. పరస్పర సౌలభ్యతని బట్టి... మోనికా అకాడమీ, వారికి ఒక నెల లేదా రెండు నెలల శిక్షణ అందిస్తుంది.

మోనికా గురించి

మోనికకు శాస్త్రీయ నేపథ్యం ఉంది. 2010 లో అమ్మాయిల కోసం మర్యాదగా వ్యవహరించడాన్ని నేర్పించే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అందులో ఆమె పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేకమైన శిక్షణ అందించేవారు. 2012 లో ఆమె తమ ఇమేజ్ కన్సల్టెన్సీ ప్రారంభించారు.

తక్కువ పెట్టుబడితో, ఎక్కువ రాబడి వచ్చే ఈ రంగం... రాబోయే రోజుల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మోనికా భావిస్తున్నారు. మోనికా విద్యార్ధుల్లో, కొంతమంది విజయవంతంగా ఈ కోర్సుని పూర్తిచేసి స్వంతంగా తమ ఇమేజ్ స్టూడియోలు పెట్టుకునే స్థాయికి ఆంట్రప్రెన్యూర్‌లగా ఎదిగారు.

ఇమేజ్ కన్సల్టేషన్ ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగేసిన మోనికాకి, ఢిల్లీ పూర్వ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, సమాజ్ రతన్ అవార్డును బహుకరించారు. “సమాజంలో మహిళలు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని మేము వారికి తర్ఫీదునిస్తున్నాం. ఒకసారి ఒక రాజకీయవేత్త కోడలు మమ్మల్ని సంప్రదించారు. ఆమెకి తన భర్తతో కలసి ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొనేందుకు తగిన అవగాహన లేదని భావించారు”, అంటారు మోనికా. మా శిక్షణ కాలం ముగిసాక, ఆమెకి కావల్సిన ఆత్మవిశ్వాసం లభించింది అధే విధంగా ఇమేజ్ ని పెంచుకుంది.

మోనికా విస్తరణ ప్రణాళికలు

మహిళల కోసం మరిన్ని కొత్త కోర్సులను ప్రారంభించాలని మోనికా భావిస్తున్నారు. తమ కార్యకలాపాలని ఇతర నగరాలకి కూడా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. తన స్వంత నిధులతోనే సంస్థని ప్రారంభించిన మోనికా ఇప్పటివరకూ నిధులకోసం ఎవరినీ సంప్రదించలేదు. లుధియానాలో త్వరలో ఒక సంస్థని ప్రారంభిద్దామని అనుకుంటున్నారు.

తన పనిని ప్రేమించి, చేసే ప్రతీ పని పట్ల నిబద్ధత కలిగిఉండే మోనికా స్వయంగా తన విద్యార్ధులకు మార్గదర్శిగా ఉండాలనుకుంటారు. తనకి రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరని, కష్టపడి పనిచెయ్యడాన్ని తాను విశ్వసిస్తానని మోనికా చెప్తారు. అదొక్కటే జీవితంలో దూసుకువెళ్లేందుకు సరైన మార్గం అని ఆమె నమ్మకం.

ఆమె ఒక సరైన రంగంలోనే పెట్టుబడి పెట్టానని, భారతదేశంలో రాబోయే కాలంలో ఇమేజ్ క్లీనిక్స్ కే అందరూ పెద్దపీట వేస్తారని మోనికా బలంగా నమ్ముతున్నారు.

“రోజురోజుకీ, స్వీయ మెరుగుదలపై అవగాహన పెరుగుతూ వస్తున్నాది, అది మాకు శుభవార్త” అంటూ నవ్వుతూ ముగించారు మోనికా.