దేశంలో 10 లక్షల స్మార్ట్ ఫోన్లకు వైరస్..! మరి మీ ఫోన్ భద్రంగానే ఉందా..?

దేశంలో 10 లక్షల స్మార్ట్ ఫోన్లకు వైరస్..! మరి మీ ఫోన్ భద్రంగానే ఉందా..?

Thursday January 28, 2016,

4 min Read

మొబైల్.. ఇప్పుడు మనిషి జీవితంలో ఓ నిత్యావసర వస్తువు. ఆటోమొబైల్ లేకపోయినా బతకగలడేమో కానీ.. మొబైల్ లేకపోతే మాత్రం మనుగడే లేదనే స్థాయికి మనమంతా అడిక్ట్ అయిపోయాం. ఇక స్మార్ట్ ఫోన్ల సంగతి చెప్పాల్సిన పనేలేదు. ఉదయం నిద్రలేపే యాప్ నుంచి రాత్రి పడుకునే ముందు వేసుకోవాల్సిన మందుల వరకూ జీవితమంతా యాప్స్‌తో ముడిపడింది. యాండ్రాయిడ్ ఫోన్ల సంగతైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.

చీతా మొబైల్, అనే మొబైల్ సెక్యూరిటీ సంస్థ తాజాగా ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 10 లక్షలకుపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇన్ఫెక్ట్ అయ్యాయి. చీతా మొబైల్ యుటిలిటీ అప్లికేషన్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 56.7 కోట్ల యాక్టివ్ యూజర్స్, 200 కోట్ల ఇన్‌స్టలేషన్ బేస్‌లను ఉపయోగించుకుంటున్నారు.

image


విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ స్టడీ సంస్థ సిస్కో సంస్థ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ వినియోగదారు. 2014లో మన దగ్గర 59.03 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నాయి. ఇది మన దేశ జనాభాలో 47 శాతం. 2013తో పోల్చి చూసి ఈ సంఖ్య ఏకంగా 18 శాతం వృద్ధి చెందింది. దీన్ని బట్టి చూస్తే.. మన దేశమే రెండో అతిపెద్ద ఇన్ఫెక్టెడ్ కంట్రీగా కూడా అవతరించి ఉండొచ్చు, అది కూడా చైనా తర్వాత. అతిపెద్ద ఆండ్రాయిడ్ యూజర్ బేస్, థర్ట్ పార్టీ యాప్స్ ఇందుకు కారణమని చీతా మొబైల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

మన దేశంలో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే 10 లక్షల సంఖ్య తక్కువే కావొచ్చు, కానీ పెరుగుతున్న ఆండ్రాయిడ్ వైరస్ ఎటాక్స్ మాత్రం ఆందోళన పెంచుతోంది. సర్వే ప్రకారం 2014లో ఆండ్రాయిడ్ వైరస్‌లు 24 లక్షలకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడా సంఖ్య 95లక్షలకు దూసుకెళ్లింది.

యాప్ విజిల్ సంస్థ ప్రోడక్ట్ - వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాష్ విశ్లేషణ ప్రకారం ఈ ముప్పు మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పటి వరకూ కేవలం 10 లక్షల మొబైల్ ఫోన్లు మాత్రమే వైరస్‌ బారినపడినట్టు బయటకు రిపోర్టులు వచ్చి ఉండొచ్చేమో కానీ సర్వీస్ మాల్వేర్ వంటివి చాపకింద నీరులా భారీ స్థాయిలో ఫోన్లను ఇబ్బందిపెడ్తోందని చెబ్తున్నారు.

ఇది చాలా ఆందోళనకరమైన విషయంగా అభివర్ణిస్తున్నాయి IAMAI, IMRB ఇంటర్నేషనల్ సంస్థలు. 2015 నాటికి ప్రాంతీయ భాషల్లో నెట్ వినియోగించే వారి సంఖ్య 12.7 కోట్లుగా ఉంది. ఇది నిరుటితో పోలిస్తే 47 శాతం వృద్ధి సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ ఫోన్లను వినియోగించడం వల్లే ఇది సాధ్యపడిందని రిపోర్టులు చెప్తున్నాయి.

మొదటి సారి స్మార్ట్ ఫోన్లను వాడుతున్న వాళ్లు, టెక్‌ పరిజ్ఞానం తక్కువగా ఉన్న వాళ్లే మొబైల్ సెక్యూరిటీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాను చెబ్తున్నారు.

''ప్రమోషనల్ డిస్కౌంట్ల ద్వారా మొదటిసారి కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాల వల్ల జనాలు ఇరుక్కుంటున్నారు. ప్రమోషనల్ డిస్కౌంట్ల మాయలో పడడం వల్ల ప్రమోషనల్ పాప్ అప్స్‌ను క్లిక్ చేయడం, అవి ప్రమోషన్ మాల్వేర్‌కు దారి ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి'' అంటారు భాను.

చీతా మొబైల్ రిపోర్ట్ లెక్కల ప్రకారం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లలో 55 శాతం ప్రమాదకర ప్రమోషనల్ మాల్వేర్‌ బారినపడి ఉంటారు. మన ప్రమేయం లేకుండా అడ్వర్టైజ్‌మెంట్స్ రావడం, మనం వద్దనుకున్న యాప్స్ వాటంతట అవే ఇన్‌స్టాల్ అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ట్రోజన్ అనేది అలాంటి మాల్వేర్. ఇది మొబైల్‌లో దాగి మనకు తెలియకుండా మెసేజ్‌లు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫోటోలు, లొకేషన్ వంటివి దొంగిలిస్తుంది.

