వాషింగ్ మార్కెట్‌ను ఉతికేస్తున్న వాస్సప్. తెలుగు రాష్ట్రాల్లో రూ.30 వేల కోట్ల బిజినెస్

వాషింగ్ మార్కెట్‌ను ఉతికేస్తున్న వాస్సప్. తెలుగు రాష్ట్రాల్లో రూ.30 వేల కోట్ల బిజినెస్

Friday April 08, 2016,

3 min Read


హైదరాబాద్ ఒక ఫ్యాషనబుల్ సిటీ. ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. ఐటితో పాటు అన్నిరంగాల్లో అగ్రగామిగా రాణిస్తోంది. బెంగళూరు తర్వాత మాకు స్ట్రాటజికల్ మార్కెట్ ఇదే అంటారు వాస్సప్ సీఈవో బాలచందర్ అంటున్నారు. యూవర్ స్టోరీకి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్ సర్వీస్ మార్కెట్ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఆర్. బాలచందర్, వాస్సప్ సిఈఓ

ఆర్. బాలచందర్, వాస్సప్ సిఈఓ


ప్ర: హైదరాబాద్ లో మీ వ్యాపారం గురించి చెప్పండి ?

బాలచంద్రన్: అన్ని మెట్రో నగరాల మాదిరి హైదరాబాద్ కూడా ఓ పెద్ద మార్కెట్. ఇప్పటికే మేం ఇక్కడికి రావాల్సింది, కొద్దిగా లేటైంది. వాషింగ్ సర్వీసు అందించడానికి స్థానికంగా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దేశం మొత్తంలో మాకు మంచి పేరుంది. హైదరాబాదులో కూడా మా సేవలను కొనసాగించాలనుకున్నాం. అందుకే ఈజీ వాష్ అనే స్థానిక సంస్థను కొనుగోలు చేసి ఇక్కడికు ప్రవేశించాం.

ప్ర: స్థానికంగా మీరెలాంటి పొటీ ఎదుర్కోబోతున్నారు?

బాలచంద్రన్: మంచి ప్రశ్న. స్థానికంగా ఉన్న వాషింగ్ స్టార్టప్స్ చాలా బాగా నడుస్తున్నాయి. అయితే మాకంటూ ఓ స్ట్రాటజీ ఉంది. మేం ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్ స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ జనం ఆఫ్ లైన్ స్టోర్లకు వెళ్లి సర్వీసు చేయించుకుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 స్టోర్లను పెడుతున్నాం. భవిష్యత్ లో వాటిని పెంచుతాం. ఆఫ్ లైన్, టెలిఫోనిక్ ఆర్డర్లు, ఆన్ లైన్ తో పాటు యాప్ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటాం. ఈ రంగంలో మార్కెట్ ని క్రాస్ చేస్తాం. ఒకసారి కనెక్టయితే కస్టమర్లు ఎటూ వెళ్లరు.

image


ప్ర: కస్టమర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ? వాళ్లకు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు ?

బాలచంద్రన్: ఇప్పటి వరకు వాస్సప్ 4 కోట్ల పీస్‌లను సర్వీస్ చేసింది. నెలకి మూడు లక్షల బట్టలను ఉతుకుతుంది. 3 వేల మంది రెగ్యులర్ కస్టమర్లున్నారు. మేం బిటుబి తో పాటు బిటుసిలోనూ ఉన్నాం. స్థానిక స్టార్టప్‌లతో కూడా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సేవలను విస్తరించాలి. అంతే కానీ మాకు కాంపిటీటర్స్ గా ఎవరినీ భావించడం లేదు. ఇదే తరహాలో హైదరాబాద్ లో కూడా సేవలను విస్తరిస్తున్నాం.

ప్ర: వాసప్ ఫండింగ్ వివరాలు చెబుతారా?

