సామాన్యుల అసామాన్య గాధల వేదిక 'పరి'

గ్రామీణ భారతాన్ని కళ్లకు కట్టే ఫోటోలుపల్లెవాసుల కష్టాలను కళ్లకు కట్టే ప్రయత్నంప్రభుత్వాల కోసం కాకుండా పాఠకుల కోసం అందిస్తున్న మాజీ జర్నలిస్ట్ సాయినాథ్రూ.30 కోసం 3 రోజుల్లో 150-250 కిలోలు తోసుకెళ్లే కష్టజీవులున్న దేశం మనదిడిజిటల్ మీడియాలోకి భిన్నత్వంలో ఏకత్వంలోని మరోకోణం

సామాన్యుల అసామాన్య గాధల వేదిక 'పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక్ష్మీ పాండా... నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో అతి చిన్న వ్యక్తి. సొంత రాష్ట్రం ఒరిస్సా ఆమెను స్వాతంత్ర సమరయోధారాలిగా గుర్తించినా.. కేంద్రం మాత్రం 80ఏళ్ల పాండా దరఖాస్తును తిరస్కరించింది. ఆమె జైలుకు వెళ్లలేదనే సాకు చూపింది కేంద్రం. భరతనాట్యంతోపాటు 3 తమిళ ప్రాచీన నాట్య కళల్లో నైపుణ్యత సాధించారు 21 సంవత్సరాల కాళి వీరపద్రన్. కోవలంలోని మత్స్యకారుల కుటుంబలో జన్మించినా.. శిథిలావస్థకు చేరిన నాట్యాలకు తిరికి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈయన. అలాగే బంగాళదుంపలపై మనస్సులు కదిలించే ఒక పాటను గిరిజన బాలికలు పాడారు. ఆ ఇంగ్లీష్ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

స్వాతంత్ర పోరాట యోధుల్లో ఆఖరి తరం మహిళ పాండా

స్వాతంత్ర పోరాట యోధుల్లో ఆఖరి తరం మహిళ పాండా


పీపుల్స్ ఆర్కివ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి)

ఇవన్నీ పీపుల్స్ ఆర్కివ్ ఆఫ్ రూరల్ ఇండియా వెబ్‌సైట్‌లో మనకు కనిపించే అసాధారణ విషయాలు. 35 ఏళ్లపాటు పత్రికా రంగంలో సేవలందించారు మాజీ పాత్రికేయుడు పి. సాయినాథ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇది. అందులో చివరి 22ఏళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు, అలవాట్లు, కష్టాలను ప్రపంచానికి కళ్లకు కట్టేలా చూపారు. ఇంత సుదీర్ఘకాలం గ్రామాలను మాత్రమే రిప్రజెంట్ చేసిన అరుదైన వ్యక్తుల్లో ఈయనా ఒకరని చెప్పాలి. సాయినాథ్ దృష్టిలో గ్రామాలంటే పేదరికం, అజ్ఞానంతో కునారిల్లుతున్న ప్రాంతాలు. ‘భారతీయ పల్లెల కంటే ఆకర్షణీయంగా ఉండే ప్రాంతం ప్రపంచంలో లేదం"టారు సాయినాథ్. "గ్రామాల్లో ఉండే 85 కోట్లమందిలో... 780 భాషలు మాట్లాడేవారున్నారు. వీరిలో ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అత్యంత ప్రాచీనమైన వృత్తులను కొనసాగిస్తున్నారు. తమ నాట్యం, ప్రదర్శనలతో తమకు తాముగా వినోదాన్ని అందించుకునే విధానాలు ప్రపంచం మొత్తం కనుమరుగువుతున్నా... భారతీయ పల్లెల్లో ఇంకా సజీవంగా ఉండడం విశేషం."

కోవళం బీచ్‌లో మొదటి సర్ఫర్

కోవళం బీచ్‌లో మొదటి సర్ఫర్


ఇలాంటి ఎన్నో విశేషాలతో పీపుల్స్ ఆర్కివ్ ఆఫ్ రూరల్ ఇండియా(PARI)ను సాయినాథ్ రూపొందించారు. ఇది ప్రస్తుత సమాజ పరిస్థితుల, రోజువారీ జీవితాలకు అద్దం పడుతుంది. “ఇలాంటి జీవితాల్లో చాలావరకూ మరో 20-30 ఏళ్లలో కనుమరుగవుతాయి. ఈ దృశ్యాలను, ఆట-మాట-పాటలను భద్రపరచుకుంటే... భవిష్యత్తులో మనలను చైతన్యపరచేందుకు అవి ఉపయోగపడతాయి. భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాల్లో ఇది చాలా అవసరం. లేకపోతే గ్రామాల్లోని సంస్కృతులు... భవిష్యత్ తరాలకు తెలీకుండా పోయే ప్రమాదముంది. ఇప్పటికే చాలావరకూ కళలు తమ ప్రాచీన వైభవాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నాయి.”-సాయినాథ్.

పి.సాయినాథ్, పరి వ్యవస్థాపకులు

పి.సాయినాథ్, పరి వ్యవస్థాపకులు


భద్రపరచడం మన బాధ్యత

విలువైన గుర్తులను భద్రపరచడం మన బాధ్యత. అయితే గ్రామీణ ప్రాంతాలతో సంబంధాలు లేకుండా ఇలాంటివి ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మనసును కదిలించే ఎన్నో నిగూఢమైన అమూల్యమైన విషయాలు ఇక్కడే ఉన్నాయంటోంది "పారి". ఏ ఇతర సంస్థతో పోల్చినా... ఇలాంటి ఎన్నో అనుభవాలను కళ్లకు కడతామంటోందీ సంస్థ.

సాయినాథ్ మాటల్లో గ్రామీణ ప్రాంతాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్ధమవుతుంది. పారి లాంటి సంస్థ అవసరం తెలిసొస్తుంది. ప్రాణాలు ఉగ్గబట్టి వినే గ్రామాలకు చెందిన ఎన్నో యదార్ధ గాధలను, మానవత్వాన్ని తట్టిలేపే ఉదాహరణలను ప్రపంచానికి పరిచయం చేసే బృహత్తర బాధ్యతను పారి సంస్థ భుజాన మోస్తోంది.

  • గ్రామాల గుర్తులతో ఇలాంటి భాండాగారాన్ని తయారు చేయడం ఇదే మొదటిదంటున్నారు. ఎందుకు ?

"ఎన్ని భాషలను మేము భద్రపరుస్తున్నామో చూడండి. ఎన్ని రకాల గొంతులను నిక్షిప్తం చేస్తున్నామో తెలుసుకోండి. ప్రతీ భారతీయ భాషనూ ఆయా ప్రాంతాల వ్యక్తులతో మాట్లాడించి భద్రపరచడమే మా లక్ష్యం. 780కి పైగా భాషలను పూర్తిగా కవర్ చేస్తోంది. ప్రస్తుతం మా దగ్గర 8వేల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలున్నాయి. అన్నీ పల్లెవాసుల జీవితాలను ప్రతిబింబిచేవే. దశాబ్దాల చరిత్రను ఫోటోలు, వాయిస్‌ల రూపంలో దాచిపెట్టేందుకు ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించలేదు. 1980ల నుంచి ఇప్పటివరకూ గ్రామాలనుంచి పట్టణాలకు వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ సమస్యలన్నిటినీ చదివి తెలుసుకోవడంతోపాటే ఆయా చిత్రాలను చూడడం, మాటల ద్వారా వినే అవకాశాన్ని 'పరి' మాత్రమే కల్పిస్తోంది. "

"ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ లేనటువంటి వృత్తులు భారత్‌లో ఉన్నాయి".- సాయినాథ్
  • మరిచిపోలేని అనుభవాలు

మీ ప్రయాణంలో మరచిపోలేని కొత్త అనుభవాలేంటి అనే ప్రశ్నకు.. కొన్ని ఉదాహరణలు చెబ్తారు సాయినాథ్. పాత పనిముట్లతోనే ఆధునిక సాంకేతికతో పోటీ పడుతున్న మలబార్‌కు చెందిన కళాసీల పనితనాన్ని ప్రశంసించారాయన. అలాగే బీహార్‌లోని గొడ్డాకు చెందిన కొయ్‌లావాలాల జీవితాన్ని సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు. "కొయ్‌లావాలాలు శక్తి సామర్ధ్యాలు, పట్టుదల చూసి నా ఊపిరి ఆగిపోయిందం"టారు సాయినాథ్.

"ఒక్కో కొయ్‌లావాలా తన సైకిల్‌పై 150-250 కేజీల బరువు మోసుకుంటూ 42కిలోమీటర్లు వెళ్తాడు. అది కూడా 30రూపాయల కోసం. ఇది మూడు రోజుల కష్టానికి దక్కే సంపాదన. నేను కూడా ఒక రోజంతా వాళ్లు చేసే పని చేసేందుకు ప్రయత్నించాను. అయితే కేవలం 3 కిలోమీటర్లే ఆ సైకిల్ నెట్టగలిగాను. నా శరీరంలో ప్రతీ ఎముకా వారాలపాటు నొప్పులు పెట్టేసింది. నిజానికి వీళ్లు ఇలా బొగ్గు తరలించడం నేరపూరితం. వారికి శిక్షలు పడే అవకాశం కూడా ఉంది."

image


  • మీరు 35 ఏళ్లపాటు పాత్రికేయులుగా ఉన్నారు. ఇప్పుడు పరిని లాంఛ్ చేశాక పారిశ్రామికవేత్తగా మారారు. ఒక రంగంలో నిపుణుల స్థాయి నుంచి కొత్తగా మరో రంగంలో ప్రవేశించిన అనుభవం ఎలా ఉంది ? పరి లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మీరేం నేర్చుకున్నారు. ?
"నాకు పారిశ్రామికవేత్త అనే పదం నచ్చదు. నేనెప్పుడూ జర్నలిస్టునే. ఇప్పుడు చేసే పని దానికి పొడిగింపు మాత్రమే."- సాయినాథ్

"ఇలాంటి అనుభవాలు వేలకొద్దీ ఉన్నాయి. నేనే తెలుసుకున్న అతి ముఖ్య విషయం ఏంటంటే ఫిజికల్ ప్లాట్‌ఫాం కంటే.. డిజిటల్ వేదికలు ఎంతో శక్తిమంతమైనవి. ఎన్నిటినో ప్రదర్శించకల శక్తి ఆన్‌లైన్ మీడియాకు ఉంది. టెలివిజన్‌లో ఒక టెక్స్ట్‌నో, స్టిల్ ఫోటోనో చూపించలేం. ప్రింట్ మీడియాలో కదిలే బొమ్మలకు స్థానం లేదు. కాని డిజిటల్ రంగంలో వీటన్నింటికీ అవకాశం ఉంది. అందుకే మా పాఠకులకు, సైట్ విజిటర్లకు తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పించాం. తద్వారా మేం కూడా మరింతగా రాటుదేలచ్చు."

"ప్రజలు ఎంత ఉదారంగానూ, ఆదర్శవంతంగానూ ఉండగలరన్నది నేను తెలుసుకున్న మరో విషయం. 'పారి' ప్రారంభిస్తానని ప్రకటించినపుడు నాకు లభించిన మద్దతు చూసి ఆశ్చర్యం వేసింది. అనేక మంది వాళ్ల సమయం, డబ్బు, అనుభవాలను నా కలను నెరవేర్చడం కోసం ఖర్చు చేశారు. సాటి మనిషికి అండగా నిలబడాలనే ఆ దృక్పథం చూశాక.. ఈ సంస్థ ప్రారంభానికి నాకు మరింత పట్టుదల కలిగింది."

ఈ తరహా రాతలు గ్రామీణ భారతాన్ని సమూలంగా ఎలా మార్చుతాయనే ప్రశ్నకు సాయినాథ్ సమాధానం ఇది. - "నేను ప్రభుత్వాలతో కాకుండా పాఠకులతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుంటాను. అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం తీసుకునే విధానాలు అట్టడుగు స్థాయి నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకునేలా ఉండాలి. "

  • కథలతో మార్పు సాధ్యమేనా ?

ఆయా జీవితాలను కథల రూపంలో చెప్పడం ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారా ? మీ వెబ్‌సైట్‌లో ఈ గాధలు చెప్పడంతో ఎలాంటి అభివృద్ధిని ఆశిస్తున్నారు ?

"ఏ విషయాన్ని చెప్పడానికైనా ఒక్కటే పద్ధతి సరిపోతుందని నేననుకోను. ఇలా కథల రూపంలో చెప్పడం ఓ మంచి పద్ధతి. మాకు అనుభవజ్ఞులైన పాత్రికేయులున్నారు అలాగే వెబ్‌సైట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే నిపుణులున్నారు. అలాగే జర్నలిస్టులు కానివాళ్ల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రణాళికలున్నాయి."

ఇలా కథల రూపంలో ఆకర్షణీయంగా చెప్పగలగడం చాలా ముఖ్యం. చరిత్రలో ఎన్నో విషయాలు మనకు తెలిసింది ఇలాగే. ప్రస్తుతం జర్నలిజం వృత్తి ఈ స్టోరీటెల్లింగ్‌ను మరచిపోతోంది. ప్రస్తుతం అంతా పబ్లిక్ రిలేషన్స్(పీఆర్)ను ప్రోత్సహించే కార్పొరేట్ మీడియా కబంధ హస్తాల్లో మీడియా చిక్కుకుపోయింది. అందుకా "పారి" ద్వారా వ్యాస రూపంలో విషయాన్ని చెప్పే కాన్సెప్ట్‌కు మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నా"మంటారు సాయినాథ్.

"సామాజిక విధానాలకు సాంకేతికత ఎప్పుడూ సరిపోదు. నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ రంగం బాాగా అభివృద్ధి చెందింది. అయితే అదే రాష్ట్రంలో లక్షల కొద్దీ ఉన్న మత్స్యకారులకు సాఫ్ట్‌వేర్ చేసిందేమీ లేదు."

