'ఫ్యాష్ ఏ లాట్‌'తో షాప్ ఏ లాట్

రిటైలర్స్‌కు సాయం చేయడానికి సరికొత్త ఒమ్ని కామర్స్ స్టార్టప్ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లానే షాప్ ఏ లాట్ఇండియన్ ఈ కామర్స్ పై గంపెడాశలువచ్చే ఏడాదిలో పెరగనున్న రిటైల్ ఈ-కామర్స్

'ఫ్యాష్ ఏ లాట్‌'తో షాప్ ఏ లాట్

Friday May 15, 2015,

4 min Read

భారతీయ ఈ-కామర్స్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దేశీయ స్టార్టప్ కంపెనీలు దాదాపు 1.7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. ఇందులో ఈ-కామర్స్ వాటా 47 శాతం. 575 మిలియన్ డాలర్ల పేటిఎం(payTM) పెట్టుబడితో ఆలీబాబా ఇండియాలో అడుగు పెట్టింది. దేశీయ మెట్రోనగరాల పెరుగుదల, దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వాడకం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీలు దేశంలో పెట్టుబడులకు ఆసక్తి కనపరుస్తున్నాయి. టైగర్ గ్లోబల్, సాఫ్ట్ బ్యాంక్, డిఎస్టీ గ్లోబల్, ఆలిపే,నాస్పర్స్, రాకెట్ ఇంటర్నెట్ లాంటివి ఇప్పటికే ఇండియాలో ఆఫీసులు ప్రారంభించి పెట్టుబడులను ప్రారంభించాయి. 

image


ఫ్యాష్ ఏలాట్ అనేది ఓ ఒమ్ని కామర్స్ స్టార్టప్. మనం కాఫీషాపులో ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో , క్యాబ్‌లో వెళ్తున్నప్పుడు లేదా మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న టైంలో లేటెస్ట్ ట్రెండ్స్ , ఇతర ఫ్యాషన్ వస్త్రాలను వెతికే వెసులుబాటు ఈ సైట్ కల్పిస్తోంది. కొన్నిసార్లు షాపింగ్ మాల్‌లో మనకి ఇష్టమైన షర్ట్ .. కొనలేకపోయిన సందర్భంలో అదే షర్ట్ ఆన్‌లైన్లో ఆర్డర్ ఇవ్వాలనుకుంటే.. దాని డిటైల్స్ ఇస్తే .. మన ఇంటి దగ్గరికే షర్ట్‌ను తీసుకొచ్చే సౌకర్యమూ ఉంది. ఆన్‌లైన్లో కూడా సైజ్, కలర్ ఇతర విషయాలపై పూర్తి స్థాయి సౌలభ్యాన్ని ఇవ్వడం దీని ప్రత్యేకత. ఇలాంటి ఎన్న ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తోంది ఫ్యాష్ ఏ లాట్

ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవలు

ఫ్యాష్ ఏ షాట్, షాపులు, రిటైల్ స్టోర్లు ఓ ప్రత్యేకమైన టెక్నాలజీతో అనుసంధానం అయి ఉంటాయి. దీంతో వారికి కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడంలో సాయం చేస్తుంది. దగ్గర్లో షాపులో ఉన్న స్టాక్ డీటైల్స్‌ను మొబైల్ యాప్‌లోనే అందించడం విశేషం. ఫోన్లో సులభమైన స్వైప్‌లు చేయడం ద్వారానే కస్టమర్లు బట్టలను ఎన్నుకోవచ్చు. ఇక రిటైలర్స్ విషయానికి వస్తే కొత్తగా కస్టమర్లను షాపింగ్‌కు తెప్పించడంతో పాటు పాత కస్టమర్లకు మరిన్ని వెరైటీలను చూపించి కొనుగోళ్లను పెంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తోంది. కొన్ని లిమిటెడ్ ప్రాడక్టులను స్టోర్ లోనే ఉంచి, వాటి గురించి వివరాలను ఆన్ లైన్లో ఉంచడంతో కస్టమర్లు స్టోర్‌కి వచ్చి వాటిని కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.

ఫ్యాష్ ఎ లాట్ టీం

అమిత్ కోశల్, రిషి బాత్ర, అమిత్ శర్మలు కలసి ఫ్యాష్ ఏ లాట్‌ను ప్రారంభించారు. వీళ్ల ముగ్గురికీ ఇన్వెస్ట్‌మెంట్, టెక్నాలజీ పరంగా అపార అనుభవం ఉంది. గతంలో సీనియర్ మేనేజ్‌మెంట్ పొజిషన్లో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులు వీరు. ఫ్యాష్ ఏ లాట్ ముందుగా ఢిల్లీ, బెంగళూరులో ప్రారంభమైంది. మల్టీ బ్రాండ్‌లతో ముందుగానే సంతకాలు చేసుకుంది ఫ్యాష్ ఏ లాట్. మీనా బాజార్, సభ్యత, ప్రైవేట్ లైవ్స్, డెల్కో, అర్జయ్ ఏజెన్సీస్, ఎమ్డీ అపారెల్స్ లాంటి బ్రాండ్స్‌కు సంబంధించిన ప్రాడక్టులు ఫ్యాష్ ఏ లాట్ లో డిస్ ప్లే చేస్తారు. వీటి టర్నోవర్ 3000కోట్లు ఉంటుందని అంచనా.

