తన స్టార్టప్ కోసం ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాన్నీ వదిలేసుకున్న అంకిత్ ఖాత్రి

మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అయిన ఖగోళ శాస్త్రవేత్తఇస్రోలో లక్షలరూపాయల ఉద్యోగానికి బై చెప్పేసిన అంకిత్ ఖాత్రివరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో మొబైల్ అప్లికేషన్స్నోయిడాలో మై కోడ్ మొబైల్ స్టార్టప్  మైకోడ్ మొబైల్ క్లయింట్లుగా బెంజ్,శాంసంగ్, హగ్గీస్ఏదైనా కొత్తగా చేయడంలోనే మన టాలెంట్ ఉందంటున్న అంకిత్ ఖాత్రి

తన స్టార్టప్ కోసం ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాన్నీ వదిలేసుకున్న అంకిత్ ఖాత్రి

Wednesday June 17, 2015,

3 min Read

కొంతమందికి కొన్ని ఇష్టం..మరి కొందరికి అవే కష్టం కావచ్చు. ఉదాహరణకు మేథ్స్ ..ఈ సబ్జక్టంటే ఆషామాషీ కాదు అందులోనూ బాల్యంలో లెక్కలంటే నానాకుస్తీలు పడాల్సి వచ్చేది. అందరూ అలా తంటాలు పడే వయస్సులోనే అంకిత్ ఖాత్రి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయస్సుకే ఓ ప్రోగ్రామ్ రాశాడు కూడా. ఇక కాలేజీ దశలో టెక్నో ఫెస్టివల్స్ కండక్ట్ చేసేవాడు. ఇప్పుడు ఇవి ఏ కాలేజ్‌లో అయినా జరుగుతున్నాయ్ కానీ అతనెప్పుడో వాటిని తన డిగ్రీదశలోనే నిర్వహించాడు. అలానే ఓ వెబ్‌సైట్ కూడా రూపకల్పన చేశాడు. అన్నీ అంత చిన్నవయస్సులో చేశాడు కాబట్టే..ఇస్రోలో సైంటిస్ట్‌గా సెలక్టయ్యాడు. స్పేస్ సైంటిస్టుగా కెరీర్ బిగిన్ చేశాడు. ఐతే అతనిలోని క్రియేటర్ అంత గొప్ప ఉద్యోగాన్ని వదులుకోమంటూ నిరంతరం పోరాడేవాడు. చివరికి ఆ ఉద్యోగం వదిలేశాడు..వదిలి..ఏం చేశాడు..మీరే చూడండి.

అంకిత్ ఖాత్రి, కోడ్ మై మొబైల్ వ్యవస్థాపకులు

అంకిత్ ఖాత్రి, కోడ్ మై మొబైల్ వ్యవస్థాపకులు


2013లో కోడ్ మై మొబైల్ అనే మొబిలిటీ సొల్యూషన్స్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. అది ప్రారంభించిన 9 నెలల్లోనే మొబిలిటీ సొల్యూషన్స్ రంగంలోని టాప్ 20 లిస్ట్‌లో ఒకటిగా మారింది. అత్యంత చిన్నవయస్సులో ఆంట్రప్రెన్యూర్ చేసిన ఆ స్టార్టప్.. ఇండియా నుంచి ఎంపికైన ఏకైక ప్రారంభ సంస్థ కావడం మరో విశేషం.

కోడ్ మైమొబైల్..కోర్ ఐడియా

సరికొత్త మొబిలిటీ సొల్యూషన్స్‌ను డెవలప్ చేయడం కోడ్ మై మొబైల్ ప్రత్యేకత. వ్యాపారాలు సమర్ధవంతంగా నిర్వహించుకునేందుకు అందుబాటులో ఉన్న వనరులను, ఫీచర్స్‌ను ..భద్రతాపరంగా NSIT 800-124 స్టాండర్డ్స్‌ను కొనసాగిస్తూ సేవలు అందించడమే కోడ్ మై మొబైల్ ప్రత్యేకత.

కోడ్ మై మొబైల్ మూడు ప్రధానమైన డిఫరెన్షియేటర్లను దృష్టిలో పెట్టుకుని పని చేస్తుంది.

1. యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్స్‌ను అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేజ్ (API) లో వాడటం ద్వారా కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసే సమయాన్ని 300శాతం వరకూ తగ్గించవచ్చు.

2. ఏ రకమైన మొబైల్‌లో అయినా వాడుకోవడానికి వీలుగా, ఏ ఫ్లాట్‌ఫామ్ పైనైనా వాడటానికి అనువుగా ఉండే మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను కనుక వాడితే అది కూడా NSIT800-124 స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే తయారీ ఖర్చు తగ్గుతుంది.

