ఇలాంటి ఉద్యోగులుంటే ఏ బాస్‌కైనా ధైర్యమొస్తుంది !

ఎంతటి మహాద్భుతమైనా పిడికెడంత మెదడులోనే పురుడుపోసుకొంటుంది. గొప్ప పనులన్నీ సాదాసీదాగానే మొదలవుతాయి. గొప్పవాళ్లుగా పేరుతెచ్చుకొన్నవాళ్లంతా సాధారణంగానే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్లు నిరంతరం మెదడుతో పోరాడుతుంటారు.. అద్భుతాల కోసం మస్తిష్కాన్ని తవ్వుతుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు శృతి గుప్త.. కన్జూమర్ మొబైల్ యాప్స్ సృష్టిలో బుడిబుడి అడుగులు వేస్తున్న ‘షిఫు’ సంస్థ పునాదులను పటిష్టపర్చటంలో ఎనలేని కృషిచేస్తున్న యువతి.

ఇలాంటి ఉద్యోగులుంటే ఏ బాస్‌కైనా ధైర్యమొస్తుంది !

Monday May 18, 2015,

3 min Read

మస్తిష్కమే ప్రయోగశాల

శృతి గుప్త మొరాదాబాద్‌లో పుట్టిపెరిగారు. చిన్నప్పటి నుంచి తాను చూసిన, విన్న, ఆలోచించిన ప్రతి విషయాన్నీ డ్రాయింగ్ రూపంలో భద్రపర్చుకోవటం ఆమెకు అలవాటు. పాఠశాల విద్య పూర్తిచేసే వరకూ ఆమెకు బయోటెక్నాలజీ అంటే ప్రాణం. డిజైనింగ్‌ను వృతిగా ఎంచుకోవాలన్న ఆలోచనే ఆమెకు లేదు. పాఠశాల విద్య చివరి ఏడాదిలో ఆమె మెదడులో డిజైనింగ్ ఆలోచన మొదలైంది. అది పెరిగి పెద్దదై బలమైన ఇష్టంగా మారింది. డిజైనింగ్‌ను కెరీర్‌గా ఎందుకు ఎంచుకోకూడదు ? అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆమెకు కారణాలేవీ కనిపించలేదు. అంతే.. ‘బిట్ మెర్సా’లో డిజైనింగ్ కోర్సులో చేరిపోయారు. చదువు పూర్తయిన తర్వాత బుక్ పబ్లిషింగ్ నుంచి ఈవెంట్ మేనేజ్‌మెంట్ వరకు అనేక రంగాల్లో ఆమె పనిచేశారు.. పరిశీలించారు. ఆ సమయంలోనే శృతిలోని పట్టుదల, కొత్తగా ఆలోచించే నైపుణ్యం, ప్రతిభను షిఫు సహ వ్యవస్థాపకులు దీపాంషు జైన్ గుర్తించారు. షిఫు సంస్థలో కీలక పదవికి నామినేట్ చేశారు.

image


శృతిగుప్త అంటే ఒక నమ్మకం

శృతిగుప్త గురించి, ఆమె పనితనం గురించి దీపాంషుజైన్ గొప్పగా చెప్తారు. ‘ఏడాదిన్నర క్రితం మా స్టార్టప్ రోజుల్ని గుర్తుచేసుకొంటే.. ఎన్నో విషయాల్లో ఎంతో భిన్నంగా పనిచేశాం. కానీ అందులో డిజైనర్ ఎంపిక గురించి మాత్రం లేదు. ఎందుకంటే మేము శృతిని ఎంతగానో నమ్మాము. మా మొట్టమొదటి ఉద్యోగుల్లో శృతి ఒకరు. ఇప్పటివరకు మా ప్రయాణంలో ఆమె కీలకపాత్ర పోషించారు. కన్జూమర్స్ మొబైల్ యాప్ స్పేస్ రంగంలో స్టార్టప్‌గా ఉన్న మాకు డిజైన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ హక్కులే కీలకం. ఈ విషయంలో మేము శృతి గుప్తను నమ్మాము. ఆమె తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. మాది పెద్ద టీం కాదు. అందునా.. అందులో అంతా సాంకేతికాంశాల గురించి ఆలోచించేవాల్లే. మా ఆలోచనా విధానంపై డాటా, తర్కమే ఆధిపత్యం చెలాయించేవి. కొన్నిసార్లు మేం సున్నితత్వాన్ని, వినియోగదారుల దృక్పథాలను, ఉత్పత్తి డిజైన్‌లో మృదుత్వాన్ని కోల్పోయేవాళ్లం. ఆ గ్యాప్‌ను శృతి భర్తీచేశారు’ అని ఎంతో సంతోషంగా చెప్పారు.