  • సాంకేతిక రంగ ప్రయోజనాలను అనుభవిస్తున్న ఒక సాధారణ నగరవాసి ఇతర రంగాలకు ఎలా తన సహకారం ఇవ్వగలడు ?

"చాలా మంది టెకీలు మాకు వాలంటీర్లుగా ఉన్నారు. వారంతా గ్రామీణ భారతంతో అనుబంధం ఏర్పరచుకోవాలనుకునేవారే. అర్ధవంతమైన జీవిత అన్వేషణలో వారు మాతో భాగస్వాములయ్యారు"

"మాకు వాలంటీర్‌గా ఉంటే, మీ చరిత్ర మూలాలను స్పృశించినట్లే. 83.3 కోట్ల భారతీయులతో సంబంధాలు ఏర్పరచుకున్నట్లే. దేశంలో 68శాతం మందిలో కొంతమంది గురించైనా ఆముూలాగ్రం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లే. మన జీవితాలకు మూలమైనవాటితో ఈ మాత్రం ప్రాథమిక అనుబంధాలుండడం చాలా ముఖ్యమని భావిస్తా"- సాయినాథ్

"మాకు మంచి ప్రోగ్రామర్స్, డెవలపర్స్, డిజైనర్ల అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధ మహిళలు కూడా ఉపయోగించుకునేలా ఒక ట్యాబ్ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇంటర్నెట్ రంగం విస్తరిస్తున్న వేగం చూస్తే... మరో పదేళ్లలో దీన్ని సుసాధ్యం చేసేందుకు మరో పదేళ్లు పడుతుంది. గ్రామీణ పేదలకు "ట్యాబ్" అందించగలగడం మంచి అభివృద్ధే. ఇదేమీ అసాధ్యం కాదు. ఒక ఐదేళ్ల క్రితం సెల్‌ఫోన్ ఈ స్థాయికి చేరుతుందని ఊహించామా? మా దగ్గరున్న టెకీలు, ఐటీ నిపుణులు ఈ ఆలోచనను ఆచరణ సాధ్యం చేయగలరనే అనుకుంటున్నా. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మాకు మరింతమంది వాలంటీర్లు అవసరం"

నియంగారిలో ఓ వివాహ వేడుక

నియంగారిలో ఓ వివాహ వేడుక


"రైటర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇంకెవరికైనానా సరే మా విన్నపం ఇదే.. మన దేశ ఘనతను కాపాడుకునేందుకు మీ వంతు సహకారం అందించండి."

"ప్రస్తుతం కార్పొరేట్ మీడియా అంతా నగరాలనే తప్ప... గ్రామాలను పట్టిచుకోవడం లేదు. ఒకే కోణంలో సమాజాన్ని చూస్తూ, చూపిస్తూ... అదే నిజమని ప్రజలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. అయితే పారి మాత్రం పల్లె జీవితాలనే ప్రముఖంగా ప్రదర్శిస్తోంది. మిగతావాళ్లతో పోల్చితే మాకున్న వైరుధ్యం ఇదే."

"ప్రస్తుతం ప్రధాన మీడియా అంతా దేశీయ చరిత్రనో, విషయాలనో కవర్ చేసేందుకు డిజైన్ చేసి లేదు. ఒక్కోసారి వాళ్లు చేసేదాని ముూలంగా మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. ఒక రైతు కార్ కొంటే దానిపై ఓ రిపోర్ట్ ప్రదర్శిస్తారు. అయితే.. అదే రైతు తన కారు, ఇల్లు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఎవరికి పట్టింది. ఎవరైనా కోటీశ్వరుడైతే మాత్రం దాన్ని ప్రముఖంగా చెప్పుకొస్తారు. "

సాధారణ పేదల నైపుణ్యం, వృత్తి లాఘవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులను వారు ఎదుర్కునే తీరు కూడా ఎంతో ఆశ్చర్యం. మన ఊహకు కూడా అందని ఎన్నో పనులు వారెంతో సులువుగా పూర్తి చేసేయగలరు. ఒక సగటు గ్రామీణ మహిళ తన జీవితంలోని నడకలో మూడోవంతు మైళ్లదూరం నుంచి నీళ్లు తెచ్చేందుకే వెచ్చిస్తోందనే విషయం చాలామందికి తెలీదు. తన కుటుంబాన్ని, సమాజాన్ని బేలన్స్ చేసే ఆమె జీవితం ప్రశంసనీయం. ఎవరికీ తలొంచకుండా, దీనికీ భయపడకుండా తన గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించే గ్రామీణుల జీవితాలు అందరికీ ఆదర్శ ప్రాయమే. సాధారణ మనుషుల్లోనే అసాధారణ సంఘటనలను, పరిస్థితులను వెలికితీయడమే "పారి" లక్ష్యం.