బాలచంద్రన్: అదే విషయం చెప్పబోతున్నా. 2012 లో సీడ్ ఫండింగ్ కింద రూ. 3 కోట్లు రెయిజ్ చేశాం. అనంతరం సిరీస్ ఏ రౌండ్ లో రూ. 12 కోట్లు రెయిజ్ చేశాం. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో పూర్తిస్థాయిలో సేవలను విస్తరించడానికి ఫండ్స్ ని ఉపయోగించాం. వాస్సప్ - యాప్ సర్వీసు అందిస్తోంది. మరో మూడు నెలల్లో సరికొత్త యాప్ రాబోతోంది. మరో ఏడాది వరకు మా ఫండ్స్ కి ఏం ఢోకా లేదు. సెల్ఫ్ సస్టెయినబుల్ మోడల్ లో ఉన్నాం కనుక భవిష్యత్ ఫండ్ రెయిజింగ్ ఆలోచన ఇప్పట్లో లేదు.

ప్ర: హైదరాబాద్ లో ఆఫ్ లైన్ స్టోర్స్, ఫ్రాంచైజీల వివరాలు?

బాలచంద్రన్: నగరంలో మాదాపూర్, హైటెక్ సిటీ, ఎస్సార్ నగర్ , కుకట్ పల్లి లాంటి 25 ప్రాంతాలను గుర్తించాం. ఫ్రాంచైజీలను కూడా ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు 3 లక్షల మూల పెట్టుబడితో వస్తే, వాళ్లతో అసోసియేట్ అవుతాం. వారు చేసే బిజినెస్ లో పదినుంచి 15 శాతం కమిషన్ వస్తుంది. నెలకు 25 నుంచి 30వేలు సంపాదించుకోడానికి ఇదొక అద్భుత అవకాశం. ముఖ్యంగా గృహిణిల‌కు  ప్రాధాన్యం ఇస్తాం. స్టోర్ ఫ్రంట్ ఎండ్ లో వారుంటారు. బ్యాక్ ఎండ్, లాజిస్టిక్, ఇతర బ్రాండింగ్ లాంటి వన్నీ మేమే చూసుకుంటాం.

వెబ్ సైట్ 

ప్ర: వాషింగ్ సర్వీసు మార్కెట్ వాల్యూమ్ ఎంత?

బాలచంద్రన్: దేశ వ్యాప్తంగా 1.1 కోటి మంది ధోబీలున్నారు. అదంతా అవ్యవస్థీకృత రంగం. ఇది దాదాపు 32 బిలియన్ డాలర్ల(రూ 2.20 లక్షల కోట్లు) మార్కెట్. హైదరాబాద్, సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కెట్ 5 బిలియన్ డాలర్లు(రూ.34000 కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇది ఇంకా పెరుగుతోంది కూడా. వాషింగ్ సర్వీసును వ్యవస్థీకరణం చేయడంలో సక్సెస్ సాధిస్తున్నాం.

ప్ర: హైదరాబాదీల కోసం ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు?

బాలచంద్రన్: ఆఫర్లు అనేదానికంటే ప్యాకేజీ అంటే బాగుంటుంది. రూ.1,299కు నెలవారీ బట్టల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. దీంతో పాటు మరో రెండు ప్యాకేజీలున్నాయి. కస్టమర్లు మా ప్యాకేజీ కవర్ వాపస్ ఇస్తే.. వారి అకౌంట్లో పాయింట్లు యాడ్ అవుతాయి. వాటిని మేం రెడిమ్ చేస్తాం. ఈ రకంగా పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నాం. ఒకసారి మాకు కస్టమరుగా మారి చూడండి.. మా సేవలు చూసి ఆఫర్లు అడగక్కర్లేదు అంటారు మీరంతా.

image


డోర్ స్టెప్ లాండ్రీ సేవలను వ్యవస్థీకరించిన మొదటి భారతీయ సంస్థ మాది, భవిష్యత్ లో గ్లోబల్ లీడర్ కావాలనుకుంటున్నామని ముగించారు బాల చంద్రన్”