చిన్నవయస్సులోనే ప్రఖ్యాత జ్యువెల్రీ డిజైనర్‌గా ఎదిగిన పల్లవి ఫోలే

కుటుంబం, స్నేహితుతే డిజైన్లలో నవ్యతకు కారణంఅంతర్జాతీయ సంస్థలు జ్యూవెలరీ బ్రాండ్లకు డిజైనింగ్తనిష్క్ డిజైనింగ్ టీంలో పదేళ్లపాటు పని చేసిన పల్లవిసొంత వెంచర్ బోటిక్ జ్యూవెల్స్‌తో మరో ముందడుగుపల్లవి డిజైన్లకు జాతీయ అంతర్జాతీయ అవార్డులు

చిన్నవయస్సులోనే ప్రఖ్యాత జ్యువెల్రీ డిజైనర్‌గా ఎదిగిన పల్లవి ఫోలే

Thursday July 02, 2015,

4 min Read

కుటుంబంలో ప్రతీ ఒక్కరి నుంచీ ఎంతోకొంత నేర్చుకున్నా.. ప్రకృతిని ప్రేమిస్తూ ఉండడంతోనే డిజైన్లలో కొత్తదనం తనిష్క్‌లో పదేళ్లపాటు డిజైనింగ్ బాధ్యతలు నిర్వహించిన పల్లవి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించిన పల్లవి డిజైన్స్ బోటిక్ జ్యూవెల్స్‌తో సొంత వెంచర్ నిర్వహణ చేపట్టారు.

పల్లలి ఫోలే, బొటిక్ జ్యువెల్స్ వ్యవస్థాపకురాలు

పల్లలి ఫోలే, బొటిక్ జ్యువెల్స్ వ్యవస్థాపకురాలు


“ప్రతీ వ్యవస్థాపకుని జీవితం సవాళ్లతో ముడిపడి ఉంటుంది. ప్రతీ రోజూ ఏదో ఇబ్బంది తలుపుతడుతూనే ఉంటుంది. రోజువారీగా ఎదురయ్యే ఇలాంటి సమస్యలను సమర్ధంగా ఎదుర్కుని, పరిష్కారం వెతికి అధిగమిస్తేనే... చివరకు లక్ష్యాన్ని చేరుకోగలం” అంటారు బోటిక్ జ్యూవెల్స్ వ్యవస్థాపకురాలు పల్లవి ఫోలే.

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న పల్లవి వెంచర్... డిజైన్ స్టూడియోలను మించి తామేం చేయగలమో ప్రయత్నిస్తుంటుంది. ఆమెతో పాటు తన టీం వారి మేథోశక్తితో... కొత్త డిజైన్లకు ప్రాణం పోస్తుంటారు. గ్లోబల్ బీ2బీ కస్టమర్ల కోసం.. కస్టమైజ్డ్ డిజైన్ల రూపొందించడంలో వీరు నిమగ్నమై ఉంటారు. అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ జ్యూవెలరీ బ్రాండ్ల కోసం ఈ స్టూడియో డిజైన్లు రూపొందిస్తుంది.

తన పని నుంచి రిలాక్సేషన్ కోరుకున్నపుడు.. డిజైన్ కాలేజ్‌‍లైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, జీఐఏ(జెమాలజీ ఇనిస్టిట్యూట్)లలో గెస్ట్ ఫాకల్టీగానూ, జ్యూరీ మెంబర్‌గాను విధులు నిర్వహిస్తుంటారు. చెబుతుంటారు. అంతర్జాతీయ డిజైన్ కాలేజ్‌ల కోసం కోర్సులను రూపొందించారు కూడా. 

