ఒక వైపు వ్యాపారం.. మరోవైపు సామాజిక సేవ..

 ఒక వైపు వ్యాపారం.. మరోవైపు సామాజిక సేవ..

Thursday March 10, 2016,

4 min Read

    నది ఎటువైపు పయనించాలో… మార్గం ఎక్కడ మార్చుకోవాలా తానే నిర్ణయించుకుంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఈ ముగ్గురు మహిళలు కూడా తమ భవిష్యత్ కు తామే శిల్పులుగా మారారు. భర్తల చాటున ఉండాలనుకోలేదు… తమకంటూ పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. అదే పని చేశారు … విజయతీరాలను ముద్దాడారు. ఉద్యోగమైనా… వ్యాపారమైనా పోటీపడి సాధించుకోవాలని… మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకోవాలంటున్నారు. ఆకాశంలో సగంకాదు… అంతకన్నా ఎక్కువే అంటున్నారు.

లత

1992లో భర్త పాండ్య రాజన్ తో కలిసి లత మాఫోయ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించారు. అందులో ఉన్నతోద్యోగంలో చేరారు లత. అయితే ఏడాది తర్వాత తనను ఎవరైనా ఎండీగారి భార్య అనిపిలిస్తే ఉద్యోగం మానేస్తానని చెప్పారు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుందని ఖరాకండిగా చెప్పేశారు. లతా క్వాలిఫైడ్ చార్టెక్ అకౌంటెంట్ … సొంత ప్రాక్టీస్ ఉంది. అన్నీ వదులుకొని భర్త కంపెనీలో డైరెక్టర్ గా చేశారు. హెచ్ఆర్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ పెట్టిన రెండేళ్లలోనే అంటే… 92లో కంపెనీ పెట్టగా 1994కే కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

రజనీ రెడ్డి

 రజనీ రెడ్డి చిన్నప్పుడు ఆర్కిటెక్ట్ కావాలని కలలుకనేవారు. పురుషులు డామినేషన్ ఎక్కువగా ఉండే సివిల్ ఇంజనీరింగ్ చదివారు.రిజల్ ఎస్టేట్ చేస్తున్న తన అంకుల్ స్ఫూర్తినిచ్చారని చెప్పారు. కోర్స్ పూర్తయిన తర్వాత తన అంకుల్ కంపెనీలో చేరారు. మర్చెట్ బ్యాంకర్ జీఆర్కే రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో కొంతకాలం ఉన్నాక భర్తతో పాటు… చెన్నై షిప్ట్ అయ్యారు.భర్త చెన్నైలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అయితే ఆమె భర్త అడుగుజాడల్లో నడవాలనుకోలేదు. సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ కంపెనీ స్థాపించారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ బిజినెస్ తోపాటు… విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు.

అముధ

రిటైల్ రంగం దిగ్గజం కెవిన్ కేర్ గ్రూప్ ఛైర్మన్ రంగనాథన్ పెద్ద కుమార్తె అముధ. తన కజిన్ ను స్ఫూర్తిగా తీసుకుని … విజువల్ కమ్యూనికేషన్స్ చదివారు. విద్యపూర్తయ్యాక కెవిన్ కేర్ గ్రూప్ లోని రిటైల్ సేల్స్, రెస్టారెంట్స్, ఇంటీరియర్ డిజైన్ బాధ్యతలు నెరవేర్చారు. తండ్రి సంస్థలో పనిచేస్తే తనకేం గుర్తింపు వస్తుందనుకున్నారో ఏమో…ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. దీనికి తండ్రికూడా సపోర్ట్ చేయడంతో… చిన్నపిల్లలకోసం ఒక స్కూల్ ప్రారంభించారు. తను కాలేజ్ కు వెళ్తూ ఆల్ఫా బెట్ స్కూల్ ను చూసేదాన్నని … సొంతంగా స్కూల్ స్థాపించడానికి అదే స్ఫూర్తినిచ్చిందన్నారు.

