ఓలా.. ఉబర్- ఈ రెండింటిలో ఏది బెస్ట్...?

యువర్ స్టోరీ ఆసక్తికర సర్వే

ఓలా.. ఉబర్- ఈ రెండింటిలో ఏది బెస్ట్...?

Tuesday December 20, 2016,

4 min Read

మొన్నటిదాకా- ఆటోలో వెళ్దాం.. ఆటోలో వస్తాం.. అన్న మాటలు ఇప్పుడు వినిపించడం లేదు. క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ లో రండి. క్యాబ్ మాట్లాడుకోండి.. అని మాట్లాడుకుంటున్నారు. సొంత కారు ఉన్నా పక్కన పెట్టి క్యాబులో వస్తున్నారు. రోడ్డుమీద చేతులు అడ్డంగా పెట్టి వచ్చీపోయే ఆటోలను ఆపే బదులు.. రెండే రెండు నిమిషాల్లో కారుని తమ దగ్గరికి రప్పించకుంటున్నారు. దీన్నిబట్టి చెప్పొచ్చు క్యాబ్ సర్వీస్ జనాలకు ఎంత చేరువైందో.

సరే, క్యాబ్ కాన్సెప్ట్ పక్కన పెడితే.. ఇంతకూ ఏ కంపెనీ సర్వీస్ బెటర్ గా ఉంది..? పబ్లిక్ దేనికి ఓటు వేశారు?ఓలా బెస్టా..? లేక ఉబర్ సూపరా..? జనం ఇచ్చిన తీర్పు ఎలా వుంది? చదవండి యువర్ స్టోరీ విశ్లేషణాత్మక కథనం.

ఆ మధ్య ఒక సమ్మిట్ లో ఓలా సీఈవో ఏమన్నారంటే.. ఎంత ఎక్కువ మూలధనం ఉంటే అంత బెటర్ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నారు. మరి ఆయన అన్నది నిజమా? ఛలో జనం నాడీ ఎలా వుందో తెలుసుకుందాం..

image


ఓలా లేక ఉబరా.. చాలామంది ఇన్వెస్టర్లు, ఎనలిస్టులు చాలాసార్లు లేవదీసిన ప్రశ్న ఇది. కానీ ప్రయాణికులకు ఇదంతా ఏమీ తెలియదు. ఎవరి కంపెనీ ఎంత విలువైంది? ఎవరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు..? ఎవరి పెట్టుబడి ఎంత..? ఇలాంటి విషయాలను వారు పట్టించుకోరు. వాళ్లకు కావల్సిందల్లా ఏ సర్వీస్ ఎంత మెరుగ్గా ఉంది..? ఎవరు కన్వీనియెంట్ గా ఉన్నారు.? ఏది సురక్షితం? ఇవే ప్రయాణికులకు ముఖ్యం.

ఇదే విషయం మీద యువర్ స్టోరీ కొంత సర్వే చేసి వాస్తవాలు మీ ముందు ఉంచుతోంది. ఏ సర్వీస్ ఉత్తమంగా ఉందో జనం ఇచ్చిన తీర్పునే మీకు తెలియజేస్తోంది.

ఇదిగో జనం ఇచ్చిన తీర్పు

పెద్దపెద్ద నగరాలు పక్కన పెడితే, దాదాపు 84 శాతం రెండు సర్వీసులను ఉపయోగిస్తున్న 28 నగరాల ప్రజల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..

క్వాలిటీ విషయంలో ఉబర్ ని మించిన సర్వీస్ లేదని క్లియర్ కట్ గా తెలిసింది. దాదాపు 65 శాతం ప్రజలు ఉబర్ బెస్ట్ అని తేల్చి చెప్పారు. 12 శాతం మాత్రమే ఓలాకు ఓటేశారు. మరి ఎంత ఎక్కువ మూలధనం ఉంటే అంత బెటర్ సర్వీస్ ఇస్తామని ఓలా సీఈవో భవిష్ చెప్పినట్టు ఇక్కడ జరగలేదేంటి?

వాస్తవానికి ఓలా కంటే ఉబర్ రైడ్ 15 శాతం చీప్. ఈ విషయంలో 44 శాతంమంది ఉబర్ సర్వీస్ కు జై కొట్టారు. సేఫ్టీ విషయంలో మాత్రం రెండో స్థానంలో (29శాతం) ఉంది. అయితే, 21 శాతం మంది మహిళలను మాత్రమే అడిగితే వచ్చిన ఓటింగ్ ఇది.

image


టైం సెన్స్ కూడా మరో ఫ్యాక్టర్. ఆ విషయంలో ఉబర్ 19 శాతం వెనుకబడింది. అయినప్పటికీ క్వాలిటీ కన్వీనియెన్స్ విషయంలో ఎవరూ ఇబ్బంది పడలేదని తేలింది. ఒక్క క్లిక్ ద్వారానో ఒక్క స్వైప్ మూలంగానో కారు ఉన్నచోటికి వచ్చింది. లొకేషన్ ఎక్కడ..? లాండ్ మార్కేంటి..? ఇలాంటి క్వశ్చన్లేవీ లేవు. అదే ఓలా అయితే కాల్స్ మీద కాల్స్ చేయాలి. లొకేషన్ వివరించాలి. ఎక్కడున్నామో విడమరిచాలి. దాంతో పెద్ద తలనొప్పి. ఇది ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్వానుభవం.

ఓలా పట్ల జనం విసిగిపోవడానకి ఇదొక్కటే కారణమా? కాదు. డ్రైవర్ బిహేవియర్ కూడా. అది మరో రీజన్. వారి దురుసు ప్రవర్తన, చిరాకు, విసుగు మూలంగా కూడా ఓలా ఓటింగ్ పర్సంటేజీ కోల్పోయింది. అదే ఉబర్ అయితే- డ్రైవర్ విషయంలో ఎంతమాత్రమూ అలసత్వంగా ఉండదు. ఉపేక్షించదు కూడా.

చాలామంది డ్రైవర్లు ఏమంటారంటే.. ఓలాకు డ్రైవర్ గా కుదరడం చాలా సింపుల్. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇట్టే జాయిన్ అయిపోవచ్చు. అదే ఉబర్ తో ఒప్పందం చేసుకోవడం అంత ఈజీ కాదు. క్వాలిటీ విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అస్సలే రాజీపడరు. రెండు సర్వీసుల్లో డ్రైవింగ్ చేసేవాళ్లు చెప్పిన మాటలివి.

image


ఆటో అంటేనే చిరాకేస్తోందా..?

వాస్తవమే. ఆటోలో వెళ్దాం అనే మాట క్రమంగా కనుమరుగువుతోంది. ఈవెన్ సొంత కారున్నా జనాలు వాటిని తీయడానికి ఇష్టపడటం లేదు. 60 శాతం కంటే ఎక్కువ ప్రజలు ఓలాను గానీ ఉబర్ గానీ వారంలో రెండు మూడు సార్లు బుక్ చేసుకుంటున్నారు. అందులో దాదాపు 60 శాతంమంది ఉబర్ కే థమ్స్ అప్ అంటున్నారు. 20 శాతం పబ్లిక్ మాత్రమే ఆటోలు, లేదంటే సొంత బండ్లలో వెళ్తున్నారు. 22 శాతం మంది తప్పనిసరి పరిస్థితుల్లో.. అర్జెంట్ అయితే గానీ.. ఏదో ఒకటిలే అని ఓలాతో సరిపెట్టుకుంటున్నాం అంటున్నారు.

మీరు అనుకోవచ్చు.. యాక్టివ్ యూజర్లను అడిగితే ఇలాగే మాట్లాడుతారు. అందులో కొత్త విషయం ఏముంది అని. నిజమే.. కానీ బ్రాండ్ వైజ్ మాత్రం ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ల రియాక్షన్ ను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే.

