వర్చువల్ రియాలిటీలో మెరాకీ సక్సెస్‌ఫుల్ ఎంట్రీ

వర్చువల్ రియాలిటీలో మెరాకీ సక్సెస్‌ఫుల్ ఎంట్రీ

Tuesday April 26, 2016,

4 min Read


వర్చువల్ రియాలిటీ(వీఆర్). నిన్నా మొన్నటివరకు.. చాలామంది దీన్నో సుదూర స్వప్నంగా భావించేవారు. భారత్‌లో రావడానికి కొన్నేళ్లు పడుతుందని అనుకునేవాళ్లు. కేవలం రోబోలు, మెషిన్లకు మాత్రమే సంబంధించిన టెక్నాలజీగానే భావించేవారు. అయితే ఈ టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటులోకి వస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే వీఆర్ టెక్నాలజీలో ఎన్నో వీడియోలను రూపొందించింది. మెరాకీతోపాటు మరికొన్ని సంస్థలు కూడా ఈ టెక్నాలజీ రంగంలో వినూత్నమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయి.

గత ఏడాది నవంబర్‌లో అరవింద్ ఘోర్వాల్, సాయిరామ్ సాగిరాజు, పార్థ్ చోక్సీ, ఆగమ్ గార్గ్‌ మెరాకిని స్థాపించి భారత్‌లో తొలి వీఆర్ కంటెంట్ ప్రొడక్షన్ స్టూడియోను ప్రారంభించారు.

ఈవెంట్లు, ఫిల్మ్స్, టూరిజమ్, స్పోర్ట్స్, అడ్వెంచర్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ఎక్స్‌పెరిన్షియల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, వెడ్డింగ్, న్యూస్, ఫిక్షన్ల కోసం 360 డిగ్రీల కోణంలో వీడియో, ఫిల్మ్స్‌ను రూపొందించారు. వీఆర్ కంటెంట్ ప్రొడ్యూసింగ్‌లో ఈ సంస్థ ఎండ్ టు ఎండ్ సేవలు అందిస్తోంది.

మెరాకీ టీమ్

మెరాకీ టీమ్


ముంబైకి చెందిన ఈ సంస్థ స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ క్రాఫ్ట్ కోసం అత్యాధునిక విజువల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ఉపయోగిస్తోంది. కొత్త టెక్నాలజీతో విజువల్ కంటెంట్ ఉపయోగించే విధానాన్నే మార్చేసింది.

‘‘వర్చువల్ రియాలిటీ ప్రేక్షకుల్లో ఓ విధమైన అవగాహనను కలుగచేస్తోంది. అంతేకాదు మానసిక సంబంధాన్ని సృష్టిస్తుంది. ప్రేక్షకులతో ఉద్వేగభరితమైన సంబంధాన్ని కలిగించే కంటెంట్‌ను రూపొందించాలన్నదే మా ఉద్దేశం’’ పార్థ్ 

ది బిగినింగ్..

ఉజ్జయినికి చెందిన అరవింద్‌కు మొదటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. బాంబే ఐఐటీలో చదువుతున్నప్పుడు ఎన్నో షార్ట్‌ఫిల్మ్స్‌, డాక్యూమెంటరీలను రూపొందించారు. అలా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. అలా విజువల్ లాంగ్వేజ్ మీద ఆసక్తితో ఓ సంస్థలో చేరారు. అక్కడే వీఆర్‌పై ఆసక్తి పెంచుకుని ఇమేజరీ, ఏరియల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తితో ఉన్న అరవింద్ కూడా మెరాకీతో ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీని ప్రారంభించారు.

సాయిరామ్ ఫిల్మ్ రైటర్, డైరెక్టర్. గ్రామీ అవార్డును గెలుచుకున్న విండ్స్ ఆఫ్ సంసారా మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌ను డైరెక్ట్ చేశాడు. అంతకుముందు ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీలో ఫిల్మ్ డాటా మోడల్‌ను డెవలప్ చేశారు. అలాగే హౌసింగ్.కామ్‌లో కంటెంట్ ప్రొడక్షన్ హెడ్‌గా వ్యవహరించారు.

ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి పార్థ్ రెండేళ్లపాటు ఐటీసీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఇంట్రా-సిటీ ప్రజా రవాణా వ్యవస్థ లెవో డ్రైవ్‌లో ఆగమ్ గార్గ్‌తో కలిసి పెట్టుబడులు పెట్టారు. బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ఆగమ్.. గతంలో ఒరాకిల్, క్రెడిట్ సుస్ వంటి సంస్థల్లో పనిచేశారు. వీరితోపాటు ఇద్దరు వీఆర్ స్పెషలిస్టులు, మరికొందరు ఫ్రీలాన్సర్లు కూడా ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్‌లలో పనిచేశారు.

వీఆర్ సెషన్‌ను నిర్వహిస్తున్న పార్థ్, అరవింద్

వీఆర్ సెషన్‌ను నిర్వహిస్తున్న పార్థ్, అరవింద్


సంస్థను ప్రారంభించి ఏడాది కూడా పూర్తవకముందే మెరాకీ ఆరు మేజర్ ప్రాజక్ట్‌లను చేపట్టింది. స్టార్ స్పోర్ట్స్, నెట్ వర్క్ 18, పర్సెప్ట్ పిక్చర్స్ (సన్‌బర్న్, హార్డ్‌వెల్), చానల్ వీ వంటి సంస్థలకు సేవలందించింది.

ముంబైలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రముఖ మ్యూజిషియన్ హర్డ్‌వెల్ ప్రదర్శనను తన తొలి ప్రాజెక్ట్‌లో భాగం 360 డిగ్రీ కాన్సర్ట్ ఫిల్మ్‌గా చిత్రీకరించింది మెరాకీ.

మెరాకీ ఖాతాలో అతి పెద్ద ప్రాజెక్ట్ గత ఫిబ్రవరిలో జరిగిన ఆసియా కప్. ఇండియా-పాకిస్థాన్, ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లను స్టేడియంలో ఉండి కవర్ చేసింది. ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రపంచంలోనే వర్చువల్ రియాలిటీలో కవర్ చేసిన తొలి క్రికెట్ మ్యాచ్. 

క్లయింట్లకు వర్క్ చేయడంతోపాటు వీఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రొప్రైటరీ కంటెంట్‌ను కూడా రూపొందిస్తోంది. ఇటీవలే రూపొందించిన ‘స్ట్రేంజర్స్ అగైన్’’ మంచి ఆదరణ పొందింది. అలాగే సామ్‌సంగ్ క్యూరేటెడ్ ప్లాట్‌ఫామ్ మిల్క్ వీఆర్‌పైనా లభిస్తోంది. సొంతమూలధనంతో ఏర్పాటైన మెరాకీ వర్చువల్ రియాలిటీలో బాంబే ఐఐటీ, విద్యాలంకార్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వర్క్‌షాపులు నిర్వహించింది.

మార్కెట్ రివ్యూ..

గేమ్స్, కంటెంట్, ఫిల్మ్స్ వంటి విభాగాల్లో వర్చువల్ రియాలిటీ రంగం 2020 నాటికి 150 బిలియన్ల రంగంగా ఎదుగుతుందని విశ్లేషకుల అంచనా. కంటెంట్ (ఫిల్మ్స్, గేమ్స్), హార్డ్‌వేర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (హ్యాండ్‌సెట్ ప్రొడ్యూసర్స్, ఇన్‌పుట్ డివైజెస్), సాఫ్ట్‌వేర్, ప్లాట్‌ఫామ్, డెలివరీ సర్వీసెస్ ప్రస్తుతానికి వీఆర్ మార్కెట్‌లో ప్రధానమైన రంగాలు.

