డ్రైవ్ యూలో యూనిటస్ సీడ్ ఫండింగ్

డ్రైవ్ యూలో యూనిటస్ సీడ్ ఫండింగ్

Wednesday March 02, 2016,

2 min Read

బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రైవ్ యూ సంస్థ మంచి ఆర్థిక సహకారం లభించింది. ఈ సంస్థలో ప్రఖ్యాత ఇన్వెస్టర్లు యూనిటాస్ సీడ్ ఫండ్ పెట్టింది. కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ కు తగ్గట్టుగా సంస్థను విస్తరించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు.

డ్రైవ్ యూ వ్యవస్థాపకులు అశోక్ శాస్త్రి, రామ్, అమూల్ మిత్ చద్దా

డ్రైవ్ యూ వ్యవస్థాపకులు అశోక్ శాస్త్రి, రామ్, అమూల్ మిత్ చద్దా


గత ఏడాది జూలైలో బెంగళూరులో ప్రారంభమైన ఈ సంస్థ టెక్నాలజీ ఆధారిత, ఆన్ డిమాండ్ సర్వీసులను, ప్రైవేట్ డ్రైవర్ సర్వీసులను సరసమైన ధరకు అందిస్తున్నది.

‘‘ప్రైవేట్ ఓన్డ్ వెహికిల్ ఓనర్ల డ్రైవర్ల సమస్యను తీర్చడమే మా ఉద్దేశం. ఓనర్ల సమస్యను తీర్చడంతోపాటు డ్రైవర్లకు కూడా అవకాశాలు కల్పించగలుగుతున్నాం’’’ అని డ్రైవ్ యూ సీఈఓ రామ్ శాస్త్రి అన్నారు.

డ్రైవ్ యూతో ఒప్పందం చేసుకుంటే ఫుల్ టైమ్ డ్రయివర్ ను కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరసమైన ధరకే పార్ట్ టైమ్ డ్రయివర్ ను పొందొచ్చు.

కస్టమర్ల సేఫ్టీకే పెద్ద పీట వేస్తోంది ఈ సంస్థ. రిజిస్ట్రేషన్ కు ముందే డ్రైవర్ గురించి పూర్తి వివరాలను సేకరిస్తున్నది. పోలీస్, ఆర్టీఓ వెరిఫికేషన్ చేయిస్తున్నది. ఆ తర్వాత రోడ్డుపై కారు నడిపే విధానంలోనూ ట్రైనింగ్ అందిస్తున్నది. అలాగే సురక్షిత డ్రైవింగ్ కోసం టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తున్నది.

ప్రస్తుతానికైతే బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలో సేవలను అందిస్తోంది డ్రైవ్ యూ. ఈ ఏడాది జనవరి వరకు 15 వేల ట్రిప్ లను పూర్తిచేసింది. అలాగే ఆరువేల మంది కస్టమర్లకు సేవలందించింది. అందులో 60% వరకు మహిళలే.

‘‘అద్భుతమైన టీమ్, మంచి టెక్నాలజీ సామర్థ్యం, కస్టమర్ల అవసరాల మేరకు సేవలు అందించడం వంటి చర్యల కారణంగానే డ్రైవ్ యూలో పెట్టుబడులు పెట్టాం. మా పెట్టుబడులతో డ్రైవర్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ఇరు వర్గాలకు అది లాభధాయకంగా ఉంటుంది’’ అని యూనిటస్ సీడ్ ఫండ్ కో ఫౌండర్, మేనేజింగ్ పార్ట్నర్ విల్ పోలే వివరించారు.

కార్ల ఓనర్ షిప్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా భారత్ 160వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందిలో 18 మందికి కార్లున్నాయి. 2025 కల్లా ఈ సంఖ్య 35కి చేరుతుందని ఓ అంచనా.

ఓ నివేదిక ప్రకారం బెంగళూరులో 15లక్షలకు పైగా ప్రైవేట్ కార్లున్నాయి. అందులో 30% మంది ఓనర్లు.. డ్రైవర్ల కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తున్నది. అయితే ఈ రంగంలో డ్రైవ్ యూ ఒక్కటే కాదు మరికొన్ని కంపెనీలు కూడా ప్రైవేట్ డ్రైవర్ల సేవలను అందిస్తున్నాయి. గుర్గావ్ కేంద్రంగా నడుస్తున్న డ్రైవ్ బడ్ సంస్థ కూడా ఈ రంగంలో సేవలందిస్తున్నది. మంచి సేవలతో కస్టమర్ల మనసు చూరగొంటున్న డ్రైవ్ యూ మరిన్ని పెట్టుబడులు సాధించాలని యువర్ స్టోరీ ఆశిస్తోంది.