ఆన్ లైన్ లో వరల్డ్ ఫేమస్ గుజరాతీ స్నాక్స్

ఆన్ లైన్ లో వరల్డ్ ఫేమస్ గుజరాతీ స్నాక్స్

Wednesday February 03, 2016,

3 min Read

ఒక్కో ప్రాంతం ఒక్కో ఆహార పదార్థానికి ఫేమస్. ఆగ్రా పేటా, హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు... ఇలా ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఆహారపదార్థాలు ఫేమస్. అలాగే గుజరాతీ స్నాక్స్ కీ ఓ గుర్తింపు ఉంది. అయితే జీవనోపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డవాళ్లు మాత్రం సొంతూరి వంటలకు దూరమవ్వాల్సిందే. ఇక ఇలాంటి చింతలేదు. గుజరాతీ చిరుతిళ్లు, పిండివంటల్ని ఆన్ లైన్ లో అందిస్తోంది FarsanKart.com. గుజరాతీ స్నాక్స్ ని ప్రపంచం నలుమూలల ఉన్న ఫుడ్ లవర్స్ కు పంచుతోంది.

ఆన్ లైన్ లో పిండివంటలు

దర్శన్ ధృవ్ బుర్రలో పుట్టిన ఆలోచనే ఫర్సాన్ కార్ట్. గుజరాత్ పిండివంటల్ని ఆన్ లైన్ లో అమ్మే స్టార్టప్ ఇది. మీఠీ ఖారీ నుంచి భకర్వాడీ వరకు... ఇంకా చాలా నోరూరించే ఈ చిరుతిళ్లను మీరు FarsanKart.com ద్వారా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వడోదరకు చెందిన దర్శన్ సొంతూళ్లోనే ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలున్న వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఫీజులు, పాకెట్ మనీ కోసం డీజేగా పనిచేశాడు. తర్వాత మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లాడు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశాడు. ఇండియాకు వెళ్లి సొంతగా ఏదైనా చేయాలని సంకల్పించాడు. అప్పటికే దర్శన్ కుటుంబం ప్యాకేజింగ్ బిజినెస్ లో ఉండటం అతడికి కలిసొచ్చింది.

image


2012 నవంబర్ లో ఫర్సాన్ కార్ట్ ప్రారంభించాడు దర్శన్. స్వతహాగా భోజన ప్రియుడైన దర్శన్... ఆహారానికి సంబంధించిన వ్యాపారంలోనే అడుగుపెట్టాలని అనుకున్నాడు. నాణ్యమైన గుజరాతీ చిరుతిళ్లను వ్యాపారమార్గంగా ఎంచుకుంటే సక్సెస్ సాధిస్తానని నమ్మాడు. ప్యాకేజింగ్ లో తనకున్న జ్ఞానాన్ని ఇందుకోసం ఉపయోగించుకున్నాడు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు తీసుకున్నాడు. ఫైనల్ గా ఫర్సాన్ కార్ట్ ప్రారంభమైంది. వడోదరలోని ప్రముఖ ఫర్సాన్ స్టోర్ల నుంచి నాణ్యత గల ఆహారపదార్థాల నుంచి సేకరించి కస్టమర్లకు సరఫరా చేయడమే ఫర్సాన్ కార్ట్ పని. వీరి కస్టమర్లలో ప్రధానంగా భారతదేశంలో పలు చోట్ల నివసిస్తున్న గుజరాతీలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.

ఈ స్టోరీ కూడా చదవండి

బ్రాండ్ బాజా

బ్రాండ్ పేరు ఎంపిక చేయడం కోసం చాలా కసరత్తు చేశాడు దర్శన్. డొమైన్ పేరు .com ఎంపిక చేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. ఎందుకంటే తన ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా తాను ఏమి అందించాలనుకుంటున్నది పేరులోనే తెలిసుండాలన్నది దర్శన్ ఆలోచన. ఫర్సాన్ అనేది గుజరాతీయులకు బాగా తెలిసిన పదం. ఇక ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ ఫేవరెట్ అయిన 'కార్ట్'ని పేరులో జోడించాడు. ఇక .com డొమైన్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎవరికైనా సులువుగా తడుతుంది. అలా www.farsankart.com మొదలైంది. అయితే ఏ ఆన్ లైన్ షాపింగ్ కైనా విశ్వసనీయత ముఖ్యం.

"అంతర్జాతీయ మార్కెట్ లోకి విస్తరించడానికి నా వెబ్ సైట్ కి .com డొమైన్ ఎక్స్ టెన్షన్ సరైనదని నేను బలంగా నమ్మాను. ఫర్సాన్ కార్ట్ పేరును కూడా అలాంటి ఆలోచనతోనే ఎంపిక చేశాను. దేశీయమైన పేరు పెట్టడం ద్వారా ఎవరైనా సులభంగా గుర్తుచేసుకోగలరు" అంటారు దర్శన్.
దర్శన్ ధృవ్, ఫర్సాన్ కార్ట్ ఫౌండర్

దర్శన్ ధృవ్, ఫర్సాన్ కార్ట్ ఫౌండర్


లోకల్ టు గ్లోబల్

ఇక తర్వాత అడుగు ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం. అందుకే... www.global.farsankart.com పేరుతో ఇంటర్నేషనల్ పోర్టల్ రూపొందించాడు. ఇందులో యూఎస్ డాలర్ల ధరల పట్టిక ఉంటుంది. వేర్వేరు దేశాలకు షిప్పింగ్ ధరలుంటాయి. ప్రస్తుతం ఫర్సాన్ కార్ట్ 22 దేశాలకు ఉత్పత్తుల్ని సరఫరా చేస్తోంది. అమెరికా, కెనెడా, బ్రిటన్, దుబాయి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పాపులర్. విదేశాలకు నాలుగు రోజుల్లో, భారతదేశంలో రెండుమూడు రోజుల్లో డెలివరీ చేస్తున్నారు. కేవలం కస్టమర్లకు మాత్రమే సప్లై చేయాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప తిరిగి అమ్మే రీటైలర్లకు వీటిని సరఫరా చేయరు.

"గుజరాతీ పిండివంటలు, చిరుతిళ్లు అమ్మే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ గా ఫర్సాన్ కార్ట్ పేరు తెచ్చుకోవాలన్నది నా కల. మా వెబ్ సైట్ ను ప్రతీ రోజూ 600-700 మంది సందర్శిస్తున్నారు. గత రెండేళ్లుగా ఫర్సాన్ కార్ట్ కు ఐదువేల మంది కస్టమర్లు పరిచయం అయ్యారు. వారానికి 50-60 ఆర్డర్లు లభిస్తున్నాయి. మేము ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... భారత సంతతికి చెందినవాళ్లు ఎక్కువగా నివసించని జర్మనీ, పోర్చుగల్ లాంటి దేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి" అంటున్నారు దర్శన్.
image


ఫర్సాన్ కార్ట్ ను వేర్వేరు వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని అమ్మే వెబ్ సైట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇ-మెయిల్, కరపత్రాలు, ఆన్ లైన్ మార్కెట్ పద్ధతుల్ని ఉపయోగించుకొని విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్నారు. వారి ఫేస్ బుక్ పేజీకి 45 వేలకు పైగా లైక్స్ రావడం విశేషం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వెంచర్ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. తన విజయానికి కారణం నాణ్యతగల ఆహార పదార్థాలు అందించడమే అంటారు దర్శన్. ఎలాంటి మార్కెటింగ్ చేసినా నాణ్యతే భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నది దర్శన్ విశ్వాసం. గ్లోబల్ కస్టమర్ల కోసం Going.com కూడా farsankart.com తో చేతులు కలిపింది. సో... ఇదీ .com మహిమ. మీరు కూడా ఇలాంటిదేదైనా ప్రారంభించాలనుకుంటే .com ఉండేలా చూసుకోండి.

(వెరీసైన్ స్పాన్సర్ చేసిన ఈ కథనం సిటీస్పార్క్స్ సిరీస్ లో భాగం)


ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి