కాలేజీలో ఉండగానే స్టార్టప్స్ పెట్టి ఎలా అమ్మగలిగారు..?

0


బిజినెస్ ప్లాన్ కాంపిటిషన్ లో పాల్గొనేందుకు ఐఐటీ ఖరగ్ పూర్ కు వెళ్తుండగా శశాంక్ మురళికి ఒక ఆలోచన వచ్చింది. పది వేల పెట్టుబడి పెట్టి కొన్ని రోజుల్లోనే లక్ష రూపాయలు సంపాదించడం ఎలా అన్నదే అతడి ఆలోచన. దాన్నే యూనివర్సిటీ విద్యార్థులకు వివరించి విజేతగా కూడా నిలిచాడు. నిజమే ఇప్పుడంతా స్టార్టప్స్ కాలం నడుస్తోంది. స్టార్టప్స్ అనగానే రిస్క్ ఎంత ఉంటుందో రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే రిస్కే ఎక్కువ. విజయం సాధించేవరకు ఎవరూ గుర్తించరు. కెరీర్ ను త్యాగం చేయాల్సి ఉంటుంది. 

పాతికేళ్లు కూడా నిండని శశాంక్ మురళి అలాంటి విజయమే సాధించాడు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలును… ఆయన మాటల్లోనే విందాం.

మొదట్లో పెట్టిన పెట్టుబడి పోయింది. రెండు మూడు సార్లు కంపెనీ పెట్టాలనుకున్నా సాధ్యం కాలేదు. సమయం, కష్టం, పెట్టుబడి కొంతమేర నష్టపోయాను. కాలేజీలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు పోయినా భరించడం చాలా కష్టం. మనసు గాయపడింది. అలా అని మనసు ఊరుకోలేదు. మళ్లీ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. సొంత ఖర్చులు తగ్గించుకుని… డొక్కు బస్సుల్లో తిరుగుతూ… బిజినెస్ ప్లాన్ పై దృష్టిపెట్టాను. అసలు ఎందుకిలా చేస్తున్నానా అన్న విషయం ఆలోచిస్తే భయమేసేది. చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే బెటర్ కదా అప్పుడప్పుడూ అనిపించేది.

యురేకా మూమెంట్

స్టార్టప్ కంపెనీ పెట్టడం ఒక్కరివల్ల సాధ్యం కానప్పుడు కొంతమంది స్నేహితులను కలుపుకుపోవడం బెటర్. మనం ఎలా చదివాం… ఎన్ని మార్కులు వచ్చాయన్నది ఇక్కడ క్రైటీరియా కాదు. మిగతా కంపెనీల్లో పనిచేసినవారు స్కిల్ ఉన్నవారు స్నేహితులుగా దొరికితే ఇంకా మంచిది. మంచి ఐడియాలుంటే వాటిని అమలు చేయాలి. ఒకవేళ ఎవరైనా మన ప్రోడక్ట్స్ కొనటానికి ఇష్టపడకపోయినా వారికి టెక్నాలజీ గురించి తెలియదని సరిపెట్టుకోవాలి తప్ప నిరాశ చెందరాదు.

ప్రయత్నం ఆపరాదు

తిరస్కరణకు గురైతే వేరే సంస్థలకు మన ప్లాన్ అమ్మేందుకు ప్రయత్నించాలి. తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలి. అప్పటికీ ఎవరూ మన ప్లాన్ లేదా ప్రోడక్ట్ కొనేందుకు ముందుకు రాకపోతే మరిన్ని నగరాలకు ట్రావెల్ చేయాలి. మరిన్ని సంస్థల ప్రతినిధులతో మాట్లాడాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే బిజినెస్ ప్లాన్ అమ్మేందుకు ఖరగ్ పూర్ ఐఐటీకి వెళ్లాను.

సరిదిద్దుకోవాలి

వీలైనంత తొందరగా లోపాలను సరిదిద్దుకోవాలి. ఎక్కడ తప్పుందో ముందు కనిపెట్టాలి. మనకు తెలియని రంగాల్లో ఎవరికైనా మంచి ప్రావీణ్యం ఉంటే వారి సాయం తీసుకోవాలి. పార్ట్ నర్స్ గట్టివాళ్లయితే మరీ మంచిది.

ఇట్స్ ఎలైవ్

బిట్స్ పిలానీలో చదువుతుండగానే ఎడ్ వైస్ అనే స్టార్టప్ మొదలు పెట్టాను. దీనిద్వారా ట్యూటర్స్ తో విద్యార్థులు నేరుగా మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. దీనికోసం చాలా విద్యా సంస్థల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. ప్రయోజనం శూన్యం. ప్రోడక్టును కొనుక్కునేందుకు ఎవరైనా ముందుకు వస్తే అమ్మేయడం బెటర్. మన ప్రోడక్ట్ కు ప్రచారం కల్పించేందుకు వెబ్ లో ఒక కొత్త పేజీ ఓపెన్ చేసి ప్రచారం కల్పించాలి.

అలా నేను పెట్టిన ల్యాండింగ్ పేజ్ చాలా బాగుంది. చాలా మంది ట్యూటర్స్ , ఫ్రెండ్స్, సీనియర్స్ సైనప్ అయ్యారు. జీవితంలో ఎన్నడూ ఊహించని మేధావులు చేరారు. పెట్టుబడులు పెడతామంటూ వెంచర్ కేపిటలిస్టులు ముందుకొచ్చారు. నేనేమీ ప్రోడక్ట్ సృష్టించలేదు. రియల్ యూజర్స్ ను చూడలేదు. డబ్బు రాలేదు. కానీ చాలామంది పెట్టుబడులు పెడతామన్నారు. చాలా మంది అభిప్రాయలు తీసుకున్నాను. ఆ తర్వాత ప్లాన్ వర్కవుట్ అయ్యేలా ఉందనుకున్నాను.