భర్తల చాటునో… తండ్రుల పోషణలోనో కాకుండా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనే ఈ ముగ్గుర్నీ ఒక స్థాయిలో నిలబెట్టింది.రజనీ రెడ్డి భర్తను జీఆర్కే రెడ్డిని విలేజ్ మాఫియా కిడ్నాప్ చేసింది. డబ్బు డిమాండ్ చేశారు. ఐదురోజుల తర్వాత విడుదల చేశారు. ఆ ఐదు రోజులూ భర్త వ్యాపారాలను రజనీ నిర్వహించారు. ఏదైనా సొంతంగా చేయాలని అప్పుడే అనుకున్నారు.

భర్తతో కలిసి స్థాపించిన మాఫోయ్ కంపెనీలోనే ఎదిగారు లత. కంపెనీ అంతర్గత వ్యవహారాలన్నీ ఈమె చూసుకుంటారు.భర్త పాండ్యరాజన్ బిజినెస్ డెవల్ మెంట్, కస్టమర్ డీలింగ్స్ చూసుకుంటారు. అంతేకాదు మాఫోయ్ చేపట్టిన సామాజిక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కూడా లతదే. దక్షిణ చెన్నైలో పేద చిన్నారులను ఆదుకుంటున్నారు . మహిళా సాధికారతకోసం మైక్రో ఫైనాన్స్ యూనిట్ ను ప్రారంభించారు.

వివిధ రంగాల్లో సత్తా చాటాలంటూ అముధకు తండ్రి సలహానిచ్చారు. కెవిన్ కేర్ కొత్త సాఫ్ట్ డ్రింక్ ప్రారంభించినప్పుడు … గ్రౌండ్ లెవెల్ లో సేల్స్ బాధ్యతలను నిర్వర్తించారు అముధ. తెల్లవారుజుము నాలుగు గంటల వరకు పనిచేసేవారు. వెజ్ నేషన్ పేరుతో రెస్టారెంట్స్ పెట్టినప్పుడు… స్టాఫ్ స్ట్రైక్ చేస్తే సొంతంగా వండి… కస్టమర్లకు అందించారు. పరిస్థితులు తారుమారైనా ఎదురెళ్లి… ఎలా నిలదొక్కుకోవాలో అప్పుడే నేర్చుకున్నానని చెప్పారు.

వృత్తి - సవాళ్లు

వీరికి ప్రారంభంలో వ్యాపారం అంత సులువుకాలేదు. ధైర్య సాహసాలు, చిత్త శుద్ధివల్లే రజనీ రెడ్డి నిలబడగలిగారు.ఈమె ప్రారంభించిన అట్లాంటా సాఫ్ట్ వేర్ కంపెనీ దాదాపు దివాలా తీసింది. ఈమెతోపాటు పెట్టుబడులు పెడతామన్న ఇద్దరు పార్టనర్స్ మధ్యలోనే హ్యాండిచ్చారు. అయినా వెనక్కి తగ్గకుండా సాఫ్ట్ వేర్ కంపెనీని ఔట్ సోర్సింగ్ కంపెనీగా మార్చేశారు. 1999లో ఆర్ఆర్ ఇన్ఫోటెక్ స్థాపించి … 2008లో దానిపేరును ఎగ్జెంప్లర్ గా మార్చారు. అమెరికా క్లైంట్ల కోసం మెడికల్ బిల్లింగ్, మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్ సేవలందిస్తోంది. వస్తే ప్రాజెక్టులన్నీ ఒకేసారి వస్తాయని… పని లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. తర్వాత డాటా ఎంట్రీ లాంటి సేవలను అందిస్తారు.

రజనీ రెడ్డి ,”ఏదో హాబీగా వ్యాపారం చేస్తున్నానని ఇంట్లోవారంతా అనుకున్నారు. అలానే చూశారు… నేను మాత్రం వ్యాపారాన్ని నా భవిష్యత్ ను మార్చే సాధనంగా ఉపయోగించుకుంటున్నాను. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 10 వారాల శిక్షణకు కూడా హాజరయ్యాను. ఇండియన్ బిజినెస్ స్కూల్ లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. ఒకప్పుడు పనిలేకే వ్యాపారం చేసుకుంటుందనుకున్నవారంతా ఇప్పుడు నా ప్రతిభను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకుంటున్నప్పుడు అమెరికా, బ్రెజిల్ లోని బిజినెస్ స్కూల్స్ అన్నీ చూశాను. దీంతో ఆత్మస్థైర్యం బాగా పెరిగింది”

