మీ దగ్గర చెత్త ఉంటే మాకు పంపించండి మహాప్రభో..  

పొరుగు దేశాలకు స్వీడన్ రిక్వెస్ట్

0

అవును మీరు చదివింది నిజమే. స్వీడన్ దేశానికి గార్బేజ్ కరువొచ్చింది. మీ దగ్గర ఎంత చెత్త ఉంటే అంత పంపి పుణ్యం కట్టుకోండి బాబూ అని పక్క దేశాలకు కబురు పంపింది. ఎందుకంటే ఆ దేశంలో ఉత్పత్తయ్యే కరెంటులో సగం- చెత్త, ఇతర రెన్యూవబుల్ సోర్సుల నుంచే జెనరేట్ అవుతుంది. 1991 నుంచి శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని మాగ్జిమం తగ్గించింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడొక్కసారిగా ఆ దేశానికి చెత్తకు కరువొచ్చే సరికి పవర్ ప్రొడక్షన్ ఢామ్మని పడిపోయింది. 2014లో 8లక్షల టన్నుల చెత్తను జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారంటే.. పవర్ ప్రొడక్షన్‌లో చెత్త పాత్ర ఏంటో మీరే ఊహించుకోవచ్చు.

గత రెండు దశాబ్దాలుగా చెత్త రీ సైక్లింగ్ చేయడంలో ఏ దేశమూ అందుకోలేనంతగా స్వీడన్ అడ్వాన్స్ అయిపోయింది. గత ఏడాది ఆ దేశంలో కేవలం ఒక్క శాతం చెత్త మాత్రమే వృథా అయిందంటే అర్ధం చేసుకోవచ్చు..స్వీడన్ ప్రజలకు ప్రకృతి, పర్యావరణం సమస్యలపై ఎంత అవగాహన ఉందో. పనికిరానిది ఏదీ బయటకి విసిరికొట్టరు. ఆ విషయంలో ఎంతో స్ట్రిక్టుగా ఉంటారు. రీ సైక్లింగ్ అన్నది వాళ్ల దృష్టిలో చాలా విలువైనది.

కోహెసివ్ నేషనల్ రీ సైక్లింగ్ పాలసీని స్వీడన్ పకడ్బందీగా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ఇతర ప్రైవేటు కంపెనీలు కూడా చెత్తను కాల్చడం ద్వారా వచ్చే ఎనర్జీని నేషనల్ హీటింగ్ నెట్ వర్క్‌ కు పంపిస్తాయి. దీనిద్వారా చలికాలంలో వెచ్చగా ఉండేందుకు నివాస గృహాలకు హీట్ వేవ్స్ అందిస్తారు. అదే దక్షిణ యూరప్ లో అయితే హీట్ వేవ్స్ కోసం చిమ్నీలు ఏర్పాటు చేసుకుంటారు.

స్వీడిష్ మున్సిపాలిటీలు కూడా భవిష్యత్ చెత్త అవసరాలపై నిధులు ఖర్చుపెడుతోంది. నివాస గృహాల మధ్య ఆటోమేటిక్ వాక్యూమ్ సిస్టమ్, చెత్తను సేకరించే ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ పక్కాగా ఉండేలా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ కంటెయినర్ల వ్యవస్థపై దృష్టి సారించింది. ఎందుకంటే చెత్తను స్టోర్ చేసినప్పుడు ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండాలని ఇలాంటి చర్యలు చేపట్టింది. ఇప్పుడు వారి అవసరాలకు తగిన చెత్త లేకపోవడంతో..  కచరా ఉంటే పంపండి మహాప్రభో అని పొరుగు దేశాలకు కబురు పెట్టింది.

Related Stories