3డి ప్రింటింగ్‌లో తిరుగులేని వ్యాపారం ఉందంటున్న హైదరాబాద్ స్టార్టప్ 'ఎవాల్వ్3D'

3డి ప్రింటింగ్‌లో తిరుగులేని వ్యాపారం ఉందంటున్న హైదరాబాద్ స్టార్టప్ 'ఎవాల్వ్3D'

Thursday September 24, 2015,

2 min Read

చూసిందాన్ని ఫోటో తీయాలనిపిస్తుంది. ఫోటోని త్రీడీ బొమ్మల మార్చితే ? ఫెంటాస్టిక్ ఐడియా కదా ? ఇప్పటి వరకూ ఇది ఐడియాగానే ఉంది. ఇక ముందు ఐడియాను మెటీరియలైజ్ చేసుకోవచ్చు. అదీ ఎవోల్వ్ త్రీడీ (Evolv3D)తో. ప్లాస్టిక్ లాంటి ఫైబర్‌తో కూడిన ఓ మెటీరియల్‌తో వీటిని తయారు చేస్తారు. చూడ చక్కనైన కళాఖండాలను కళ్లకు కట్టినట్లు ప్రింట్ చేయడం ఈ స్టార్టప్ ప్రత్యేకత. సాధారణ ఫోటో చూసిన దానికంటే దాన్ని త్రీడీలో చూడటం వల్ల దాన్ని మరింత బాగా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది. స్కూళ్లలో ఉపయోగించే చార్ట్‌లు, మ్యాప్‌లను కూడా త్రీడీలో చూడగలిగితే విద్యార్థులు మరింత చక్కగా పాఠాలు నేర్చుకోగలరు. సైన్స్ ల్యాబ్స్‌లో ఉపయోగించే ఎన్నో ఫోటోలను త్రీడీ ప్రింటింగ్‌లో చూపించగలిగితే నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంది. ఇదే ఐడియాతో ఇప్పుడు జనం ముందుకొచ్చింది ఎవోల్వ్ త్రీడీ.

image


“త్రీడీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకు కేరాఫ్‌గా మారాలనేదే మా టార్గెట్ అన్నారు” ఫౌండర్ కార్తీక్ తాటికొండ

మా క్లెయింట్స్ బిజినెస్‌కు త్రీడీ ఏరకంగా ఉపయోగపడుతుందనే విషయాలనే మేం ఎక్కువగా పట్టించుకుంటాం. మాతో కలసి పనిచేసిన ప్రతి ఒక్కరూ వంద శాతం సంతృప్తిని వ్యక్తం చేశారనే చెప్తారు కార్తీక్. దేశంలో ఉన్న గొప్ప గొప్ప కంపెనీలతో టై అప్ అవుతున్నాం. ఉత్పత్తి రంగంలో సరికొత్త ఆలోచనలను తీసుకురావడమే కాదు క్లయింట్ బిజినెస్ రెట్టింపు అయ్యేలా కొత్త డైమెన్షన్ చూపించడంలో సక్సస్ సాధించామనేది వీళ్ల ధీమా.

త్రీడీ ప్రింటింగ్

సాధారణంగా ఫోటో ప్రింట్ టూడీ వరకే పరిమితమై ఉంటుంది. కానీ ఆ ఫోటోను త్రీడీలో మేం చూస్తాం. దాన్ని త్రీడీ ప్రింట్ తీస్తాం. దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతున్నాం. బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న వస్తువులను దీనిలో ప్రింట్ చేయొచ్చు. రెండేళ్ల నుంచి ఈ టెక్నాలజీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో స్టార్టప్స్ కూడా ఇదే బాట పడ్తున్నాయి. ఎవోల్వ్ త్రీడీ కూడా ఆ కోవకు చెందినదే. యూఎస్, కెనడాల్లో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.

ఫౌండర్ కార్తీక్ తాటికొండ

ఫౌండర్ కార్తీక్ తాటికొండ


పుష్కలమైన అవకాశాలు

వ్యాపార పరంగా చూస్తే ఏరో స్పేస్ ,ఆటోమోటివ్, హెల్త్ కేర్, ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్, రిటైల్, ఫ్యాషన్ ఇలా దాదాపు మనకు అవసరమైన అన్ని రంగాల్లో త్రీడీ ప్రింట్ అవసరం ఉంటుంది. తయారీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుగా త్రీడీ ప్రింటింగ్‌ని చెప్పొచ్చు. ఎవాల్వ్ త్రీడీకి కూడా ఈ రంగాలకు పేరున్న సంస్థలు క్లెయింట్స్‌గా ఉన్నారు. త్రీడీ ప్రింట్ అప్లికేషన్స్‌కు చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే దీనిలోకి అడుగుపెట్టామంటున్నారు కార్తీక్. తాను మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాక్ గ్రౌండ్ నుంచి రావడం ఎంతో కలసి వచ్చే విషయంగా ఆయన వివరిస్తారు.

ఎవాల్వ్ త్రీడీ టీం

కార్తీక్ తాటికొండ ఈ స్టార్టప్ కు ఫౌండర్. ఎంజిఐటి హైదరాబాద్ నుంచి మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ఇండియానా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. డిఫెన్స్, ఆర్ అండ్ డీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై అవగాహన ఉంది. సంపత్ గద్దం ఇందులో కో ఫౌండర్. ఐటి కంప్యూటర్ రంగంలో అనుభవం ఉంది. ఈయన కూడా అమెరికాలోని ఇండియానా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. గారి శ్రీకర్ రెడ్డి, ఆదిత్య కూడా ఈ సంస్థకు కో ఫౌండర్లుగా ఉన్నారు. అమెరికాలో త్రీడీ ప్రింటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీతో పాటు, ఫ్రాన్స్‌కు చెందిన త్రీడీ సిస్టమ్స్, నొవాబీన్స్ కంపెనీలతో ఎవాల్వ్ త్రీడి టై అప్ చేసుకుంది

భవిష్యత్ ప్రణాళికలు

ప్రతీ రంగంలో తన మార్క్ ఉండేలా పనిచేస్తామంటోంది ఎవాల్వ్ త్రీడీ. రా మెటీరియన్ ను ఇప్పటి వరకూ పక్క దేశాలనుంచి మనం దిగుమతి చేసుకుంటున్నమని, దాన్ని కూడా తామే తయారు చేయాలని చూస్తున్నట్టు కార్తీక్ చెప్పారు. పూర్తి స్థాయి ఈ కామర్స్ సర్వీసును కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలిపారు.