‘స్టార్ట్ ఏపీ’ ఆరంభం అదిరింది

Saturday March 05, 2016,

2 min Read

ఆంధ్రా లోని అతిపెద్ద స్టార్టప్ ఫెస్ట్ గా చెప్పుకొనే స్టార్ట్ ఏపీకి వైజాగ్ వేదికైంది. అందాల సాగరతీరంలో వేల సంఖ్యలో విద్యార్థులు, వందలమంది ఆంట్రప్రెన్యూర్లు హాజరుకాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేశారు. స్టార్టప్ లకు ఆంధ్రాలో అనుకూల పరిస్థితులున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.

“ ప్రతి ఇంటి నుంచి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి,” చంద్రబాబు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవెంట్ కు అందుబాటులోకి వచ్చిన చంద్రబాబు స్టార్టప్ లకు ప్రభుత్వం తరుపున ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉత్సాహంగా విద్యార్థులు

సక్సెస్ ఫుల్ స్టార్టప్ ఐడియాలన్నీ క్యాంపస్ నుంచే మొదలవుతాయి. స్టార్ట్ ఏపీలో కూడా వేలమంది విద్యార్థులు ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఇక్కడకు వచ్చారు. దీంతో పాటు ఎన్నో స్టార్టప్ ఆలోచనల్ని ప్రదర్శనకు పెట్టారు. స్టార్టప్ మొదలు పెట్టిన ఫౌండర్లు, ఇతర ఆంట్రప్రెన్యూర్లకంటే విద్యార్థులే ఉత్సాహం చూపించడం ముఖ్యం.

“ప్రభుత్వం దగ్గరి నుంచి సాయం చేస్తామనడం ఆనందించదగినది,” శ్రీనివాస్

ఆంధ్రాలో ఆలోచనలకి కొదవ లేదని, స్టార్టప్ మొదలు పెడితే సాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు రావడం గొప్ప నిర్ణయంగా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వైజాగ్ ఫస్ట్ ఆఫీస్,ఇంక్యుబేషన్ ఫౌండర్ అయిన శ్రీనివాస్ స్టార్ట్ ఏపీలో పాల్గొన్నారు. చాలామంది స్టూడెంట్స్ రావడం భవిష్యత్ లో ఇక్కడి నంచి గొప్ప సంస్థలు పుట్టుకు రావడానికి సంకేతమన్నారు.

సన్ రైజ్ స్టేజ్

స్టార్ట్ ఏపీలో ప్రధాన ఆకర్షణ నిలిచింది సన్ రైజ్ స్టేజ్. స్టార్టప్ స్పీకర్స్, మెంటార్స్, ప్యానల్ డిస్కషన్ జరిగే స్టేజీని సన్ రైజ్ స్టేజ్ గా వ్యవహరించారు.

“ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది,” సిద్దార్థ్

స్టార్ట్ ఏపీ ఈవెంట్ కు కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ స్టార్ట్ ఏపీ ఆరంభం అదుర్స్ అన్నారు. ఈవెంట్ కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్ అనేది సర్ రైజ్ లాంటిది. అందుకే మా స్టేజీకి సన్ రైజ్ స్టేజీ అని పేరు పెట్టామన్నారు. దీంతో పాటు వివిద స్టార్టప్ లకు చెందిన ఫౌండర్లు తమ అనుభవాలను పంచుకున్నారు.