ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం అమలైతే మనకు నష్టం లేదు

ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం అమలైతే మనకు నష్టం లేదు

Thursday March 02, 2017,

1 min Read

ఎట్టకేలకు ఇండియన్లకు ఉపయోగపడే ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ మీద ఇన్నాళ్లూ రకరకాల ఆంక్షలు పెట్టిన ట్రంప్.. తాజాగా మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం ప్రతిభావంతులున్న ఇండియాలాంటి లాంటి దేశాలకు లబ్ది చేకూరుస్తుందనడంలో సందేహమే లేదు. అమెరికన్ కాంగ్రెస్ ని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ట్రంప్ మెరిట్ బేస్డ్ విధానంపై ఓ క్లారిటీ ఇచ్చారు.

image


కెనడా, ఆస్ట్రేలియా, ఇంకా అనేక దేశాలు మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్నే అవలంభిస్తున్నాయి. ఇదే విషయాన్ని ట్రంప్ కాంగ్రెస్ లో ప్రస్తావించారు. ఈ పద్ధతిలో వెళ్తే డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.. ఇటు ఉద్యోగుల వేతనాలూ పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ మాటలను ట్రంప్ గుర్తు చేశారు. ఆయన పాలసీని ఫాలో అవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

ఇప్పుడున్న లోయర్ స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ విధానానికి స్వస్తి చెప్పి, మెరిట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా వెళ్తే అనేక లాభాలున్నాయని ట్రంప్ అన్నారు. లక్షలాది డాలర్లు ఆదా అవడమే కాకుండా, వర్కర్ల జీతాలూ పెరిగి, కుటుంబాల బాధలు కూడా తీరుతాయని చెప్పారు. అమెరికా పోగొట్టుకున్న లక్షలాది ఉద్యోగాలు కూడా తిరిగి వస్తాయన్నారు.

అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాలంటే ఇప్పుడున్న పాత విధానాలను సంస్కరించక తప్పదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. పాత వ్యవస్థ వల్ల ఉద్యోగులను చాలీచాలని వేతనాలు కుంగదీశాయని , టాక్స్ చెల్లించే విషయంలోనూ వారు ఎంతో ఒత్తిడికి గురయ్యారని ట్రంప్ అన్నారు.

ఇమ్మిగ్రేషన్ విధానంలో సానుకూల సంస్కరణలు ప్రవేశపెడితే ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా దీర్ఘకాలికంగా దేశభద్రత కూడా మెరుగవుతుందని ట్రంప్ అన్నారు.

అమెరికన్ల శ్రేయస్సుకోరి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి పనిచేస్తే, ఇన్నాళ్లూ ఏం కోల్పోయామో అది తిరిగి సాధించేలా గొప్ప ఫలితం రాబడతామనే నమ్మకం తనకు ఉందన్నారు.