అర్ధరాత్రి వేళ ఆహారం డెలివరీ చేసే ది బూటీ కాల్

లేట్‌నైట్ పార్టీ అయ్యాక ఫుడ్ కావాలంటే ఎలా ?మిడ్‌నైట్‌లో మెడిసిన్ విక్రయాలుంటాయా ?తమ ఇబ్బందులనే వ్యాపారంగా మలుచుకున్న ఇద్దరు మిత్రులువినూత్న కాన్సెప్ట్‌, డిజైన్‌తో నిర్వహిస్తున్న కేఫ్ అదనపు ఆకర్షణ

అర్ధరాత్రి వేళ ఆహారం డెలివరీ చేసే ది బూటీ కాల్

Wednesday July 01, 2015,

3 min Read

ఇషాన్ మన్, చిరాగ్ మెడిరాటలకు పార్టీలంటే పిచ్చి. మిడ్ నైట్ పార్టీలకు ఖచ్చితంగా హాజరయ్యేవారు ఇద్దరూ. ఆ సమయంలో వీరికో సమస్య ఎదురైంది. లేట్‌నైట్‌లో ఆహారం దొరక్క ఇబ్బందిపడేవారు. కొన్నిసార్లు మాత్రం 24/7 కాఫీషాప్స్‌కి వెళ్లి అధిక ధరలు పెట్టి... అంతోఇంతో తిని బయటపడేవారు. దీనికి ఏదైనా పరిష్కారం చూడాలనే ఆలోచన వచ్చింది. ఆ ఐడియానే 'ది బూటీ కాల్' పేరుతో ఓ స్టార్టప్‌గా మలిచారు ఇషాన్, చిరాగ్‌లు.

image


ది బూటీ కాల్

“మా ఇద్దరికీ ఫుడ్ & బెవరేజెస్ రంగంలో మార్కెటింగ్ చేసిన అనుభవం ఉంది. అర్ధరాత్రివేళ ఆహారం డెలివరీ చేసే ఐడియా క్లిక్ అవుతుందని అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్‌కు డిమాండ్ ఉంటుందని మాకు తెలుసు. అయితే ఈ విషయాన్ని పక్కాగా మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇద్దరం మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కావడంతో... మాకిది పెద్ద ఇబ్బంది కాలేదు. సరిగా పబ్లిసిటీ చేస్తే... ఈ కాన్సెప్ట్‌కి మంచి బిజినెస్ రావడానికి ఆస్కారం ఉంది. అందుకే ‘ది బూటీ కాల్’ పేరుతో బిజినెస్ ప్రారంభించారు. ఇది అర్ధరాత్రి వేళల్లో ఫుడ్ డెలివరీలు చేస్తుంది.

image


రాత్రి వేళల్లో డెలివరీలతోపాటు.. ఒక డిజైనర్ కాఫీషాప్ కూడా నిర్వహిస్తున్నారు ఈ మిత్రులు. ఫుడ్ తీసుకోవడంలో కొత్త అనుభూతులు అందించడం కోసం... ఆ ప్లేస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రయోగం వాళ్లకు మంచి పేరు సంపాదించిపెట్టింది. కస్టమర్లకు కొత్త అనుభూతులు అందించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. లో లెవెల్ సీటింగ్, వినూత్నమైన లైటింగ్, ప్రత్యేకమైన ఆర్ట్ వర్క్, స్పెషల్ మ్యూజిక్, వైఫై సౌకర్యాలను ఈ కాఫీషాప్‌లో అమర్చారు.

image


బూటీ కాల్ వెనక బ్యూటిఫుల్ టీం

ఇషాన్ ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇతనికి గతంలో ఐటీసీ హోటల్స్‌కు చెందిన ఇన్-హౌస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. ఐటీసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత... మొదటి వెంచర్ 'యునైటెజ్ కలర్స్ ఆఫ్ ఫుడ్'ను ప్రారంభించారు. ఆహార ప్రదర్శనలతోపాటు.. ఈవెంట్లను నిర్వహించే ప్లాట్‌ఫాం ఇది.

image


వీఐటీలో గ్రాడ్యుయేట్ చేసిన చిరాగ్ మెడిరాట... తర్వాత MICAలో మేనేజ్మెంట్ విద్యాభ్యాసం చేస్తున్నారు. టాటామోటార్స్‌లో కొన్నాళ్లు పని చేశాక... ఇండియన్ ఆర్మీలో పని చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆర్మీలోంచి త్వరగా బయటకు వచ్చారు.