image


జనానికి సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని ఇవ్వడంలో ఆన్ లైన్ కు మించింది లేదు. రిటైల్ ఇండస్ట్రీలో 2శాతం చాలా తక్కువ అయినప్పటికీ ఆన్ లైన్ మార్కెట్ ఆన్ లైన్ దే. ఆఫ్ లైన్ గ్రోత్ స్పీడ్ తగ్గింది. దీనికి టెక్నాలజీ సాయం అవసరం ఉంది. దీనికంటే కూడా ఆన్ లైన్ పైనే దృష్టిసారిస్తే బెటర్ అంటారు అమిత్ కోశల్

రిటైల్ మార్కెట్లో మిగిలిన 98 శాతం లక్ష్యంగా ముందుకు పోతోంది ఫ్యాష్ ఏ లాట్. స్థానికంగా ఉన్న షాపులను డిజిటల్ మార్కెట్‌తో అనుసంధానం చేసుకుంటూ ముందకు అడుగులు వేస్తోంది. మళ్లీ మళ్లీ కస్టమర్లు షాపునకు వెళ్లే అవకాశం లేకుండా ఆ షాప్‌కు సంబంధించిన స్టాక్ ను ఆన్ లైన్లో అందించి. ఇంటి దగ్గర నుంచే షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కస్టమర్లకు కూడా షాపింగ్ కు వెళ్లాలనుకుంటే ముందుగానే ఏఏ ప్రాడక్ట్ లు షాప్ లో విషయాలు ముందే చూసుకోవడం వల్ల షాపింగ్ లో సమయం మిగలడంతో పాటు మాటి మాటికీ షాపింగ్ వెళ్లకుండా, కొనుగోలు చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. జూలై 2014 నుంచి ఫ్యాష్ ఏ లాట్ పై అమిత్ టీం పనిచేస్తోంది. తాము పనిచేస్తున్న సమయం నుంచి పెట్టుబడులను ఆకర్షించగలిగారు. చాలా స్టోర్స్ ,ఫ్యాష్ ఏ లాట్ తో అనుసంధానికి తగిన మొత్తం చెల్లించడం విశేషం. మొత్తం టీంలో 12మంది ఉన్నారు. వచ్చే ఏడాది సమయానికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. మిలియన్ యూజర్లతో ముందుకు పోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెవెన్యూ మోడల్

ఫ్యాష్ ఏ లాట్ , టూ సైడ్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడరు. కస్టమర్లకు ఉచితంగా సైన్ అప్ అయ్యే వెసులుబాటు కలిగించడంతో ఎక్కువ మంది సైట్ ను విజిట్ చేస్తున్నారు. కొత్తవారితోపాటు ఎగ్జిస్టింగ్ కస్టమర్ల కు రిటైలర్స్ సేవలు అందించొచ్చు. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ఆర్ఓఐ)కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సంబంధం లేకుండా జనం వ్యక్తిగత షాపింగ్ అవసరాలకు స్మార్ట్ ఫోన్ వాడటాన్ని మనం గమనించొచ్చు. వీరికి సహాయకారిగా ఫ్యాష్ ఏ లాట్ పనిచేస్తోంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసి సైట్లో చూపిస్తారు. భవిష్యత్ లో యూజర్స్‌కి సంబంధించిన విశ్లేషణను అందించనున్నారు. ఇది ప్రాడక్ట్ విషయంలో షాపర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ముప్పై రోజుల్లో 10నుంచి18శాతం క్లిక్‌ల రెవెన్యూని గూగుల్ ఇస్తుంది. దీంతో ఒమ్నీ చానెల్ తో స్టోర్లు టై అప్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కస్టమర్లను అర్థం చేసుకోవడం, మొబైల్ ద్వారా కస్టమర్లకు సమాచారం అందించి వారిని స్టోర్ వరకూ రప్పించడంతో స్టోర్ లకు ఎంతగానో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అటు వినియోగదారులతో పాటు ఇటు దుకాణదారుల అవసరాలను తీర్చగలిగే సులువు, సుస్థిరమైన పరిష్కారాన్ని ఇవ్వడంలో ఫ్యాష్ ఏ లాట్ ఎంతగానో సాయపడుతోంది.

ఇండస్ట్రీ రిపోర్ట్

ఈ ఏడాది మొదటి భాగంలో ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 300శాతం గణనీయమైన పెరుగుదలను కనబరిచాయి. ఇది చైనాను మించిపోయింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి. నిరుడు 300లకు పైగా ఈకామర్స్ కంపెనీలు మాత్రమే పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. ఈకామర్స్ రంగంలో స్థబ్దత ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 5నుంచి6శాతం వాటా రిటైల్ సేల్‌ని చేసింది. ఈ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం 2014 ఏడాదికి గానూ..ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ సేల్స్ 22.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను సంపాదించింది. ఇందులో ఈ-కామర్స్ వాటా 1.3 ట్రిలియన్ డాలర్లు. ఇక మన దేశానికొస్తే ఈ-కామర్స్ వాటా 1 నుంచి 2 శాతంగా ఉంది. మొత్తం 600బిలియన్ డాలర్ల రిటైల్ అమ్మకాలు జరిగాయి. దీంతో మిగిలిన 98శాతం అవకాశాలు పుష్కలంగా ఉన్న సంగతి ఇక్కడ మనం గుర్తించాలి. కస్టమర్లను అర్థం చేసుకొని వారిని ఈకామర్స్ వైపు తిప్పుకోగలిగితే అద్భుతాలు చేయొచ్చు. దీంతో లాభాలు కూడా సాధించొచ్చని అంచనా.