ఫార్మా రంగంలో విస్తృత‌ పరిశోధనలు జరగాలి 

బయో ఏషియా సదస్సులో తొలిరోజు వక్తల పిలుపు

0

హైదరాబాద్ హెచ్ఐసీసీలో 14వ బయో ఏషియా-2017 సదస్సు గ్రాండ్ గా ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 800 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, వరల్డ్ వైడ్ ఛైర్మన్ ఆఫ్ ఫార్మా డాక్టర్ పౌల్ స్టోఫెల్స్, ప్రొఫెసర్ కుర్త్ ఉర్తిచాంద్ కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు.

ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్ రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చిన సిరెస్ట్రా కంపెనీ తోతెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన 6 కంపెనీలకు బయో ఏషియా సదస్సు వేదికగా ప్రభుత్వం భూ కేటాయింపు పత్రాలను అందించింది.

హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో జరిగే పరిశోధనలు సామాన్యులకు అందుబాటులోకి రావాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారడం సంతోషంగా ఉందన్న గవర్నర్.. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇతర రోగాలను నివారించడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఇందుకుగాను కొన్ని పైలెట్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని ఆయన సూచించారు. జినోం వ్యాలిలో పెట్టుబడులు పెట్టాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్న నరసింహన్.. లైఫ్ సైన్స్ సెక్టార్ లో తెలంగాణ లీడర్ గా ఎదుగుతోందన్నారు.

భారతదేశానికి హైదరాబాద్ టాప్ ఫార్మా డెస్టినేషన్ గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని జినోం వ్యాలీలో లైఫ్ సైన్స్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణ ముందుందన్న కేటీఆర్.. ఏషియా దేశాలకు జినోం వ్యాలీ ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రాష్ట్రంలో రిసెర్చ్ సెంటర్ నెలకొల్పి ఫార్మా రంగంలో హైదరాబాద్ ను హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని కేటీఆర్ విజ్ఙప్తి చేశారు. హైద్రాబాద్ లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అన్నీ రకాల సహకారం అందిస్తామన్నారు.

ఇండియాలోనే మొదటిసారిగా జినోం వ్యాలీలో సోలార్ ఎనర్జీ పవర్ అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. జినోం వ్యాలీ ఇన్నోవేషన్, రీసెర్చ్ కు హబ్ గా మారుతోందని తెలిపారు. మూడు రోజులపాటు కొనసాగే బయో ఏషియా సదస్సులో హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ తో పాటు ఇతర అంశాలపై మంచి చర్చలు జరగాలన్నారు కేటీఆర్.

7వ తేదీ ఉదయం వరల్డ్ వైడ్ ఛైర్మన్ ఆఫ్ ఫార్మా డాక్టర్ పౌల్ స్టోఫెల్స్ , ఫార్మాసూటికల్స్ వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ కుర్ట్ ఊత్‌రిచ్, స్రైప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నోవార్టీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, డ్రగ్ డెవలప్‌మెంట్ గ్లోబల్ హెడ్ డాక్టర్ వాస్ నర్సింహన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30గంటలకు సీఈవోల సదస్సు ఉంటుంది. అందులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

-ఫిబ్రవరి 8న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, జర్మన్ జీఎస్కే సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ పాట్రిక్ వాల్లెన్స్ కీలకోపన్యాసాలు చేస్తారు.

Related Stories