మాతో రండి.. అందమైన ప్రపంచాన్ని చూపిస్తాం..!!

మనకు తెలియని అద్భుతమైన ప్రాంతాలు చూపించే హాలిడిఫై

0

కోవిద్ కపూర్, రోహిత్ ష్రాఫ్, ప్రతీక్ చౌహాన్- ముగ్గురు ఫ్రెండ్స్. ముంబైలో ఐఐటీ చదివే రోజుల్లో వీకెండ్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసేవారు. అకేషన్ దొరికితే చాలు.. వెకేషన్ ఎక్కడుందా అని వెతుక్కునేవారు. హాలిడే స్పాట్లను, హ్యాంగవుట్ ప్లేస్‌ల ను వెతుక్కుంటూ రెక్కలు గట్టుకుని వెళ్లేవారు. అలా కొంతకాలం గడిపేసరికి ఆన్‌ లైన్‌లో పాపులర్ అయిన ప్రాంతాలన్నిటినీ కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఏం చూడాలి? ఎక్కడికి వెళ్లాలి? అంతగా జనానికి తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే దారేది? వాటి గురించి ఎవరు చెప్తారు? అప్పుడు మెరిసిందో ఐడియా!

హాలిడిపై లోగో
హాలిడిపై లోగో

ఎందుకో హాలిడిఫై దగ్గరే ఆగిపోయారు !

సాధారణంగా వెబ్ సైట్లలో టూరిజం స్పాట్ వివరాలు చాలా తక్కువగా ఉంటాయి. బాగా పాపులర్ అయినవీ, జనాలకు తెలిసినవి మాత్రమే అందులో పొందుపరుస్తారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా వాటినే ప్రమోట్ చేస్తాయి. దాంతో టూరిస్టులు కూడా వాళ్లు చెప్పిన చోటికే వెళ్తుంటారు. ఆ మాటకొస్తే పాపులర్ అయిన ప్రదేశాల కంటే జనానికి అంతగా పరిచయం లేని అద్భుతమైన టూరిజం స్పాట్ లు ఎన్నో ఉన్నాయి. సరిగ్గా అక్కడ బీజం పడింది హాలిడిఫై ఆలోచనకు. అప్పటికే కొన్ని రకాల స్టార్టప్ లకు కసరత్తు చేశారు కానీ, ఎందుకో హాలిడిఫై దగ్గరే ఆగిపోయారు. 

ప్లానింగ్ నుంచి స్టేయింగ్ వరకూ..

హాలిడిఫై ఒక్కసారి ట్రిప్ ప్లాన్ చేసిందంటే- అదంత గుడ్డిగా ఉండదు. చేతిలో పూర్తి సమాచారం ఉంటుంది. టేస్టుకు తగ్గ డెస్టినేషన్ ఎంచుకునేందుకు సాయపడుతుంది. పాపులారిటీ కాదు ముఖ్యం. ప్రదేశం ఇంపార్టెంట్. మ్యాప్ బేస్డ్ సర్వీసులే కాకుండా... అవసరమైన ట్రావెల్ గైడ్స్ కూడా అందిస్తారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వివరాలు సేకరిస్తారు. వీటన్నిటినీ ఒక చోటకు చేర్చి ట్రావెల్ గైడ్‌ను రూపొందిస్తారు. ఎక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది? హోటల్ సదుపాయాలు ఎలా వుంటాయి? వంటి వివరాలను ఫోటోలతో సహా అందిస్తారు. ప్రతీవారికీ పర్సనలైజ్డ్ సేవలు అందించడమే హాలిడిఫై లక్ష్యం.

కోవిద్ కపూర్
కోవిద్ కపూర్

ప్రొఫైల్ ద్వారా కస్టమైజ్డ్ డీటెయిల్స్

యూజర్లు తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేందుకు సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. విజిట్ చేయబోయే స్పాట్ గురించే కాదు.. గత ప్రయాణపు అనుభూతులను ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. దీనిద్వారా సైట్లో వారికి కస్టమైజ్డ్ సమాచారం లభిస్తుంది. బీటా స్థాయి నుంచే సైట్కి యమా ఫాలోయింగ్ వచ్చింది. ఆ పాపులారిటీయే తమకు ఉత్సాహం ఇచ్చిందంటారు ముగ్గురు స్నేహితులు. ట్రిప్ ప్లానింగ్ పూర్తిస్థాయి సరైన సమాచారంతో బయలుదేరేందుకు హాలిడిఫై సహాయం చేస్తుంది. సైట్ విజిటర్లు ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రవేశించినా, ఆటోమేటిగ్గా మరిన్ని ప్రాంతాలను బ్రౌజింగ్ ద్వారా తెలుసుకుంటారని దీమాగా చెపుతోంది హాలిడిఫై టీం. ప్రతీ యూజర్, విజటర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు కంటెంట్ని సమగ్రంగా తీర్చిదిద్దుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో విజిటర్లు డెస్టినేషన్స్ వెతికే విషయంలో హాలిడిఫై సైట్‌కి అసలు పోటీయే లేదు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మస్ట్‌ సీ ఇండియా డాట్ కాం, ఇక్సిగో డాట్ కాం, హాలిడేఐక్యూ డాట్ కాం వంటి సైట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఆ విషయం ముగ్గురికీ తెలుసు.

సవాళ్లు ఎన్నో

వెంచర్ ప్రారంభించేటప్పుడు అనుకున్నది ఒకటి. తీరా రంగంలోకి దిగితే ఎదురయ్యేది మరొకటి. టీం మొదలుకొని టెక్నికల్ సపోర్టు వరకు. అన్నీ సవాళ్లే.సాధారణ జీతాలతో టాలెంటెడ్ టెకీస్ బోర్డులోకి తీసుకోవడం చాలా కష్టమైన విషయం అంటాడు రోహిత్. పైగా సైట్ ప్రారంభించినపుడు ఏరకమైన ఫండింగ్ బ్యాకప్ లేదు. హాలిడిఫై ఎదుర్కున్న ప్రధాన సమస్య ఇది. ముగ్గురు దాచుకున్న మొత్తం కూడా అంత గొప్పగా ఏం లేదు. కాకపోతే క్వాలిటీ ప్రోడక్ట్ కోసం ఎక్కడా రాజీ పడలేదు.

ప్రతీక్ చౌహాన్
ప్రతీక్ చౌహాన్

జనాల్లో కొత్త ప్రాంతాలను చూడాలనే ఉత్సాహం

నిజానికి దేశంలో అనేక స్టార్టప్స్‌ కొత్త కొత్త టూరిస్ట్ స్పాట్ల గురించి వివరాలు అందిస్తున్నాయి. వాటిని చూసేందుకు అనేకమంది పర్యాటకులు ముందుకొస్తున్నారు. కొత్త ప్రాంతాలను చూడాలనే ఉత్సాహం, తపన జనాల్లో కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో ఏదో రకమైన ఎక్స్ పరిమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. యాక్టివిటీ ట్రిప్ ప్లానింగ్ లాంటి కాన్సెప్ట్లకు దేశంలో విపరీతంగా ఆదరణ పెరుగుతోంది

త్వరలో విండోస్, ఐఓఎస్ వెర్షన్ల రిలీజ్

ప్రస్తుతానికి దేశంలోని ప్రాంతాలపైనే హాలిడిఫై దృష్టి పెట్టింది. జీపీఎస్ ఆధారంగా జోన్ల వారీగా డెస్టినేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ట్రెండిగ్ నౌ, బీచ్లు, హిల్త్ & వ్యాలీస్, డెజెర్ట్స్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, రెలిజియస్, రివర్స్ & లేక్స్, అడ్వంచర్.. అంటూ సెర్చ్లను కస్టమైజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర దేశాలకు తమ కార్యకలాపాలు విస్తరించే యోచన ఉందని చెబ్తున్నారు హాలిడిపై టీం. అలాగే మల్టీ సిటి ట్రిప్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఆప్ కూడా లాంఛ్ చేశారు. త్వరలో విండోస్, ఐఓఎస్ వెర్షన్లను కూడా రిలీజ్ చేయబోతున్నారు.

రోహిత్ ష్రాఫ్
రోహిత్ ష్రాఫ్

వెబ్‌సైట్

ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్