ఆల్మా మ్యాటర్‌ను మలుపు తిప్పిన అను ఆంటీ !

ఆల్మా మ్యాటర్‌ను మలుపు తిప్పిన అను ఆంటీ !

Sunday April 05, 2015,

3 min Read

'అల్మా మాటర్' పేరు ఎక్కడో విన్నట్లు, చూసినట్లు ఉందా,వినే ఉంటారు, దేశంలోని స్కూల్స్, కాలేజెస్ పూర్వ విద్యార్ధులకు దుస్తులు, జ్ఞాపికలు విక్రయించేందుకు 2009 లో వరుణ్ అగర్వాల్ కో-ఫౌండర్ గా ఏర్పాటు చేసిన ఆన్-లైన్ స్టోర్ 'అల్మా మాటర్'.ఆ తర్వాత ఆయన , 'హౌ ఐ బ్రేవేడ్ అనూ అంటీ -అండ్ కో-ఫౌన్డెడ్ మిలియన్ డాలర్ కంపెనీ' అనే పుస్తకం రాసారు. అంతే, అది బెస్ట్ సెల్లర్ అయి పోయింది. ఆయన ప్రతిష్ట బహుముఖంగా విస్తరించింది. ఆ ఒక్క పుస్తకంతోనే ఓ వంక 'అల్మా మాటర్' కు ప్రచారం లభించింది, మరో వంక భారత దేశంలోని అనేక కాలేజెస్ లో వరుణ్ ఉపన్యాసాల కోసం బారులు తీరారు. ఇటీవల లెనోవో ఫ్లెక్ష్ ప్రొడక్ట్స్ కు వరుణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అదేదో అలా వచ్చింది, అనే వరుణ్ అంతరంగాన్ని, ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం .

 

వరుణ్ అగర్వాల్, అల్మా మ్యాటర్ కో ఫౌండర్

వరుణ్ అగర్వాల్, అల్మా మ్యాటర్ కో ఫౌండర్


వరుణ్ గత కొద్ది నెలలో 100 కుపైగా కళాశాలల్లో ఔత్సాహిక వ్యాపారం, వ్యాపార వేత్తల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి నెలలో 244 కాలేజీల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందాయి అంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చును. ఇందులో వరుణ్ కు నచ్చిన విషయం ఏంటంటే విద్యార్ధులు ఉద్యోగాల కంటే వ్యాపార,పరిశ్రమల స్థాపన మీదనే, ఎక్కువ మక్కువ చూపున్నారు అంటారు వరుణ్.


అను ఆంటీతో అగర్వాల్

అను ఆంటీతో అగర్వాల్


“అల్మా మాటర్ నిర్వహణ ఒక వైపు, మరో రాత కోతలు దానితో పాటే ఉపన్యాసాలు ఇలా బహుముఖ వ్యాపకాలతో కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే ఉపన్యాసాల విషయంలో కొంచెం ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోంది.. పిలిచిన ప్రతి కాలేజి కి కాకుండా ఎంపిక చేసుకున్న కాలేజీలకు మాత్రమే వెళ్ళ గలుగుతున్నాను, 244 కాలేజీలు ఆహ్వానాలు పంపితే కేవలం 25 కళాశాలలకు వెళ్ళడం మాత్రమే సాధ్యమైంది" అంటారు వరుణ్.

ఐ ఎన్ కె కాన్ఫరెన్స్ ఒక విధంగా టెడ్ ఇండియన్ వెర్షన్ లాంటిది. ఇక్కడ వరుణ్ తాను వ్యాపారవేత్త కావడానికి సమాజాన్ని ఏ విధంగా ఎదిరించిందీ వివరించారు. "ఉపన్యాసానికి కేవలం కొద్ది గంటల ముందే నా PPT పూర్తి చేశానన్న విషయం నాకు గుర్తుంది. ఒక సారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత నేను సహజంగా దాని గురించి ఆలోచించను. దాన్ని యూ ట్యూబ్ లో షేర్ చేస్తాను కనీసం 5000 మంది చూస్తారని నా నమ్మకం. కానీ , దాన్ని నేను చూడక ముందే మిత్రులు షేర్ చేసారు. కేవలం నాలుగు రోజుల్లో 500,000 మంది దాన్ని చూశారు" అంటారు వరుణ్ యు ట్యూబ్ అధికార పేస్ బుక్ పేజి వీడియోను షేర్ చేసిన తర్వాత అయితే చెప్పనే అక్కర లేదు, చూసిన వారి సంఖ్య పరుగులు తీసింది. "దీని వలన నా జీవితంలో పెద్దగా మార్పురాలేదు గానీ, 'అల్మా మాటర్' కు మాత్రం చాలా పెద్ద ఊపు నిచ్చింది" అంటారు వరుణ్.