“ఏ వ్యాపారానికైన డిజైనింగ్ చాలా కీలకం. ఈ డిజైనింగ్ కోర్సుల్లో సృజనాత్మకను నింపి మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు నేను ప్రయత్నిస్తాన”ని చెప్తున్నారు పల్లవి.
image


బాల్యం నుంచే అడుగులు

నాలుగేళ్ల చిన్నారిగా ఉన్నపుడే డ్రాయింగ్, స్కెచింగ్ అంటే పల్లవికి చాలా ఇష్టం. ఈ పోటీల్లో చాలా బహుమతులు గెలుపొందారామె. కేన్సర్ చికిత్సలో భాగంగా మూడో స్టేజ్ కీమోథెరపీకి వెళ్లవలసిన స్థితిలో ఉన్న తన నాయనమ్మ... స్కూల్‌కు వచ్చి ఆమెకు వచ్చిన అవార్డ్ అంందుకున్న ఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పుడామె ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ ఇప్పటికీ నాతో ఉన్నాయని చెప్తారు పల్లవి. ప్రకృతి ఎప్పుడూ నా ఊహల్లో ఉండేది. నాకు స్ఫూర్తినిచ్చే అతి పెద్ద ఎలిమెంట్ కూడా అదే అంటున్నారు పల్లవి.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూ ఢిల్లీ నుంచి 1997-2000లో యాక్సెసరీ డిజైనింగ్‌లో పట్టభద్రులయ్యారు పల్లవి ఫోలే. మొదట ఆమె తనిష్క్ కోసం పని చేశారు. ఆ టీంలో దాదాపు దశాబ్దంపాటు పల్లవి. ఉన్నారు

స్ఫూర్తినిచ్చిన అంశాలు

తాను జీవితంలో ఎదుర్కున్న అనుభవాలే.. తనను ఈ రంగంవైపు నడిచేందుకు స్ఫూర్తినిచ్చాయంటారు పల్లవి. “నా అనుభవాలు నా డిజైన్లకు స్ఫూర్తినివ్వడమే కాదు.. వాటిలో కనిపిస్తాయి కూడా. నా వరకూ నాకు నాంది, ఫలితం రెండూ డిజైన్లే. నన్ను కొత్త ప్రపంచంలోకి అడుగులు వేసేలా చేస్తాయి. డిజైనర్ బాధ్యతలు నిర్వహించేవారికి ఇలాంటి దృష్టి చాలా అవసరం. నేను ఎదుర్కున్న ప్రతీ సంఘటన నుంచి ఏదో ఒక డిజైన్‌కు స్ఫూర్తినిచ్చింది. కొత్త సంస్కృతులు, కళలు చూసేందుకు, ప్రకృతిని పరిశీలించేందుకు ప్రయాణాలు చేయడమంటే చాలా ఇష్టపడతాను. అలాగే చరిత్రలు చదవడం ద్వారా నా ఆస్తిలాంటి డిజైన్లను మరింత సుసంపన్నంగాను, మంత్రముగ్ధంగాను, చైతన్యం నింపేదిగానూ మార్చుకుంటున్నా”నని చెప్పారు పల్లవి.

గుర్తింపు అంటే బాధ్యత పెరగడమే

డిజైనింగ్ రంగంగో పల్లవి పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించింది. ఆ డిజైన్స్ ఆమెను ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాయి. 'ఆమ్రా' పేరుతో ఆమె రూపొందించిన డిజైన్‌కు బెస్ట్ యాక్సెసరీస్ విభాగంలో.. ప్రతిష్టాత్మక ఎన్ఐడీ బిజినెస్ వరల్డ్ డిజైన్ అవార్డు సాధించింది. సమకాలీన భారతీయ మహిళల కోసం రూపొందించిన ఈ డిజైన్‌లో భాగంగా ... వారు అమితంగా ఇష్టపడే మామిడి డిజైన్‌ను ఆధునీకరించి, పునర్ నిర్వహించారు పల్లవి.

