పొరిగింటి వంటకాల రుచి చూపించే టిఫిన్‌వాలా

ఇంటర్నేషనల్ బ్యాంక్‌ను వదిలి టిఫిన్‌వాలాను ఏర్పాటు చేసిన అక్షయ్పొరిగింట్లో చేసిన వంటకాలను షేర్ చేసే ప్లాట్‌ఫామ్ టిఫిన్‌వాలాలండన్‌లో ఎదర్కొన్న సమస్యల కారణంగా సొంత వ్యాపారం మొదలుపెట్టిన అక్షయ్ఫుడ్ ఇండస్ట్రీలో ఏటా 16 నుంచి 20 శాతం వృద్ధి

పొరిగింటి వంటకాల రుచి చూపించే టిఫిన్‌వాలా

Friday August 21, 2015,

4 min Read

పొరిగింటి పుల్ల కూర రుచి. ఇది తెలుగులో ఓ సామెత. మన ఇంట్లో ఎంత మంచి వంటకాలు వండినా, పొరిగింటి పుల్లే కూర నచ్చుతుంది కొందరికీ. అలా పొరిగింట్లో చేసిన వంటకాలను రుచి చూపించేందుకు టిఫిన్‌వాలా స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు ముంబైకి చెందిన అక్షయ్ భాటియా.

చాలామందికి లంచ్ చేసే సమయంలో పక్కన ఉండేవారి బాక్స్‌లో ఉన్నవాటిని రుచి చూడటం ఇష్టం. అయితే అవి ఎంత బాగున్నా రెండోసారి తీసుకోవాలంటే మొహమాటం అడ్డొంస్తుంటుంది. అందరిలాగే ముంబైకి చెందిన 24 ఏళ్ల అక్షయ్ భాటియా కూడా తన కోలిగ్స్ లంచ్ బాక్స్‌లోని వంటకాలను రుచి చూసేవారు. ఆ తర్వాత మరింత తీసుకోవాలని అనిపించినా మొహమాటం కారణంగా తీసుకోలేకపోతుండేవారు. పక్కవాడి లంచ్ బాక్స్‌ను షేరు చేసుకోవాలన్న ఆలోచనే అక్షయ్ జీవితంలో సరికొత్త ఆరాంభానికి నాంది పలికింది.

లండ‌న్‌లో త‌న కార్యాల‌యంలో లంచ్ సమ‌యంలో అక్ష‌య్‌

లండ‌న్‌లో త‌న కార్యాల‌యంలో లంచ్ సమ‌యంలో అక్ష‌య్‌


లండ‌న్‌లో మోర్గాన్ స్టాన్లీలో బ్యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో చల్లటి ఆహారాన్ని తిన‌లేక అక్ష‌య్ విసుగెత్తిపోయారు. ‘‘నా జీవితాన్ని నేను ర‌క్షించుకునేందుకు వంటచేసుకోలేకపోయేవాడిని. కేవలం టోస్టులు చేసుకోవడం మాత్రమే తెలుసు’’ అని ముంబైలోని త‌న నివాసంలో యువ‌ర్‌స్టోరీకి వివ‌రించారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో గంటలకొద్దీ ప‌నిచేయాల్సి రావ‌డంతో ఫాస్ట్‌ఫుడ్, స‌బ్ వే సాండ్‌విచ్‌ల‌తోనే కాలం వెల్లదీసేవారు అక్షయ్. 

‘‘నాకు వింత అనిపించింది. ఎప్పుడో తయారుచేసిన సాండ్‌విచ్‌కు ఐదు పౌండ్లు ఎందుకు చెల్లించాలో. సాండ్‌విచ్‌లన్నీ బల్క్‌గా చేస్తారు. అది కూడా నాకు నచ్చని దానికి అంత డబ్బు చెల్లించాలా అని అనిపించేది’’ అని లండన్‌లో గడిపిన రోజులను అక్షయ్ గుర్తుచేసుకున్నారు.

ఇంటికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేసే అందరు భారతీయుల్లాగే అక్షయ్ కూడా లంచ్ సమయంలో తన కొలిగ్స్ లంచ్‌ బాక్స్‌ల వైపు చూడటం ప్రారంభించారు.

‘‘చాలామంది ఉద్యోగులు ఆఫీస్‌లకు టిఫిన్ డబ్బాలను తెచ్చుకుంటారు. అందులోంచి కొంత నేను కూడా టేస్ట్ చేస్తుంటాను. కానీ రెండోసారి మళ్లీ అడగడానికి మొహమాటం అడ్డొస్తుంటుంది. దీనికి పరిష్కారం కనుక్కోవాలని నాకు అనిపించింది’’ అని అక్షయ్ తెలిపారు.

