ఇండియాలో బ్రాండ్ బజాయించిన క్రియేటర్

 
ఇండియాలో బ్రాండ్ బజాయించిన క్రియేటర్

Monday December 28, 2015,

2 min Read

అలిక్ పదమ్సీ అంటే టక్కున గుర్తు పట్టక పోయినా ఫర్వాలేదంటారు ఈ పద్మశ్రీ. లిరిల్ సబ్బు ప్రకటన్ని మీరు గుర్తు పడితే చాలు. ఎంఆర్ఎఫ్ టైర్, సర్ఫ్ లాంటి బ్రాండ్ లు మనకు తెలిశాయంటే అది పదమ్సీ క్రియేటివిటీయే. సగటు భారతీయుడి పల్స్ తెలిసిన యాడ్ మేకర్ ఈయన. వందకు పైగా బ్రాండ్ లను క్రియేట్ చేసిన పదమ్సీ కి ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది.

“ఎప్పటికప్పుడు కొత్త తరం వ్యక్తులతో కలవడమే నా సక్సస్ కు కారణం” అలీక్

హైదరాబాద్ లోని వోక్సెన్ బి స్కూల్ లో విద్యార్థులతో ఇంట్రాక్షన్ సెషన్ లో పాల్గొన్న అలీక్ తన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి చెప్పారు. కొత్త తరం అంటే కొత్త ఆలోచనలు. అడ్వర్టైసింగ్ ఇండస్ట్రీలో రాణించాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలన తెలుసుకోవడమే కాదు, కొత్త ఆలోచనల్ని విశ్లేషిస్తూ ఉండాలి. అయితే ఇది ఏ ఒక్క ఇండస్ట్రీకి పరిమితం కాదు. ఇన్నోవేషన్, కొత్తదనం అన్నది అన్ని ఇండస్ట్రీల్లో రావాలి. అలా కొత్త దనంతో ముందుకు పోతుంటేనే మనం పదికాలాలపాటు ఉండగలమన్నారు.

image


నాయకుడికి ఉండాల్సిన ఆ ఏడు లక్షణాలు

పుట్టుకతో ఎవరూ లీడర్లు కాలేదని అలీక్ అంటన్నారు. నాయకుడిగా ఎదగడానికి ఏఏ అంశాలు దోహదం చేస్తాయో వివరించారు.

“పుట్టగానే నాయకుడు కాలేదు. ఎదురైన పరిస్థితులే లీడర్ని తయరు చేస్తాయి,” అలీక్

ఈవిషయాన్ని గట్టిగా నమ్ముతారట అలీక్. ఓ సాధారణ వ్యక్తి నాయకుడుగా మారడానికి ఏడు అంశాలు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు.

  1. విజన్, లీడ్ కు ప్రధానంగా ఉండాల్సింది ఇది. ఇప్పుడేం చేస్తున్నావనే విషయంతో దాని భవిష్యత్ ఏంటో తెలియాలంటారాయన.
  2. చరిష్మా కలిగి ఉండాలి. అది కూడా సాదా సీదాగా కాదు . ఓటమిని ఎదుర్కోడానికి ఇది సహకరిస్తుందన్నారు.
  3. గుండెధైర్యం ఉండాలి. పరిస్థితులు ఎంత విచిత్రంగా ఉంటాయనేది అవి ఫేస్ చేస్తే గానీ తెలీదు. అన్ని సందర్భాలను ఎదుర్కోడానికి గుండె ధైర్యం ఉండాలన్నారు.
  4. ఎంఫథైజ్ చేసే సామర్థ్యం. దేన్నైనా సరే నిర్వర్తించగల సామర్థ్యం ఉండాలంటారు. లీడర్ అంటే దేనికైనా సిద్ధపడాలనేది ఆయన అభిప్రాయం.
  5. సామర్థవంతమైన డెలిగేషన్. ఇది లీడర్ కు ఉండాల్సిన గుణాల్లో చెప్పుకోదగినది. లీడర్ అంటే ఆ సొసైటీకి, ఆ సంస్థకు ముఖచిత్రం అన్నమాట. తాను చేసే డెలిగేషన్ పైనే మొత్తం సంస్థ ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
  6. అభిప్రాయం అందించడం. సాధారణంగా ఎవరెలాంటి అభిప్రాయం చెప్పినా అది నచ్చినా, నచ్చకపోయినా దానిపై తన అభిప్రాయం అందించే వాడే సరైన లీడర్ గా ఎదుగుతాడని అంటున్నారు. మొహమాటానికి పోయి ఏమీ చెప్పకుండా ఉంటే జీవితంలో ఎదగలేమంటున్నారాయన.
  7. చైతన్యవంతంగా ఉండటం. జనాన్ని చైతన్య పరచాలంటే ముందు తాను చైతన్యవంతంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ, అందరినీ చేస్తూ ఉన్నప్పుడు తాను గొప్ప లీడర్ కాగటడని అంటున్నారు అలీక్.

విద్యార్థుల స్పందన

కొత్తగా ప్రారంభమైన వోక్సెన్ బిజినెస్ స్కూల్ సొంత ఇంక్యుబేసిన్ ను చేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో విద్యార్థులకు ఇంట్రాక్షన్ సెషన్ లను ఏర్పాటు చేస్తోంది. లీడర్‌ షిప్, ది డైనమిక్ ఫర్ గ్రోత్ అనే అంశంపై మాట్లాడటానికి అలీక్ అతిధిగా విచ్చేశారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పారు. అలీక్ లాంటి వ్యక్తిని కలవడం ఓ మరపు రాని సంఘటనగా విద్యార్థులు అన్నారు. బ్రాండ్ క్రియేషన్ పై ఆయన చేసిన విశ్లేషణ, హార్డ్ వర్క్ చాలా విశేషమైందన్నారు.

image


అలీక్ పదమ్సీ గురించి క్లుప్తంగా

అలీక్ పదమ్సీ లింటాస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ హెడ్ గా వ్యవహరించారు. భారత్ లో 100కు పైగా బ్రాండ్ లను క్రియేట్ చేశారు. పదమ్సీని భారతీయ యాడ్ గాడ్ అంటారు. నాటక రంగంలో కూడా పనిచేసిన పదమ్సీ కొన్ని గొప్ప గొప్ప పాత్రలను ప్రాణం పోశారు. ‘గాంధీ’ సినిమాలో మహమ్మద్ ఆలీ జిన్నా పాత్రను పోషించిన పదమ్సీ తన కంటూ సినిమా రంగంలో కొన్ని పేజీలు రాసుకున్నారు.