కళలకు లింగ బేధాలు ఉండవంటారు పల్లవి. “మనం చేసే పని ఎంత అద్భుతంగా ఉండాలో చూడ్డమే మన విధి. మిగతాదంతా తనకు తానే చేసుకోగల శక్తి వాటికి ఉంటుంది. తన బాధ్యతలను తాను నిర్వర్తించే వ్యక్తులకు... వారు ఆడైనా, మగైనా సరే... దేశంలో నేను తిరిగిన ఏ ప్రాంతంలో అయినా సరే... తగిన గుర్తింపు, గౌరవం లభించడాన్ని గమనించాన”ని చెబ్తున్నారు పల్లవి.

కెనడాకు చెందిన ఓర్లాండో ఓర్లాండిని డిజైనింగ్ వర్క్ బాగా నచ్చిందని, ఎంతో స్ఫూర్తి నింపిందని అన్నారు పల్లవి. వీటి స్థాయిని అందుకునేందుకు తన దగ్గరున్న నిపుణులైన క్రాఫ్ట్స్‌మెన్‌తో చాలా ఎక్కువ సమయం గడిపానని అంటున్నారామె.

పల్లవికి ప్రేరణ

ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తాను ఇబ్బందులు ఎదుర్కున్న మాట వాస్తవమే అయినా... అది తనకు కలిసొచ్చే అంశం కూడా అంటున్నారు పల్లవి. సవాళ్లను పక్కన పెట్టి, అభివృద్ధిపై దృష్టి పెడితే... కొన్నాళ్లకు ఆ ప్రతికూల అంశాలు కూడా సానుకూలంగా మారిపోతాయి అన్నారామె.

తన ప్రయాణంలో మూడు అంశాలు తనను ప్రధానంగా ప్రభావితం చేశాయని పల్లవి చెప్పారు. ‘ఈ కష్టం కూడా కరిగిపోయేదే’అనే సిద్ధాంతంపై ఆమెకున్న ఆపార విశ్వాసం మొదటిది కాగా... పనిపట్ల, జీవితంపట్ల తనకున్న నిబద్ధత రెండోది. బోర్డింగ్ స్కూల్‌లో ఫిట్‌నెస్, ఆహార అలవాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించి క్రమశిక్షణ అలవాటు చేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు పల్లవి.

“మా నాన్నగారి వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన ప్రతీరోజు గంటపాటు రన్నింగ్ చేస్తారు. మనం ప్రతీ రోజూ ఏం చేస్తామో, ఎంత క్రమశిక్షణగా ఉంటామో... అది ఏ వయసులో అయినా సరే జీవితాంతం తోడు నిలుస్తుంది, సహాయపడుతుందని నాన్నగారు చెప్పేవారు. ఆయన జీవితం నుంచి నేను చాలా నేర్చుకున్నాను”-పల్లవి ఫోలే

ఇక తనకు మద్దతుగా నిలిచి... తన వెంచర్‌కు పునాదులుగా ఉన్న కుటుంబం, ప్రాణ స్నేహితులే... ప్రభావం చేసిన మూడో అంశంగా చెప్పారు పల్లవి. “ నా భర్త నీల్ ఎప్పుడూ నాకు తోడు నిలిచేవారు. ఆయన చేసే పనులు, అంత వినయంగా ఉండగలిగే భర్తను చూస్తే నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. నా కూతురు నియా కూడా నా వ్యక్తిగత విజయంలో ఒక భాగమే. స్టూడియోలో ఉంటూ.. నా డిజైనింగ్ టీంలో ఒక భాగం కావడానికి తనకు చాలా ఇష్టం. వీకెండ్స్‌లో నియా నాతోనే ఉండి డిజైనింగ్‌లో పాలుపంచుకుంటుంద”ని చెప్పారు పల్లవి.

ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాననే పల్లవి జీవితం.. డిజైనింగ్ పట్ల మక్కువ, ప్రేమ.. ఆమె విజయానికి కారణమయ్యాయి. నిత్యజీవితం నుంచే ప్రేరణ పొందానని చెప్పే ఆమె మాటలు... చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.


యువర్‌స్టోరీతో పల్లవి ఫోలే తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి(వీడియో క్రెడిట్ - హెచ్.రాజా. అంజలి అచల్)