ముస్లిం పెళ్లి సంబంధాల కోసం 'ముజ్ మ్యాచ్'

ముస్లిం కమ్యూనిటీ కి ఎంతో మేలైన యాప్..రోజుకి వందల్లో వస్తున్న ప్రొఫైల్స్..నెలన్నరలో 9వేలు దాటిన ప్రొఫైల్స్..ప్రైవసీ విషయంలో జాగ్రత్తలు..

ముస్లిం పెళ్లి సంబంధాల కోసం 'ముజ్ మ్యాచ్'

Saturday May 16, 2015,

2 min Read

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం లకు, సరైన పెళ్లి సంబంధాలను వెతికిపెట్టడానికి ''ముజ్ మ్యాచ్'' పేరుతో కొత్త యాప్ వచ్చింది. ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్‌తో పాటు యూజర్ ఈజ్‌ని కలిగి ఉండటం ఈ యాప్ ప్రత్యేకత

ది అప్లికేషన్

ముజ్ మ్యాచ్‌లో యూజర్లు తమ ప్రాంతంలో ఉన్న కొత్త ప్రొఫైల్స్‌ని ప్రతి రోజూ చూసుకునే వెసులుబాటుంది. ప్రొఫైల్ నచ్చినట్లైతే కుడి ప్రక్కకు... నచ్చకపోతే ఎడమ ప్రక్కకి స్వైప్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ స్వైప్‌ల గురించి వేరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇద్దరు సబ్‌స్క్రైబర్లూ ఓకే అనుకుంటేనే మ్యూచువల్ ఇంట్రస్ట్‌గా పరిగణిస్తారు. ఒకసారి ఇలా పరిగణిస్తే.. ఇరువురు ఒకరినొకరు మెసేజిలు పంపించుకునే వెసులుబాటు ఉంటుంది. ముజ్ మ్యాచ్‌లో యూజర్లు మెంబర్ల ప్రొఫైల్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఫోటోలు చూడటానికి , ఇతర విషయాలు కావాలంటే ఇన్‌స్టెంట్ మెసేజ్ చేయొచ్చు. అవతలివారికి నచ్చితే ఆ డిటైల్స్ పంపిస్తారు. లేదంటే వివరాలు కనిపించవు.

image


బిహేవియర్ ఫిల్టరింగ్

మెంబర్స్ మెసేజ్ చేసేటప్పుడు వారి భాష, ప్రవర్తన సరిగా లేకపోతే మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అసందర్భపు చాట్‌గా ముజ్ మ్యాచ్ టీం కు చేరిపోతుంది. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. ముందుగా నోటీసు జారీ చేస్తారు. వారి ప్రొఫైల్‌ని పూర్తి స్థాయిలో సర్కులేట్ కలిగించరు. కాస్త తేడాగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్ కూడా ఇస్తారు.

మెంబర్స్ అకౌంట్‌కి గార్డియన్‌ని సెట్ చేసి పెడతారు. ఆ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజిలు వచ్చినా, లేదా ఆ అకౌంట్ కి బయటి నుంచి సందేశాలొచ్చినా గార్డియన్‌కు ఈమెయిల్ ద్వారా విషయం చేరవేస్తారు. మ్యాచ్‌లను కూడా గార్డియన్ కు తెలియపరుస్తారు. మొత్తం వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తుందనేందుకు ఇదే నిదర్శనం అంటుంది టీమ్. ఫోటో ప్రైవసీ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రొఫైల్ ఇంట్రస్ట్ అని వచ్చిన తర్వాత ఫోటో కనిపిస్తుంది. అప్పటి వరకూ ఫోటో అనేది బ్లర్‌గానే ఉంటుంది.

వెబ్ సైట్ నుంచి యాప్ దాకా

షాహ్జద్ యూనాస్, ముజ్ మ్యాచ్ ఫౌండర్ సిఈఓ దీన్ని మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌గా ప్రారంభించారు. యువత అభిరుచులు కొత్తగా ఉండడంతో ఒక యాప్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. దీంతో ప్రొఫైల్స్ చూసుకోడానికి మరింత ఈజీ అవుతుందని భావించారు. ఇంకేముంది యాప్ లాంచ్ అయిపోయింది. 

తొమ్మిదేళ్ల పాటు మోర్గాన్ స్టాన్లీలో ఈక్విటీ పోర్ట్ ఫోలియో హ్యాండిల్ చేసి, వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో భారీ శాలరీని విడిచి పెట్టి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు షాహ్జాద్. ప్రొఫైల్స్‌‌ని బ్రౌజ్ చేసి నచ్చిన వారికి ఈమెయిల్ పంపించడం కొద్దిగ ప్రయాసగానే అనిపించింది. కొన్ని సార్లు ఈమెయిల్ చూడటానికి సమయం కూడా ఉండకపోవచ్చు. దీంతో ముజ్ మ్యాచ్ ను లాంచ్ చేశామంటున్నారాయన.

షాహ్జాద్ - ముజ్ మ్యాచ్ సిఈఓ

షాహ్జాద్ - ముజ్ మ్యాచ్ సిఈఓ


ముజ్ మ్యాచ్ అనేది తనకు తానుగా సంపాదించుకొనే స్టార్టప్. మొదట యాపిల్, ఆండ్రాయిడ్‌లో యాప్ ఏరకంగా తీసుకు రావాలనే దాన్ని ముందుగా ఆలోచించారు షాహ్జాద్. దీనికే దాదాపు ఐదు నెలల సమయం పట్టిందట. భవిష్యత్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ని రీలాంచ్ చేయడానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని షాహ్జిద్ వివరించారు. స్థానిక అవసరాలకు అనుగణంగా లోకలైజ్డ్ వర్షన్స్‌తో పాటు కీ రీజియన్స్ లో డైరెక్ట్ మార్కెటింగ్ క్యాంపైన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రతిరోజూ వందకు పైగా కొత్త ప్రొఫైల్స్ వస్తున్నాయి. దీంతో మా బాధ్యత రెట్టింపైంది. నెలన్నర సమయంలో 9వేలకు పైగా ప్రొఫైల్స్ లభించడం ఓ గొప్ప విషయం. దీంతోపాటు కమ్యూనిటీ నుంచి ఆదరణ సైతం అదే స్థాయిలో రావడం ఆనందాన్ని కలిగించిందని షాహ్జిద్ ముగించారు.