స్థాపించిన మూడేళ్లలోనే వరల్డ్ థర్డ్ ర్యాంక్.. హైదరాబాదీ సంస్థ ‘ఇన్సోఫి’ సక్సెస్ స్టోరీ

2


డేటా సైన్స్ అనేది ఇప్పుడు వేగంగా ప్రభావితం చూపిస్తోన్న సబ్జెట్. అమెరికాలో అయితే మంచి డిమాండ్ ఉన్న కోర్స్. దీన్ని మొదటిసారి భారతదేశానికి పరిచయం చేసింది మాత్రం మన భాగ్యనగర సంస్థ ఇన్సోఫినే. సాధారణంగా బిజినెస్ మేనేజ్మెంట్ తర్వాత ఉద్యోగానికి వెళ్లడానికి ముందు సాఫ్ట్ స్కిల్స్ లాంటివి నేర్చుకోడానికి ప్రత్యేకమైన సంస్థలుంటాయి. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు వారి గ్రాడ్యుయేషన్ తర్వాత కోర్ సబ్జెక్ట్ లో ఉద్యోగం చేయాలంటే అంత వీజీ కాదు. అయితే ప్రొఫెషనల్ గా విద్యార్థులు ఎదగాలంటే దానికి టెక్నికల్ స్కిల్స్ కావాలి. అవి నేర్పే బాధ్యతను తీసుకుంటున్న కాలేజీలను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది ఇన్సోఫి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ పేరుతో ఫిల్మ్ నగర్ లో ఈ సంస్థ నడుస్తోంది. ప్రారంభించిన మూడేళ్లలోనే వరల్డ్ థర్డ్ ర్యాంక్ సాధించి కొలంబియా, స్టాండ్ ఫార్డ్ సరసన చేరింది.

ఏంటి ఈ డేటా సైన్స్

ప్రపంచ జనాభా పెరుగుతున్నదానికి వందల రెట్లు ఎక్కువగా డేటా పెరుగుతోంది. భవిష్యత్ లో ఇది మరీ ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి డేటాని అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే, దాన్ని పదిమందికి విడమరిచి చెప్పడం మరో ఎత్తు. ఇలా చేసే దాన్ని డేటా సైన్స్ అంటారు. ఇంజినీరింగ్ విద్యార్థులైతే ఈ డేటా సైన్స్ ను తొందరగా ఆకళింపు చేసుకుంటారు.

“డేటా సైన్స్ కోసం ఓ సంస్థని మొదలు పెట్టాలనుకున్నాం. అలా మొదలైందే మా ఈ ఇన్సోఫీ విద్యాసంస్థ”-  శ్రీరామ కే మూర్తి.

ఇన్సోఫి ఫౌండర్లలో ఒకరైన మూర్తి.. మూడేళ్లలో ప్రపంచంలోనే మూడో స్థానానికి వస్తామని అనుకోలేదని అన్నారు. ప్రపంచస్థాయి విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. చేసి చూపించారు. ఇప్పుడు తమపై మరింత బాధ్యత పెరిగిందని అంటున్నారు. డేటా సైన్స్ ను చెప్పే అతికొద్ది మందిలో తామూ ఒకరిమని తెలిపారు. ఈ రంగంలోకి రావాలనుకునే వారికి ఆయన ఆహ్వానం పలికారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇన్సోఫి విద్యార్థులు

సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో పదుల సంఖ్యలో విద్యార్థులు వచ్చే వారు. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వర్చువల్ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఇన్సోఫి చేరుకుంది. ఇక్కడి నుంచి రిలీవ్ అయిన చాలామంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించారు. అదే విధంగా చాలామంది స్టార్టప్ సంస్థలు సూపర్ సక్సెస్ అయ్యాయని మూర్తి చెప్పుకొచ్చారు. కెనడా, అమెరికా, యూకే, నైజీరియా, యూఏఈ , సింగపూర్, ఇండోనేషియా దేశాల్లో ఈ సంస్థ విద్యార్థులు ఉన్నారు. చాలా దేశాలకు ఆన్ లైన్ కోర్స్ లను అందిస్తున్నారు.

మూర్తి, కో ఫౌండర్
మూర్తి, కో ఫౌండర్

ప్రధాన సవాళ్లు

1.టెక్నికల్ నాలెడ్జితో పాటు టీచింగ్ స్కిల్స్ ఉన్న వాళ్లు తమ విద్యాసంస్థకు అవసరమని అన్నారు. వారిని హైర్ చేసుకోవడం తమకు పెద్ద సవాలని అంటున్నారు మూర్తి. ప్రస్తుతానికి సక్సెస్ అయ్యామని, భవిష్యత్ లో మెరుగుపడాలని అంటున్నారు.

2. ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ కి వచ్చామని, దాన్ని సస్టేయిన్ చేయడం మారో పెద్ద సవాలని అన్నారు. అయితే డెడికేటెడ్ టీం వర్క్ తో తమ ఇండస్ట్రీలో రాణిస్తామన్నారు మూర్తి.

భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరుల్లో క్యాంపస్ లు ఉన్నాయి. హైదరాబాద్ లో మరో పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఇతర మెట్రో నగరాలతో పాటు అమెరికాలోనూ బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని మూర్తి చెప్పుకొచ్చారు. మరింత మంది డేటా లీడర్లను  తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ముగించారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories