కాల్ సెంటర్‌ను క్లౌడ్‌ బాటపట్టించిన ‘ఓజోన్ టెల్’

కాల్ సెంటర్‌ను క్లౌడ్‌ బాటపట్టించిన ‘ఓజోన్ టెల్’

Tuesday November 17, 2015,

2 min Read


ఒక పదేళ్ల క్రితం కస్టమర్ కేర్ అంటే ఓ కాల్ సెంటర్ , కొంతమంది ఎగ్జిక్యూటివ్స్. తియ్యగా వినిపించే నాలుగైదు గొంతులు. అదోరకం హంగామా. ఎప్పటి కప్పుడు ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ప్రతీదీ ఓ సమస్యగానే ఉండేది. ఈ సమస్యకు క్లౌడ్ ద్వారా పరిష్కార మార్గం చూపుతోంది ఓజోన్ టెల్. హైదరాబాద్ కేంద్రంగా క్లౌడ్ టెలిఫోనిక్ తో కస్టమర్ సపోర్ట్ ను రన్ చేస్తున్న ఈ సంస్థ బిటుబి సెగ్మెంట్ లో తమకెవరూ పోటీ లేరంటోంది.

“స్టార్టప్ అయినా మరే కంపెనీ అయినా సర్వీసు అందించే కంపెనీలకు కస్టమర్ సపోర్టు కంపల్సరీ.” సీఐఓ చైతన్య

కస్టమర్ సపోర్టు కోసం ఔట్ సోర్సింగ్ చేయడం తెలిసిన విషయమే. కానీ దాన్ని క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించి మరింత స్మార్ట్ గా మార్చడమే ఈ ఓజోన్ టెల్ లక్ష్యం.

image


ఓజోన్ టెల్ పనితీరు

2007లో ప్రారంభమైన కూకూ డాట్ ఇన్ బ్రెయిన్ చైల్డ్ ఈ ఓజోన్ టెల్. 2010లో కూకూ ప్రాడక్టుగా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చించి ఓజోన్ టెల్ . అయితే ఈ కూకూ ప్లాట్ ఫాంను జొమెటో, ప్రాక్టో లాంటి సంస్థల తమ ప్రాడక్టు డెవలప్‌మెంటు కోసం వినియోగిస్తున్నాయి. కస్టమర్ కాల్ చేసిన తర్వాత అటు వైపు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ రిప్లై ఇవ్వాల్సిన పనిలేకుండా క్లౌడ్ నుంచే జవాబు అందుతుంది. ఐవిఆర్ ఇతర వాయిస్ కాల్స్ తో సమాధానం వస్తుంది. పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన ఓజోన్ టెల్ గత ఏడాది రూ. 20కోట్ల టర్నోవర్ చేసింది. వచ్చే ఏడాది కల్లా 70కోట్ల బిజినెస్‌ అవుతుందని అంచనా. దేశంలో ప్రారంభమవుతున్న ఎన్నో స్టార్టప్ కంపెనీలకు కస్టమర్ సపోర్టు విషయంలో దిశానిర్దేశం చేసే సంస్థగా బిటుబి సెగ్మెంట్ లో ఓజోన్ దుమ్మురేపుతోంది.

ఓజోన్ టెల్ టీం

ఓజోన్ టెల్ లో ముగ్గురు కో ఫౌండర్లున్నారు. సిఎస్ ఎన్ మూర్తి సంస్థకు సీఈవోగా ఉన్నారు. అతను ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత ఇంటెటో కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన అనుభవం ఉంది. చైతన్య- మరో కో ఫౌండర్. ఆయన సీఐవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫ్లోరిడా నుంచి ఎం ఎస్ పూర్తి చేసి ఇండియా వచ్చిన చైతన్య మొదటగా చేసిన ఉద్యోగం ఇదే. అతుల్ శర్శ కంపెనీ సీటీఓ బాధ్యతలు చేపడుతున్నారు. ఎటి అండ్ టీ తోపాటు టెలికాం రంగంలో విశేష అనుభవం ఉంది. వీరితో పాటు 80 మంది ఉద్యోగులు ఈ కంపెనీలు పనిచేస్తున్నారు.

image


బిటుబి సెగ్మెంటులో రాణింపు

బిటుబి సెగ్మెంట్ లో స్టార్టప్ మొదలు పెట్టాలంటే సాధారణంగా రిస్క్ అంటారు. ఈ సెగ్మెంట్ లో అరుదుగా ఫండింగ్ వస్తుంది. కస్టమర్ తో ఇంట్రాక్షన్ ఉండదు. కానీ ఓజోన్ టెల్ ప్రారంభమైన రోజునుంచే లాభాల్లో పయనించింది. కంపెనీలకు కావల్సిన కస్టమర్ సపోర్ట్ అందివ్వడం తో ముందడుగేసింది. సాధారణ కాల్ సెంటర్ లాగా కాకుండా- క్లౌడ్ ను కంపెనీల ఆఫీసుల్లోని డెస్క్ దగ్గరకే తీసుకు రావడంతో క్లెయింట్స్ నుంచి గుడ్ విల్ పుష్కలంగా దొరికింది. భారత్ తోపాటు ఇతర దేశాల్లో కూడా సేవలను ఇప్పటికే ప్రారంభించిన ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఫండ్ రెయిజింగ్ కోసం చూస్తోంది. అమెరికా , ఆస్ట్రేలియాలో పూర్తి స్థాయి సేవలను ప్రారంభించడానికి వీటిని వినియోగిస్తామని చైతన్య చెప్పుకొచ్చారు.

“గ్లోబల్ టెలీకాం కు 2020 నాటికి 25 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటుందని అంచనా.” చైతన్య.
image


భవిష్యత్ ప్రణాళికలు

ఓజోన్ టెల్ కు సబ్ స్క్రిప్షన్ ప్రధాన రెవెన్యూ మోడ్. మరికొన్న ఆదాయ మార్గాలను వెతికే పనిలో ఉన్నారు. దీనికోసం మరో రెండు టూల్స్ ను విడుదల చేయాలని చూస్తోంది. బిటుబి, ఎస్ఏఎస్ ప్లాట్ ఫాంలో దేశంలో ఉన్న బెస్ట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఓజోన్ టెల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దూసుకు పోవాలని చూస్తోంది.