డ్రైవర్లతో ఇంకో ఇబ్బందేంటంటే.. ప్యాసింజర్ల డ్రాప్ లొకేషన్ ఇష్టం ఉంటేనే వస్తున్నారు. లేదంటే క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 54 శాతం కస్టమర్లు ఇదే సమస్య అని చెప్పారు. ఇంకొందరు డ్రైవర్లు జీపీఎస్ నేవిగేట్ చేయడం లేదు. 37 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

నిజానికి జీపీఎస్ సమస్యకు రెండు ప్రాథమిక కారణాలున్నాయి. ఒకటి- డైరెక్షన్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. చాలామంది డ్రైవర్లకు ఆంగ్లం తెలియదు. అందుకే దాన్ని ఫాలో అవరు. రెండు- అప్లికేషన్ లో వచ్చే విజువల్ పట్ల సరైన ట్రైనింగ్ లేకపోవడం. మూడోది- అరకొర ఇంటర్నెట్ సర్వీస్. కొన్ని ఏరియాల్లో నెట్ సర్వీస్ సరిగా లేకపోవడంతో సమస్య ఎదురువుతోంది.

రూట్ విషయంలో డ్రైవర్లు పదే పదే అడగడం వల్ల చిరాకొస్తోందని బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అన్నాడు. డ్రాపింగ్ లొకేషన్ చెప్పినప్పటికీ పదేపదే ప్రశ్నిస్తున్నారని అతను వాపోయాడు.

image


ఇక్కడ ధర గురించి కూడా కాసేపు మాట్లాడుకోవాలి. అందుకే మేం కొంతమంది అభిప్రాయాన్ని సేకరించాం. క్యాబ్ అగ్రిగేట్లు నిర్ణయించిన రేట్లపై గవర్నమెంట్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించాం. దానిమీద మిశ్రమ స్పందనే వచ్చింది. 48 శాతం మంది ట్యాక్సీల టారిఫ్ ని గవర్నమెంటే రెగ్యులేట్ చేయాలని అన్నారు. మరో 40 శాతం పెద్దగా పట్టించుకోలేదు .

ఇక డిమానిటైజేషన్ యాంగిల్లో అడిగిన ప్రశ్నకు రెండు సర్వీసులకు చాలామంది మద్దతు తెలిపారు. 82 శాతం మంది పేమెంట్ విషయంలో ప్రాబ్లమేం రాలేదనే అన్నారు. విడివిడిగా ప్రశ్నిస్తే మాత్రం ఉబర్ కంటే ఓలా నుంచే ఒకటి రెండు సమస్యలు ఎక్కువ ఎదురయ్యాయని స్పష్టమైంది.

దీని గురించి ఒక యువ ఆంట్రప్రెన్యూర్ తనకు ఎదురైన అనుభవాన్ని ఇలా చెప్పాడు..

నేను ఆ మధ్య ఒకసారి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాను. డ్రైవర్ నా లొకేషన్ కు వచ్చిన తర్వాత పేమెంట్ ఎలా చేస్తారు అని అడిగాడు. అందుకు నేను- ఓలా మనీతో అన్నాను. దాంతో అతను.. కుదరదు, క్యాన్సిల్ చేసుకోండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను.

image


చివరగా చెప్పేదేంటంటే..

ఓలా, ఉబర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆ మాటకొస్తే ఉబర్ కంటే ఓలా సర్వీసులే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ఓలా షేర్ 75 శాతం. 9 రకరకాల కేటగిరీల్లో ఉన్న సర్వీసులు దాదాపు 100 సిటీల్లో విస్తరించాయి.

కానీ క్వాలిటీ ప్రాతిపదికన చూసుకుంటే కస్టమర్ శాటిస్ఫాక్షన్ విషయంలో ఉబర్ ద బెస్ట్. అఫ్ కోర్స్- ఈ సర్వేలో శాస్త్రీయత, కచ్చితత్వం లేకపోయినా.. కస్టమర్ సెంటిమెంట్ ని, అతడి మనోగతాన్ని మాత్రం ఆవిష్కరించాం. వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిందే.

ఏది ఏమైనప్పటికీ.. ఎవరి అభిప్రాయం ఏదైనా.. వచ్చే సంవత్సరం క్యాబ్ సర్వీసులు కస్టమర్ల ఎక్స్ పెక్టేషన్స్ కు రీచ్ అవ్వాలని ఆశిద్దాం..