కిరిబాటీ ద్వీపంలో సాయిరామ్, రికీ కేజ్

కిరిబాటీ ద్వీపంలో సాయిరామ్, రికీ కేజ్


అందరూ అనుకున్నట్టుగా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ సుదూర స్వప్నమేమీ కాదని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండేనని స్టాన్‌ఫోర్డ్ ఏంజెల్స్, ఆంట్రప్రెన్యూర్స్ ఇండియా కో-ప్రెసిడెంట్ అజయ్ లావాకరే అన్నారు. వీఆర్ హార్డ్‌వేర్ సెగ్మంట్‌ కూడా ఆలస్యంగానైనా మొత్తానికి ప్రారంభమైంది. సామ్‌సంగ్ గేర్ వీఆర్, ఆక్లస్ రిఫ్ట్, హెటీసీ వైవ్ వర్షన్లకు కూడా ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే వీఆర్ మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. గేమ్ కంటెంట్ రంగంలో వర్చువల్ రియాలిటీ ఇప్పటికే కనిపిస్తోంది కూడా.

పోటీ..

ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వీఆర్‌లో పోటీ పెద్దగా కనిపించడంలేదు. కొన్ని స్టార్టప్స్ మాత్రమే వీఆర్‌ రంగంలోకి బరిలోకి దూకాయి. బిట్స్ పిలానీ గోవా గ్రాడ్యుయేట్స్ అబెసెంటియా పేరుతో ఓ వీఆర్ స్టార్టప్‌ను ప్రారంభించారు. అస్ట్రాక్ వెంచర్స్, 50 కే వెంచర్స్‌తోపాటు మరికొందరు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. స్మార్ట్ విజ్‌ఎక్స్ పేరుతో ఓ జంట వర్చువల్ రియాలిటీ సొల్యూషన్ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ (ఐఎఎన్), స్టాన్‌ఫోర్డ్ ఏంజెల్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇండియా) వంటి సంస్థలు ఐదు లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి. రియల్ ఎస్టేట్‌తోపాటు మరికొన్ని ఇండస్ట్రీలకు ‘ఇమ్మెర్సివ్ టెక్నాలజీ’ని వర్చువల్ రియాలిటీని అందిస్తోందీ స్టార్టప్. స్పెక్ట్రా వీఆర్ సంస్థ వీఆర్ మీడియా ప్రొడక్షన్, టెక్నాలజీ సేవలను ముంబై, బెంగళూరులో అందిస్తోంది. ఇమ్మెర్సివ్ ఎడ్యుకేషన్ కోసం వీఆర్, గేమిఫికేషన్‌ను గ్రే కర్నల్ అందిస్తోంది. వీఆర్ అడాప్షన్ ప్రస్తుతమైతే తక్కువగానే ఉన్నప్పటికీ, సోనీ, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, వన్‌ప్లస్ ఫేస్‌బుక్ ఒక్లస్ ప్లాట్‌ఫామ్‌లో చేరాయి. భారత్‌లో వీఆర్ మార్కెట్ మరింత విస్తృతమవ్వాలంటే మాత్రం తక్కువ ధరకే హెడ్‌సెట్‌ను అందించాల్సి ఉంటుంది.

వీఆర్ ఫిల్మ్ స్ట్రేజంర్స్ అగైన్‌ను వీక్షిస్తున్న లవ్‌, సెక్స్ అండ్ ఢోకా స్క్రీన్, ప్లే, టిట్లీ డైరెక్టర్ కునుభెల్.

వీఆర్ ఫిల్మ్ స్ట్రేజంర్స్ అగైన్‌ను వీక్షిస్తున్న లవ్‌, సెక్స్ అండ్ ఢోకా స్క్రీన్, ప్లే, టిట్లీ డైరెక్టర్ కునుభెల్.


ఫ్యూచర్ ప్లాన్స్..

దేశంలో 160 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్స్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ మార్కెట్‌కు ఎన్నో అవకాశాలున్నాయని మెరాకీ టీమ్ భావిస్తోంది. ఓవైపు కంటెంట్ క్రియేట్ చేస్తూనే, మరోవైపు సొంతంగా ఇమ్మెర్సివ్ ప్రొడక్షన్ పనులను కూడా నిర్వహించాలన్నది మెరాకీ లక్ష్యం. ఇప్పటికే ఎన్నో వీడియాలను విడుదల చేసిన ఈ సంస్థ ప్రస్తుతం గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కేజ్‌తో కలిసి యునైటెడ్ నేషన్స్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తోంది. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసి మెరాకీ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది.