అసాధార‌ణ సామాజికవేత్త థాయిలాండ్ 'మిస్ట‌ర్ కండోమ్ '

సృజ‌నాత్మ‌క‌త‌కు కొంత హాస్య చ‌తుర‌త కూడా తోడైతే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని నిరూపించారు థాయ్‌లాండ్‌కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త, సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత మెకాయి విరావైథ‌య‌.. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌కు కొంత హాస్య‌రసాన్ని కూడా జోడించి థాయిలాండ్‌ను కుటుంబ నియంత్ర‌ణ బాట ప‌ట్టించారు. వెనుక‌బ‌డిన దేశాన్ని అభివృద్ధి బాట ప‌ట్టించాడు. ప‌ర్యాట‌క రంగంలో నెంబ‌ర్‌వ‌న్‌గా తీర్చిదిద్దారు.

అసాధార‌ణ సామాజికవేత్త థాయిలాండ్ 'మిస్ట‌ర్ కండోమ్ '

Tuesday May 12, 2015,

2 min Read

గ‌తంలో యువ‌ర్ స్టోరీలో ప్ర‌చురిత‌మైన స్పార్క్ ఫొటోలు అన్ ఆర్ట్ ఫెయిర్‌, మ్యూజిక‌ల్ ఫెస్టివ‌ల్‌, టెలికం ఎక్స్‌పో, ఆర్ట్ మ్యూజియం, మొబైల్ షోకేస్, మ్యాథ్ మ్యూజియం, సోష‌ల్ హాకథాన్‌, బుక్ స్టోర్‌, కో వ‌ర్కింగ్ స్పేస్‌, సెన్సోరియం, లాంత‌ర్న్ ఫెస్టివ‌ల్‌, ఔట్ డోర్ యాడ్స్‌, స్టార్ట‌ప్ రోడ్ షో, కంప్యూట‌ర్ మ్యూజియం, స్టార్ట‌ప్ టీ ష‌ర్ట్స్‌, బిజినెస్ కార్డ్స్‌, ఆర్ట్ థెర‌పీ, దివాలీ రంగోలీ, ఎకోప్రెన్యూర్స్‌, ఈ-ఎన్జీవోల‌కు చెంద‌న‌వి. కానీ ఇప్పుడు ప్ర‌చురిత‌మైన ఫొటోలు సామాజికవేత్త విరావైథ‌య‌ సృజ‌నాత్మ‌క‌త‌, హాస్య చ‌తుర‌త ఎలాంటిదో చూపేవి.

image


ఇటీవ‌ల బ్యాంకాక్‌లో క్రియేటివ్‌, ఇన్నోవేష‌న్ మీద ఓ వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. అందులో అత్యంత అసాధార‌ణ సామాజిక, ఆరోగ్య‌ కార్య‌క‌ర్త‌, క‌మ్యునిటీ డెవ‌ల‌ప‌ర్‌ విరా వైథ‌య‌నే ప్ర‌ధాన వ‌క్త‌. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌తినిధుల‌కు త‌న హోట‌ల్‌లోనే వ‌స‌తి ఏర్పాటు చేశారు విరావైథ‌య‌. ఆయ‌న విధానాలు ఎంత విభిన్నంగా ఉంటాయో .. ఆయ‌న హోట‌ల్ పేరును చూస్తేనే తెలిసిపోతుంది. బ్యాంకాక్‌లో ఉన్న విరావైథ‌య‌ హోట‌ల్ పేరు క్యాబేజెస్‌ అండ్ కండోమ్స్‌.