ఈ ఆలోచన అక్షయ్‌ను చాలా చికాకు పెట్టింది. తన సమస్య ఏమిటో ఓ పేపర్‌పై రాసుకున్నారు అక్షయ్. ‘‘మొదట నాకు ఏమనిపించిందో దాన్ని పేపర్‌పై పెట్టాను. చక్కటి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినాలి. ఆ తర్వాత దానికి పరిష్కారం కూడా రాశాను. ఎవరైనా ఒకరు నాకు వండిపెట్టాలి’’ అని అక్షయ్ రాసుకున్నారు. అయితే చేయడం కంటే చెప్పడం చాలా సులభమని అప్పుడాయన గ్రహించారు.

దీంతో కొలిగ్స్‌తో ఆహారాన్ని షేర్ చేసుకునే ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని అక్షయ్ నిర్ణయించారు.

‘‘అయితే ఈ ఐడియా లండన్‌లాంటి ప్రాంతాల్లో వర్కవుట్ కాదని గుర్తించాను. అక్కడి ప్రజలు వారే స్వయంగా తెచ్చుకుంటారు. లంచ్ మిగిలిపోతే దాన్ని డిన్నర్‌ కోసం భద్రపర్చుకుంటారు. ఆహారాన్ని షేర్ చేసుకునే అలవాటు కేవలం ఆసియా కమ్యూనిటీకి మాత్రమే ఉంది. లండన్‌లో నేను పనిచేస్తున్న సమయంలో నాకేమైనా కావాలా అని నా ఇండియన్ ఫ్రెండ్స్ అడుగుతుండేవారు. కానీ నాకు వారి నుంచి ఏదీ ఆశించడం ఇష్టం ఉండదు. డబ్బులు తీసుకోకుండా వారు ఆహారాన్ని ఇస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది’’ అని లండన్‌లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు అక్షయ్.

పొరిగింటి పుల్లకూర రుచి..

నగరాలు విస్తరిస్తున్నప్పటికీ కుటుంబాలు మాత్రం చిన్నవైపోతున్నాయి. పొరిగింటి వంటకాల ఘుమఘుమలు మన కిటికీ నుంచి వస్తుంటే, అలాంటి వంటకాలు తినాలని ఎవరికైనా అనిపించడం సహజమే. ఈ ఏడాది జనవరిలో అక్షయ్ హాలీడేస్ ‌కోసం ముంబై వచ్చారు. ఈ సమయంలో తన ఫుడ్ షేరింగ్ ఐడియాను టెస్ట్ చేయాలని అనుకున్నారు. ముంబైలో తాను నివసించే పొవాయ్ ప్రాంతంలో చిన్నపాటి సర్వే నిర్వహించారు. 

‘‘మా ఇంటిదగ్గర ఉండే ప్రజలను వారి ఆహార అలవాట్ల గురించి అడిగాను. ఇతరులు తెచ్చుకున్న ఆహారాన్ని రుచిచూస్తారా అని ప్రశ్నించాను. అందులో చాలామంది పొరుగింటి వంటకాలను రుచిచూడాలనిపిస్తుందని చెప్పారు’’ అని అక్షయ్ వివరించారు.

బ్యాక్ టు హోమ్..

ఫుడ్‌షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలన్న ఆలోచన కారణంగానే లండన్‌ను వదిలి అక్షయ్ తిరిగి భారత్ వచ్చేలా చేసింది. 

‘‘నా కోసం నేను ఏదైనా చేసుకోవాలన్న ఆలోచనను అమలు చేయాలనిపించింది. అందుకు ఫుడ్‌ షేరింగ్ ప్లాట్‌ఫామ్ సరైనదని నాకు అనిపించింది. కొన్నేళ్లుగా నేను కార్పొరేట్ సైకిల్‌లో బందీ అయిపోయాను’’ అని అక్షయ్ వివరించారు.

వార్విక్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చేసేందుకు లండన్ వెళ్లిన అక్షయ్ 2011లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్‌కు ఎంపికయ్యారు. ఏడాదిన్నరపాటు ఈక్విటీ రిస్క్ డివిజన్‌లో, మరో ఏడాదిన్నరపాటు అసెట్ మేనేజ్‌మెంట్ డివిజన్‌లో పనిచేశారు.

‘‘మూడేళ్లపాటు మోర్గాన్ స్టాన్లీలో పనిచేశాను. అప్పడప్పుడనిపించేది.. నిజంగా నా పనికి నేను న్యాయం చేస్తున్నానా అని.. ? వదిలివేయాలని చాలా సార్లు అనుకున్నాను. ఒకవేళ నేను జాబ్ మానేస్తే.. ఎవరికీ నష్టం ఉండదు.. నేను వెళ్లిపోతున్నానని బాధపడేవారు ఆ సంస్థలో ఒక్కరు కూడా లేరు. నాకు సరైన గౌరవమివచ్చే లేదా జీవితంలో మంచి మార్పును తెచ్చే వ్యాపారాన్ని సొంతంగా చేయాలని అనుకున్నాను’’ అని అక్షయ్ వివరించారు.