లెనోవో డీల్ :

లెనోవో ఫ్లెక్ష్ రేంజ్ ప్రొడక్ట్స్ విడుదల చేసిన కొద్ది నెలలకు, కంపెనీ కొత్త ఉత్పత్తులను ప్రమోట్ చేసిన యువ పారిశ్రామిక వేత్త కోసం వేట మొదలు పెట్టింది. "క్రియేటివ్ ఏజెన్సీ ‘22 ఫీట్’ నన్ను సంప్రదించింది. వాళ్ళకు యువ పారిశ్రామికవేత్త కావాలి అంతే కాదు ఆ యువపారిశ్రామికవేత్త ఒకే సారి రెండు జీవితాలు జీవించే వారు అయ్యుండాలిట. ఇంతవరకు నేను చేసింది వారికీ నచ్చింది. దాంతో వారికి వాణిజ్య ప్రకటన చేశాను. ఇలా ఒక పారిశ్రామికవేత్త మరో కంపెనీ ప్రోడక్ట్ ను ఎండార్స్ చేయడం గొప్ప విషయం అనుకుంటాను'

ఈ డీల్ ద్వారా వరుణ్ కు ప్రయోజనం కూడా చేకూరింది. అల్మా మాటర్ పేరు , బ్రాండ్ గురించి ప్రస్తావిచేందుకు లేనోవ్ప్ అంగీకరించింది. దీంతో అలమ మాటర్ కు ప్రచారం లభించింది, వరుణ్.

స్టార్ .. స్టార్ వరుణ్ స్టార్

image


వరుణ్ వయసు జస్ట్ 27 సంవత్సరాలు. ఇంతలోనే అతనికి దేశంలో మరీ ముఖ్యంగా యువతలో ఒక గుర్తింపు, గౌరవం దక్కాయి. ఆయనకు స్టార్ స్టేటస్ వచ్చింది. అదే అంటే అయన నవ్వేస్తారు. "నా కంటే ఎంతో విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలు చాలా మందే ఉన్నారు. నిజానికి ఈ గౌరవం వారికే దక్కాలి. కానీ నేను చేసిన పనుల గురించి ఎక్కువ మాట్లాడతాను కాబట్టి నేను అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాను’’ అంటూ వరుణ్ చెప్పారు. నేను దీనికి అర్హుడిని కాదు. నాకు అది తెలుసు అయినా ఇదొక గొప్ప అనుభూతి. కొంత కాలం క్రితం ఐ ఐ టీ ఖరగ్ పూర్ లో ఉపన్యాసం ఇచ్చినప్పుడు 4000 మంది స్టూడెంట్స్ నా ఆటోగ్రాఫ్ కోసం, నాతో ఫోటో కోసం ఎగబడ్డారు. అక్కడే కాదు నేను ఎక్కడికి వెళితే అక్కడల్లా ఇదే పరిస్థితి. ఏదో ఒక రోజు ఇలాంటిది జరుగుతుందని తెలుసు అయినా నిజంగా జరిగినప్పుడు కలిగే ఆనందం మాత్రమే కాదు బాధ్యత కూడా పెరుగుతుంది. ఇంకా విలువైన పనులు చేస్తే ఇంకా గౌరవం, విలువ పెరుగుతాయనే ఆలోచన ముందుకు నడిపిస్తుంది. ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది " అంటారు వరుణ్.