మాఫోయ్ కంపెనీలో కీలకపాత్ర పోషిస్తున్న లత జీవితంకూడా వడ్డించిన విస్తరేమీ కాదు. ప్రారంభంలో ఫండ్స్ సేకరణ చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిధులు సేకరించారు. ఐదువేల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగేవారినికూడా ఆహ్వానించి షేర్లు ఇచ్చామని చెప్పుకున్నారు. నెదర్లాండ్స్ కు చెందిన విడియర్ కంపెనీ పెట్టుబడులు పెట్టాక… చిన్న మదుపరులకు లాభాలిచ్చి… వారిని బయటకు పంపామని లత తెలిపారు. విడియర్ కంపెనీని 2008లో రాండ్ స్టడ్ కంపెనీ కొనుగోలు చేశాక పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. లతా , ఆమె భర్త కూడా స్టాఫింగ్ బిజినెస్ ను మానేసి… 2012లో కన్సల్టింగ్, ఎడ్యుకేషన్, ఎనలిటిక్స్ బిజినెస్ లోకి వచ్చారు. వరం పేరుతో మైక్రో ఫైనాన్స్ పై లత దృష్టిపెట్టారు.60వేల మంది మహిళలు దీనివల్ల లబ్ధిపొందారు. లత ఏడున్నర కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పూలు అమ్మేవారి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారి వరకు ఎంతో మందికి అప్పులిస్తున్నారు. వారికి వరం ఒక ఆసరాగా మారింది.

ఉత్తర చెన్నైలో ప్రారంభమైన వరం మైక్రోఫైనాన్సింగ్… చత్తీస్ గడ్, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందిస్తోంది. మాఫోయ్ … ఏకం అనే ట్రస్ట్ ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైలో స్పోర్ట్స్ అకాడమీని స్థాపించి అబ్బాయిలకు బాక్సింగ్ లోనూ శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈమె స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణపొందినవారు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటారు.

చిన్నారుల స్కూల్ స్టార్ట్ చేసిన అముధ… అంతకన్నా ముందు పిల్లపై రీసెర్చ్ చేశారు. దేశమంతా తిరిగి… స్కూల్స్ ను పరిశీలించారు. కనోపో అనే స్కూల్ ను 2014లో స్థాపించారు. తల్లులకు, పిల్లలకు కూడా సరిపోయేలా సొంతంగా కరికూలమ్ రూపొందించారు. పది నెలల వయసున్న పిల్లను సైతం తన స్కూల్ లో చేర్చుకుంటన్నారు. వారి పెంపకం విషయంలో తల్లులకు శిక్షణనిస్తున్నారు. పిల్లలకు ఐదున్నరేళ్ల వయసు వచ్చేటప్పటికి … ప్రకృతితో ఎలా మెలగాలి, పెద్దవారితో ఎలా ఉండాలన్న దానిపై ఒక అవగాహన తీసుకొస్తున్నారు.

అమ్మాయిలకు ఐటీలో సాధికారత కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఈ విట్ వ్యవస్థాపక సభ్యురాలు రజనీ రెడ్డి. అమ్మాయిలు… ఉద్యోగాలు పొందేందుకు ఇది సహకరిస్తోంది. ఐటీలో పెద్ద పెద్ద ఉద్యోగాలను సాధించేందుకు శిక్షణనిస్తోంది. పేదల పిల్లలకు లత, మహిళా సాధిరాతకోసం రజనీ పాటుపడుతున్నారు. స్కూల్స్ ద్వారా మార్పు తీసుకురావాలని అముధ ప్రయత్నిస్తున్నారు. తమ భర్తలకన్నా… ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఒక వైపు వ్యాపారం మరోవైపు సామాజిక సేవలో దూసుకుపోతున్నారు.

రజనీరెడ్డి, అముధ,లత

రజనీరెడ్డి, అముధ,లత


రజనీరెడ్డి

రజనీరెడ్డి


లత

లత