పరిశ్రమలకు పెద్ద పీట !

Monday February 29, 2016,

2 min Read

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చాలా బ్యాలెన్స్ డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కార్పొరేట్ల నుంచి కామన్ మ్యాన్ వరకూ ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయడాన్ని చూస్తే ఇది మోడీ మార్క్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎంతోకాలం నుంచి అనాదరణకు గురవుతున్న వ్యవసాయ రంగానికి అరుణ్ జైట్లీ పెద్ద పీట వేశారు. ప్రతీ బడ్జెట్ ప్రసంగంలో ఒకటి రెండు నిమిషాలకు మాత్రమే పరిమితమయ్యే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఈ సారి బడ్జెట్ ప్రసంగంలో పదిహేను నిమిషాలకంటే ఎక్కువే సమయం దొరికింది. 2017 నాటికి అన్ని గ్రామాలకూ విద్యుత్, డైరీ ప్రాజెక్టులకు ఊతమిచ్చారు. స్వచ్ఛ్ భారత్ కు ఏ మాత్రం లెక్కతక్కువ కాకుండా చూసుకుంటూనే.. పారిశ్రామికవేత్తలకూ పెద్ద పీటవేశారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమ ప్రారంభంలో భాగంగా ప్రధాని మోడీ చేసిన ప్రకటనలకు ఈ బడ్జెట్ కొనసాగింపు అనే చెప్పాలి!

undefined

undefined


ఒక్క రోజులోనే కంపెనీల రిజిస్ట్రేషన్

కంపెనీస్ యాక్ట్ 2013లో మార్పులు చేస్తూ, కంపెనీల రిజిస్ట్రేషన్ ఒక్క రోజులో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మోడీ గతంలో చెప్పారు. మొబైల్ యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు కల్పించబోతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన మొబైల్ యాప్ లాంఛ్ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

పన్ను రాయితీ

స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఐదేళ్లలో మూడేళ్లకు లాభాల్లో 100 శాతం పన్ను రాయితీ. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వర్తింపు. ఇదే విషయాన్ని బడ్జెట్లో మరోసారి స్పష్టం చేసిన జైట్లీ.

కొత్త ప్రకటనలు

ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 500 కోట్ల కేటాయింపు

''ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాలు పొందే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఎస్సీ,ఎస్టీ ఆంట్రప్రెన్యూర్ల కోసం ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తున్నాం ''.

వచ్చే ఏడాది బి ఆర్ ఆంబేద్కర్ 125 జయంతి సందర్భంగా, ప్రతీ బ్యాంక్ శాఖ.. ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తలకు మెరుగైన వనరులు కల్పించే విధంగా రెండు ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన. ఎస్టీ, ఎస్టీలు సాధికారత సాధించాల్సిన సయమమిది.

నైపుణ్యాభివృద్ధి, ఆంట్రప్రెన్యూర్షిప్ బోధన కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఆన్ లైన్ కోర్సులు.

స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించేందుకు 1500 శాఖలను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. ఇందుకోసం ఈ ఏడాది రూ.1700 కోట్ల నిధుల కేటాయింపు.

undefined

undefined


దివాలా బిల్లు

2016-17లో బ్యాంక్రప్సీ, ఇన్సాల్వెన్సీ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు దివాలా విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుంది.

చిన్న కంపెనీలకు ఊరట

రూ. 5 కోట్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ ను 29 శాతానికి తగ్గించారు.

కార్పొరేట్ ట్యాక్స్ 2015-16 ప్రకారం రూ. 10 కోట్ల ఆదాయం ఉన్న దేశీయ కంపెనీలకు 30 శాతం ఆదాయపు పన్నుతో పాటు, 5 శాతం సర్ఛార్జ్ విధించే వారు. కోటి కంటే ఆదాయం తక్కువున్న సంస్థలకు సర్ ఛార్జ్ ఉండేది కాదు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నిబంధన వర్తింపజేసి కార్పొరేట్ పన్నును 29 శాతానికి తగ్గించి ఏకీకృతం చేశారు. 

అనువాదం: నాగేంద్ర సాయి