ఖరీదైన టూరిస్ట్ ప్లేసుల్లో చవకైన వసతికి కేరాఫ్.. జాస్టల్

ట్రావెలింగ్‌ని ప్రోత్సహించడమే లక్ష్యంఅత్యుత్తమ హాస్టల్ కోసం వెతుకులాట అవసరం లేదుఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడేందుకు యువతకు అవకాశంగ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు కోసం కృషి

0

చాలామందికి ప్రయాణాలు చేయడమంటే మహా సరదా. ఇక యువత అయితే చెప్పనవసరం లేదు. సరిపడినంత డబ్బు చేతిలో పెట్టి తిరిగి రమ్మంటే ఎక్కడికైనా, ఎలాగైనా, ఎవరితోనైనా, ఎప్పుడైనా వెళ్లడానికి సై అంటారు. అంతా బాగానే ఉంది. మరి వెళ్లిన ప్రదేశాల్లో తినడానికి అంటే ఏదో ఒకటి కొనుక్కుంటాం, లేదా ఇంటి నుంచి తీసుకెళ్తాం. లేకపోతే ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉండనే ఉంటాయి. మరి వసతి మాటేమిటి ? దీనికి కూడా ఎన్నో లాడ్జిలు, రిసార్టులు ఉంటాయి. నిజమే. కానీ లాడ్జిలు, రిసార్టులలో ఉంటే... మీ దగ్గరున్న డబ్బుతో ఎన్ని ప్రదేశాలు చూడగలరు ? ఫుడ్ అంటే ఇష్టం లేకపోతే పడేయొచ్చు, అది చవకైన వ్యవహారం కూడానూ. జస్ట్ థింక్!!

దీంతో ట్రావెలింగ్ అనేది ఓ కాస్ట్లీ అఫైర్ గా మారిపోయింది. యువత కనీసం తమ చుట్టు పక్కలనున్న ప్రదేశాలు కూడా తిరగడం లేదు. ఇక వారికి విజ్ఞానం ఎలా వస్తుంది ? సమాజంపై అవగాహన ఎలా పెరుగుతుంది ? దీనికి సరైన సమాధానమే “జోస్టెల్”. ఈ పేరే వింతగా ఉంది కదా!

“భారత దేశ యువతకు ట్రావెలింగ్‌పై ఆసక్తిని పెంచడమనే ఏకైక ఉద్దేశంతో ప్రారంభమైనదే జోస్టెల్”… అంటారు దీన్ని స్థాపించిన వారిలో ఒకరైన ధరమ్ వీర్ సింగ్ చౌహాన్. ఎప్పుడూ ప్రయాణాల్లో మునిగితేలే యువతను, యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు మొదట రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ జోస్టెల్‌ను ప్రారంభించారు చౌహాన్. కొత్త నగరానికి వచ్చినప్పుడు మనకు అనువైన వసతిని వెతుక్కోవడం కొంచెం ఇబ్బందికరమైన పనే. ఆ ఇబ్బందిని దూరం చేసేందుకే... జైపూర్ తో ప్రారంభమైన వీరి జైత్రయాత్ర మరో 8 నగరాలకు విస్తరించింది. ఈ విస్తరణలో భాగంగా జోస్టెల్ నిర్వహణకు ఎన్నో నిధులు కూడా సమకూరాయి.

“#BeYou... ఇది జోస్టెల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం. దీని ద్వారా ఎవరైనా ఓ ఆంట్రప్రెన్యూర్ కావచ్చు. కాకపోతే... కొద్దిగా పెట్టుబడి అవసరం. తమ సొంత నగరం లేదా పట్టణంలో జోస్టెల్ ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షలతో ఎవరైనా ముందుకొస్తే... వారికి కావలసిన మార్కెటింగ్, సేల్స్, బ్రాండింగ్, ప్రమోషన్, సిబ్బంది శిక్షణ వంటి మిగిలిన అంశాలన్నీ జోస్టెల్ టీమ్ చూసుకుంటుంది. వీటికోసం గానీ, జోస్టెల్ బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించుకుంటున్నందుకు గానీ ప్రత్యేకించి ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. పెట్టుబడి ఎందుకు అడుగుతున్నామంటే... మాతో భాగస్వాములు కావాలనుకునేవారు జోస్టెల్‌ను ఓ ఉద్యోగం, వ్యాపారంలా కాకుండా ఓ బాధ్యతగా భావించాలనేదే మా లక్ష్యం. వారు ఈ ప్రమాణాలను అందుకోగలిగితే ఇక మిగిలినదంతా జోస్టెల్ టీమ్ చూసుకుంటుంది” అంటారు మరో కో-ఫౌండర్ అఖిల్ మాలిక్.