ఆ తర్వాత ఫుడ్‌ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ ఆలోచనపై పనిచేయాలన్న నిర్ణయం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. ‘‘మేం మొదటగా మట్టర్‌ఫ్లై యాప్‌ను రూపొందించాం. దాని బేటా వెర్షన్‌ను మా అపార్ట్‌మెంట్‌లోనే తొలిసారి టెస్ట్ చేశాం. ప్రజలు తాము షేర్ చేసే వంటకాల గురించి ముందుగానే చెప్పాలి. పొరిగింటి వంటకాలను రుచి చూసేందుకు ఓ ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించాం. అది పెద్ద విజయం సాధించింది. మా అపార్ట్‌మెంట్‌లో 120 ఫ్లాట్స్ ఉంటే 70 మంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అందులో ఎక్కువగా 40-60 వయసు వారు ఎక్కువగా పాల్గొన్నారు’’ అని అక్షయ్ తెలిపారు.

ఫుడ్ రేస్..

ఆ తర్వాత జాబ్ కోసం అక్షయ్ మళ్లీ లండన్ వెళ్లలేదు. తాను ఇక్కడే ఉండి సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తానని తల్లిదండ్రులను ఒప్పించారు. కానీ ఫుడ్‌ షేరింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంపై ఆయన నానమ్మను ఒప్పించడం అక్షయ్‌కు తల ప్రాణం తోకకొచ్చింది.

‘‘మాది జాయింట్ ఫ్యామిలీ. లండన్‌ను వదిలి ఇక్కడే ఉండాలనుకుంటున్నానని మా నానమ్మకు చెప్పి ఒప్పించడం చాలా కష్టమైంది. అంతర్జాతీయ బ్యాంక్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలి టిఫిన్‌వాలా అవతారం ఎత్తుతున్నాని తెలుసుకుని, నాకు పిచ్చిపట్టిందని ఆమె భావించారు. ఫోన్‌లో నేను ఫుడ్ ఆర్డర్లు తీసుకుంటానని ఆమె ఊహించుకునేవారు’’ అని అక్షయ్ చెప్పారు.
యాప్ ఎలా పనిచేస్తుందో తన నానమ్మకు వివరిస్తున్న అక్షయ్

యాప్ ఎలా పనిచేస్తుందో తన నానమ్మకు వివరిస్తున్న అక్షయ్


ఫుడ్ సర్వీస్ సెక్టార్ 50 బిలియన్ డాలర్లను చేరింది. ప్రతి ఏటా దాని వృద్ధి రేటు 16% నుంచి 20% ఉంటుంది. ఫుడ్ స్టార్టప్‌లో అనుభవమున్న జిత్ సాలుంకే, టెక్నాలజీలో అనుభవమున్న ధావల్ మెహతా, మరో ఇద్దరు ఫ్రీలాన్సర్లతో కలిసి అక్షయ్ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. తొలి నెలలోనే ముంబై నగరంలో ఆహార ప్రియులు వాడుకునేందుకు వీలుగా ఓ యాప్‌ను కూడా రూపొందించింది అక్షయ్ టీమ్.

వచ్చే కొన్ని నెలల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో ఫుడ్ షేరింగ్‌పై ఆసక్తి ఉన్న సమాజాన్ని గుర్తించాలనుకుంటున్నాం. వచ్చే ఫేజ్‌లో మరిన్ని ప్రత్యేక వంటకాలను పరిచయం చేయాలనుకుంటున్నామని అక్షయ్ తన ప్రణాళికలను వివరించారు.

ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాలను సంపాదించడంపై వారు ద్రుష్టిసారించారు. ‘‘మా యాప్‌ను ఉపయోగించుకుని వ్యాపారం చేయాలని చాలామంది చెఫ్‌లు భావిస్తున్న విషయాన్ని గుర్తించాం. దీంతో మసాలా మేకర్స్ పేరుతో చిన్నపాటి వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. మసాలాలు ఉపయోగించి వేగంగా తయారు చేసే వంటకాలను మేం చిన్న, చిన్న వీడియోల ద్వారా మా యాప్‌లో పొందుపర్చాలనుకుంటున్నాం. అలాగే ఇదే ప్లాట్‌ఫామ్లో డెజర్ట్ తయారీ కూడా వివరించాలన్నదే మా సుదీర్ఘ కాల ప్రణాళిక. పొరిగింటి వంటకాలను స్వీట్స్ ఇచ్చి తీసుకోవడం ఈ ప్లాన్ ఉద్దేశం’’ అని అక్షయ్ తెలిపారు.

ప్రస్తుతానికైతే సొంతమూలధనంతోనే సంస్థను నడపాలని అక్షయ్ భావిస్తున్నారు. లండన్‌లో మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో దాచుకున్న సొమ్మును ఈ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నారు.

వెబ్‌సైట్: Download the app here