3. అలానే కన్సల్టింగ్ లెడ్ మెథడాలజీ ద్వారా అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించి కంపెనీ అభివృద్ధికి ఏది అవసరమో..కాదో గ్రహిస్తారు.

image


కోడ్ మైమొబైల్ ప్రొడక్ట్స్‌లో ఆపిల్ ఫోన్, శాంసంగ్‌లో వాడే మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్ , సర్వర్ యూజర్ ఇంటర్‌ఫేస్, అనలిటికల్ మాడ్యూల్స్ , కార్ డేటా బేస్, ఓపెన్ ఎక్స్ సీ యాప్ లైబ్రరీ (ఓపెన్ ఎక్స్ సీ -అంటే అమెరికాలో ప్రతీ కార్ కూ ఓ పర్టిక్యులర్ ఏక్సెస్ కోడ్ ఉంటుంది. దానితో అదే రకానికి చెందిన మిగిలిన వాటితో కనెక్ట్ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది). కాలేజ్ గోయర్ల కోసం రియల్ టైమ్ క్విజ్ యాప్స్, యాహూ సైట్ ఫైనాన్స్ ఇంటిగ్రేషన్ స్క్రిప్ట్స్ , ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో ఇమేజ్ ఎడిటింగ్ లైబ్రరీ ఉన్నాయ్.

"మొబిలిటీ యాప్స్‌లో ఇంటిగ్రేషన్, డెవలప్‌మెంట్‌కు పట్టే సమయాన్ని ఇవన్నీ గణనీయంగా తగ్గిస్తాయి" అంటూ తమ ప్రొడక్ట్ గురించి చెప్తూ వివరించాడు అంకిత్ ఖాత్రి. కోడ్ మై మొబైల్... కంపెనీల్లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సేవలను కూడా అందిస్తుంది.

క్లయింట్ల లిస్ట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే !

ఈ సంస్థ క్లయింట్ల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. " మెర్సిడెజ్ బెంజ్, ఫోర్డ్, ప్రాడా, శాంసంగ్, హగ్గీస్ మా క్లయింట్లు. వీరంతా మా సర్వీస్ తీసుకున్న తర్వాత వారి వారి బిజినెస్‌లో మంచి రెస్పాన్స్ గమనించారు. పాతకాలం నాటి పద్దతుల్లో కస్టమర్లను, భాగస్వాములను, ఉద్యోగులతో కమ్యూనికేట్ చేసేదానికీ, మేం ఇచ్చిన ప్రొడక్ట్‌తో మార్పునీ ఈ కంపెనీలన్నీ బాగా గ్రహించాయి'' అంటారు అంకిత్.

నోయిడాలోని హెడ్ క్వార్టర్స్ కాకుండా కోడ్ మై మొబైల్‌కు న్యూయార్క్ లో కూడా ఓ ఆఫీస్ ఉంది. ఇప్పటికే కోడ్ మై మొబైల్ స్టార్టప్‌కి ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.3 కోట్లు) పెట్టుబడిని ఆకర్షించింది. టీమ్ విషయానికి వస్తే అనుభవంతో కూడిన 20మంది డెవలపర్లు, డిజైనర్లు, మార్కెటింగ్ స్పెషలిస్టులున్నారు.

ప్రస్తుతానికి ఈ ఇరవైమంది తమ ప్రొడక్ట్‌తో పాటు API లైబ్రరీని మరింత ముందుకు తీసుకెళ్లో పనిలో ఉన్నారు. బిజినెస్ లీడర్లకు ఐటీ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా, సాఫ్ట్‌వేర్ ఫ్లెక్లిబుల్‌గా ఉండేలా తీర్చిదిద్దడమే మా లక్ష్యమంటాడు అంకిత్ ఖాత్రి.

ఇస్రో ఉద్యోగం వదలడం అంత ఈజీ కాదు

ఇస్రోలో ఉద్యోగం వదిలేయడానికి మానసికంగా అంకిత్ ఖాత్రి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అతని కుటుంబ సభ్యుల్లో ఆ స్థాయికి ఎదిగింది అంకిత్ ఒక్కడే. అతనిపైనే కుటంబ జీవనం ఆధారపడి ఉంది. ఆ స్థితిలో ఉద్యోగం వదిలేయడం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన సడన్‌గా తీసుకున్న నిర్ణయం కూడా కాదు. ఇస్రోలోని బ్యూరోక్రసీ కూడా అంకిత్ ఖాత్రిని ఆ జాబ్ వదిలేలా చేశాయట.

అంకిత్, స్వాతి, అమన్ - మై కోడ్ మొబైల్ టీమ్ సభ్యులు

అంకిత్, స్వాతి, అమన్ - మై కోడ్ మొబైల్ టీమ్ సభ్యులు


అంకిత్ జర్నీ గురించి తెలిసిన వాళ్ల టీమ్‌మేట్ స్వాతి బగారియా మాట్లాడుతూ " చాలీ చాలని డబ్బుతోనే అంకిత్ తన లక్ష్యాన్ని ప్రారంభించాడు. ఇది తెలిసిన చాలామంది అతన్ని గేలి చేసేవారు. ఐతే అతని సంకల్పం, ఆత్మవిశ్వాసంతోనే వాటన్నిటినీ తట్టుకునేవాడు. తన చుట్టూ అనూహ్యంగా వచ్చే మార్పులను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా... తనపై ఉన్ననమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోలేదు" అని చెప్తారు.

అంకిత్ జర్నీని చూస్తే ఒకటి అర్ధం అవుతుంది. ఏదైనా కొత్తది కనిపెట్టడంలోనే బలముందని..అదే మన టాలెంట్‌ను బయటి ప్రపంచానికి తెలియజేస్తుంది.

ఈ ధైర్యవంతుడి సాహసోపేతమైన నిర్ణయంపై మీరేమంటారు ? మీ కామెంట్స్‌ను తెలియజేయండి