రిపోర్ట్ ప్రకారం 95 లక్షల ఆండ్రాయిడ్ వైరస్‌లలో 60 శాతం వరకూ మొబైల్ పేమెంట్స్‌కు సంబంధించనవే. మొబైల్ పేమెంట్ మాల్వేర్ వల్ల ‌సాధారణ బ్యాంక్ పేజీలానే హ్యాకర్స్ రూపొందించిన పేజీ కనిపిస్తుంది. మనకు అవగాహనలేకపోవడం, గుర్తించలేకపోవడం వల్ల ఆ పేజీపైనే బ్యాంక్ డిటైల్స్, వ్యక్తిగత సమాచారం, ఐడి ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్ వంటివి ఇచ్చేస్తాం. దీని వల్ల పెద్ద ప్రమాదానికి మనమే కారణమైనట్టు అవుతుంది.

యాండ్రాయిడ్ యూజర్లలో 8.5 లక్షల మంది ప్రమాదకర ప్రమోషన్ మాల్ వేర్ బారినపడిన వాళ్లే. మొబైల్ పేమెంట్ వైరస్‌ల వల్ల 3 లక్షల మందికి సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లింది.

ఎకో సిస్టం ఎలా ఉంది

సెక్యూర్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంపై దృష్టిసారించాలని భాను సూచిస్తున్నారు. ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది లగ్జరీలా కాకుండా తప్పనిసరి అవసరంలా భావించాల్సి ఉంటుంది. ఓ యాప్‌ను అభివృద్ధి చేసేటప్పుడు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెబ్తున్నారు.

డెవలపర్స్ రోజుకో కొత్త ఏపిఐ ఇవ్వడం వల్ల కూడా మాల్వేర్ వ్యాప్తికి మరో కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మొబైల్‌పై జనాల్లో అనూహ్యమైన నమ్మకం పెరిగింది. పెద్ద, విలువైన ఆర్డర్లను సైతం మొబైల్ ద్వారానే చేయడం ఇందుకు ఓ ఉదాహరణ.

యాప్స్ వృద్ధిచేస్తున్న వారిలో ఈ మధ్య నైతికత పెరుగుతోందని భాను అంటున్నారు. అన్ని పర్మిషన్లకు ఒకే ఒక్కసారి ఓకే చెప్పకుండా ఇన్‌స్టలేషన్‌కు ముందు వివిధ రకాల పర్మిషన్లు అడిగేలా చేయడం వల్ల వినియోగదారుడికి కూడా అవగాహన పెరుగుతోందన్నారు. వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. యూజర్స్ దగ్గరి నుంచి ఇన్‌స్టలేషన్ సమయంలో తీసుకున్న సమచారాన్ని గోప్యంగా, భద్రంగా ఉంచాల్సిన బాధ్యతను కంపెనీలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు కొన్ని విధాన నిర్ణయాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక యాప్ వివిధ అనుమతులను పొందకపోతే అది పబ్లిష్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటే ఎంతో కొంత ఉపయుక్తంగా ఉండొచ్చనిపిస్తోంది.

పొంచి ఉన్న ప్రమాదం

స్టేజ్ ఫ్రైట్ - ఆండ్రాయిడ్ వర్షన్స్ 2.2 నుంచి 5.1 వరకూ వాడుతున్న వాళ్లలో 95 శాతం మంది హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంది. మన ప్రమేయం లేకుండానే మన ఫోన్‌పై వాళ్లు పెత్తనం చేసేందుకు ఇది కారణమవుతుంది. లైబ్రరీ నుంచి రికార్డ్, మల్టీమీడియా ఫైల్స్ ప్లే చేసేందుకు ఉపయోగించే ఆండ్రాయిడ్ ప్రాసెస్‌లో ఈ స్టేజ్ ఫ్రైట్ దాగి ఉంటుంది. ఇదే ఆండ్రాయిడ్‌లో కీలక కాంపొనెంట్.

హోం స్క్రీన్ అప్లికేషన్స్

మే 2015లో సిఎం సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్ కనుగొన్న దాని ప్రకారం హోం స్క్రీన్ అప్లికేషన్లు కూడా ప్రమాదం బారినపడేందుకు కారణమవుతాయి. ఈ యాప్స్ ఫేక్ మెసేజీలను రూపొందించి, ఇతరులకు పంపుతుంది. దీని వల్ల కూడా చాలా పెద్ద రిస్క్ ఉంది.

ఘోస్ట్ - లైనక్స్ సిస్టమ్స్‌ను ఛేదించి, సిస్టమ్ ప్రివిలేజీలు తీసుకునేందుకు ఇది ఎటాకర్లకు సహకరిస్తుంది. మనం తరచూ వాడే వెబ్ పేజీల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని హ్యాకర్లను చేరవేస్తుంది.

image


Original story written by Tarusha Bhalla

Translated by Chanukya

Infographic by Aditya Ranade (Source: Cheetah Mobile)