మీకు ఫేస్‌బుక్‌లో పేజీ ఉందా..? అయితే సిటోఫీ సాయంతో దాన్ని వెబ్‌సైట్‌గా మార్చేయండి..!

0

సాధారణంగా వెబ్ సైట్ కావాలంటే మనం ఏం చేస్తాం..? డెవలపర్ ని కన్సల్ట్ అవుతాం. లేదంటే గూగుల్ లేదా వర్డ్ ప్రెస్ ను ఉపయోగించుకొని మనకున్న నాలెడ్జితో తయారు చేస్తాం. కానీ ఫోటోలు అప్ లోడ్ చేయడం, కంటెంట్ రాయడం లాంటివి చేయాలంటే ఇబ్బందే. అదే ఫేస్ బుక్ పేజీలో అయితే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పోస్టులు పెట్టేస్తాం. అందరికీ కనెక్ట్ అయిపోతాం. చాలా మంది అలా ఫేస్ బుక్ పేజీనే వెబ్ సైట్ లా వాడుకుంటున్నారు. అలా కాకుండా ఫేస్‌బుక్ పేజీనే వెబ్‌సైట్‌గా మార్చాలంటే ఎలా? ఇలాంటి ఆలోచనే హైదరాబాద్ కుర్రాళ్లకొచ్చింది.

“ఫేస్ బుక్ పేజీ యూఆర్ఎల్ ని సిటోఫీ సైట్ లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వెబ్ సైట్ గా మారిపోతుంది,” మీరజ్ ఫహీం

ఎవరైనా ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని సిటోఫీ కో ఫౌండర్ అయిన మీరజ్ అంటున్నారు. కిందటేడాది జనవరిలో ప్రారంభమైన ఈ సైట్ ఇప్పటి వరకూ పదిహేను వందల వెబ్ సైట్ లను డిజైన్ చేసిందని తెలిపారు.

సిటోఫి పనితీరు

వెబ్ సైట్ డిజైనింగ్ కోసం ప్రత్యేకంగ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ కోడ్ ని ఆటోమేటిగ్ గా జనరేట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎవరైనా ఈ టెక్నాలజీ తో వెబ్ సైట్ ను డిజైన్ చేసుకున్నట్లైతే , వారు తిరిగి వెబ్ సైట్ కు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటిలాగే ఫేస్ బుక్ లో వారి పోస్టులను పెడుతుంటే అది ఆటోమేటిక్ గా వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తుంది.

“మా టూల్ ఉపయోగించిన కస్టమర్ల ప్రమోషన్ తోనే మేం ఈస్థాయికి వచ్చాం,” చంద్రకాంత్, కో ఫౌండర్

ఇప్పటి వరకు సిటోఫీ ని చూసిన వారి సంఖ్య 12,500. యాక్టివ్ యూజర్ల సంఖ్య 1,300, హ్యాపీ క్లయింట్స్ వేయి మంది దాకా ఉన్నారు.

సిటోఫి టీం

మీరజ్ ఫాహీం దీన్ని ప్రారంభించడానికి ముందు మరో రెండు స్టార్టప్ లను ప్రారంభించారు. ఇది మూడో స్టార్టప్. చెన్నైలో హ్యాకింగ్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు తట్టిన ఐడియా ఇది. చంద్రకాంత్ సిటోఫీకి మరో కో ఫౌండర్. అతడికి ఎమ్మెన్సీ కంపెనీలో ప్రాడక్ట్ డెవలపర్ గా పనిచేసిన అనుభవం ఉంది. సయద్ అలీం దీనికి డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. మొబషీర్, అలీమ్ లు టీంలో మెంబర్లుగా ఉన్నారు.

మార్కెట్ వాల్యూమ్

వెబ్ సైట్ మార్కెట్ కు భారత్ లో బాగా డిమాండ్ ఉంది. మోడీ స్టార్టప్ ఇనిషియేషన్ తో దేశం మొత్తం స్టాండప్ ఇండియా , స్టార్టప్ ఇండియా అంటోంది. దీంతో మొదలైన ప్రతి స్టార్టప్ కు వెబ్ సైట్ అవసరం ఉంది. ఆ రకంగా చూసినా బిలియన్ మార్కెట్ స్కోప్ ఉంది. దీన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే ఈ తరహా స్టార్టప్ కి మంచి భవిష్యత్ ఉంటుందనడంలో సందేహం లేదు.

సవాళ్లు, పోటీ దారులు

ఫేస్ బుక్ నుంచి వెబ్ సైట్ తయారు చేయడమే వీరికి పెద్ద సవాల్. అయితే ఈ వెబ్ సైట్ కు డొమైన్ ను వెతకడం అనుకున్నంత ఈజీ కాదు. ఫేస్ బుక్ పేరుతో డొమైన్ దొరక్కపోతే ఎంత కష్టపడ్డా లాభం లేదు . భారత్ లో ప్రస్తుతానికి పోటీ దారులెవరూ లేకపోయినా భవిష్యత్ లో ఈ డొమైన్ లో పోటీ ఎక్కువగా ఉండొచ్చు.

భవిష్యత్ ప్రణాళికలు

  1. ఆన్ లైన్ లో ఉన్న వాటితో పాటు ఆఫ్ లైన్ ఉన్న వారు కూడా టార్గెట్.  
  2. వాళ్లకు అవేర్ నెస్ కల్పించడానికి ఈవెంట్స్ చేయాలని ప్రణాళిక.
  3. పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన సిటోఫీ ఫండింగ్ వస్తే యాప్ మోడ్ లోకి రావాలని యోచిస్తోంది.
  4. భారత్ తోపాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ప్రస్తుతానికి వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. 

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik