కూతురి పేరు పాపులర్ చేయాలనే తపన నుంచి పుట్టిన ఓ ఫ్యాషన్ స్టార్టప్


కూతురి పేరు పాపులర్ చేయాలనే తపన నుంచి పుట్టిన ఓ ఫ్యాషన్ స్టార్టప్

Sunday August 30, 2015,

3 min Read

తన బిడ్డ పేరు ప్రఖ్యాతలు విశ్వ విఖ్యాతం కావాలన్న కోరికతో రగిలిపోయే తల్లిని గురించి ఎప్పుడైనా విన్నారా.? అందుకోసం కొత్తగా ఓ సంస్థనే మొదలు పెట్టిన వ్యక్తి గురించి తెలుసా..?వేదికా భాటియా ఆ పని చేసి చూపించింది. తన బిడ్డ 'వన్య' పేరుతో మహిళల కోసం ఓ ఆన్ లైన్ వస్త్రప్రపంచాన్నే సృష్టించింది.

"వన్య పుట్టిన తరువాత తన కోసం షాపింగ్ చెయ్యడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మేం షాపింగ్ షెడ్యూళ్లన్నీ తన నిద్రకే అంకితమైపోయేవి. ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. నాలాగే ఇబ్బంది పడే వాళ్ల కోసమే నేను నా ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచాన్ని సృష్టించాను. ఇది నా మరో అవతారం! "

అయితే దీని ఈ విషయంలో అటు తన తండ్రి నుంచి, భర్త నుంచి తిట్లు, దీవెనలు రెండూ అందుకున్నారు వేదిక.

వన్యతో వేదిక

వన్యతో వేదిక


వేదికకు ఇదో మొదటి వెంచరేం కాదు. మొదట్లో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో తన కెరీర్ ప్రారంభించారు. ఏదో ఒకటి సొంతంగా చెయ్యాలన్న బలమైన కోరిక అప్పట్లో ఆమెలో ఉండేది. అందుకే 2005లో బైనరీ కన్సల్టెంట్స్ పేరుతో ముంబైలో ఓ సంస్థను స్థాపించారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మూడేళ్లకే అది మూతపడింది. ఆ తరువాత గ్లోబల్ ప్రోక్యూర్, డిరక్టీ వంటి రిక్రూట్‌మెంట్ సంస్థల్లో పని చేశారు. అదే సమయంలో ముంబై లోని నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబిఏను పూర్తి చేశారు. 

స్వతహగా ఢిల్లీకి చెందిన వేదిక ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత పబ్లిక్ రిలేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యూషన్ పూర్తి చేసి 2002లో పెళ్లైన తరువాత ముంబై వెళ్లిపోయారు. 2012లో భర్త ఉద్యోగ రీత్యా బెంగళూరుకు మారాల్సి వచ్చింది.

వేదిక ఎలా తన మలి ప్రయాణాన్ని ప్రారంభించారు..? ఆ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి.. హెర్ స్టోరీ ఆమెతో పంచుకున్నారు.

ఎన్నో ప్రశ్నలు

''మార్కెట్లో ఆమె లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారన్న సంగతిని తాను కూడా ఒప్పుకుంటానంటారు, కానీ అన్ని చోట్లా ఎక్స్ క్లూజివ్ వస్తువులుండవు. అలాంటి వాటిని మనం మార్కెట్ కన్నా తక్కువ ధరకి అమ్మినప్పుడు కచ్చితంగా మంచి వ్యాపారం జరుగుతుంది" అంటారు వేదిక.

ఆమె అభిప్రాయం ప్రకారం ముందు కొద్ది మంది కస్టమర్లను సంపాదించగలిగితే ఆ తరువాత అంతా సెట్ అయిపోతుంది. "మొట్ట మొదటి కస్టమర్‌ను సంపాదించడం చాలా కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. అందుకోసం తక్కువ ధరలుండే వస్తువులను మొదట్లో అమ్మడం మంచిది. తద్వారా కస్టమర్ల విశ్వాసం సంపాదించవచ్చు. ఆ పై నెమ్మది నెమ్మదిగా అధిక ధరలుండే వస్తువులను అమ్మవచ్చు.

నా వ్యాపారం మొత్తం కస్టమర్ల నమ్మకంతోనే నిర్మించాను. "నా భర్త నా గురించి నా ప్రొఫెషన్ గురించి అందరికీ చెబుతూ ఉండేవారు. సో.. మొదట్లో నా రూం కి వాళ్లు కొత్తగా వచ్చినట్లు అనిపించినా.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం స్నేహితులుగా మారిపోతారు." అంటారు వేదిక...

ఇతరులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వేదికకు వెన్నతో పెట్టిన విద్య. మాటలాడటం, వ్యక్తులను కలవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. " నేను కేవలం వ్యాపారం కోసమే ఇతరులతో సంబంధాల్ని పెంచుకోను. అంతకన్నా ఎక్కువ ఇంకేదో ఉందన్న నమ్మకం వాళ్లలో కల్గిస్తాను.." అంటారు వేదిక.వేదిక ఎంచుకున్న రంగంలో ఆ విధానం కచ్చితంగా ఫలితాన్నిస్తుంది.

image


ఎంచుకున్న రంగంలో సవాళ్లు

ఆన్ లైన్ క్లాత్ రిటైల్ మార్కెట్లో కస్టమర్లలో నమ్మకాన్ని, సత్సంబంధాల్ని పెంచుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. " నేను వ్యాపారం ప్రారంభించిన మొట్టమొదటి వారంలో ప్రొడక్ట్స్‌ను అప్‌లోడ్ చేసిన తరువాత ఫస్ట్ ఎంక్వైరీ కోసం గోళ్లు గిల్లుకుంటూ ఎదురు చూసే వాళ్లం. " ఈ మాటలు తొలి రోజుల్లో వేదిక ఎదుర్కొన్న పరిస్థితి నిదర్శనం.

మహిళల ఫ్యాషన్ , కొత్త కొత్త డిజైన్లు, ఎక్స్ క్లూజివిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడదు వన్య. ఇక ఈ రంగంలో ఎదుర్కొనే మరో సమస్య... కస్టమర్లు ఎంచుకునే వస్త్రాలు వాళ్లకు ఫిట్ కావడం. "కానీ రాను రాను నెలలు గడిచే కొద్ది ఈ విషయంలో సైజుల విషయంలో కస్టమర్లలో విశ్వాసాన్ని కలిగించాను ". అలాగని అదేం స్కేలు పట్టుకొని కొలవడం కాదంటారు వేదిక.

ప్రతి వస్తువూ అమ్మిన తరువాత కొనుగోలు చేసి వాళ్ల నుంచి మెటిరీయల్ విషయంలోనూ, ఫిట్టింగ్ , డెలివరీ విషయాల్లో వారి ఫీడ్ బ్యాక్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవారు.

ఇక వేదిక ఎదుర్కొన్న మరో పెద్ద ఇబ్బంది... డబ్బులు వసూలు చేసుకోవడం. చాలా అమ్మకాల విషయంలో కస్టమర్లు డిజైన్లను నచ్చినప్పటికీ ఆన్ లైన్లో డబ్బులు చెల్లించేటప్పుడు NEFT, లేదా క్యాష్ డిపాజిట్ చెయ్యడం వంటి విధానాల్లో ఎదురయ్యే సాంకేతిక పరమైన సమస్యలకు భయపడేవారు. దీంతో క్యాష్ చెల్లింపుల్ని చాలా సులభతరం చెయ్యడానికి సర్వీస్ ప్రొవైడర్ సాయంతో క్రెడిట్ కార్డు చెల్లింపులకు ప్రవేశపెట్టింది. " అయితే ఇది కొంత కొంత సాయం చేసినా మేజర్ పేమెంట్ విషయంలో మాత్రం ఇంకా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. " అంటారు వేదిక.

image


సోషల్ మీడియా అండ్ మార్కెట్స్

వేదిక వాట్స్ అప్, ఫేస్ బుక్ రెండింటిని ఉపయోగిస్తారు. కొన్నాళ్ల తర్వాత తన వెంచర్ కు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ మొదలయ్యింది. త్వరలోనే ఆమె వెబ్ సైట్ కూడ ప్రారంభించనుంది. ఆమె భర్త కూడా దాన్ని సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. ప్రస్తుతం వేదిక తనకు తెలిసిన వాళ్లకు తన ప్రోడక్టు వివరాలకు, ప్రోడక్ట్ ప్రమోషన్ కు ఈ మెయిల్ పైనే ఆధారపడుతున్నారు.

ప్రస్తుతం వేదికకు తన ఫ్యామెలి నుంచి మంచి మద్దతు లభిస్తోంది. వాళ్లే ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యానికి మూలస్థంభాలు. తన హ్యాపీ కస్టమర్లెప్పుడూ తనకు స్ఫూర్తి కలిగిస్తూ ఉంటారు. వన్య క్రియేషన్స్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మరాలన్న ఆమె కుటుంబసభ్యుల మాటలు ఎప్పుడూ ఆమె గుర్తు చేసుకుంటూనే ఉంటారు.