టీ-షర్ట్ డిజైన్ చేయండి... విక్రయించండి !

టీ-షర్ట్ డిజైన్ చేయండి... విక్రయించండి !

Tuesday July 07, 2015,

4 min Read

కాలేజీ రోజుల్లో ఫెస్టివల్ కోసం టీ-షర్ట్స్ ఆర్డరు ఇవ్వడం మీకు గుర్తుందా? అనుభవం, అవగాహన లేకపోవడంతో ఎన్ని టీ-షర్ట్స్‌కు ఆర్డరు ఇవ్వాలో తెలియక విద్యార్థులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు.

image


అటువంటి ఇబ్బందులు ఏవీ అవసరం లేదంటోంది జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్. అంతేకాదు సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలకు విద్యార్థులకు తోడ్పాటు ఇస్తామని చెబుతోంది. కళాశాల విద్యార్థులు లక్ష్యంగా ఈ స్టార్టప్ పనిచేస్తోంది. విద్యార్థులు టీ-షర్ట్స్ విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమానికి వెచ్చించొచ్చు. అంతేకాదు ఆదాయమూ పొందొచ్చు. ఇందుకు కావాల్సిన డిజైన్‌లో దుస్తులను తయారు చేసి ఔత్సాహికులకు అందించడం జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్ పని. అయితే కార్యక్రమానికి కావాల్సిన నిధుల కోసం ఒక్కో టీ-షర్ట్‌పై కస్టమర్ అదనంగా రూ.10-20 చెల్లించేలా కంపెనీ ప్రోత్సహిస్తోంది. కార్యక్రమానికి గుర్తింపుగా చిన్న సైజులో ఇంపాక్‌థ్రెడ్ హార్ట్‌ను కంపెనీ తన కస్టమర్లకు అందిస్తోంది.

ఇది ఎలా పనిచేస్తుందంటే..

టీ-షర్ట్స్‌ను రైజర్లు (కార్యక్రమ నిర్వాహకులు) తమకు నచ్చిన డిజైన్‌లో సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు. విక్రయించవచ్చు కూడా. ఎన్ని టీ-షర్ట్స్ కావాలి, ఎంత ధరలో విక్రయించుకోవాలో నిర్ణయం అంతా రైజర్ చేతుల్లోనే. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక వ్యవస్థను కంపెనీ ఏర్పాటు చేసింది. ఎటువంటి పెట్టుబడి రిస్క్ లేకుండా రైజర్లు లాభాలను సైతం ఆర్జించొచ్చు. కళాశాల టీ-షర్ట్స్, ఫ్యాన్ గ్రూప్స్, చమత్కారమైన డిజైన్, ఆర్ట్ వర్క్ ఇలా ప్రాజెక్టు ఏదైనా మేం రెడీ అని కంపెనీ చెబుతోంది. అంతా కూడా సమాజానికి ఎంతో కొంత హితం చేయడానికేనని కంపెనీ అంటోంది. కంపెనీ గతేడాది 'రైజ్' పేరుతో క్రౌడ్ ఫండింగ్ వేదికను ప్రారంభించింది.

సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫౌండర్లలో ఒకరైన యశ్‌వర్ధన్ కనోయ్‌ని యువర్ స్టోరీ పలకరించింది. కంపెనీ విశేషాలు ఆయన మాటల్లోనే..

image


కంపెనీ ఏర్పాటుకు ఇదీ స్ఫూర్తి..

''సింగపూర్‌లో హైస్కూల్‌లో చదువుతున్న సమయంలో రంగస్థల కళాకారుడిగా స్టూడియోలో గడిపేవాడిని. స్కూల్ యూనిఫాం కంటే కళాకారుల సంఘం టీ-షర్ట్ వేసుకోవడమే గొప్పగా అనిపించేంది. హై స్కూల్ పూర్తి అయ్యాక అదే స్ఫూర్తితో బెంగళూరులో స్కూల్‌లో చదివిన సమయంలో తరగతి వెలుపలా గొప్ప పనులకు పూనుకునేవాడిని.

కొందరు స్నేహితులతో కలిసి ద క్యాంపస్ స్టోర్‌ను ప్రారంభించాను. అది విఫలమైంది. ఏడాది తర్వాత గత కంపెనీ ఫౌండర్లలో ఒకరైన అపూర్వ, నేను కలిసి పటిష్టమైన టీంతో మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించాం. ఆకాశ్, ప్రతిభను చేర్చుకుని జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్‌కు రూపమిచ్చాం.

ఇంపాక్‌ థ్రెడ్‌కు స్ఫూర్తి

సమాజంలో మార్పు వచ్చే పని చేయాలని నిర్ణయించాం. డొనేషన్ బాక్స్‌ను మించాలని భావించాం. ఇట్టే కనిపించే కాలేజ్ టీ-షర్ట్స్ ఆలోచన వచ్చింది. మూవెంబర్, పెప్సిల స్ఫూర్తితో ఇంపాక్‌థ్రెడ్ పుట్టింది.

మూవెంబర్ అనేది సోషల్ కాన్సెప్ట్. ఇందులో భాగంగా యువకులు నవంబరు నెలలో మీసాలను పెంచాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహన కోసమే ఇదంతా.

ఫ్రెష్‌నెస్ లేబుల్‌ను పెప్సి పరిచయం చేసింది. కోలా నాణ్యతను పరీక్షించే కార్యక్రమమిది. కళాశాల దుస్తులను కొలిచేందుకు కొత్త ప్రమాణాలను సృష్టించాలని నిశ్చయించాం. ‘మీ టీ-షర్ట్ ప్రత్యేకత చూపించగలదా’ అంటూ చేపట్టిన కార్యక్రమం ఈ కోవలోనిదే.

రైజ్ ఏర్పాటుకు స్ఫూర్తి

రైజ్‌కు ఆసక్తిగల మూలాలు ఉన్నాయి. మార్కెటింగ్ తరగతుల్లో పెప్సి గురించి తెలుసుకున్నాను. గ్రూపాన్ గ్రూప్ డిస్కౌంట్ విధానాన్ని అధ్యయనం చేశాను. రిటైల్ తెలియని విద్యార్థుల బృందానికి ఎటువంటి రిస్క్ లేని విక్రయ విధానం ఇది. ఈ విధానం ఎంతో ప్రభావితమైన, అపార అవకాశాలున్నది. ఇందుకు ఒక వేదికను సృష్టించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏడాది తర్వాత ఇజ్రాయల్‌లో ఇక హైటెక్ కంపెనీ కొత్త ఉత్పాదన మార్కెటింగ్ నిర్వహణ కోసం ఆరు నెలలు సమయం వెచ్చించాను. జీరో రిస్క్ విక్రయ విధానం ఎలా పనిచేస్తుందో నాకు అప్పుడు అర్థమైంది. నా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్‌లో అమలు చేశాం.

ఇదీ మా బృందం..

నలుగురం కలిసి కంపెనీని ప్రారంభించాం. ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సింగపూర్‌లోని ఎన్‌యూఎస్ యూనివర్సిటీ స్కాలర్స్ ప్రోగ్రామ్‌లో లిబరల్ ఆర్ ్ట్స విద్యార్థిని. బృందాన్ని ఒక్కతాటిపై తీసుకురావడం, పనులు అప్పగించడం నా విధి.

అపూర్వ అగర్వాల్ బెంగళూరులోని పెసిట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సమాచారం, ఆర్థిక విషయాలు, భాగస్వామ్యం బాధ్యతలు చూస్తున్నారు.

అకాశ్ దత్తా సింగపూర్‌లోని నాఫాలో యానిమేషన్ విద్యార్థి. విజువల్స్, డిజైనింగ్ బాధ్యతలు ఆయన మీదున్నాయి.

ప్రతిభ నాయర్ బెంగళూరులోని ఎంవీఐటీ బయోటెక్ విద్యార్థిని. ప్రొడక్షన్, కస్టమర్ ఫీడ్ బ్యాక్, మార్కెటింగ్ సిబ్బంది బాధ్యత ఆమెదే.

ఎగ్జిక్యూటివ్‌లు, రాయబారులు, డిజైన్ మంకీస్ భారత్, సింగపూర్‌తోపాటు మధ్యప్రాచ్య దేశాల్లో కంపెనీతో కలిసి పనిచేస్తున్నారు. వీరంతా కలిసి పనిచేసేందుకు ఫన్ ప్లేస్‌గా కంపెనీని తీర్చిదిద్దారు.


కంపెనీ విజయ రహస్యం

2012 చివర్లో కంపెనీని ఏర్పాటు చేశాం. తొలి నాళ్ల నుంచే మంచి బిజినెస్ రాబట్టగలిగాం. ప్రముఖ స్కూళ్లు సైతం ఆర్డర్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. విభిన్న దేశాల నుంచి ప్రతినిధులుగా నియమించుకున్నాం. మీడియాలో ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ద్వారా మంచి పేరు సంపాదించాం. ఇజ్రాయల్‌లో రూ.60 కోట్ల విలువ చేసే స్టార్టప్ కంపెనీలో పనిచేసిన అనుభం ఉంది. స్టార్టప్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాను. కంపెనీని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు బృందం సభ్యులు రెడీ అయ్యారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం.

రైజ్‌ను పరిచయం చేయడంతో స్పందన అనూహ్యంగా ఉంది. ఇది కంపెనీకి కలిసి వచ్చే అంశం. తొలి రెండు రోజుల్లోనే 60 మంది యూజర్లను దక్కించుకున్నామంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు, విద్యార్థి బృందాలు, డిజైనర్లు, సోషల్ గ్రూప్స్, టీచర్లే కాదు రిటైల్ ఔట్‌లెట్లు కూడా పాలు పంచుకుంటున్నాయి. మా దూరదృష్టిని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. ప్రత్యేకత కోసం విద్యార్థులు రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉన్నాం.

ఇదీ కంపెనీ ప్రత్యేకత..

థ్రెడ్‌లెస్ కేవలం కళాకారులపైనే దృష్టిపెట్టింది. క్రౌడ్‌ఫండింగ్‌ను వాడదు. నేరుగా రిటైల్‌లో ఉన్నారు. క్రౌడ్‌ఫండ్ చాలా సులువైంది. డిజైనింగ్ మా కంపెనీ ప్రత్యేకత. కార్యక్రమాన్ని మరింత భిన్నంగా చేపట్టేందుకు రైజర్లకు మద్దతుగా మా డిజైన్ మంకీస్ కలిసి పనిచేస్తారు. క్లయింట్లు డ్రాయింగ్‌ను పంపుతారు. మా బృందం దానిని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. రెడీ టు ప్రింట్ డిజైన్‌ను క్లయింట్ల ముందు ఉంచుతాం.

కళాశాలల్లో కార్యక్రమాలను నిర్వహించిన అనుభవంతో క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా టైలర్‌మేడ్ పరిష్కారాలను ప్రవేశపెడుతున్నాం. రైజ్ సహకారంతో ఔత్సాహికులు తమ క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నారు.

ప్రముఖ వస్త్ర తయరీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. నాణ్యత విషయంలో రాజీకి తావులేదు. నాణ్యతే మా విజయ రహస్యం. తమ సమయాన్ని వృధా చేయొద్దని చెప్పిన కంపెనీలే ఇప్పుడు చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నాయి. కొత్త తయారీ యూనిట్ల నుంచి ఈ-మెయిల్స్ వస్తూనే ఉన్నాయి.

ఆదాయం ఇలా వస్తోంది..

రైజర్ నుంచి ఒక్కో టీ-షర్ట్‌కు కొంత మొత్తాన్ని చార్జీ చేస్తున్నాం. రైజర్లు పొందిన లాభాల నుంచి మేం ఏమీ ఆశించం. రైజ్ వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు ఏదైనా కార్యక్రమం చేపట్టి టీ-షర్ట్స్ విక్రయించాలన్నది మా ఆశయం.

website