image


మూడు ద‌శ‌ల ద్వారా దేశంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నరు విరావైథ‌య‌. పాపులేష‌న్ అండ్ క‌మ్యునిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అసోసియేష‌న్ (పీడీఏ)ను 1974లో ఏర్పాటు చేశారు. సునామీ బీభ‌త్సం త‌ర్వాత గ్రామాభివృద్ధిలో ప్ర‌జ‌ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు రూర‌ల్ క‌మ్యూనిటీ ఎంప‌వ‌ర్‌మెంట్‌ను 2004లో ప్రారంభించారు. అలాగే త‌న మెకాయి విరావైథ‌య‌ ఫౌండేష‌న్ ద్వారా మెకాయి ప‌ట్టాణ స్కూల్ అండ్ గ్రీన్ విలేజ్ టాయ్ లైబ్ర‌రీలో యువ‌కులకు విద్య నందిస్తున్నారీయ‌న‌. ఈ కార్య‌క్ర‌మాల‌కు కొంద‌రు మాన‌వ‌తావాదుల‌తోపాటు ''క్యాబేజెస్ అండ్ కండోమ్స్‌", "బ‌ర్డ్స్ అండ్ బీస్‌", "బిజినెస్ ఫ‌ర్ రూర‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ (బ్రెడ్‌)" వంటి సామాజిక సంస్థ‌లు భారీగా విరాళాలు ఇచ్చాయి. మెకాయిని థాయిలాండ్‌లో ముద్దుగా మిస్ట‌ర్ కండోమ్, కండోమ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఐతే త‌న హాస్య‌చ‌తుర‌త‌తో కంట్రాసెప్టివ్ పిల్స్‌పై ఈయ‌న చేసిన ప్ర‌భావ‌వంత‌మైన ప్ర‌చారాన్ని టీఈడీ, టైమ్‌, అప్‌వ‌ర్తీ వంటి అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు కూడా విశేషంగా ప్ర‌శంసించాయి.

image


image


మెకాయి విరావైథ‌య‌ నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు థాయిలాండ్‌లో జ‌నాభా రేటును అరిక‌ట్టేందుకు, ఫ్యామిలీసైజ్‌ను త‌గ్గించేందుకు విశేషంగా కృషి చేశాయి. 1970 మ‌ధ్య‌లో థాయిలాండ్‌లో ఒక్కో ఫ్యామిలీలో క‌నీసంగా ఏడుగురు పిల్ల‌లుండేవారు. దాన్ని 2005 క‌ల్లా రెండుకు త‌గ్గించ‌డంలో ఈ మిస్ట‌ర్ కండోమ్ పాత్ర అనిర్వ‌చ‌నీయం. సుర‌క్షిత శృంగారం కోసం కండోమ్ వాడ‌కం త‌ప్ప‌నిస‌రి అంటూ దేశ‌వ్యాప్తంగా వినూత్న‌ ప్ర‌చారం నిర్వ‌హించారీయ‌న‌. కండోమ్‌ల‌తో రూపొందించిన‌ వివిధ ర‌కాల ఆకృతుల‌ను న‌గ‌రంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. అర‌క్షిత శృంగారంతో త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా, హ్య‌ూమ‌ర‌స్‌గా ప్ర‌ద‌ర్శించారు. కండోమ్‌ల‌తోనే పోస్ట్ బాక్స్‌లు, డ‌స్ట్‌బిన్లు, డిజైనర్‌ బ‌ల్బ్స్ వంటివాటిని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చారు. అత్యంత జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ను ఇలా సున్నితంగా, సరదాగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి అనుకున్న‌ది సాధించారు. ఇలాంటి సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నందుకు అమెరికాకు చెందిన గేట్స్ ఫౌండేష‌న్ నిర్వాహ‌కులు బిల్ అండ్ మెలిండా మిలియ‌న్ డాల‌ర్ల‌ను విరాళంగా ఇచ్చారు.


మిస్టర్ కండోమ్ - మెకాయి విరావైథ‌య‌

మిస్టర్ కండోమ్ - మెకాయి విరావైథ‌య‌


కింద ప్ర‌చురిత‌మైన ఫొటోలు మెకాయ్ ప్ర‌జెంటేష‌న్‌కు చెందినవి. అలాగే నిజాలు ఎంత క‌ఠినంగా ఉంటాయో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా హ్య‌మ‌ర‌స్‌గా త‌న రెస్టారెంట్‌లో మ‌రికొన్ని ఫొటోల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు విరావైథ‌య‌. ఇలాంటి హాస్య‌చ‌తుర‌తతో కూడిన దైర్య‌మే దేశంలో సామాజిక క‌ట్టుబాట్ల‌ను తెంప‌గ‌లిగింది. సుదీర్ఘ కాలంలో థాయిలాండ్‌లో సామాజిక మార్పుల‌ను తీసుకురాగ‌లిగింది.

image


image


image