జోస్టెల్... తన కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. జోస్టెల్ కి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, నిర్వహణ ఖర్చులు, ఒక్కొక్క బెడ్ కి ఫీజు, వ్యూహాలు, లాభాలు వంటి అన్ని వివరాలతో మార్కెట్లో ప్రమోషన్ చేయడానికి సిద్ధమైంది. ఈ 8 నెలల కాలంలో వారికి లభించిన ఆదరణను కూడా ప్రచారంలో భాగంగా వివరించనున్నారు. ఎలాంటి దాపరికాలు లేని బిజినెస్ కోసం, ఆ వివరాలను అందరికీ తెలియచేయడానికి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రూపొందించారు. దీనిలో దేశీయంగా, విదేశాల్లోనూ జోస్టెల్ కార్యకలాపాలపై సవివరంగా చెప్పారు. ఎందుకు ఇలా వినూత్నంగా చేశారు? అని ఎవరైనా అడిగితే... “ఆంట్రప్రెన్యూర్ షిప్ పై ఆసక్తి ఉన్నవారికి దానిపై అవగాహన కల్పించి, మరింత ప్రోత్సహించడానికే మేం ఇలా చేయాలనుకుంటున్నాం. కొత్తగా ఏదైనా చేయాలనుకునే వారికి అందులో ఉండే లాభ నష్టాలను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. అవగాహన లేమి, అనుభవ లేమి, సిబ్బంది కొరత కారణంగా తమ బిజినెస్‌లో సరైన దిశలో వెళ్లలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారందరికీ మేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం” అంటారు అఖిల్.

పెట్టుబడికి ఇలా వస్తుంది ప్రతిఫలం
పెట్టుబడికి ఇలా వస్తుంది ప్రతిఫలం

జోస్టెల్ లక్ష్యం ఒక్కటే... ఓ మంచి బ్యాక్ ప్యాకింగ్ బ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం. వచ్చే 6 నెలల్లో భారత దేశం మొత్తం తమ శాఖలను విస్తరించాలనేది వీరి లక్ష్యం. ఆ తర్వాత లక్ష్యం దక్షిణాసియాతో పాటు ఇతర దేశాల్లో విస్తరణ. జోస్టెల్ బ్రాంచ్ లలో కొన్ని సొంతంగా ప్రారంభించినవి, కొన్ని వేరేవారి సహాయంతో ప్రారంభించినవి, కొన్ని పూర్తిగా వేరే వారి ఆధ్వర్యంలో జోస్టెల్ సహకారంతో నిర్వహిస్తున్నవి. “అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే... కొద్ది కాలంలోనే జోస్టెల్ ఓ వరల్డ్ బ్రాండ్ గా అవతరిస్తుంది”... అని తమ భవిష్యత్ ప్రణాళికలు చెప్తారు అఖిల్.

సో రీడర్స్... మీరు ఇక ఏ సిటీకి వెళ్లినా... వసతి కోసం తర్జన భర్జన పడనవసరం లేదు. జోస్టెల్ చిరునామా తెలుసుకోండి. మీ టూర్ ని ఎంజాయ్ చేయండి.

జోస్టల్,జైపూర్‌లోని డార్మిటరీ
జోస్టల్,జైపూర్‌లోని డార్మిటరీ

ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఇది పూర్తిగా బ్యాక్ ప్యాకర్స్ స్పెషల్ హాస్టల్ లాంటిది. ఇది రొటీన్ ట్రావెలర్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. కొత్త వాళ్లను కలుసుకోవాలనే తపన, తాపత్రయం, ఇతరుల నుంచి ఏమైనా నేర్చుకుందామనే ఆశ ఉన్నవాళ్లకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. తక్కువ ఖర్చులో ఒక్కరైనా హ్యాపీగా వెళ్లి ప్రయాణం చేసి రావొచ్చు.


జైపూర్ జోస్టల్ కామన్ రూమ్ ఇది
జైపూర్ జోస్టల్ కామన్ రూమ్ ఇది