“అర్ధరాత్రి వేళ మాకు ఆర్డర్ చేసే కస్టమర్లకు... ఆ సమయంలో ఆహారం ఎంత అవసరమో మేము బాగా అర్ధం చేసుకోగలం”అంటారు చిరాగ్. సిగరెట్స్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, పార్టీ అవసరాలతోపాటు... కాంట్రాసెప్టివ్ ఐటెమ్స్‌ను కూడా విక్రయిస్తుంది బూటీకాల్.

“కమ్యూనికేషన్, బ్రాండింగ్... ఈ రెండు మమ్మల్ని ఇతర పోటీదారులతో పోల్చితే.. విభిన్నంగా నిలుపుతాయి. మా సర్వీసులపై సమాచారం అందించడం భాధ్యతగా భావిస్తాం. టెక్నాలజీ ఆధారంగా ఈ కమ్యూనికేషన్ షేర్ చేసుకుంటాం”అన్నారు ఇషాన్.

బూటీకాల్‌కి పబ్లిసిటీ యాంగిల్

తమ మిడ్‌నైట్ డెలివరీ సర్వీస్, కేఫ్‌లపై ప్రచారం కోసం, వీలైనంత ఎక్కువమందికి తెలిసేలా చేసేందుకు... ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో పబ్లిసిటీ చేస్తున్నారు. అలాగే సాంప్రదాయ మార్కెటింగ్ విధానాలు, మౌత్ పబ్లిసిటీలనూ బాగానే వినియోగించుకుంటున్నారు.

“కేఫ్‌కి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం. ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య రెట్టింపు అవాలన్నది... మేం వెంచర్ ప్రారంభించినప్పటి లక్ష్యం. దానికోసం విపరీతంగా కష్టపడ్డా”మని చెప్పారు చిరాగ్.

బ్యాట్‌మ్యాన్ డెలివర్స్(గుర్‌గావ్) సంస్థ కూడా ఇలాంటి సర్వీసునే ఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ మార్కెట్ ప్రస్తుతం శరవేగంగా పెరుగుతోంది. ఈ తరహా వ్యాపారం సుదీర్ఘంగా నిలబడాలన్నా, గణనీయమైన లాభాలు గడించాలన్నా... సేవల్లో నాణ్యత, పదార్ధాల్లో రుచిని కొనసాగించడం చాలా ముఖ్యం. కస్టమర్లకు దగ్గరయ్యేందుకు మార్కెటింగ్ వ్యూహాలుకూడా ముఖ్యమే.


ఇషాన్ మన్, చిరాగ్ - బూటీ కాల్ వ్యవస్థాపకులు

ఇషాన్ మన్, చిరాగ్ - బూటీ కాల్ వ్యవస్థాపకులు


వీళ్లే టార్గెట్

అర్ధరాత్రి పూట ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లను కొన్ని రకాలుగా వర్గీకరించచ్చు. లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. రాత్రి సర్వీసులు పెరగడం, ఉద్యోగాల్లోనూ నైట్ కల్చర్ పెరిగిపోవడంతో... మార్కెట్ సైజ్ కూడా ఊపందుకుంటోంది.

ది బూటీకాల్‌ను ప్రారంభించడానికి సొంత నిధులనే వెచ్చించారు ఇషాన్, చిరాగ్‌లు. దీన్ని వ్యవస్థాగతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది వీరి దగ్గర. అయితే సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న తీరును అనుసరించి, విస్తరణ కార్యకలాపాలు ప్లాన్ చేసుకుంటామని చెబ్తున్నారు. మొదట ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లను పూర్తిగా కవర్ చేశాక.. భవిష్యత్తులో ఇతర నగరాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.