ప్రతిరోజూ ఒక మైలురాయి

అవును.. ప్రతిరోజూ ఒక కొత్త మైలురాయిని అధిగమించాలి.. ఇదే శృతిగుప్త సిద్ధాంతం. సోషల్ మీడియా చానల్స్‌ను పరిశీలించటం, అప్లికేషన్ డిజైన్ రోలింగ్‌ను అధ్యయనం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన పనిలో అద్భుతమైన వేగం కనబరుస్తారు. ఉదయం ఓ కొత్తఫీచర్ కోసం ఇంటర్‌ఫేస్ డిజైన్ చేస్తే.. మధ్యాహ్నానికి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తారు. సాయంత్రంలోపు ఆ డిజైన్ ప్రయోజనాలపై పూర్తి సమాచారాన్ని పోస్ట్ చేస్తారు. ఇది అంత తేలికైన పనికాదు. చేసే పనిపట్ల నిబద్ధత, మెరుపులాంటి వేగం, గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉన్నవారికే సాధ్యమవుతుంది. అందుకే శృతిగుప్త అందరిలో ఒకానొకరు కాకుండా అందరిలో ఒక్కరుగా నిలిచారు అని చెప్తారు షిఫు సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌సింగ్. షిఫు ఇంటర్‌ఫేస్ డిజైనర్ కోసం వెదుకుతున్న సమయంలో వచ్చిన శృతికి మొబైల్ అప్లికేషన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ కొత్త పని అయినప్పటికీ ఆమె పనిచేస్తున్న విధానానికి ప్రశాంత్‌సింగ్ ఫిదా అయిపోయారు. ఆమె షిఫులో చేరిన కొత్తలో సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు ఆమెను ఒక్కటే కోరారు. వేరొకరి రిఫరెన్స్ గురించి మాత్రమే కాకుండా సొంత ముద్ర వేయటానికి ప్రయత్నించాలని సూచించారు. సహజంగానే స్వేచ్ఛగా పనిచేసే శృతిగుప్తను ఆ మాటలు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మొదట ఆరు నెలల ఫ్రీలాన్సర్‌గా షిఫులో చేరిన ఆమె ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరిపోయారు.

image


ఆచరణాత్మక ఆలోచనే ముఖ్యం

చేసే పనిలో స్పష్టత, ఆచరణాత్మక ఆలోచనే విజయానికి ముఖ్యమని శృతిగుప్త ప్రఘాడంగా విశ్వసిస్తారు. షిఫులో తన పాత్ర గురించి ఆమె చెప్పే మాటలు వింటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ‘గతంలో సృష్టించినా ఆచరణలోకి రాని వస్తువులు ఒక చిత్తు ప్రతిగా ఇతర అన్ని అంశాలకంటే ఎక్కువగా ఉపయోగపడుతాయి. ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఏడురోజుల్లో కొత్తగా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నావనుకో.. ఏడోరోజు ఆ పని పూర్తికాకుంటే రోమ్ నగరాన్ని ఒకరోజులో నిర్మించలేదులే అనే వాస్తవికతలోకి వస్తావు. ఈ విధానంలోనే నా పాత్రను నేను అధికంగా ప్రేమిస్తా’ అని ఆమె సూటిగా చెప్తారు. వినియోగదారుడికి మనం ఏమి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం? అతడి నుంచి ఏం ఆశిస్తున్నాం? అనే ప్రశ్నలపైనే ప్రతి డిజైన్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంటారు. డిజైన్‌పై బృంద చర్చల్లో సునిశిత మూల్యాంకనానికి ఆమె ప్రాధాన్యం ఇస్తారు. తన టీంలోని అందరికీ స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలిపే వాతావరణం కల్పిస్తారు. డిజైన్‌ను మరింత బలోపేతం చేసే ఉత్తమ సూచనలు వస్తే అమలుచేసిన తర్వాతే తమ ఉత్పత్తిని వినియోగదారుడి వద్దకు చేరుస్తారు. వినియోగదారుడు ఏమి వాడుతున్నాడన్న విషయాన్ని పరిశీలించి వాటికి అనుగుణంగా డిజైన్ చేయటమే ఆమె విజయరహస్యం అని చెప్తారు దీపాంషు. బృంద నాయకురాలిగా తన టీం నుంచి ఏం ఆశిస్తున్నారో అది రాబట్టుకోవటంలో శృతి అత్యంత సమర్థురాలు. ఒక్కోసారి తన నిర్ణయాలను సమర్థించుకొంటూ సంస్థ వ్యవస్థాపకుల సూచనలను కూడా పట్టించుకోరు. అంత కచ్చితత్వంతో పనిచేస్తారు కాబట్టే యాజమాన్యానికి ఆమెపై అంత విశ్వాసం. ‘విషయంపట్ల ఆమెకున్న శ్రద్ధ, డెడ్‌లైన్ పట్ల నిబద్ధత అద్భుతం. నవ్వుతూ, ఆడుతూ పాడుతూ చిన్నగదిలో ఆమె స్వచ్ఛమైన, అద్భుతమై డిజైన్లను సృష్టించటం నిజంగా గొప్పవిషయం’ అని దీపాంషు మరీమరీ ప్రశంసిస్తారు.

image


‘జీవితం చిన్నది. ఇప్పుడే సాధిద్దాం’.. ఇదే శృతిగుప్త విధానం.

నిజమే లక్ష్యం స్పష్టంగా నిర్ధేశించుకున్నవారు క్షణకాలాన్ని కూడా వృథా చేయరు.. శృతిగుప్తలాగే..