మెంటర్స్, మీటింగ్స్

డబ్బులు పెడతామని చాలామంది చెప్తారుగానీ… క్యాష్ ఇచ్చేసరికి చాలా సాకులు చెప్పారు. బయటకు మాత్రం ఫండింగ్ చేయలేమని నో చెప్పరు. అలాగని డబ్బు పెట్టరు. నాన్చుతుంటారు. అలాంటివారిని డీల్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఈ క్రమంలో చాలామందిని కలవాల్సి ఉంటుంది.

చిన్న ఆఫీస్

నాతోపాటు ఐదుగురు జూనియర్స్ తమ ఇంటర్న్ షిప్ లు వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. స్టార్టప్ వల్ల ఏదో సాధిస్తామన్న ఆశ వారిది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు. మా ప్లాన్ కు పెట్టుబడిదారులు బాగానే స్పందిస్తున్నారుగానీ, పెట్టుబడులు పెట్టడం లేదు. స్టూడెంట్స్ , ట్యూటర్స్ మా వెబ్ సైట్ ను, యాప్ ను ఇష్టపడుతున్నారు. కానీ మార్కెటింగ్ చేసేకోలేకపోయాం.

సెమిస్టర్ పూర్తయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ప్రోడక్ట్ మాత్రం ఇంకా లాంచ్ కాలేదు. పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా దేశంలోని రెండు ఎడ్ టెక్ కంపెనీలు తమకు భారీ పెట్టుబడులు వచ్చాయని ప్రకటించాయి. దీంతో మేం మరింత గందరగోళానికి గురయ్యాం.

భద్రతే ముఖ్యం?

చివరికి మేం పెట్టిన స్టార్టప్ ను అమ్మేయాలనుకున్నాం. విద్యార్థులుగా ఉన్న మాకు.. భద్రతే ముఖ్యం అనుకున్నాం. పది నెలలు కష్టపడ్డాం. ఇంటర్న్ షిప్పులకు ఏదైనా పెద్ద కంపెనీకి వెళ్తే కొంత మొత్తం వచ్చేది. స్టార్టప్ ను బిల్డప్ చేయడంపైనే మేం దృష్టిపెట్టాం. స్టార్టప్ ను అమ్మేస్తే నాతోపాటు ఉన్న స్నేహితులకు పెద్ద ఉద్యోగాలు వచ్చి బాగా సెటిల్ అవుతారని భావించాను. అదే జరిగింది. బిట్స్ పిలానీ చరిత్రలో కాలేజీలో ఉండగానే కంపెనీ పెట్టి అమ్మగలిగింది మీరేనని కొందరు చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. నేను పెట్టిన ఎడ్ వైస్ స్టార్టప్ ను అమెరికన్ ఎడ్యు టెక్ కంపెనీ కొనుగోలు చేసింది.

కంపెనీ అమ్మేశానని బాధేమీ లేదు. మాకు పెద్ద మొత్తమే ముట్టింది. మరో స్టార్టప్ కోసం ప్రయత్నిస్తున్నాను. కంపెనీ అమ్మేసిన తర్వాత రోజు నుంచే పనిచేయడం మొదలుపెట్టాను.

సాధక బాధకాలు

ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసి అంతా సవ్యంగా సాగితే ఫర్వాలేదు. లేకపోతే చాలా కష్టం. నిరంతరం కొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉండాలి. మార్కెట్లోకి వచ్చేవరకు ప్రోడక్ట్ కు రోజూ మెరుగులు దిద్దుతునే ఉండాలి. ఒక్కసారి ఫేమ్ వస్తే నేషనల్ పేజ్ లో హెడ్ లైన్ న్యూస్ కావచ్చు. రోజు రోజుకూ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ సంఖ్య పెరుగుతోంది. ఐదేళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. క్లిక్ అయితే కోట్లు వచ్చిపడతాయి. నేను బిట్స్ పిలానీ – బెంగళూరు మధ్య చక్కర్లు కొడుతున్నాను. విమాన ఛార్జీలకే డబ్బు ఖర్చయిపోతుంది.

స్టార్టప్ పెట్టడానికి చాలా కష్టపడాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి ఉంటుంది. డాలర్ డ్రీమ్స్ ను వదులుకోవాలి.  రిస్క్ చేయడానికి సిద్ధపడాలి.

మై ఓషన్స్ ఎలెవెన్, హలో, ట్యాప్ చీఫ్

అనతికాలంలోనే ఈ మూడు స్టార్టప్ లను తీసుకొచ్చాం. 18 ఫిబ్రవరి,2016లోనే ట్యాప్ చీఫ్ లైవ్ లోకి వచ్చింది. ఈ యాప్ ను ఉపయోగించి నిపుణులతో సంభాషించవచ్చు. ట్యాప్ చీఫ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. ట్యాప్ చీఫ్ ను మరింత అభివృద్ధి చేసేపనిలో ఉన్నామని ముగించారు శశాంక్ మురళి.

I am a young post graduate ... have a great zeal for entrepreneurship. Writing is my hobby

Related Stories