హైటెక్ సిటీ .. స్టార్టప్‌ సిటీగా మారుతోందా ?

ఎకో సిస్టమ్ లో మార్పులుఫండ్ రెయిజింగ్ పై సిటీ స్టార్టప్ కంపెనీల కాన్ఫిడెన్స్టీహబ్ కోసం రిజిస్ట్రేషన్ కోసం వెంపర్లాడిన స్టార్టప్ లు కొత్త ఇంక్యుబేసిన్ పై గంపెడాశలు

0

హైదరాబాద్ స్టార్టప్‌లు ఉత్సాహంగా పాల్గొన్న ఆగస్ట్ ఫెస్ట్ పూర్తయింది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఆసక్తిగా ఈ రెండు రోజుల సమావేశాలకు హాజరయ్యారు. డెలిగేట్స్, స్టార్టప్స్, విజిటర్స్ అంతా కలిసి దాదాపు 5 వేల మంది వరకూ వచ్చినట్టు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇన్నోవేటివ్ థాట్స్‌తో కొత్త కంపెనీలు తమ స్టాల్స్ ప్రదర్శనకు పెట్టాయి. మొబైల్ యాప్స్‌లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న హైదరాబాదీ స్టార్టప్‌లు టెక్నాలజీని అందుకోవడానికి అధికంగా ఉత్సాహాన్ని చూపించినట్టు అనిపించింది.

ఆగస్ట్ ఫెస్ట్‌లో ప్యానెల్ డిస్కషన్
ఆగస్ట్ ఫెస్ట్‌లో ప్యానెల్ డిస్కషన్
"హైటెక్ సిటీ అంతా స్టార్టప్ సిటీ వైపు అడుగు లేస్తుందనడానికి ఆగస్ట్ ఫెస్ట్‌కి వచ్చిన స్పందనే నిదర్శనం." సుబ్బరాజు పెరిచర్ల - ఆర్గనైజర్ స్టార్టప్ లీడర్‌షిప్

స్టాల్స్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ విజిటర్స్ సంఖ్య మాత్రం బాగానే ఉంది. కొత్తదనం కోసం ఎంతో మంది ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి చేరగలమే ధీమా మాత్రం ఈ ఫెస్ట్ కల్పించింది. మొత్తానికి రెండు రోజుల పాటు జరిగిన ఆగస్ట్ ఫెస్ట్ అద్భుతంగా ముగిసింది. చాలా మంది ఏంజెల్ ఇన్వస్టర్లు కూడా ఈ ఫెస్ట్‌కు హాజరయ్యారు. వీరి నుంచి ఎన్నికంపెనీలు ఫండింగ్ పొందుతున్నాయనో చూడాలి. కొన్ని కంపెనీల కాన్సప్ట్ లు షార్ట్ లిస్ట్ అయినట్టు తమకు తెలిసిందని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

టి- హబ్ రిజిస్ట్రేషన్

వచ్చే నెలలో రతన్ టాటా చేతులు మీదుగా ప్రారంభం కానున్న టీ హబ్ ఇంకుబేషన్ సెంటర్ గురించి ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వివరాలను తీసుకున్నారు. ఇందులో కొన్నింటిని టీహబ్ లో స్థానం కల్పిస్తారు. ఐఎస్‌బి, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా టీ హబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. యునిక్ కాన్సప్ట్‌తో ఉన్న స్టార్టప్‌లు ఇందులో రిజిస్ట్రర్ చేసుకుంటే వాటిని షార్ట్ లిస్ట్ చేస్తామని టీ హబ్ నిర్వహకులు చెప్పారు. రెండు రోజుల ఫెస్ట్ లో టీ హబ్ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఆన్ లైన్ లో కూడా ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతోంది. రిజిస్ట్రర్ అయిన స్టార్టప్ కనక టీ హబ్ లో స్థానం దొరికితే సీడ్ ఫండింగ్ తోపాటు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన భవంతిలో కో వర్కింగ్ స్పేస్ కల్పిస్తారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి మన హైదారబాద్ స్టార్టప్ లు ఫండ్ ని రెయిర్ చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సాయికిరణ్.

మెమైలాగ్ ఫౌండర్ అయిన సాయి ఆగస్ట్ ఫెస్ట్ ప్రమోషన్ తో పాటు ఆర్గనైజింగ్ టీంలో ఉన్నారు. ఇన్వెస్టర్లు స్టార్టప్ సత్తాను గుర్తిస్తున్నారు. ఇలాంటి ఫెస్ట్‌లు మరిన్ని జరిగితే మరింత మంది స్టార్టప్‌లతో పాటు ఏంజిల్ ఇన్వెస్టర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.

ఆగస్ట్ ఫెస్ట్ టీం
ఆగస్ట్ ఫెస్ట్ టీం

హైదరాబాద్ మైండ్ సెట్ కూడా మారుతోందా ?

స్టార్టప్ కల్చర్‌ని ఏడాప్ట్ చేసుకోడానికి మన హైదరాబాద్ కూడా సిద్ధం అంటోంది. ఈ ఏడాది వచ్చిన రెస్పాన్స్ ఎకో సిస్టమ్‌లో మార్పులొచ్చేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం లాంటివి దీనికి మరింత చేయూతనిస్తున్నాయి. జనం ఆలోచన సరళి మారుతుండటం ఇక్కడ స్టార్టప్ వ్యవస్థ మరింత బలపడేందుకు దోహదపడ్తుందని నిర్వాహకులు చెబ్తున్నారు.

ఆగస్ట్ ఫెస్ట్‌కు హాజరైన డెలిగేట్స్
ఆగస్ట్ ఫెస్ట్‌కు హాజరైన డెలిగేట్స్
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik